తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం గ్రూప్:1 పేపర్-6..
అభ్యర్థులు ఈ పేపర్‌కు సంబంధించి హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ విలక్షణ సంస్కృతి, ముల్కి-నాన్ ముల్కి అంశాలు, భారత సమాఖ్యలో హైదరాబాద్ విలీనం తదనంతర పరిపాలన, ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు-సిఫారసులు, 1956లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భా వం, పెద్దమనుషుల ఒప్పందం ముఖ్యాంశాలు, ఉల్లంఘనలు, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రాధాన్యత, ముల్కి నిబంధనలపై కోర్టు తీర్పులు, జై ఆంధ్ర ఉద్యమం, ఆరుసూత్రాలు, 8 సూత్రాలు, ఐదు సూత్రాల పథకాలు, 371-డీ ఆర్టికల్, రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీఓ, నక్సలైట్ ఉద్యమం-వ్యాప్తి ప్రభావం, తెలంగాణ సమాజం-సంస్కృతిపై సినిమా, మీడియా, ఇతర పరిశ్రమల ఆధిపత్యం, భాషా సంస్కృతులపై దాడి, 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, తదనంతర రాజకీయాలు, 2004, 2009 ఎన్నికలు-పరిణామా లు, తెలంగాణ సాధనలో కేసీఆర్/టీఆర్ఎస్ పాత్ర, ఇతర పార్టీలు, సమాజంలో వివిధ సంఘాలు, వ్యక్తులు, వ్యవస్థల పాత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన పార్లమెంటరీ ప్రక్రియల గురించి లోతుగా అధ్యయనం చేస్తే ఎక్కువ ప్రశ్నలకు సమాధానం రాయ వచ్చు.
గ్రూప్-1లో ఆరో పేపర్ అయిన తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావిర్భావంలో మూడు విభాగాలున్నాయి. అవి.
1. తెలంగాణ భావన (క్రీ.శ. 1948 – 1970)
2. సమీకరణ దశ (క్రీ.శ. 1971 – 1990)
3. తెలంగాణ రాష్ట్రావిర్భావం దిశగా (క్రీ.శ. 1991 – 2014)
తెలంగాణ భావన
# హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ విలక్షణ సంస్కృతి, తెలంగాణ భౌగోళికాంశాలు, సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ ఆర్థిక లక్షణాలను లోతుగా అధ్యయనం చేయా లి. తెలంగాణ ప్రజలు, కులాలు, తెగలు, మతాలు, కళలు, నైపుణ్యాలు, భాషలు, మాండలికాలు, జాతరలు, పండుగలు, తెలంగాణలోని ప్రధాన ప్రాంతాలు మొదలైన వాటిపై సమాచారాన్ని సేకరించి చదవాలి.
# హైదరాబాద్ సంస్థానంలో పరిపాలన, సాలార్జంగ్ సంస్కరణలు (పరిపాలనా, రవాణా, ఆర్థిక, రెవెన్యూ, కరెన్సీ, విద్యా, న్యాయ – ఇదే టాపిక్ రెండోపేపర్లోని రెండో సెక్షన్లో ఉంది. కాబట్టి అభ్యర్థులు దీని ప్రాముఖ్యతను గుర్తించాలి) ముల్కి- నాన్ ముల్కి అంశాల ఆవిర్భావం వివిధ కారణాల సాకుతో ఉన్నతోద్యోగాల్లో ఇతర ప్రాంతాల వారిని నిజాం కాలంలో నియమించారు. అందువల్ల ఈ నేపథ్యాన్ని (ముల్కి, నాన్ ము ల్కి రూల్స్) అభ్యర్థులు అర్థం చేసుకోవాలి.
# మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో ఉద్యోగ, సివిల్ సర్వీసెస్రూల్స్, 1919 ఫర్మానా ముల్కి నిర్వచనం ము ఖ్యాంశాలు, ముల్కిలీగ్-1935గా పేరొందిన నిజాం లీగ్ ఏర్పాటు-దాని ప్రాధాన్యత. భారత సమాఖ్యలో హైదరాబాద్ రాష్ట్రం 1948లో విలీనం కావడం, సైనిక పాలనలో ఉద్యోగాల విధానాలు, ఎంకే వెల్లోడి పాలన ముల్కి రూల్స్ ఉల్లంఘన-వాటి పర్యవసానాలు.
# స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం, బూ ర్గుల రామకృష్ణారావు మంత్రివర్గం, 1952 ముల్కి ఆందోళన, స్థానికులకు ఉద్యోగాల కోసం డిమాండ్, సిటీ కాలేజీ సంఘటన-దాని ప్రాధాన్యత, 1953లో ప్రాథమికంగా తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్లు, ఫజల్ అలీ నాయకత్వంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్ఆర్సీ) ఏర్పాటు చేయడానికి కారణాలను లోతుగా అధ్యయనం చేయాలి. ఎస్ఆర్సీ ప్రధానాంశాలు, దాని సిఫారసులు, చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై అంబేద్కర్ అభిప్రాయాలు చదవాలి.
# 1956లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం: పెద్దమనుషుల ఒప్పందం-దాని ప్రధానాంశాలు, సిఫారసులు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏర్పాటు, విధులు, పనితీరు, తెలంగాణ రక్షణలు, ఉల్లంఘనలు, కోస్తాంధ్ర నుంచి తెలంగాణకు వలసలు, 1970 తర్వాత వ్యవసాయ నీటిపారుదల, విద్యుత్, విద్య, వైద్యం, ఉద్యోగాలు, వైద్యం-ఆరోగ్య రంగాల్లో తెలంగాణలో అభివృద్ధి.
# ఉద్యోగాలు, సర్వీస్ రూల్స్ ఉల్లంఘన: తెలంగాణ పోరా ట మూలాలు కొత్తగూడెం, ఇతర ప్రాంతాల్లో జరిగిన నిరసనలు, రవీంద్రనాథ్ ఆమరణ నిరాహారదీక్ష, 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగుల పాత్ర, తెలంగాణ రక్షణలు అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్రం కావాలని ఏర్పడిన వర్గాలు, ఈ అంశాలను క్షుణ్ణంగా అధ్యయ నం చేయాలి.
# తెలంగాణ ప్రజాసమితి ఆవిర్భావం : ఉద్యమ విస్తరణ, మరిచెన్నారెడ్డి, మల్లిఖార్జున్, మదన్మోహన్, అచ్యుతరెడ్డిలపాత్ర, అఖిలపక్ష ఒప్పందం, జీఓ నెం. 36- తెలంగాణ ఉద్యమ అణచివేత. ఉద్యమం అణచివేత-దాని పరిణామాలు, 8 సూత్రాలు, 5 సూత్రాల పథకాలు, వాటి పర్యవసానాలపై సంపూర్ణ అవగాహన ఏర్పర్చుకోవాలి.
సమీకరణ దశ
# ముల్కి నిబంధనలపై కోర్టు తీర్పులు, జై ఆంధ్ర ఉద్యమం-దాని పర్యవసానాలు, ఆరుసూత్రాల పథకం (1973) లోని అంశాలు, ఆర్టికల్ 371 (డి), రాష్ట్రపతి ఉత్తర్వులు, 1975 ఆఫీసర్స్ (జయభారత్‌రెడ్డి) కమిటీ నివేదిక, 610 జీఓ (1985)-వాటిపై జరిగిన ఉల్లంఘనలు మొదలైన వాటిని కూడా లోతుగా అధ్యయనం చేయాలి.
# నక్సలైట్ ఉద్యమం ఎదుగుదల, విస్తరణ-దాని కారణాలు, పర్యవసానాలు, జగిత్యాల, సిరిసిల్ల, ఉత్తర తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు అధ్యయనం చేయాలి. నక్సలైట్ ఉద్యమ ఫలితంగా సమాజంలో సంభవించిన మార్పులపై దృష్టి సారించాలి. ‘జల్-జంగల్-జమీన్’ విధానం నుంచి ప్రశ్నలడిగే అవకాశం ఉంది.
# 1980ల్లో ప్రాంతీయపార్టీల పుట్టుక-ప్రభావం, తెలు గు జాతి భావన పేరుతో తెలంగాణ అస్థిత్వాన్ని అణచివేసే కుట్రలు, రియల్ఎస్టేట్, ఫైనాన్స్ కంపెనీలు, ఫిల్మ్, మీడియా, వినోద పరిశ్రమలు, కార్పొరేట్ విద్య, ఆస్పత్రులు మొదలైనవి హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో రావడం, తెలంగాణ స్వాభిమానం, మాండలికం, భాషా సంస్కృతులపై సాంస్కృతిక ఆధిపత్యం ఏర్పర్చేప్రయత్నాలు-వాటి పర్యవసానాలను అధ్యయనం చేయాలి.
# తెలంగాణ అస్థిత్వం కోసం తెలంగాణ మేధావుల చర్చ లు, రాజకీయ, సైద్ధాంతిక ప్రయత్నాలు ప్రారంభం, ప్రాంతీయ అసమానతలు, వివక్షవల్ల, వెనుకబాటుతనంతో ప్రజల్లో పెరిగిన అశాం తి, అసంతృప్తులు మొదలైన విషయాలను అవలోకనం చేసుకోవాలి.
తెలంగాణ రాష్ట్రావిర్భావం దిశగా…
# తెలంగాణపై వివక్షకు వ్యతిరేకంగా ప్రజల్లో వచ్చిన చైతన్యం, మేధావుల స్పందనలు, పౌర సంఘాల ఆవిర్బావం, ప్రత్యేక తెలంగాణ అంశాన్ని లేవనెత్తడం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్-తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటు, భువనగిరి, వరంగల్ సభలు, ప్రకటనలు తీర్మానాలు (తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ), తెలంగాణ అంశాన్ని లేవనెత్తడంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రయత్నాలు.
# 2001లో తెలంగాణ రాష్ట్రసమితి ఏర్పాటు, రాజకీయ పునరేకీకరణ, 2004 ఎన్నికల్లో పొత్తులు, యూపీఏ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రసమితి-గిర్గ్లాని కమిటీ-తెలంగాణ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, 2009 ఎన్నికల పొత్తులు, మ్యానిఫెస్టోల్లో తెలంగాణ అంశం, హైదరాబాద్ ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా వచ్చిన పోరాటం, కేసీ ఆర్ ఆమరణ నిరాహారదీక్ష, అరెస్టు, భగ్గుమన్న తెలంగాణ సమాజం మొదలైనవి అధ్యయనం చేయాలి.
# తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో టీఆర్ఎస్/కేసీఆర్ పాత్ర మీద ప్రశ్నలడిగే అవకాశం ఉంది. లేదా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో రాజకీయ జేఏసీ, స్టూడెంట్, ప్రజాసంఘాలు, ఉద్యోగ జేఏసీల పాత్ర, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, న్యాయవాదులు తదితరుల పాత్రపై, వారు చేసిన కృషి, అవలంభించిన విధానాలపై దృష్టిసారించాలి. (టీడీపీ, వామపక్ష పార్టీలు, ఎంఐఎం, తెలంగాణ ప్రజాఫ్రంట్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ మొదలైనవి కూడా చదవాలి).
# తెలంగాణ కోసం జరిగిన ఆత్మబలిదానాలు చాలా ప్రాధాన్యతతో కూడుకున్నవి. తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం, తెలంగాణ ఉద్యమంలో సాహి త్యం, కళారూపాలు, కవులు, గాయకులు, మేధావులు, కళాకారు లు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఉద్యోగులు, లాయర్లు, వైద్యులు, ప్రవాస భారతీయులు, మహిళలు, పౌరసంఘాలు, వివిధ కులాలు నిర్వహించిన పాత్ర, సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణోద్యమం, మిలియన్‌మార్చ్, మొదలైన అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి అధ్యయనం చేయాలి. ఈ అంశాలపై ప్రశ్న వచ్చే అవకాశం ఉంది.
పార్లమెంటరీ ప్రక్రియ: తెలంగాణ అంశంపై యూపీఏ ప్రభుత్వ విధానం, అఖిలపక్ష సమావేశం, ఆంటోనీ కమిటీ ఏర్పాటు, తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర హోం మంత్రి ప్రకటనలు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక దాని సిఫారసులు, తెలంగాణ అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటులో జరిగిన కార్యకలాపాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం, 2014 ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రసమితి విజయం, తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు కావడం (2014, జూన్ 2) మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి.
– మధుసూదన్ బోయిన
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు