ఆర్థిక సంస్కరణలు – న్యాయపరమైన వివాదాలు
ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు భారత విధాన నిర్ణేతలు మొదలుపెట్టిన సంస్కరణలు అనేక ఆటపోట్ల మధ్య ముందుకుసాగుతున్నాయి. సామాజికసమస్యలతో పాటు చట్టపరమైన సమస్యల కారణంగా అనుకున్నంతవేగంగా సాగటంలేదు. ఆర్థికసంస్కరణలపై పలు న్యాయపరమైన వివాదాలగురించి నిపుణ పాఠకులకు ప్రత్యేకం..
-మానవుడు సంఘజీవి, రాజకీయ జీవి అంతకుమించి ఆర్థిక జీవి కూడా. మానవుడి ఆర్థిక కార్యకలాపమే నాగరికతకు మూల్యాంకనం. అన్ని జీవుల్లాగా ప్రకృతి ఒడిలో పుట్టి పెరిగిన మానవుడు ఏ జీవికి లభించని హేతుబద్ధత అందిపుచ్చుకొని, ప్రకృతి నుంచి విడిపోయి తన ప్రత్యేకతను, ఉనికిని చాటుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
మనిషి వర్సెస్ ప్రకృతి ఘర్షణ అని వార్యమైంది. ఈ ఘర్షణలో మనిషి తన మూలాలను, జన్మ రహస్యాలను మర్చిపోయి మోతాదుకు మించి ప్రకృతిపై తన శక్తియుక్తుల్ని ప్రదర్శించి అనేక తప్పులు చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు.
-తాను సృష్టించుకున్న కృత్రిమ వ్యవస్థ కోసం, సుస్థిరమైన ప్రకృతిని పణంగా పెట్టాడు.
-ప్రకృతిని ఓడించిన మానవుడు డబ్బు చేతుల్లో ఓడిపోయి మట్టి కరిచాడు.
-సరిగ్గా అదే సమయంలో అర్థశాస్త్ర పితామహుడు ఆడంస్మిత్ తెరమీదకొచ్చాడు. వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథాన్ని ప్రచురించాడు.
-అసలు కథంతా ఇక్కడే మొదలైంది. ఆడంస్మిత్ పెట్టుబడిదారీ విధానాన్ని, మార్కెట్ శక్తులను సృష్టించి వదిలేశాడు. అవి మానవున్ని ముడిసరుకును చేసి పడేశాయి.
-కారల్‌మార్క్స్ అనే మరో మేధావి కమ్యూనిజం/సౌమ్యవాదాన్ని సృష్టించి ప్రపంచం మీదికి వదలడంతో మెదట మనిషికి ప్రకృతికి మధ్య మొదలైన ఘర్షణ, అది మనిషికి డబ్బుకు మధ్య ఘర్షణగా రూపాంతరం చెంది చివరికి పెట్టుబడిదారీ, సామ్యవాద సిద్ధాంతాలు వైరుధ్యంగా పరిణామం చెంది భూగోళాన్ని రెండుగా చీల్చిపారేసింది.
-విచిత్రమేమిటంటే అభివృద్ధి/వృద్ధి కోసం జరిగిన ఈ పోరాటంతో రెండు వ్యవస్థలు దెబ్బతిన్నాయి.
-ఒకవైపు ప్రభుత్వ జోక్యమే అక్కర్లేదన్న పెట్టుబడిదారీ వ్యవస్థ, ఆర్థిక మాంద్యం దెబ్బకు గిలగిలా కొట్టుకుంది.
-మరోవైపు, పెట్టుబడిదారి వ్యవస్థలు సృష్టించిన గతిశీలక పురోభివృద్ధి వేగం ముందు సామ్యవాద వ్యవస్థలు పతనం అంచుకు చేరుకున్నాయి.
-కమ్యూనిస్టు రష్యా అధ్యక్షుడైన గోర్బచెవ్ సైతం పెరిస్ర్తోయికా, గ్లాస్‌నోస్త్ అంటూ సంస్కరణల బాట పట్టక తప్పలేదు.
-సరిగ్గా ఇదే సమయంలో భారతదేశ మిశ్రమ ఆర్థిక ప్రగతి రథ చక్రాలు ఆగిపోయాయి.
-సామ్యవాద తరహా అతిపెద్ద ప్రజాస్వామ్యం పెట్టుబడిదారీ వ్యవస్థల ఆర్థిక సంస్కరణలను/ఎల్పీజీ మోడల్ అనుకరించాల్సి వచ్చింది.
-రాజకీయ, ఆర్థిక సంక్షోభాల మూలంగా ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, రుణభారం, చెల్లింపు శేషం మన ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
-ప్రణాళికబద్ధ అభివృద్ధి పేరుతో ప్రభుత్వ ఆధిపత్యాన్ని చాటిచెబుతూ వస్తున్న భారతదేశపు ఇనుపతెరను పడగొట్టి, దాని స్థానంలో సంస్కరణల పేరుతో వ్యవస్థకు అద్దాల తెర బిగించక తప్పలేదు.
-సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ సంస్కరణలను ఒకేసారి కలిపి, వ్యవస్థపై కుమ్మరించారు.
-70 శాతం ప్రజలు ఆధారపడిన గ్రామాలు, వ్యవసాయ రంగాన్ని గాలికొదిలి పట్టణాలు, పారిశ్రామిక రంగాల కేంద్రంగా సంస్కరణ ప్రస్థానం మొదలైంది.
-కొరియా, జపాన్ లాంటి చిన్న చిన్న దేశాలు వీటిని అమలుచేసి విజయవంతమయ్యాయి. మరి అవి దీర్ఘకాలంలో మనకు పనికోస్తాయా పల్లెకు, పట్నానికి తేడా లేకుండా చేస్తాయా? అనేది కాలం నుంచి రాబట్టాల్సిన సమాధానం.
మాతృత్వ సంస్కరణలు
-సంస్కరణలు మనకు కొత్తకాదు. 1948, 1956 పారిశ్రామిక రంగ తీర్మానాలు బ్యాంకుల జాతీయీకరణ, భూసంస్కరణలు, ప్రణాళికా సంఘం, రాజాభరణాల రద్దు మొదలైన ఎన్నో సంస్కరణలు చేపట్టి ఆదిమ సమాజాన్ని ఆధునిక సమాజంగా తీర్చిదిద్దాయి ప్రభుత్వాలు.
-ఈ సంస్కరణలు మార్కెట్ శక్తులను పెంచి పోషించడానికి కాదు. వాటిని అదుపు చేయడానికి అందుకోసం రాజ్యాంగాన్ని సైతం లెక్క చేయలేదు మన పాలకులు.
-ప్రస్తుతం మన కొనసాగిస్తున్న సంస్కరణలు, వాటి నేపథ్యం అర్థం కావడానికి మన ప్రభుత్వాలు పాలకులు ఎదుర్కొన్న ఇబ్బందులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
జమీందారీ విధానం రద్దు
-ఆదేశిక సూత్రాలు, ఆర్టికల్స్ 38,39 ప్రకారం సంపద కేంద్రీకృతం కారాదు. ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక న్యాయం.
-అప్పట్లో భూమి కొద్దిమంది భూస్వాములు, దళారులు, జమీందార్లు, జాగీర్దార్ల చేతుల్లో ఉండేది.
-బెంగాల్, బీహార్లు జమీందార్ల చట్టాలు రద్దుచేస్తూ కోర్టును ఆశ్రయించగా, 19(ఎఫ్), 31 ఆర్టికల్స్‌కు ఆ చట్టాలు విరుద్ధమంటూ అక్కడి హైకోర్టు కొట్టివేశాయి.
చంపకం దొరై రాజన్
-పార్లమెంటు అస్థిత్వాన్ని ప్రశ్నించిన మరో కేసు.
-ఆర్టికల్ 46 ప్రకారం రిజర్వేషన్లు ప్రకటన
-మద్రాస్ మెడికల్ విద్యార్థి అధిక మార్కులు పొంది రిజర్వేషన్ల వల్ల సీటు కోల్పోయానని సుప్రీంకోర్టులో కేసు.
-రిజర్వేషన్లు కొట్టివేయుట, ప్రభుత్వాలు కంగుతిన్నాయి.
-పార్లమెంటు మొదటిసారి రాజ్యాంగ సవరణ 31కు (ఎ) (బి)-15కు (ఎ) చేర్చారు.
-జమీందారీ రద్దు చట్టాలు ఆస్తిహక్కుకు వ్యతిరేకం కాదు. రిజర్వేషన్లకు చట్టబద్ధత.
బేలా బెనర్జీ
-ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఆస్తులు స్వాధీనం చేసుకున్నప్పుడు నష్టపరిహారం ఎలా చెల్లించాలి అనేది కేసు సారాంశం.
-బెంగాల్ ప్రభుత్వం, బెలాబెనర్జీ ఆస్తి స్వాధీనం, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లింపు,
-సరిపోలేదని కోర్టుకు వెళ్లడం. ప్రభుత్వానికి నచ్చిన పరిహారం కాక మార్కెట్ శక్తులు నిర్ణయించిన పరిహారం చెల్లించాలని తీర్పు. ప్రభుత్వం వర్సెస్ మార్కెట్
-సువిశాల దేశంలో, భవిష్యత్‌లో విస్తరించబోయే ప్రాజెక్టులకు ఏ ప్రాంతపు మార్కెట్ రేటును ప్రాతిపదికంగా తీసుకోవాలి? అనేది అందరిని భయపెట్టింది.
-4వ రాజ్యాంగ సవరణ ఫలితంగ మార్కెట్ శక్తులు కాక పార్లమెంట్ నిర్ణయించింది.
భూసంస్కరణల చట్టాలు
-భూమి ఉమ్మడి జాబితా
-కేంద్రం, భూసంస్కరణల చట్టాలు ముందే చేసింది. దాన్ని అనుకరిస్తూ కేరళ, బెంగాల్, బీహార్లు ప్రత్యేక చట్టాలు.
-న్యాయ సమీక్ష విధానంలో కేంద్ర, రాష్ట్ర చట్టాల సమీక్ష స్పష్టంగా లేదని, కేంద్ర చట్టాలను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు రాష్ట్ర చట్టాలను కొట్టివేసింది.
-17వ రాజ్యాంగ సవరణ న్యాయ సమీక్షకు పునర్నిర్వచనం
-భూసంస్కరణ చట్టాలను సమీక్షకు వీలుకాని 9వ షెడ్యుల్‌లో పడేశారు.
-అయినా ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు కొనసాగుతూ వచ్చాయి.
గోలక్‌నాథ్
-దేశంలో పెను సంచలనం సృష్టించిన తీర్పు
-సాధారణ చట్టాలను న్యాయ సమీక్షకు గురిచేసినట్టు, రాజ్యాంగాన్ని సవరిస్తూ చేసిన సవరణ చట్టాలను న్యాయ సమీక్షకు గురిచేయవచ్చునా?
-రాజ్యాంగ నిర్మాతలకే రాని ప్రశ్న ఈ కేసులో ఉద్భవించింది.
24వ సవరణ
-పార్లమెంట్ సార్వభౌమాధికారి
-ప్రాథమిక హక్కులతో పాటు దేన్నయినా సవరించవచ్చు.
25వ సవరణ
-ఆదేశిక సూత్రాలకు చట్టబద్ధత ప్రాథమిక హక్కుల స్థాయి పడగొట్టబడింది. భూసేకరణ, నష్టపరిహారంపై న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి వీలులేదు.
26వ సవరణ
-రాజాభరణాల రద్దు చట్టానికి రాజ్యాంగ బద్ధత
కేశవానంద భారతి
-పై 3 సవరణలపై కేరళకు చెందిన మతాధికారి సుప్రీంలో కేసు. కాంప్రమైజ్ తీర్పు
సారాంశం
1. పార్లమెంట్ సార్వభౌమాధికారి. ఓకే, నోడౌట్
2. ఏ భాగాన్నయినా మార్చొద్దు. కానీ మౌలిక స్వరూపం మార్చొద్దు.
ఉదా: స్త్రీ=స్త్రీ లింగం, పురుషుడు=పు లింగం. అటుదిటు, ఇటుదటు చేయరాదు.
3. 25వ సవరణ చెల్లదు. 24, 25 చెల్లుతాయి.
4. మౌలిక స్వరూపం అనే పదంతో నియంతృత్వానికి చెక్‌మేట్
స్వదేశీ సంస్కరణలు-రాజ్యాంగ సర్దుబాట్లు
-రాజ్యాంగ నిర్మాతలు ప్రాథమిక హక్కులను అమెరికా నుంచి ఆదేశిక సూత్రాలు ఐరిష్ రాజ్యాంగం నుంచి సంగ్రహించారు.
-హక్కులు, స్వేచ్ఛ, వ్యక్తి, పెట్టుబడిదారీ, ఆదేశిక సూత్రాలు, శ్రేయోరాజ్యం, ప్రభుత్వం.
-స్వేచ్ఛ వర్సెస్ కట్టుబాట్లు, వ్యక్తి వర్సెస్ వ్యవస్థ సిద్ధాంతిక వైరుద్ధ్యం.
-ఏ చిన్న సంస్కరణ చేపట్టినా విత్తు ముందా, చెట్టుముందా? వ్యక్తిగొప్పా, వ్యవస్థ గొప్పదా? అనే యక్షప్రశ్న ఉదయించి మొదటి హక్కులకు, సూత్రాలకు మధ్య ఘర్షణ కాస్త అయి ప్రభుత్వం, న్యాయవ్యవస్థల మధ్య సంఘర్షణగా రూపాంతరం చెంది, ప్రధాన మంత్రులకు సైతం ముచ్చెమటలు పోయించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు