ఊపిరితిత్తులతో శ్వాస తీసుకునే చేపలు ఏవి?
1. ఎడారి ఓడ అని ఏ జంతువును అంటారు?
1) ఏనుగు 2) ఖడ్గమృగం
3) గాడిద 4) ఒంటె
2. జాతీయ వారసత్వ సంపదగా ఏ జంతువును పేర్కొంటారు?
1) ఏనుగు 2) పులి
3) సింహం 4) నెమలి
3. మానవుడి తర్వాత అత్యంత తెలివైన జంతువు?
1) కోతి 2) ఎలుగుబంటి
3) డాల్ఫిన్ 4) కొండంగి
4. జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద జంతువు ఏది?
1) బెలనాప్టెరా మస్కులస్ (తిమింగలం)
2) లాక్సోడాంటా ఆఫ్రికానా (ఆఫ్రికా ఏనుగు)
3) హిప్పోపొటమస్
4) రింకోడాన్/రైనోడాన్ టైపస్
5. అతి తక్కువ గర్భావధి కాలం, అతి ఎక్కువ దంతాలు కలిగిన జంతువు ఏది?
1) ఎలుక 2) అపోజం
3) కుందేలు 4) పిల్లి
6. సరీసృపాలకు, క్షీరదాలకు మధ్య సంధాన సేతువు అని ఏ జంతువును అంటారు?
1) ఆర్నిథోరింకస్ (డక్బిల్డ్ ప్లాటిపస్)
2) ఎకిడ్నా (స్పైనీ యాంట్ ఈటర్)
3) అనాటినస్ 4) కంగారు
7. కన్నీటిని స్రవించే గ్రంథి ఏది?
1) సెబేషియస్ గ్రంథి
2) సెరుమినస్ గ్రంథి
3) లాక్రిమల్ గ్రంథి 4) పైవన్నీ
8. ఏ ఉష్ణోగ్రత వద్ద గుడ్లు పొదగబడుతాయి?
1) 30-32 డిగ్రీ సెంటీగ్రేడ్
2) 34 డిగ్రీ సెంటీగ్రేడ్
3) 33 డిగ్రీ సెంటీగ్రేడ్
4) 37 డిగ్రీ సెంటీగ్రేడ్
9. కోళ్లు గుడ్లను పొదగడాన్ని ఏమంటారు?
1) డుబ్బింగ్ 2) డిబీకింగ్
3) బ్రూడినెస్ 4) భ్రూయరీ
10. కోళ్లకు బర్డ్ ఫ్లూ/ఏవియన్ ఫ్లూ వ్యాధి ఏ వైరస్ వల్ల వస్తుంది?
1) H5N5 2) H5N1
3) H1N1 4) H1N5
11. మేలురకపు బ్రాయిలర్ కోళ్లను, కోళ్ల వ్యాక్సిన్లను ఉత్పత్తిచేసే పశువైద్య పరిశోధన సంస్థ (Indian Veterinary Research Institute – IVRI) ఎక్కడ ఉంది?
1) చెన్నై (తమిళనాడు)
2) హైదరాబాద్ (తెలంగాణ)
3) బెంగళూరు (కర్ణాటక)
4) ఐజాత్నగర్ (గుజరాత్)
12. పౌల్ట్రీ అంటే..?
1) కోళ్ల పెంపకం
2) నెమళ్లు, బాతులు, అడవి బాతుల పెంపకం
3) టర్కీకోళ్లు, ఈము పక్షులు, పావురాల పెంపకం 4) పైవన్నీ
13. NECC (National Egg Co-ordin ation Committe) వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరు?
1) డాక్టర్ బీవీ రావు
2) డాక్టర్ సీహెచ్ స్రవంతి
3) కురియన్
4) డాక్టర్ ఆర్ఎస్ నంద
14. బైనాక్యులర్ దృష్టి కలిగిన పక్షి ఏది?
1) కొరాషియస్ బెంగాలెన్సిస్ (పాలపిట్ట)
2) పావో క్రిస్టేటస్ (నెమలి)
3) బ్యుబో (గుడ్లగూబ)
4) జెర్డాన్ కోర్సర్ (కలివి కోడి)
15. పారిశుద్ధ్య కార్మికులు అని ఏ పక్షులను పిలుస్తారు?
1) కాకులు 2) సైబీరియన్ కొంగలు
3) గద్దలు 4) పిచ్చుకలు
16. అతివేగంగా ఎగిరే పక్షి అని దేనిని అంటారు?
1) స్విఫ్ట్ పక్షి 2) ఆర్కిటిక్ టెర్న్
3) గాడ్ విట్ 4) ఉడ్ కాక్
17. ఏ పక్షి పై దవడను కదిలిస్తుంది?
1) సిట్టాక్యులా (రామచిలుక)
2) గ్రేట్ ఇండియన్ బర్డ్ (బట్టమేకతల పిట్ట)
3) హమ్మింగ్ బర్డ్ (తేనెపిట్ట)
4) కొలంబో (పావురం)
18. అతిపొడవైన రెక్కలు కలిగిన అతిపెద్ద సముద్ర పక్షి ఏది?
1) ఆల్ బట్రోస్ 2) హుద్ హుద్
3) సైబీరియన్ కొంగ 4) ఆర్కిటిక్ టెర్న్
19. గుడ్లను పొదగని పక్షి ఏది?
1) యుడినామస్ (కోయిల)
2) హమ్మింగ్ బర్డ్ (తేనెపిట్ట)
3) కొలంబా (పావురం)
4) జెర్డాన్ కోర్సర్ (కలివి కోడి)
20. మెదడులో ఘ్రాణ లంబికలను కలిగివుండి వాసనను గుర్తించే పక్షి ఏది?
1) హంస 2) బాతు
3) కివి (ఎప్టెరిక్స్) 4) డోడో
21. నిలబడి గుడ్లుపెట్టే పక్షి ఏది?
1) పెంగ్విన్ 2) డోడో
3) బాతు 4) హంస
22. ఏ పక్షి గుడ్డులో ఔషధ లక్షణాలు ఉంటాయి?
1) ఆస్ట్రిచ్ 2) ఈము
3) టీనామస్ 4) రియా అమెరికానా
23. అతిపెద్ద పక్షి ఏది?
1) ఈము 2) పెంగ్విన్
3) రియా అమెరికానా
4) స్ట్రుతియో కామెలస్ (ఆస్ట్రిచ్/నిప్పుకోడి)
24. పక్షుల ధ్వని ఉత్పాదన కేంద్రం ఏది?
1) ఆస్యకుహరం (Buccul cavity)
2) శబ్దిని (Syrinx)
3) గ్రసని 4) స్వరపేటిక
25. ఏ ఖండాన్ని పక్షి ఖండం అంటారు?
1) ఉత్తర అమెరికా 2) దక్షిణ అమెరికా
3) ఆస్ట్రేలియా 4) అంటార్కిటికా
26. భారతదేశ పక్షి శాస్త్ర పితామహుడు ఎవరు?
1) బీవీ రావు 2) కురియన్
3) ఆశ్రే 4) డాక్టర్ సలీం అలీ
27. అతిపొడవైన పాము ఏది?
1) నాగుపాము 2) అనకొండ
3) డ్రయోఫిస్ 4) రక్తపింజర
28. ఏ పాము విషానికి విరుగుడు లేదు?
1) రక్త పింజర (రస్సెల్స్ వైపర్)
2) సముద్ర పాము
3) రాటిల్ స్నేక్ (క్రొటాలస్)
4) నాగుపాము (నాజానాజా)
29. గూడు కట్టుకునే పాము ఏది?
1) బంగారస్ (కట్లపాము)
2) వైపరా రసెల్లి (గొలుసు రక్తపింజర)
3) ఒఫియోఫాగస్ హన్న (రాచనాగు)
4) నాజానాజా (నాగుపాము)
30. పిల్లలను కనే పాము ఏది?
1) రక్తపింజర (రస్సెల్స్ వైపర్)
2) సముద్రపాము (హైడ్రోఫిస్)
3) రాటిల్ స్నేక్ (క్రొటాలస్)
4) నాగుపాము (నాజానాజా)
31. భారతదేశపు పెద్దబల్లి ఏది?
1) వెరానస్ (ఉడుము)
2) కొమిడో డ్రాగన్
3) కెలోటిస్ (తొండ)
4) హెమీ డాైక్టెలస్ (గోడబల్లి)
32. ఒక కన్నుతో ముందుకు, మరో కన్నుతో వెనుకకు చూసే సరీసృపం ఏది?
1) డ్రాకో (ఎగిరే బల్లి)
2) వెరానస్ (ఉడుము)
3) కొమిడో డ్రాగన్
4) కెమిలియాన్ (ఊసరవెల్లి)
33. గంగానది కాలుష్యాన్ని తట్టుకోలేక అంతరించిపోయే దశలో ఉన్న మొసలి ఏది?
1) గాంజిటికస్ (భారతదేశపు గేవియాల్/ఘరియాల్)
2) గేవియాలిస్ 3) అలిగేటర్
4) క్రొకడైలస్ పాలుస్ట్రిస్
34. మొసలి హృదయంలోని గదుల సంఖ్య?
1) 2 2) 3 3) 4 4) 5
35. అత్యధిక కాలం జీవించే జంతువు ఏది?
1) ఏనుగు 2) ఉడుము
3) ఒంటె 4) తాబేలు
36. సరీసృపాల్లోని హృదయ గదుల సంఖ్య?
1) రెండు 2) మూడు
3) నాలుగు 4) ఒకటి
37. నఖాలు మొదట ఏ జీవుల్లో కనిపించాయి?
1) ఉభయచరాలు 2) సరీసృపాలు
3) పక్షులు 4) క్షీరదాలు
38. మొదటి సంపూర్ణ భూచర జంతువులు ఏవి?
1) ఉభయ చరాలు 2) పక్షులు
3) సరీసృపాలు 4) క్షీరదాలు
39. డిప్నాయ్ చేపల్లో శ్వాస అవయవాలు ఏవి?
1) చర్మం 2) ఆస్యకుహరం
3) మొప్పలు 4) ఊపిరితిత్తులు
40. అతిపెద్ద ఎర్రరక్త కణాలు కలిగిన జంతువు ఏది?
1) ట్రైలటోట్రైటాన్ 2) ఆంఫియూమా
3) ఇక్తియోఫిస్ 4) గెగనోఫిస్
41. సాలమాండర్ల రాజధాని అని దేన్ని అంటారు?
1) ఉత్తర అమెరికా 2) దక్షిణ అమెరికా
3) ఆఫ్రికా 4) ఆసియా
42. పూర్వాంగాలు (ముందు కాళ్లు), చరమాంగాలు (వెనుక కాళ్లు) సమానంగా ఉండే ఉభయచరాలు ఏవి? (2)
1) ఎన్యురా/సేలియెన్షియన్స్
2) యురోడిలా/కాడేటాలు
3) ఎపొడా/సిసీలియన్లు
4) పైవన్నీ
43. పూర్వంగాలు (ముందు కాళ్లు) చిన్నగా, చరమాంగాలు (వెనుక కాళ్లు) పెద్దగా ఉండే ఉభయచరాలు ఏవి?
1) ఎన్యురా/సేలియెన్షియస్
2) యురోడిలా/కాడేటాలు
3) ఎపొడా/ససీలియన్లు 4) 1, 3
44. మంత్రసాని కప్ప అని దేనిని అంటారు?
1) మైక్రో హైలా 2) రానా గోలియాత్
3) అలైటిస్ 4) ఫిల్లో బేటస్
45. ఎగిరే కప్ప అని దేన్ని అంటారు?
1) రానా 2) బ్యుఫో
3) హైలా 4) రాకోఫోరస్
46. కప్పల్లోని అండాల సమూహాన్ని, శుక్రకణాల సమూహాన్ని వరుసగా ఎలా పిలుస్తారు?
1) మిల్ట్, స్పాన్ 2) స్పాన్, మిల్ట్
3) మిల్ట్, మిల్ట్ 4) స్పాన్, స్పాన్
47. కప్పలు లేని దేశం ఏది?
1) ఆస్ట్రేలియా 2) న్యూజిలాండ్
3) దక్షిణ అమెరికా 4) పైవన్నీ
48. ఉభయచరాల హృదయంలోని గదుల సంఖ్య?
1) రెండు 2) మూడు
3) నాలుగు 4) ఐదు
49. నీటి నుంచి బయటకు వచ్చి నేలపై నడిచిన మొదటి జంతువులు ఏవి?
1) ఉభయచరాలు 2) సరీసృపాలు
3) పక్షులు 4) క్షీరదాలు
50. ఏ చేపకు నాలుగు కాళ్లు ఉంటాయి?
1) పెట్రోమైజాన్ 2) మిక్సిన్
3) సిల్వర్ పాంఫ్రెట్ 4) ఏంజిలాప్స్
51. అతిపెద్ద అక్వేరియం ఎక్కడ ఉంది?
1) తారాపూర్ (ముంబై) 2) చెన్నై
3) కొవిడియాల్ (బెంగళూరు) 4) పుణె
52. ఎసిటిక్ ఆమ్లంలో చేపల చర్మాన్ని కరిగించి తయారుచేసిన పదార్థాన్ని పుస్తకాల బైండింగ్లో వాడుతారు. అయితే ఈ పదార్థాన్ని ఏమని పిలుస్తారు?
1) ఫిష్గ్వాన్ 2) షాగ్రీన్
3) ఫిష్ గ్లూ 4) ఐసిన్ గ్లాస్
53. ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు అధికంగా ఏ చేపల్లో లభిస్తాయి?
1) సాైర్డెన్ 2) సాల్మన్
3) 1, 2 4) కాడ్ చేప
54. ఏ చేపల కాలేయ నూనెలో విటమిన్ A, D పుష్కలంగా లభిస్తాయి?
1) సొరచేప 2) కాడ్ చేప
3) 1, 2 4) సాల్మన్ చేప
55. చేపల హృదయంలోని గదుల సంఖ్య?
1) రెండు 2) మూడు
3) నాలుగు 4) ఐదు
56. దవడలు కలిగిన సకశేరుకాలు ఏవి?
1) ఆస్ట్రకోడర్మ్లు 2) సైక్లోస్టోమ్లు
3) 1, 2 4) చేపలు
57. గుండ్రని నోరు, దవడలు కలిగిన కార్డేట్లు ఏవి?
1) ఆస్ట్రకోడర్మ్లు 2) సైక్లోస్టోమ్లు
3) 1, 2 4) చేపలు
58. గుండ్రటి నోరు ఉండి దవడలు కలిగిన సజీవ కార్డేట్లు ఏవి?
1) ఆస్ట్రకోడర్మ్లు 2) సైక్లోస్టోమ్లు
3) చేపలు 4) ఉభయచరాలు
59. పృష్ఠవంశం లార్వా తోకలో మాత్రమే ఉండే కార్డేట్లు ఏవి?
1) చేపలు 2) సైక్లోస్టొమేట్లు
3) సెఫలోకార్డేట్లు 4) యూరోకార్డేట్లు
60. ట్యూనికేట్లు అని వేటిని అంటారు?
1) చేపలు 2) సెఫలోకార్డేట్లు
3) యూరోకార్డేట్లు 4) పైవన్నీ
61. ప్రొటోకార్డేట్లు అని వేటిని అంటారు?
1) యూరోకార్డేట్లు 2) సెఫలోకార్డేట్లు
3) 1, 2 4) వర్టిబ్రేటా
62. అర్థసకశేరుకాలు అని వేటిని అంటారు?
1) హెమీకార్డేట్లు 2) మొలస్కా
3) ఆర్థ్రోపొడా 4) అనెలిడా
63. జలప్రసరణ వ్యవస్థ/అంబులేక్రల్ వ్యవస్థను ఏ వర్గపు జీవుల్లో చూడవచ్చు?
1) హెమీకార్డేటా 2) ఇఖైనోడర్మేటా
3) మొలస్కా 4) ఆర్థ్రోపొడా
64. ప్రౌఢ జీవులు వ్యాసార్ధ సౌష్ఠవాన్ని (Radial Symmetry), డింబకాలు ద్విపార్శ సౌష్ఠవాన్ని (Bilateral Symmetry) చూపడం ఏ జంతు వర్గంలో కనిపిస్తుంది?
1) ఇఖైనోడర్మేటా 2) అనెలిడా
3) సిలెంటిరేటా 4) మొలస్కా
65. ముళ్లవంటి చర్మంగల జీవులు ఏ వర్గంలో ఉన్నాయి?
1) అనెలిడా 2) ఆర్థ్రోపొడా
3) ఇఖైనోడర్మేటా 4) మొలస్కా
66. అతిపెద్ద సజీవ అకశేరుకం అని ఏ జీవిని అంటారు?
1) ఆర్కిట్యూథిస్ 2) మైటిలస్
3) టెరిడో 4) యూనియో
67. ఏ వర్గపు జీవుల్లో ఆకురాయి లాంటి రాడ్యులా అనే నిర్మాణం ఉండి, ఆహారాన్ని ముక్కలు చేయడానికి తోడ్పడుతుంది?
1) మొలస్కా 2) ఇఖైనోడర్మేటా
3) ఆర్థ్రోపొడా 4) అనెలిడా
68. అనెలిడా, ఆర్ధ్రోపొడా వర్గాల మధ్య సంధాన సేతువు అని ఏ జీవిని అంటారు?
1) బెలనోగ్లాసస్ 2) ఆర్కియోప్టెరిక్స్
3) రాచపీత 4) పెరిపేటస్
69. జీవితకాలం నీరు తాగని జీవి ఏది?
1) ఎఫిడ్
2) డ్రోసోఫిలా
3) లెపిస్మా (సిల్వర్ ఫిష్)
4) సీతాకోక చిలుక
70. పాత పుస్తకాలు, పటాల ఫ్రేముల మధ్య ఉండే జీవి?
1) లెపిస్మా (సిల్వర్ ఫిష్) 2) పేను
3) నల్లి 4) లక్కపురుగు
జవాబులు
1-4, 2-1, 3-3, 4-1, 5-2, 6-1, 7-3, 8-4, 9-3, 10-2, 11-4, 12-4, 13-1, 14-3, 15-1, 16-1, 17-1, 18-1, 19-1, 20-3, 21-1, 22-2, 23-2, 24-2, 25-2, 26-4, 27-2, 28-3, 29-3, 30-1, 31-1, 32-4, 33-2, 34-3, 35-4, 36-2, 37-2, 38-3, 39-4, 40-2, 41-1, 42-2, 43-1, 44-3, 45-4, 46-2, 47-4, 48-2, 49-1, 50-4, 51-1, 52-3, 53-3, 54-3, 55-1, 56-4, 57-2, 58-2, 59-4, 60-3, 61-3, 62-1, 63-2, 64-1, 65-3, 66-1, 67-1, 68-4, 69-3, 70-1.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు