మహాలక్ష్మి అమ్మవారికి తన ఎడమ చేతి వేళ్లను బలిగా సమర్పించిన రాజు?
1. రాష్ట్రకూటులు బాదామి చాళుక్యులకు సామంతులుగా ఉండి ఆ రాజ్య శిథిలాలపై స్వతంత్ర, సువిశాల సమ్రాజ్యాన్ని నిర్మించారు. తెలంగాణలోని పలు జిల్లాలు రాష్ట్రకూటుల పాలనో ఉండేవి. వారి రాజధాని ఏది?
1) కర్ణాటక ప్రాంతంలోని మాన్యఖేటం
2) మహారాష్ట్రలోని నాందేడ్
3) తమిళనాడులోని తంజావూరు 4) ఏదీకాదు
2. కిందివాటిని జతపర్చండి.
1. దంతిదుర్గుడు ఎ. క్రీ.శ. 793-814
2. మొదటి కృష్ణుడు బి. క్రీ.శ. 780-792
3. ధృవరాజు సి. క్రీ.శ. 758-772
4. మూడో గోవిందుడు డి. క్రీ. శ. 748-758
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
3. స్వతంత్ర రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు దంతిదుర్గుడు. ఇతడు రెండో ఇంద్రరాజు కుమారుడు. ఇతడు ఎవరిని ఓడించి స్వంతంత్ర రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించాడు?
1) పల్లవ రాజు రెండో నందివర్మ
2) బాదామి చాళుక్య రాజు రెండో కీర్తి వర్మ
3) మొదటి సోమేశ్వరుడు 4) ఆరో విక్రమాదిత్యుడు
4. ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయ (ఏకశిలా నిర్మితం) నిర్మాణం దాదాపు వందేండ్లు కొనసాగింది. దీనికి వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు కూడా లభించింది. దీన్ని ఎవరు నిర్మించారు?
1) ధృవరాజు 2) మూడో గోవిందుడు
3) దంతిదుర్గుడు 4) మొదటి కృష్ణుడు
5. ధృవుడు తూర్పు చాళుక్య రాజైన నాల్గో విష్ణువర్థనుణ్ని ఓడించి అతని కుమార్తెను వివాహం చేసుకొన్నాడు. ఆమె పేరేమిటి?
1) అక్కమహాదేవి 2) రేవకనిర్మాడి
3) శీలమహాదేవి 4) ఎవరూకాదు
6. రాష్ర్టానికి ముఖ్యాదాయం భూమి శిస్తు. దీనికితోడు పడేళ్లనాళ పన్ను విధించి వసూలు చేసేవారు. పడేళ్లనాళ పన్ను ఎందుకోసం విధించేవారు?
1) సైన్య నిర్వహణ కోసం 2) వ్యవసాయాభివృద్ధికి
3) అంతఃపురం ఖర్చులకు 4) విద్యాభివృద్ధికి
7. దక్షిణాన గాంగవడి రాజు నితిదుర్గుడు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకొన్నాడు. అతడిని అమోఘవర్షుడు ఓడించి, రాజనీతిజ్ఞతో దాన్ని తిరిగి గాంగరాజుకు ఇచ్చివేసి తన కుమార్తె చంద్రబ్బలచ్చెను గాంగరాజు కుమారడు బూతుగాకు ఇచ్చి వివాహం జరిపాడు. మరొక కుమార్తెను పల్లవ రాజైన నందివర్మకిచ్చి వివాహం జరిపాడు. ఆమె పేరేమిటి?
1) అక్కమహాదేవి 2) రేవకనిర్మాడి
3) శీలమహాదేవి 4) ఎవరూకాదు
8. అమోఘవర్షుడు రచించిన గ్రంథాలు ఏవి?
1) కవిరాజు మార్గం 2) ప్రశ్నోత్తర రత్నమాలిక
3) పై రెండూ 4) ఏదీకాదు
9. అమోఘవర్షుడు మాన్యఖేట (మాల్ఖేడ్) నగరాన్ని నిర్మించి దాన్ని రాష్ట్రకూట రాజధానిగా చేసుకొన్నాడు. అయితే ప్రపంచ ప్రఖ్యాతి వహించిన నలుగురు గొప్ప చక్రవర్తుల్లో అమోఘవర్షుడు ఒకడని ప్రశంసించిన యాత్రికుడు?
1) హుయాన్‌త్సాంగ్ 2) సులేమాన్
3) ఇత్సింగ్ 4) ఎవరూకాదు
10. రాజ్యంలో కరువు కాటకాలను నిలువరించడానికి కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారికి తన ఎడమ చేతి వేళ్లను బలిగా సమర్పించిన రాజు?
1) దంతిదుర్గుడు 2) మొదటి కృష్ణుడు
3) మూడో కృష్ణుడు 4) అమోఘవర్షుడు
11. స్టేట్మంట్-1:అమోఘవర్షుడు జైనమతాన్ని అవలంభించాడు.
స్టేట్మెంట్-2: ఇతడు సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించాడు.
1) స్టేట్మెంట్-1 నిజమే, కానీ స్టేట్మంట్-2 సరికాదు
2) రెండూ సరైనవే
3) స్టేట్మెంట్-1 సరికాదు, స్టేట్మెంట్-2 సరైనదే
4) రెండూ సరికాదు
12. మూడో కృష్ణుడు చోళుల రాజ్యంపై దండెత్తి యువరాజు రాజాదిత్యను చంపి తంజావూర్ కొండ అనే బిరుదును పొందాడు. మొదటి పరాంతక చోళుడిని ఓడించి రామేశ్వరంలో తన విజయ స్తంభాన్ని వేయించాడు. మొదటి పరాంతక చోళుడిని ఓడించిన యుద్ధం పేరు?
1) బొబ్బిలియుద్ధం 2) తళ్లికోట యుద్ధం
3) తక్కోళయుద్ధం 4) ఏదీకాదు
13. అమోఘవర్షుని కాలంలో మాన్యఖేటం రాజధానిగా ఉండేది. అయితే అంతకుముందు రాష్ట్రకూటుల రాజధాని ఏది?
1) ఎల్లిచ్‌పూర్ 2) ఎల్లోరా
3) పైఠాన్ 4) పైవన్నీ
14. రాష్ట్రకూటుల కాలంలో పట్టణాన్ని పాలించేవాడు నగరపతి. గ్రామానికి సాధారణంగా గ్రామపతి అధిపతిగా ఉండేవాడు. అగ్రహారాలకు సంబంధించిన గ్రామసభను ఏమని పిలిచేవారు?
1) మహాజనముల 2) మహామండలేశ్వర
3) మహాసామంత 4) ఏదీకాదు
15. రాష్ట్రకూటల సైన్యం ఐదు లక్షల కంటే తక్కువ. సైన్యంలో కాల్బలానికి అధిక ప్రాధాన్యం ఉండేది. వీరి సైనిక వ్యవస్థలో అన్ని వర్ణాలకు చెందిన సైనికులు కన్పిస్తారు. బంకేయ, శ్రీ విజయ లాంటి వారు సేనాధిపతులుగా ఉండేవారు. వీరు ఏ మతానికి చెందినవారు?
1) బౌద్ధం 2) వైష్ణవం 3) జైనం
4) ఏ మతమో తెలియదు
16. రాష్ట్రకూటుల రాజ్యంలో మనిగారమ్, నానాదేశీయులు, తిస్సెవ ఆయుత్త ఐన్నూర్వర్ అని వృత్తి సంఘాలవారు వర్తకం నిర్వహించేవారు. వీరిలో ముఖ్యమైన వారు ఎవరు?
1) మనిగారమ్ 2) నానాదేశీయులు
3) ఐన్నూర్వర్ 4) అందరూ సమానమే
జవాబులు
1-1, 2-1, 3-2, 4-4, 5-3, 6-1, 7-2, 8-3, 9-2, 10-4, 11-2,12-3, 13-4, 14-1, 15-3, 16-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు