మానవహక్కులు అంటే ఏమిటి?
ఎలాంటి పరిస్థితులు, అవకాశాలు లేకుండా మానవుల మనుడగ, అభివృద్ధి సాధ్యంకాదో ఆయా పరిస్థితుల, అవకాశాలను కల్పించేవే మానవ హక్కులు. సూటిగా చెప్పాలంటే మనిషిగా పుట్టినందుకు అతనికి తప్పనిసరిగా ఉండేటటువంటి హక్కులే మానవ హక్కులు. మానవ హక్కులు అనేవి ప్రతివ్యక్తికి సంబంధించి Inheart Dignity ఉండాలి. అదే మానవీయత అనేటువంటి తాత్వికతపై ఆధారపడి రూపుదిద్దుకొన్నది. మానవ హక్కులు అనేవి వ్యక్తుల నుంచి లేదా వారి జీవనవిధానాల నుంచి తీసివేయలేని, వారి సమగ్రాభివృద్ధికి అవసరమైనవి, వెలకట్టలేనివి.
ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్- 1993
ఈ చట్టం 1993 సెప్టెంబర్ 28 నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ చట్టం ప్రకారం మానవ హక్కులు అంటే రైట్స్ రిలేటింగ్ టు లైఫ్, లిబర్టి, ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిడ్యువల్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఎంబాడీడ్ ఇన్ ద ఇంటర్నేషనల్ కాన్వెంట్స్ అండ్ ఎన్‌ఫోర్సబుల్ బై కోర్ట్స్ ఆఫ్ ఇండియా.
విశ్వ మానవ హక్కుల తీర్మానం
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ద్వారా 1948 డిసెంబర్ 10న విశ్వమాన హక్కుల తీర్మానాన్ని ఆమోదించి ప్రకటించింది. అందువల్ల డిసెంబర్ 10ని అంతర్జాతీయ మానవ హక్కుల దినంగా జరుపుకొంటున్నాం. 2015 డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవాన్ని అవర్ రైట్స్, అవర్ ఫ్రీడమ్స్ ఆల్వేస్ అనే థీమ్‌తో నిర్వహించారు. 2014 డిసెంబర్ 10న హ్యూమన్ రైట్స్ 365 అనే థీమ్‌తో అంటే ఎవ్రీబడీ హ్యూమన్ రైట్స్ డే అనే నినాదంతో జరుపుకొన్నాం.
ప్రపంచవ్యాప్తంగా మానవులందరికి ఉండాల్సిన మానవ హక్కులను గుర్తిస్తూ సభ్యదేశాలన్నీ ఇందుకు అనుగుణంగా చర్యలను చేపట్టాలని యూఎన్ జనరల్ తీర్మానించిందే విశ్వ మానవహక్కుల తీర్మానం.30 అధికరణలతో రూపొందించారు. అవి..
-అధికరణం-1: మనుషులందరూ స్వేచ్ఛతో, సమానహోదా, హక్కులతోనే జన్మించారు.
-అధికరణం-2: జాతి, వర్ణం, లింగ, భాష, మతం, జాతీయత, పుట్టుక, సంపద, ఇతర హోదాలు, రాజకీయ అభిమతాలకు అతీతంగా పై తేడాలు ఏవీలేకుండా ప్రతి ఒక్కరికి మానవహక్కులు కల్పించబడతాయి.
-పై రెండు అధికరణలు మానవహక్కుల్లో ఉన్న ప్రధాన సూత్రాలను తెలిపేందుకు ఉద్దేశించినవి.
-అధికరణం 3 నుంచి 21 వరకు మానవహక్కుల్లో భాగంగా ఉండాల్సిన పౌర, రాజకీయ హక్కులను పేర్కొంటున్నాయి.
-అధికరణం 22 నుంచి 27 వరకు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులను పొందుపరిచారు.
-అధికరణం 28, 29, 30లు ఇతర అంశాలను పేర్కొన్నారు.
అంతర్జాతీయ బిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్
విశ్వమానవహక్కుల తీర్మానం, ద ఇంటర్నేషనల్ కోవారెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, దీనికి సంబంధించిన రెండు ఆప్షనల్, ప్రోటోకాల్, ఇంటర్నేషనల్ కోవారెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్‌లను కలిపి సంయుక్తంగా ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌గా వ్యవహరిస్తారు.
ప్రతిభకు పరీక్ష
1. స్మార్ట్ సిటీస్ పథకంలో రెండో విడత ఎంపికైన నగరాలేవి?
1.లక్నో, వరంగల్, చండీగఢ్, న్యూటౌన్ కోల్‌కతా
2. ధర్మశాల, రాయ్‌పూర్,భాగల్పూర్, ఇంపాల్
3. అగర్తల, ఫరీదాబాద్, పాంజి, చండీగఢ్, పోర్ట్‌బ్లెయిర్
4. పైవన్నీ
2. జాతీయ నూతన వైమానిక విధానానికి సంబంధించి కింది వాక్యాల్లో సరైనదేది?
1. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇదే మొదటి వైమానిక విధానం
2. 5/20 విధానం అమలు చేస్తున్నారు.
3. ప్రాంతీయ అనుసంధాన పథకం ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది.
4. విమాన ప్రయాణానికి ఒక గంటకు రూ. 2500గా నిర్ణయించారు
3. దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల మొత్తం నిరర్ధక ఆస్తులు 2016 మార్చి 31 నాటికి ఎంత ఉన్నాయి?
1. రూ. 5.3 లక్షల కోట్లు 2. రూ. 4.3 లక్షల కోట్లు
3. రూ.3.3 లక్షల కోట్లు 4. రూ. 2.3 లక్షల కోట్లు
4. ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన పథకానికి సంబంధించి కిందివాటిలో సరికాని వాక్యమేది?
1. విదేశాల్లో పనిచేయాలనుకొనే కార్మికులకు ఎంపికచేసిన కొన్ని రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి, ధ్రువపత్రాలు జారీచేస్తారు.
2. ఈ పథకాన్ని జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ చేపట్టింది.
3. కార్మికులు విదేశాలకు వెళ్లకముందు ఈ పథకంలో విదేశీ వ్యవహారాలశాఖ పాత్ర పరిమితంగా ఉంటుంది.
4. ఈ పథకం అమలును కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ పర్యవేక్షిస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు