తెలుగులో వెలువడిన తొలి శతకం ఏది?
టెట్, డీఎస్సీ, జేఎల్, డీఎల్, నెట్, సెట్ ప్రత్యేకం
# పెండ్లి వేడుకను సమగ్రంగా వర్ణించిన కవి- మాదయగారి మల్లన. ఈయన రాజశేఖర చరిత్రను నాదెండ్ల అప్పామాత్యునికి అంకితమిచ్చాడు.
# త్రికాలవేది అనే చిలుక వృత్తాంతం గల ప్రబంధం- రాజశేఖర చరిత్ర
# రామాభ్యుదయం రచించిన కవి- అయ్యలరాజు రామభద్రుడు
# ఈ కవి అష్టదిగ్గజ కవుల్లో లేడని చెప్పినవాడు- వేటూరి ప్రభాకరశాస్త్రి
# రామాభ్యుదయాన్ని గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చారు
# లక్ష్మణుడు కాకుండా రాముడే శూర్పణఖ ముక్కుచెవులు కోసినట్లుగా ఉన్న ప్రబంధం- రామాభ్యుదయం
# చింతలపూడి ఎల్లనార్యుడు రచించిన ప్రబంధం రాధామాధవం. ఇది మదనగోపాలుడికి అంకితమిచ్చారు. ఇందులో నాయికానాయకులు రాధ, శ్రీకృష్ణుడు
# కృష్ణదేవరాయల ఆస్థానంలో అల్లసాని పెద్దన పరీక్షించిన కవి చింతలపూడి ఎల్లనార్యుడు. ఇతడు మదనగోపాలుని భక్తుడు. ఈయన ఇతర రచనలు తారక బ్రహ్మరాజీయం, విష్ణుమాయానాటకం
# రాధాకృష్ణుల శృంగార కేళిని తెలిపే ప్రబంధం రాధామాధవం. దీనికి మూలం బ్రహ్మవైవర్తపురాణం
# ‘విజయవిలాసం’ అనే ప్రబంధాన్ని రచించిన కవి చేమకూర వెంకటకవి. ఇతడు తంజావూరును పరిపాలించిన రఘునాథ నాయకుడి ఆస్థాన కవి. ఇతని తొలి రచన సారంగధర చరిత్ర.
# ఇంటిపేరు నస అయినా కవిత్వంలో పస ఉన్నది. చక్కెర మడిలో అమృతం పారించి పండించిన చేమకూర అని కవులు, పండితులు పొగిడిన కవి ఎవరు? – చేమకూర వేంకటకవి
# విజయవిలాసానికి మూలం మహాభారతం ఆదిపర్వంలోని సుభద్రాపరిణయ ఘట్టం
# చేమకూర పాకాన పడ్డదని ప్రశంస పొందిన ప్రబంధం విజయవిలాసం
# స్వయంవరం, ఆర్ష, గాంధర్వం అనే మూడు విధాల వివాహాలు గల ప్రబంధం- విజయవిలాసం. ఉలూచి వివాహం స్వయంవరం, చిత్రాంగద వివాహం ఆర్ష, సుభద్ర వివాహం గాంధర్వం.
# విజయ విలాసానికి మహాభాష్యం వంటిది తాపీ ధర్మారావు రచించిన హృదయోల్లాస వ్యాఖ్య. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బమతి లభించింది. విజయవిలాసం రఘునాథ నాయకుడికి అంకితమిచ్చారు
# క్షితిలో నీమార్గమెవరికిన్ రాదు సుమీ, ప్రతి పద్యరచనా చమత్కృతుడవు అని రఘునాథ నాయకుడిచే ప్రస్తుతించబడినవాడు- చేమకూర వేంకటకవి
# ఏ గతి రచియించిరేని సమకాలమువారలు మెచ్చరే కదా అని బాధపడిన కవి చేమకూర వేంకటకవి
# విజయవిలాసంలోని కథావస్తువు అర్జునుడి ప్రణయ వృత్తాంతం
# ఉలూచి తండ్రి నాగరాజైన కౌరవ్యుడు. ఈమె కుమారుడు ఇరావంతుడు.
# చిత్రాంగద తండ్రి మలయధ్వజుడు. ఈమె కుమారుడు బభ్రువాహనుడు.
# రోహిణి, వసుదేవుల కూతురు సుభద్ర. ఈమె కుమారుడు అభిమన్యుడు.
# విజయ విలాసానికి వ్యాఖ్యలు రచించినవారు – వేదం వెంకటరాయశాస్త్రి, బులుసు వెంకటరమణయ్య, నోరిగారం లింగశాస్త్రి, తాపీధర్మారావు.
ప్రబంధ సాహిత్యంపై పరిశోధన గ్రంథాలు
# మనుచరిత్ర హృదయావిష్కరణం – జనమంచి శేషాద్రిశర్మ
# అల్లసానివాని అల్లిక జిగిబిగి – విశ్వనాథ సత్యనారాయణ
# ప్రబంధ వాజ్మయం – పల్లా దుర్గయ్య
# పారిజాతాపహరణ పర్యాలోచనం – డాక్టర్ పి. యశోదారెడ్డి
# అముక్త మాల్యద పర్యాలోకనం – వెల్దండ ప్రభాకరామాత్య
# అముక్తమాల్యద సౌందర్యం – డాక్టర్ కోటేశ్వరరావు
# కళాపూర్ణోదయంపై కవిత్వతత విచారం – కట్టమంచి రామలింగారెడ్డి
# శిల్ప ప్రభావతి – డాక్టర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
# రామకృష్ణుని రచనావైఖరి – పుట్టపర్తి నారాయణాచార్యులు
# మహాకవి ధూర్జటి – సమ్యక్పరిశీలన – డాక్టర్ గోరంట్ల మదన్మోహన్రావు
# వసుచరిత్ర సాహితీసౌరభం – పుట్టపర్తి నారాయణాచార్యులు
# రామరాజు భూషణుడిపై ‘భూషణ కిరణావళి’ – వెంపరాల సూర్యనారాయణశాస్త్రి
# అష్టదిగ్గజములు – ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విద్యార్థులు
# విజయనగరాంధ్ర కవులు – శిష్టా లక్ష్మీకాంత శాస్త్రి
శతకం
# శతకం అంటే నూరు పద్యాలు గల రచన అని అర్థం.
శతకం లక్షణాలు
1. సంఖ్యానియమం ఉండటం : సాధారణంగా శతకాల్లో 108 పద్యాలు ఉంటాయి.
2. మకుట నియమం ఉండటం : మకుటం అంటే కిరీటం అని అర్థం. రాజుకు కిరీటం ఎంత ప్రధానమైనదో శతకానికి మకుటం అంత ప్రధానమైనది. మకుటాలు నాలుగు విధాలుగా ఉంటాయి. అవి.
# 1. ఏకపద మకుటం – ఒకే పదం మకుటంగా ఉండుట.
ఉదా : సుమతీ శతకంలో సుమతీ, భాస్కర శతకంలో భాస్కరా, కుమార శతకంలో కుమారా, కుమారీ శతకంలో కుమారీ మొదలైనవి ఏకపద మకుటాలు.
# 2. అర్ధపాద మకుటం : సుమారు అర్ధపాదం మకుటంగా ఉండుట.
ఉదా : వృషాధిప శతకంలో బసవాబసవా వృషాధిపా, దాశరథీ శతకంలో దాశరథీ కరుణాపయోనిధీ. సిరిసిరిమువ్వ శతకంలో సిరిసిరిమువ్వ మొదలైనవి అర్ధపాద మకుటాలు
# 3. ఏకపాద మకుటం : ఒకపాదం మకుటంగా ఉండుట.
ఉదా : వేమన శతకంలో విశ్వదాభిరామ వినురవేమ, కాళికాంబ శతకంలో కాళికాంబ హంసకాళికాంబ, సంగమేశ శతకంలో శరణు సంగమేశ శరణు శరణు మొదలైనవి ఏకపాద మకుటాలు.
# 4. ద్విపాద మకుటం : రెండు పాదాలు మకుటంగా ఉండుట
ఉదా : నరసింహ శతకంలో భూషణ వికాస శ్రీధర్మపురి నివాస, దుష్ట సంహార నరసింహ దురితదూర, శ్రీనివాస శతకంలో సప్తగిరివాస కలియుగ సాధుపోష, శిష్ట రక్షక తిరుమల శ్రీనివాస, ఆంధ్రనాయక శతకంలో చిత్రచిత్ర ప్రభావ దక్షిణ్యభావ, హతవిమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ మొదలైనవి ద్విపాద మకుటాలు.
# సాధారణంగా మకుటం పద్యం చివరలో ఉంటుంది. కానీ చిదంబర శాస్త్రి రచించిన దారుణ శతకంలో పద్యం మొదట ఉంటుంది.
# ఛందోనియమం ఉండటం : ఏదో ఒక ఛందస్సులోనే శతకం ఉంటుంది. కానీ వృత్త పద్యాల్లోనైతే ఉత్పలమాల, చంపకమాలల్లో లేదా శార్ధూలం, మత్తేభంలో శతకం రాసే సౌలభ్యం ఉంది.
4. ముక్తకాలుగా ఉండటం: శతకంలోని పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి. ముక్తకం అంటే ఒక పద్యానికి మరో పద్యానికి సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండటం.
5. ఆత్మాశ్రయత్వం కలిగి ఉండటం : సాధారణంగా శతకాలు ఆత్మాశ్రయ ధోరణిలో ఉంటాయి. కవి ఆత్మ నివేదన ప్రధానంగా కనిపిస్తుంది.
# తెలుగులో వెలువడిన తొలి శతకం శివతత సారం. దీన్ని రచించిన కవి మల్లికార్జున పండితుడు. ఈ శతకంలో సంఖ్యా నియమం, మకుట నియమం లేకపోవడంతో సంపూర్ణ శతక లక్షణాలుగల శతకం కాదు.
# తెలుగులో సంపూర్ణ శతక లక్షణాలుగల తొలి శతకం వృషాధిప శతకం. దీన్ని రచించిన కవి పాల్కురికి సోమనాథుడు.
# ఆంధ్ర శతక సాహిత్యం అనే పరిశోధనా గ్రంథ రచయిత డా. కే గోపాకృష్ణారావు. ఈయన శతకాలను వస్తువును అనుసరించి 10 విధాలుగా విభజించాడు. అవి: 1. భక్తి శతకాలు 2. శృంగార శతకాలు 3. వ్యాజస్తుతి శతకాలు 4. వేదాంత శతకాలు 5. నీతి శతకాలు 6. అధిక్షేపాత్మక శతకాలు 7. హాస్య శతకాలు 8. ప్రకీర్ణ శతకాలు 9. వివిధ వస్తైక శతకాలు 10. కథాత్మక శతకాలు.
1. భక్తి శతకాలు: భక్తి సంబంధమైన శతకాలు. వీటిని శైవ, వైష్ణవ, దేవి, వివిధ దేవతా సంబంధ శతకాలుగా వర్గీకరించారు.
ఎ) శైవమత సంబంధమైనవి – శివుని గురించి స్తుతిస్తూ రాసిన శతకాలు. అవి:
# శివతత సారం – మల్లికార్జున పండితుడు
# వృషాధిప శతకం – పాల్కురికి సోమనాథుడు
# సర్వేశ్వర శతకం – యధావాక్కుల అన్నమయ్య
# శ్రీ కాళహస్తీశ్వర శతకం – ధూర్జటి
# విశ్వనాథ శతకం – అమలాపురపు సన్యాస కవి
#రాజశేఖర శతకం – సత్యవోలు సోమసుందర కవి
#భక్త చింతామణి – కూచిమంచి సోమసుందర కవి
# మృత్యుంజయ శతకం – తెన్నేటి నారాయణ శర్మ
బి) వైష్ణవ మత సంబంధమైనవి – విష్ణువును లేదా ఆయన అవతారాలను గురించి స్తుతిస్తూ రాసిన శతకాలు.అవి:
# నారాయణ శతకం – బమ్మెర పోతన (వైష్ణవ మత సంబంధ శతకాల్లో మొదటిది)
# వీర నారాయణ శతకం – రావూరి సంజీవ కవి
# మనసా హరిపాదములాశ్రయింపుమా – తాడేపల్లి పానకాలరాయ కవి
# నారసింహ శతకం – కాకుత్సల శేషప్ప కవి
# వేదనా శతకం, విభూతి శతకం – పుట్టపర్తి నారాయణాచార్యులు
# దాశరథి శతకం – కంచర్ల గోపన్న
# కృష్ణ శతకం (అలభ్యం) – తిక్కన
# రఘునాథ శతకం – పుష్పగిరి తిమ్మకవి
సి) దేవీ సంబంధ శతకాలు – లక్ష్మి, పార్వతి, సరస్వతులను స్తుతిస్తూ రాసిన శతకాలు. అవి:
# సరస్వతి శతకం – వెండిగంటం గురునాథ శర్మ
# శారదా శతకం – భమిడిపాటి రామమూర్తి
# లక్ష్మీ శతకం – పరవస్తు మునినాథ కవి
# మహిషాసుర మర్ధిని శతకం – దిట్టకవి రామచంద్ర కవి
డి) వివిధ భక్తి శతకాలు – వివిధ దేవతలను గురించి స్తుతిస్తూ రాసిన శతకాలు. అవి:
#విశ్వనాథ మధ్యాక్కరలు- విశ్వనాథ సత్యనారాయణ
# భక్త చింతామణి శతకం – వడ్డాది సుబ్బరాయ కవి
# సూర్యనారాయణ శతకం – ఆదిభట్ల నారాయణదాసు
#వీరబ్రహ్మంగారి శతకం – బొద్దోజు త్రిపురాంతకాచార్యులు
#శ్రీ మలయాళ సద్గురు శతకం – సముద్రాల లక్ష్మయ్య
# మాతృ శతకం – దువ్వూరి రామిరెడ్డి
2. వ్యాజస్తుతి శతకాలు: పైకి నిందగా కనిపిస్తూ లోన పొగడ్త కలిగిన శతకాలు. అవి:
# సింహాద్రి నారసింహ శతకం – గోగులపాటి కూర్మనాథుడు. (వ్యాజస్తుతి శతకాల్లో మొదటిది)
#భద్రగిరి శతకం – భల్లా పేరయ్య
# ఆంధ్రనాయక శతకం – కాసుల పురుషోత్తమ కవి
# హంసలదీవి వేణుగోపాల శతకం – కాసుల పురుషోత్తమ కవి
3. వేదాంత శతకాలు: ఆధ్యాత్మిక సంబంధ విషయాలతో కూడిన శతకాలు. అవి:
#శివముకుంద శతకం- పరమానంద యతి
# సంపంగిమన్న శతకం – పరమానంద యతి
# స్వప్రకాశ శతకం – ఎడ్ల రామదాసు
# అఖిల రూపాత్మక శతకం – ఎడ్ల రామదాసు
# రామరామ శతకం – తోట నర్సింహ కవి
# ఆత్మారామ గోవింద శతకం – పరశురామ పంతులు
# భద్రాద్రి రామ శతకం – పరశురామ పంతులు
#మానస బోధ, చిత్త బోధ శతకాలు – తాడేపల్లి పానకాలరాయ కవి
# సాక్షిలింగ శతకం – కొప్పు ఆదినారాయణ
# పరమపద పరిపూర్ణ శతకం – భళ్లా వెంకయ్య
# పరమపురుష శతకం – పోలూరి పాపయ కవి
# సంగమేశ శతకం – డా. కృష్ణ కౌండిన్య
# చిత్త శతకం – శ్రీపతి భాస్కర కవి
4. నీతి శతకాలు: నైతిక విలువల గురించి ప్రబోధిస్తూ రాసిన శతకాలు. అవి:
#సుమతీ శతకం – బద్దెన (నీతి శతకాల్లో మొదటిది)
# భాస్కర శతకం – మారద వెంకయ్య (మారవి)
# కుమార శతకం – ఫక్కి అప్పల నరసింహ
# కుమారీ శతకం – తోట వెంకటనర్సయ్య
# వేంకటేశ్వర శతకం – తాళ్లపాక పెదతిరుమలాచార్యులు
# కుమతి శతకం – కే నారాయణరావు
మాదిరి ప్రశ్నలు
1. ‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా’ అని బాధపడిన కవి? (2)
1) రామరాజ భూషణుడు
2) చేమకూర వేంకట కవి
3) నంది తిమ్మన 4) పింగళి సూరన
2. ప్రబంధ వాజ్మయం పరిశోధనా గ్రంథ రచయిత ఎవరు? (4)
1) వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి
2) పుట్టపర్తి నారాయణాచార్యులు
3) వెల్దండ ప్రభాకరామాత్య
4) డా. పల్లా దుర్గయ్య
3. తెలుగులో సంపూర్ణ లక్షణాలుగల తొలి శతకం ఏది? (1)
1) వృషాధిప శతకం 2) శివతత్త సారం
3) సుమతీ శతకం 4) సర్వేశ్వర శతకం
4. తెలుగులో తొలి నీతి శతకం? (3)
1) భాస్కర శతకం 2) కుమార శతకం
3) సుమతీ శతకం 4) కుమారీ శతకం
డా. తండు కృష్ణ కౌండిన్య
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ
ప్రభుత్వ డిగ్రీకాలేజ్, దేవరకొండ,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు