హైదరాబాద్ హితరక్షణ సమితిని ఎవరు స్థాపించారు? (TS TET & TSLPRB)
1. 2021 జూలై 25న తెలంగాణ నుంచి యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో నమోదయిన చారిత్రక కట్టడం ఏది?
ఎ) చార్మినార్
బి) రామప్పగుడి
సి) బిర్లాటెంపుల్
డి) వేయి స్తంభాల గుడి
2. ‘ ఏ జంగ్ హై జంగ్ ఆజాది’ అనే పాటను పాడి ప్రజల్లో నవచైతన్యాన్ని కల్పించిన రచయిత?
ఎ) మగ్దూం మొయినుద్దీన్
బి) సుద్దాల హనుమంతు
సి) సి. నారాయణ రెడ్డి
డి) రఫీ
3. ‘మా భూమి’ నాటకం ఎవరి వీరత్వాన్ని కీర్తిస్తూ రచించారు?
ఎ) దొడ్డి కొమరయ్య బి) చాకలి ఐలమ్మ
సి) షేక్ బందగీ డి) పై వారందరు
4. జతపర్చండి?
ఎ. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ 1. కపిలవాయి దిలీప్‌కుమార్
బి. తెలంగాణ రచయితల వేదిక 2. మధు కే రెడ్డి
సి. తెలంగాణ జలసాధన సమితి 3. దుశ్చర్ల సత్యనారాయణ
డి. తెలంగాణ విమోచన సమితి 4. నందిని సిధారెడ్డి
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4 బి) ఎ-4, బి-2, సి-3, డి-1
సి) ఎ-2, బి-4, సి-3, డి-1 డి) ఎ-3, బి-2, సి-1, డి-4
5. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో చెన్నారెడ్డిని ఆహ్వానిస్తూ, ‘రావోయి రావోయి వెర్రి చెన్నారెడ్డి, మర్రి చెన్నారెడ్డి’ అని పాట పాడింది ఎవరు?
ఎ) గద్దర్
బి) సంగంరెడ్డి సత్యనారాయణ
సి) మా భూమి సంధ్య
డి) చందాల కేశవదాసు
6. జతపర్చండి?
ఎ. గణపతి స్తపతి 1. ట్యాంక్‌బండ్‌పై బుద్ధుని విగ్రహం
బి. ఏలె లక్ష్మణ్ 2. తెలంగాణ అమరవీరుల స్థూపం
సి. బీవీఆర్ చారి 3. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం
డి. ఎక్కా యాదగిరి 4. తెలంగాణ తల్లి విగ్రహం
ఎ) ఎ-4, బి-3, సి-1, డి-2 బి) ఎ-1, బి-3, సి-4, డి-2
సి) ఎ-3, బి-2, సి-1, డి-4 డి) ఎ-3, బి-4, సి-2, డి-1
7.జతపర్చండి?
ఎ. కోనేరు రంగారావు కమిటీ 1. బూటకపు ఎన్కౌంటర్లపై
బి. తార్కుండే కమిటీ 2. 610 జీవో, గిర్గ్లాని కమిటీ సిఫారసులు
సి. జ్టస్ వాంచూ కమిటీ 3. ఆంధ్ర రాష్ట్ర రాజధాని, ఆర్థిక సమస్యల విచారణ
డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ 4. భూ పంపిణీపై
ఎ) ఎ-3,బి-4, సి-1, డి-2 బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-4, బి-1, సి-3, డి-2 డి) ఎ-3, బి-1, సి-2, డి-4
8. 1987 జూన్ 6న తెలంగాణ సమస్యకు దేశవ్యాప్త మద్దతు కోసం పాదయాత్ర చేసింది ఎవరు?
ఎ) దుశ్చర్ల సత్యనారాయణ
బి) మురళీధర్ దేశ్‌పాండే
సి) ప్రతాప్ కిశోర్
డి) భూపతి కృష్ణమూర్తి
9. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం లోక్‌సభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో తెలంగాణ ఎంపీలపై పెప్పర్ స్ప్రేతో దాడి చేసిన సీమాంధ్ర నేత?
ఎ) మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
బి) రాయపాటి సాంబశివరావు
సి) ఉండవల్లి అరుణ్‌కుమార్
డి) లగడపాటి రాజగోపాల్
10. జతపర్చండి?
తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గం
ఎ. తాటికొండ రాజయ్య 1. ఎక్సైజ్ శాఖ
బి. ఈటల రాజేందర్ 2. ఆర్థికశాఖ
సి. టీ పద్మారావు గౌడ్ 3. హోంశాఖ
డి. నాయిని నర్సింహా రెడ్డి 4. వైద్య, ఆరోగ్య శాఖ
ఎ) ఎ-4,బి-2, సి-1, డి-3
బి) ఎ-1, బి-3, సి-2, డి-4
సి) ఎ-3, బి-4, సి-1, డి-2
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
11. 1952 హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పాల్గొనని రాజకీయ పార్టీ?
ఎ) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
బి) ఆల్ ఇండియా భారతీయ జనసంఘ్
సి) పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ
డి) భారత జాతీయ కాంగ్రెస్
12. 1969 తొలిదశ ఉద్యమ సమయంలో తొలిసారి ఉద్యమకారులపై కాల్పుల సంఘటన ఎక్కడ జరిగింది?
ఎ) శంషాబాద్ బి) సదాశివపేట
సి) నాంపల్లి డి) పాల్వంచ
13. జనవరి 30న తెలంగాణ వారిపై.. ఆంధ్రప్రాంతానికి చెందినవారు దాడిచేసి, ఇండ్లను తగులబెట్టిన సంఘటన ఎక్కడ జరిగింది?
ఎ) దోమలపెంట బి) ఈగలపెంట
సి) కర్నూల్ డి) వరంగల్
14. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి?
1. 1968 ఏప్రిల్‌లో వెస్ట్‌బెంగాల్‌లోని బర్దాన్ లో జరిగిన ప్లీనరీ సమావేశంలో వచ్చిన విభేదాల కారణంగా AICCCR ఏర్పడింది
2. AICCCR ను 1969 లెనిన్ జన్మదినం రోజున CPI (ML) పార్టీగా మార్పుచేశారు
3. శ్రీకాకుళం గిరిజన ఉద్యమ పోరాటంలో భాగంగా సుబ్బారావు ‘పాణిగ్రాహి ఓ అరుణ పతాకమా నీకివిగో రెడ్ సెల్యూట్’ పాటను రచించాడు
4. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సత్యమూర్తి, కొండపల్లి సీతారామయ్య సమర్ధించారు.
ఎ) 1, 2, 3 బి) 1, 4
సి) 1, 2, 3, 4 డి) 1, 2
15. నిజాం స్థాపించిన క్షయ వ్యాధి నివారణ చికిత్స కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) అనంతగిరి కొండలు
బి) రాచకొండలు
సి) పాపికొండలు
డి) శేషాచలకొండలు
16. వాక్యాన్ని గుర్తించండి?
1. నక్సల్బరి, శ్రీకాకుళ ఉద్యమాలను చైనా అధికార పత్రిక ‘వసంత కాల మేఘ గర్జన’ (స్పింగ్ థండర్)గా ప్రకటించినది
2.ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సమర్థిస్తూ కొండపల్లి సీతారామయ్య ‘ప్రభాకర్ రెడ్డి’ పేరుతో వ్యాసాన్ని రాశాడు
3.కొండపల్లి సీతారామయ్యను ప్రజలు ముద్దుగా ‘సబ్బా మాస్టర్’ అని పిలిచేవారు
4.1970లో హైదరాబాద్‌లో బి.నర్సింగరావు, గద్దర్ ‘ఆర్ట్స్లవర్స్’ని ఏర్పాటు చేశారు
ఎ) 1, 4 బి) 3, 2
సి) 3 మాత్రమే డి) 4 మాత్రమే
17. కర్నూల్-మహబూబ్‌నగర్ జిల్లాల రైతుల మధ్య ఏ ప్రాజెక్టు సాగునీటి కోసం తరుచూ గొడవలు జరిగేవి?
ఎ) తుంగభద్ర డ్యాం
బి) రాజోలిబండ డైవర్షన్ పథకం
సి) జూరాల ప్రాజెక్టు
డి) శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
18. తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయాన్ని ఎవరు ప్రారంభించారు?
ఎ) కొమర్రాజు లక్ష్మణరావు
బి) టీకే బాలయ్య
సి) రావిచెట్టు రంగారావు
డి) మాడపాటి హన్మంతరావు
19. ప్రసిద్ధిగాంచిన ఇంద్రవెల్లి ఆదివాసీ సభను ఎప్పుడు నిర్వహించారు?
ఎ) 1980 ఏప్రిల్ 20
బి) 1981 ఏప్రిల్ 20
సి) 1982 ఏప్రిల్ 20
డి) 1979 ఏప్రిల్ 20
20. జతపర్చండి?
ఎ. వైట్‌మ్యాన్ 1. ఎక్కలదేవి సాంబశివరావు
బి. సబ్బా మాస్టారు 2. ఆదిబట్ల కైలాసం
సి. సాహూ 3. శనిగరం వేంకటేశ్వర్లు
డి. పార్కల దొర 4. దాసరి లక్ష్మీకాంతం
ఎ) ఎ-2,బి-1, సి-4, డి-3
బి) ఎ-4, బి-2, సి-3, డి-1
సి) ఎ-3, బి-2, సి-4, డి-1
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
21. నిజాం, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసిన రాంజీ గోండుని ఎక్కడ ఉరితీశారు?
ఎ) జోడేఘాట్ బి) కృష్ణదేవి పట్నం
సి) నిర్మల్ డి) పాలకుర్తి
22. తెలంగాణలో తొలి సాహిత్య సంస్థగా పేరుగాంచిన ‘సాహితీ మేఖల’ ని ఎవరు ప్రారంభించారు?
ఎ) కురుగంటి సీతారామయ్య
బి) రావి నారాయణ రెడ్డి
సి) ఇరివెంటి కృష్ణమూర్తి
డి) అంబటిపూడి వెంకటరత్నం
23. కింది ప్రదేశాల్లో బౌద్ధమత స్థావరం కానిది ఏది?
ఎ) ధూళికట్ట బి) ఫణిగిరి
సి) పొట్గ చెరువు డి) నేలకొండపల్లి
24. హైదరాబాద్ హితరక్షణ సమితిని ఎవరు స్థాపించారు?
ఎ) హయగ్రీవాచారి బి) జి రామాచారి
సి) పోటు కృష్ణమూర్తి
డి) కొండా లక్ష్మణ్ బాపూజీ
25. కైర్ల్కి తెహ్రిక్ చౌక్ దిగ్బంధాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన కార్యక్రమం?
ఎ) సాగర హారం
బి) మిలియన్ మార్చ్
సి) సకలజనుల సమ్మె
డి) సంసద్‌యాత్ర
26. తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షులను వరుస క్రమంలో అమర్చండి?
1. టీ హయగ్రీవాచారి 2. జే చొక్కారావు
3. కే రాజమల్లు 4. కే అచ్యుత రెడ్డి
ఎ) 1, 2, 3, 4 బి) 1,4, 3, 2
సి) 2, 1, 4, 3 డి) 4, 1, 2, 3
27. హైదరాబాద్ ఫ్రీ జోన్ అని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఎప్పుడు తీర్పునిచ్చింది?
ఎ) 9 అక్టోబర్, 2009
బి) 9 సెప్టెంబర్ 2009
సి) 19 అక్టోబర్ 2009
డి) 19 సెప్టెంబర్ 2009
28. అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్‌ను ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1995 బి) 1999
సి) 2002 డి) 2006
29. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ నుంచి ఎంపికయిన తొలి ముఖ్యమంత్రి?
ఎ) మర్రి చెన్నారెడ్డి
బి) పీవీ నరసింహారావు
సి) టీ అంజయ్య
డి) జలగం వెంగళరావు
30. ‘ఖానూన్-చా-ముబారిక్’ సంస్కరణలను ప్రవేశపెట్టిన నిజాం రాజు?
ఎ) మీర్ ఉస్మాన్ అలీఖాన్
బి) అప్జలుద్దౌలా
సి) మీర్ మహబూబ్ అలీఖాన్
డి) నసీరుద్దౌలా
31. కింది ఏ పండుగ సందర్భంగా ‘రంగం’ భవిష్యవాణి చెబుతారు?
ఎ) బోనాలు బి) దసరా
సి) బతుకమ్మ డి) హోళీ
32. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ భూముల అమ్మకాలు ఎవరి నియంత్రణలో ఉండాలి?
ఎ) తెలంగాణ శాసన సభ్యులు
బి) తెలంగాణ ప్రాంత మంత్రులు
సి) ఉప ముఖ్యమంత్రి
డి) తెలంగాణ రీజినల్ కౌన్సిల్
33. ‘ఫ్లాష్ అండ్ ఫైట్మెన్’ పత్రిక ద్వారా తెలంగాణ వాదాన్ని ప్రచారం చేసింది ఎవరు?
ఎ) మురళీధర్ దేశ్‌పాండే
బి) ఈవీ పద్మనాభం
సి) టీ ప్రభాకర్
డి) ప్రతాప్ కిశోర్
34. 1989 కల్వకుర్తి ఎన్నికల్లో ఎన్టీ రామారావు ఓటమి కోసం కృషిచేసిన సంస్థ?
ఎ) తెలంగాణ ఐక్య వేదిక
బి) తెలంగాణ జనసమితి
సి) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్
డి) తెలంగాణ మహాసభ
35. నిర్మల్ జిల్లాకు చెందిన రాజారెడ్డి& రాధారెడ్డి ఏ కళలో ప్రసిద్ధులు?
ఎ) పేరిణి బి) భరత నాట్యం
సి) కూచిపూడి డి) కథక్
జవాబులు
1-బి, 2-ఎ, 3-సి, 4-సి, 5-బి, 6-బి, 7-సి, 8-సి, 9-డి, 10-ఎ 11-ఎ, 12-ఎ, 13-బి, 14-సి, 15-ఎ, 16-సి, 17-బి, 18-బి, 19-బి, 20-డి, 21-సి, 22-డి, 23-సి, 24-బి, 25-బి, 26-డి , 27-ఎ, 28-బి, 29-బి, 30-సి, 31-ఎ, 32-డి, 33-బి, 34-సి, 35-సి
ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం
- ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో తెలంగాణకు కల్పించిన రక్షణల్లో అతి ప్రధానమైనది ముల్కీ నిబంధనలు.
- ముల్కీ నిబంధనల ప్రకారం 15 సంవత్సరాలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న వారికే స్థానిక కోటాలో ఉద్యోగాలు కల్పించాలి.
- రాష్ట్రస్థాయి ఆఫీసులు, సచివాలయంలోని నియామకాల్లో జనాభా ప్రకారం తెలంగాణ వారికి ప్రాధాన్యత కల్పించాలి.
- ముల్కీ నిబంధనలు ఉల్లంఘించి స్థానికేతరులు 1956-68 మధ్య కాలంలో దాదాపు 22వేల ఉద్యోగాలు పొందారు. దీంతో 1969లో తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో జరిగింది. పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీయడంతో 1969 జనవరి 19న కాసు బ్రహ్మానందరెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
- అఖిల పక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. 1956 నవంబర్ 1 తర్వాత నియమించబడిన నాల్ ముల్కీలను ఫిబ్రవరి 28, 1969లోపు బదిలీ చేయాలి. ఈ స్థానాల్లో తెలంగాణ ప్రాంతం వారిని నియమించాలనేది జీవో సారాంశం. కానీ నాన్ ముల్కీలు ఎంత మంది అనే వివరాలు లేవు.
- జీవో 36కి వ్యతిరేకంగా ఆంధ్రులు కోర్టుకు వెళ్లడంతో అదికాస్త అటకెక్కింది. అనంతర కాలంలో వచ్చిన జైఆంధ్ర ఉద్యమానికి తలొగ్గిన కేంద్రం 6 సూత్రాల పథకం రూపొందించింది. దీని ద్వారా రాష్ట్ర ఏర్పాటు సయమంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్ని రద్దు చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు