మే రెండో ఆదివారం మదర్స్ డే.. మరి ఫాదర్స్ డే ఎప్పుడో..?
తెలంగాణ ప్రభుత్వం గ్రూప్1, ఎస్సై, కానిస్టేబుల్, టెట్ తదితర పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇన్నాళ్లుగా ఎదురు చూసిన అభ్యర్థులు ప్రిపరేషన్లో తలమునకలయ్యారు. ప్రతి పోటీ పరీక్షలో ముఖ్యమైన దినోత్సవాలు, తేదీల గురించి ప్రశ్నలు అడుగుతారు. వాటిపై నెలల వారీగా సమగ్ర సమాచారం నిపుణ పాఠకుల కోసం..
జనవరి
- జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం (సావిత్రిబాయి ఫూలే జయంతి), ప్రాథమిక విధుల దినోత్సవం-జనవరి 03
- బ్రెయిలీ డే (లూయీ బ్రెయిలీ జయంతి)- జనవరి 04
- ప్రవాస భారతీయ దివస్, గాంధీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగివచ్చిన రోజు- జనవరి 09
- జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద జయంతి)- జనవరి 12
- సైనిక దినోత్సవం (భారత మొట్టమొదటి సైనిక కమాండర్‌గా కరియప్ప బాధ్యతలు స్వీకరించిన రోజు)- జనవరి 15
- దేశ్ ప్రేమ్ దివస్ (నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జయంతి)- జనవరి 23
- జాతీయ బాలికా దినోత్సవం, జాతీయ గీతం, జాతీయ గేయం ఆమోదం పొందిన రోజు- జనవరి 24
- జాతీయ ఓటరు దినోత్సవం (proud to be a voter ready to vote అనేది ఓటరు దినోత్సవం నినాదం. ఈ దినోత్సవాన్ని 2011 నుంచి జరుపుకొంటు న్నాం.)- జనవరి 25
- భారత గణతంత్ర దినోత్సం (భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు) -జనవరి 26
- అమరవీరుల సంస్మరణ దినోత్సవం (గాంధీజీ వర్ధంతి- జనవరి 30
ఫిబ్రవరి
- చిత్తడి నేలల దినోత్సవం- ఫిబ్రవరి 02
- థామస్ ఆల్వా ఎడిసన్ జయంతి (విద్యుత్తు బల్బును కనుగొన్నాడు)- ఫిబ్రవరి 11
- స్వామి దయానంద సరస్వతి జయంతి (ఆర్య సమాజాన్ని స్థాపించాడు)- ఫిబ్రవరి 12
- భారతీయ మహిళా దినోత్సవం (గాన కోకిల సరోజినీ నాయుడు జయంతి), ప్రపంచ రేడియో దినోత్సవం- ఫిబ్రవరి 13
- ప్రపంచ మాతృభాష దినోత్సవం ( బంగ్లాదేశీయులు అంటే అప్పటి తూర్పు పాకిస్థానీయులు చేసిన
- భాషా ఉద్యమానికి గుర్తుగా జరుపుకొంటారు)- ఫిబ్రవరి 21
- ప్రపంచ కవలల దినోత్సవం- ఫిబ్రవరి 22
- జాతీయ సైన్స్ దినోత్సవం (రామన్ ఎఫెక్ట్‌ను సర్ సీవీ రామన్ కనుగొన్న రోజు)- ఫిబ్రవరి 28
మార్చి
- జాతీయ భద్రతా దినోత్సవం- మార్చి 04
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం- మార్చి 08
- ఐన్‌స్టీన్ జయంతి(సాపేక్ష సిద్ధాంతం, E=mc2 సూత్రాన్ని రూపొందించాడు), పై ( ) డే (దీన్ని గణిత
- పరిభాషలో 22/7గా రాస్తారు) – మార్చి 14
- వినియోగదారుల హక్కుల దినోత్సవం- మార్చి 15
- జాతీయ టీకా (వ్యాక్సిన్) దినోత్సవం- మార్చి 16
- ప్రపంచ అటవీ దినోత్సవం- మార్చి 21
- ప్రపంచ జల దినోత్సవం- మార్చి 22
- ప్రపంచ వాతావరణ దినోత్సవం- మార్చి 23
ఏప్రిల్
- సమతా దివస్ (బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి)- ఏప్రిల్ 05
- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ఏప్రిల్ 07
- జ్యోతిబా ఫూలే జయంతి- ఏప్రిల్ 11
- జలియన్ వాలా బాగ్ దినోత్సవం- ఏప్రిల్ 13
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి- ఏప్రిల్ 14
- ధరిత్రీ దినోత్సవం- ఏప్రిల్ 22
- పుస్తక దినోత్సవం- ఏప్రిల్ 23
- పంచాయతీరాజ్ దినోత్సవం- ఏప్రిల్ 24
మే
- అంతర్జాతీయ కార్మిక దినోత్సవం- మే 01
- పత్రికా స్వేచ్ఛా దినోత్సవం- మే 03
- అథ్లెటిక్స్ దినోత్సవం- మే 05
- రెడ్ క్రాస్ దినోత్సవం- మే 08
- అంతర్జాతీయ నర్సుల దినోత్సవం (ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి)- మే 12
- ప్రపంచ కుటుంబ దినోత్సవం- మే 15
- ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం (రాజీవ్‌గాంధీ వర్ధంతి) – మే 21
- అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం (1953 లో టెన్సింగ్ నార్కే, హిడ్మండ్ హిల్లరీ ఎవరెస్ట్ అధిరోహించిన రోజు)- మే 29
- ప్రపంచ పొగాకు దినోత్సవం- మే 31
జూన్
- ప్రపంచ పాల దినోత్సవం- జూన్ 1
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం- జూన్ 2
- ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం- జూన్ 12
- ప్రపంచ రక్త దాతల దినోత్సవం (రక్తవర్గాలను కనుగొన్న కారల్ లాండ్ స్టీనర్ జయంతి)- జూన్ 14
- ప్రపంచ యోగా, సంగీత దినోత్సవం- జూన్ 21
- మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి- జూన్ 28
జూలై
- అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం (పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రి, ప్రసిద్ధ వైద్యుడు బీఎన్ రాయ్ జయంతి)- జూలై 1
- ప్రపంచ సైకిల్ దినోత్సవం- జూలై 3
- జూనోసిస్ డే (జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అంటు వ్యాధుల అవగాహన కోసం జరుపుతారు)- జూలై 06
- ప్రపంచ జనాభా దినోత్సవం, తెలంగాణ ఇంజినీర్స్ డే (నవాబ్ అలీ నవాజ్ జంగ్ జయంతి)-జూలై 11
- కార్గిల్ విజయ్ దివస్- జూలై 26
ఆగస్టు
- పింగలి వెంకయ్య జయంతి (జాతీయ జెండా రూపకర్త)- ఆగస్టు 02
- ఆచార్య జయశంకర్ జయంతి- ఆగస్టు 6
- జాతీయ చేనేత దినోత్సవం- ఆగస్టు 07
- క్విట్ ఇండియా దినోత్సవం- ఆగస్టు 08
- ప్రపంచ ఎడమ చేతివాటం వారి దినోత్సవం- ఆగస్టు 13
- ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం- ఆగస్టు 19
- సంస్కృత భాషా దినోత్సవం- ఆగస్టు 24
- అంతర్జాతీయ క్రీడా దినోత్సవం(హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతి),తెలుగు భాషా దినోత్సవం (గిడుగు రామ్మూర్తి జయంతి) – ఆగస్టు 29
సెప్టెంబర్
- ప్రపంచ కొబ్బరికాయల దినోత్సవం- సెప్టెంబర్ 02
- ఉపాధ్యాయ దినోత్సవం (డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి)- సెప్టెంబర్ 05
- అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం- సెప్టెంబర్ 08
- తెలంగాణ భాషా దినోత్సవం (కాళోజీ నారాయణరావు జయంతి)- సెప్టెంబర్ 09
- సోదర దినోత్సవం (1893లో స్వామి వివేకానంద చికాగోలో ప్రసంగించిన రోజు)- సెప్టెంబర్ 11
- జాతీయ హిందీ దినోత్సవం- సెప్టెంబర్ 14
- జాతీయ ఇంజినీర్స్ దినోత్సవం(మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి) – సెప్టెంబర్ 15
- జాతీయ పర్యాటక దినోత్సవం-సెప్టెంబర్ 27
అక్టోబర్
- జాతీయ శాకాహార దినోత్సవం – అక్టోబర్ 01
- అహింసా దినోత్సవం (గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి)- అక్టోబర్ 02
- ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం- అక్టోబర్ 04
- జాతీయ తపాలా దినోత్సవం- అక్టోబర్ 10
- మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి- అక్టోబర్ 15
- ప్రపంచ ఆహార దినోత్సవం- అక్టోబర్ 16
- పేదరిక నిర్మూలన దినోత్సవం- అక్టోబర్ 17
- ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ దినోత్సవం- అక్టోబర్ 24
- ఏక్తా దివస్ (సర్ధార్ వల్లభాయ్‌పటేల్ జయంతి)- అక్టోబర్ 31
నవంబర్
- జాతీయ విద్యా దినోత్సవం (మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌కలాం ఆజాద్ జయంతి)- నవంబర్ 11
- బాలల దినోత్సవం (జవహర్లాల్ నెహ్రూ జయంతి)- నవంబర్ 14
- ఇందిరాగాంధీ జయంతి- నవంబర్ 19
- అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం- నవంబర్ 20
- జాతీయ న్యాయ దినోత్సవం- నవంబర్ 26
డిసెంబర్
- కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం- డిసెంబర్ 2
- అంతార్జాతీయ వికలాంగుల దినోత్సవం- డిసెంబర్ 03
- ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం- డిసెంబర్ 10
- యూనిసెఫ్ దినోత్సవం- డిసెంబర్ 11
- జాతీయ శక్తివనరుల పొదుపు దినోత్సవం- డిసెంబర్ 14
- జాతీయ గణిత దినోత్సవం (శ్రీనివాస్ రామానుజన్ జయంతి) – డిసెంబర్ 22
- కిసాన్ దివస్ (చౌదరి చరణ్‌సింగ్ జయంతి)-డిసెంబర్ 23
అవయవాలు – దినోత్సవాలు
ప్రపంచ కాలేయ దినోత్సవం – ఏప్రిల్ 13
ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం – సెప్టెంబర్ 25
ప్రపంచ గుండె దినోత్సవం – సెప్టెంబర్ 29
వ్యాధులు – దినోత్సవాలు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం – ఫిబ్రవరి 4
జాతీయ క్షయ దినోత్సవం – మార్చి 24
హీమోఫీలియా దినోత్సవం – ఏప్రిల్ 17
అంతర్జాతీయ మలేరియా దినోత్సవం – ఏప్రిల్ 25
తలసేమియా దినోత్సవం – మే 8
హైపర్‌టెన్షన్ దినోత్సవం – మే 17
బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం – జూన్ 8
హెపటైటిస్ దినోత్సవం – జూలై 28
ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం – నవంబర్ 14
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం – డిసెంబర్ 1
ప్రపంచ కిడ్నీ దినోత్సవం – మార్చి రెండో గురువారం
ప్రపంచ ఆస్తమా దినోత్సవం – మే మొదటి మంగళవారం
మదర్స్ డే – మే రెండో ఆదివారం
ప్రపంచ వలస పక్షుల దినోత్సవం – మే రెండో శనివారం
ఫాదర్స్ డే – జూన్ మూడో ఆదివారం
ప్రపంచ స్నేహితుల దినోత్సవం – ఆగస్టు మొదటి వారం
ప్రపంచ గుడ్డు దినోత్సవం – అక్టోబర్ రెండో శుక్రవారం
పర్యావరణం – దినోత్సవాలు
ప్రపంచ జీవవైవిద్య దినోత్సవం – మే 22
ప్రపంచ పర్యావరణ దినోత్సవం – జూన్ 5
ప్రపంచ ఓజోన్ సంరక్షణ దినోత్సవం – సెప్టెంబర్ 16
జాతీయ విపత్తు నిర్వహణ దినోత్సవం – అక్టోబర్ 13
జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం – డిసెంబర్ 2
జంతువులు – దినోత్సవాలు
అంతర్జాతీయ జీబ్రా డే – జనవరి 31
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం – మార్చి 20
డాల్ఫిన్ డే – ఏప్రిల్ 14
ప్రపంచ ఒంటెల దినోత్సవం – జూన్ 22
ప్రపంచ పులుల దినోత్సవం – జూలై 29
ప్రపంచ సింహాల దినోత్సవం – ఆగస్టు 10
ప్రపంచ ఏనుగుల దినోత్సవం – ఆగస్టు 12
ప్రపంచ దోమల దినోత్సవం – ఆగస్టు 20
ప్రపంచ కోతుల దినోత్సవం – డిసెంబర్ 14
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు