కుమార్ లలిత్ నివేదిక ప్రకారం తెలంగాణ మిగులు నిధులు?
1. రాష్ట్రప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అయిన మిషన్ కాకతీయకు రానున్న ఐదేండ్లలో ఎన్ని నిధులను కేటాయించాలని నిర్ణయించారు?
1) రూ. 10,000 కోట్లు
2) రూ. 20,000 కోట్లు
3) రూ. 30,000 కోట్లు
4) రూ. 25,000 కోట్లు
2. ప్రభుత్వ ఉపాధి (నివాసాన్ని బట్టి అర్హత) రూల్స్-1959 ప్రకారం 22,000 మంది స్థానిక నిబంధనలకు వ్యతిరేకంగా నియమితులైన ఉద్యోగులను వారి స్థానిక ప్రాంతాలకు పంపించేయాలని చెప్పే జీవో?
1) 360 2) 574 3) 36 4) 49
3. రాష్ట్రపతి ఉత్తర్వులననుసరించి జిల్లాస్థాయి పోస్టులకు స్థానిక మెరిట్ నిష్పత్తి?
1) 70:30 3) 60:40
3) 80:20 4) 90:10
4. బచావత్ ట్రిబ్యునల్ ఏ చట్టం ద్వారా ఏర్పాటయ్యింది?
1) అంతరాష్ట్ర జలవివాద చట్టం-1959
2) అంతరాష్ట్ర జలవివాద చట్టం-1969
3) అంతరాష్ట్ర జలవివాద చట్టం-1956
4) అంతరాష్ట్ర జలవివాద చట్టం-1952
5. జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీలోని సభ్యులు?
1) కేఎల్ స్వామి 2) ఎంవీ మాథుర్
3) హరిభూషణ్ 4) 2, 3
6. కుమార్ లలిత్ కమిటీ రూపొందించిన నివేదికలో ఏ అంశాలను పరిశీలించారు?
1) రెవెన్యూ, క్యాపిటల్ అకౌంట్లు
2) కార్పొరేషన్ల రెవెన్యూ అకౌంటు
3) కార్పొరేషన్ క్యాపిటల్ అకౌంటు 4) పైవన్నీ
7. బచావత్ ట్రిబ్యునల్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది?
1) 1969 2) 1973 3) 1976 4) 1982
8. జేఎం గిర్గ్లానీ కమిటీ ఎప్పుడు ఏర్పాటయ్యింది?
1) 2001, జూన్ 25 2) 2002, జూన్ 25 3) 2003, జూన్ 25 4) 2000, జూన్ 25
9. గిర్గ్లానీ కమిటీ ప్రకటించిన ఉల్లంఘనలు ఎన్ని రకాలు?
1) 15 2) 16 3) 17 4) 18
10. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మొత్తం నికర జలాలు ఎన్ని?
1) 2030 టీఎంసీలు 2) 2040 టీఎంసీలు 3) 2060 టీఎంసీలు 4) 2050 టీఎంసీలు
11. జీవో 610 ప్రకారం ఎప్పటిలోగా స్థానికేతరులను ఆయా ప్రాంతాలకు పంపాలని నిర్దేశించారు?
1) 1986, మార్చి 31 2) 1987, మార్చి 31 3) 1988, మార్చి 31 4) 1986, డిసెంబర్ 31
12. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానదిలో ఏపీకి ఎన్ని టీఎంసీల నీటిని కేటాయించారు?
1) 565 2) 700 3) 800 4) 1001
13. తెలంగాణ ప్రాంత గ్రామీణ పట్టణ జనాభా నిష్పత్తి?
1) 61:39 2) 63:37
3) 60:40 4) 65:35
14. 2001 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత?
1) 70 శాతం 2) 66 శాతం
3) 69 శాతం 4) 75 శాతం
15. వాంఛూ కమిటీకి కింది ఏ విషయంతో సంబంధం ఉంది?
1) తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల విభజన 2) కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి
3) ముల్కీ నిబంధనలు-రాజ్యాంగ సవరణ
4) కృష్ణానది నీటి కేటాయింపులు
16. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వ్యవసాయానికి ప్రధాన వనరు?
1) బావులు 2) కాలువలు
3) చెరువులు 4) ఏదీకాదు
17. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల్లోని ఎన్ని టీఎంసీల నీటిని ఏపీ తెలంగాణకు పునఃకేటాయించింది?
1) 300 టీఎంసీలు 2) 250 టీఎంసీలు
3) 277.86 టీఎంసీలు
4) 287.86 టీఎంసీలు
18. రాజోలిబండ నీటి మళ్లింపు పథకం ఏ నదికి సంబంధించింది?
1) గోదావరి 2) భీమ
3) దూద్గంగ 4) తుంగభద్ర
19. జూరాల ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటి మొత్తం?
1) 15.9 టీఎంసీలు 2) 17.84 టీఎంసీలు 3) 29.50 టీఎంసీలు 4) 32.50 టీఎంసీలు
20. కుమార్ లలిత్ నివేదిక తేల్చిన తెలంగాణ మిగులు ఎంత?
1) రూ. 28 కోట్లు 2) రూ. 34 కోట్లు
3) రూ. 50 కోట్లు 4) రూ. 44 కోట్లు
21. ప్రభుత్వ ప్రత్యక్ష పాలన కింద ఉంటే ఖల్సా భూములు మొత్తం సేద్యపు భూమిలో ఎంత శాతం ఉండేది?
1) 60 శాతం 2) 70 శాతం
3) 50 శాతం 4) 40 శాతం
22. హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం చేసిన ఏడాది?
1) 1949 2) 1950 3) 1952 4) 1955
23. శిస్తు లేకుండా వంశపారపర్యంగా అనుభవించే హక్కుగల జాగీర్లు?
1) తనఖా జాగీర్లు 2) జాత్ జాగీర్లు
3) పాయిగా జాగీర్లు 4) ఆల్తం జాగీర్లు
24. హైదరాబాద్ జాగీర్ల రద్దు రెగ్యులేషన్ చట్టం చేసిందెప్పుడు?
1) 1947 2) 1949 3) 1950 4) 1951
25. 1894 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వానికి కింది ఏ భూమిని తీసుకొనే అర్హత ఉంది?
1) కార్పొరేట్ రంగం నుంచి భూమి తీసుకోవడం
2) సంపన్న కుటుంబాల నుంచి భూసేకరణ
3) ప్రైవేటు ఉద్దేశానికి ఎవరి నుంచైనా భూసేకరణ
4) ప్రజల ఉపయోగానికి ఎవరినుంచైనా భూసేకరణ
26. భూ గరిష్ట పరిమితి చట్టం ప్రకారం ఒక కుటుంబం ఏడాదిలో ఒక పంట పండించడానికి శాశ్వత నీటిపారుదల సౌకర్యం కలిగిన భూమి గరిష్ట పరిమితి?
1) 15-27 ఎకరాలు 2) 10-18 ఎకరాలు 3) 10-15 ఎకరాలు 4) 15-25 ఎకరాలు
27. ఆంధ్రప్రదేశ్ 1973 భూసంస్కరణల చట్టం ప్రవేశాన్ని సిఫారసు చేసింది?
1) రాష్ట్ర భూసంస్కరణల కమిటీ
2) భారత ప్రభుత్వం
3) కేంద్ర భూసంస్కరణల కమిటీ
4) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
28. ఎవరి అధ్యక్షతన కౌలుదారుల స్థితిగతులను అధ్యయనం చేయడానికి నిజాం కాలంలో కమిటీని 1939లో నియమించారు?
1) ఎంఎస్ భరూచా 2) ఛటోపాధ్యాయ
3) అమర్నాథ్ 4) కేఎన్ రాజ్
29. ఆసామి షక్మీదారు చట్టం ఎప్పుడు చేశారు?
1) 1942 2) 1939 3) 1944 4) 1946
30. రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాలను ఏ అధికరణం సూచిస్తుంది?
1) 244 (1) 2) 244 (2)
3) 243 (1) 4) 244
జవాబులు
1-2, 2-3, 3-3, 4-3, 5-4, 6-4, 7-3, 8-1, 9-4, 10-3, 11-1, 12-3, 13-1, 14-2, 15-3, 16-1, 17-3,18-4, 19-2, 20-2, 21-1, 22-2, 23-4, 24-2, 25-4, 26-1, 27-4, 28-1, 29-3, 30-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు