మన రాష్ట్రంలో ఖనిజాలు- గనులు (TS TET Special)
- భూమి లోపలి నుంచి పొందే ప్రతీది ఖనిజమే.
- భూమి నుంచి వచ్చే ఖనిజాలు మట్టి, ఇసుక, సున్నం, నాపరాయి, గ్రానైట్ రాయి, బొగ్గు, సహజ వాయువు, భూగర్భజలం
- సహజ వనరులు రెండు రకాలు, పునరుద్ధరించేవి, అంతరించేవి లేదా పునరుద్ధరించడానికి వీలు కానివి.
పునరుద్ధరించే వనరులకు ఉదాహరణ చెట్లు(వెదురు) - పునరుద్ధరణకు వీలుకాని వనరులకు ఉదాహరణ ఖనిజాలు(బొగ్గు)
- మన రాష్ట్రంలో బొగ్గు, ఇనుప ధాతువు, సున్నపురాయి, ముగ్గురాయి, మాంగనీస్, క్వార్ట్, ఫెల్డ్స్పార్, బంకమన్ను, బైరటీస్, యురేనియం, పాలరాయి, గ్రానైట్ లభ్యమవుతాయి.
- బయ్యారం రిజర్వు ఫారెస్ట్లో మధ్యరకం ఇనుప నిక్షేపాలు, ఖమ్మంలో ఫ్లోట్ ఐరన్ నిల్వలు, పూర్వపు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో తక్కువగా ఇనుపధాతు నిల్వలు ఉన్నాయి.
- పూర్వపు కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకమైన టాన్బ్రౌన్ గ్రానైట్ నిల్వలున్నాయి. వీటిలో ఎరుపు, గోధుమ రంగులు నిష్పత్తి స్థాయి పాలరాయి చైనా, ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతి అవుతోంది.
- తాండూరు నీలి సున్నపు రాయి బండలు (షాబాద్) పూర్వపు రంగారెడ్డి జిల్లాలో, యురేనియం నిల్వలు పూర్వపు నల్లగొండ జిల్లా నంబాపురం, ఎల్లాపురం ఉన్నాయి.
- ఖనిజాలు వెలికితీయడానికి భూగర్భ సొరంగాలు తవ్వి తీసే విధానాన్ని భూగర్భ మైనింగ్ అంటారు.
- సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ బొగ్గు వెలికితీతకు ఈ విధానాన్ని అవలంబిస్తారు.
- పెద్దగొయ్యి తవ్వి, గుట్టలను పేల్చి, ఖనిజాన్ని వెలికి తీసే విధానాన్ని ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటారు.
- గనుల తవ్వకం వల్ల, అడవులు , వ్యవసాయ భూములు నాశనం అవుతాయి. నీటి వనరులు కలుషితం అవుతాయి, ప్రజలు అనారోగ్యం బారిన పడుతారు.
- గనుల తవ్వకం వల్ల ఉద్యోగావకాశాలు, కొత్త కాలనీలు పట్టణాలు ఏర్పడతాయి
- ముడిచమురు, సహజ వాయువు వంటి ఇంధన వనరులను సముద్ర తీరంలో డ్రిల్లింగ్ చేయడం ద్వారా వెలికి తీస్తారు.
- దేశంలో ఖనిజాలు యావత్తు ప్రభుత్వ ఆస్తి, జాతీయ సంపద.
- 1970 సంవత్సరంలో దేశంలోని గనులన్నింటిని ప్రభుత్వం జాతీయం చేసింది.
- 1993 కొత్త జాతీయ ఖనిజ విధానం ప్రకారం ప్రభుత్వం గనులను ప్రైవేటు కంపెనీలకు కౌలుకు ఇచ్చింది. ప్రభుత్వం దీనిపై రాయల్టీ వసూలు చేస్తుంది. అణు ఇంధనాలకు సంబంధించి మొత్తం గనులు ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నవి.
- పూర్వపు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తార బొగ్గు గనులను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వెలికి తీస్తోంది.
- సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ను 1886లో బ్రిటిష్ ప్రైవేటు కంపెనీ నెలకొల్పింది. 1920లో హైదరాబాద్ పాలకుడైన నిజాం కొనుగోలు చేశాడు. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం దీనిని జాతీయం చేసింది. ఇది ప్రస్తుతం భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కంపెనీ.
సాధారణంగా బొగ్గు 200-300 అడుగుల లోతులో లభ్యమవుతుంది. - బొగ్గు తవ్వగా ఏర్పడే సొరంగాన్ని ‘మైన్ షాఫ్ట్’ అంటారు.
- బొగ్గు పొరలను ‘కోల్ సీమ్’ అని కూడా పిలుస్తారు.
- భూగర్భ బొగ్గు గనుల్లో కాంతిని పరావర్తనం చేసి వెలుతురు ఇవ్వడానికి గోడలకు ‘డోలమైట్’ పూస్తారు.
- బొగ్గు తవ్వే ప్రాంతాన్ని ‘ముఖం’ (ఫేస్) అంటారు.
- బొగ్గు గనుల్లో పనిచేసే వారు సాధారణంగా ఎదుర్కొనే అనారోగ్య సమస్య నల్ల ‘ఊపిరితిత్తుల వ్యాధి’ (క్షయ వ్యాధి).
- ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఉపరితల (ఓపెన్ కాస్ట్) బొగ్గు గనుల పేరు జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు.
- ‘సత్తుపల్లి’ ఉపరితల బొగ్గు గనులను 2005 సంవత్సరంలో ప్రారంభించారు.
- ఖనిజాలలో లోహ సంబంధమైన వాటిలో ఇనుప ఖనిజం, నికెల్, రాగి కాగా అలోహ సంబంధమైన వాటిలో మైకా, సల్ఫర్, సున్నపురాయి, ఇసుక.
- అణుశక్తి సంబంధమైన వాటిలో యురేనియం, ఫ్లూటోనియం, రేడియంలు, ఇంధన వనరులలో బొగ్గు, ముడిచమురు సహజ వాయువు వంటివి ఉన్నాయి.
- భూగర్భ గనులతో పోల్చినప్పుడు ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకం వల్ల పర్యావరణపరంగా ఎక్కువ సమస్యలు వస్తాయి.
1. కింది వాటిలో పునరుద్ధరించే వనరు ఏది? (4)
1) బొగ్గు 2) సహజవాయువు
3) ముడిచమురు 4) సోలార్ ఎనర్జీ
2. భారతదేశంలోని ఏకైక బంగారు గని ? (1)
1) కోలార్ 2) బైలిదిల్లా
3) ఝురియా 4) ఖేత్రి
3. కింది వాటిలో పునరుద్ధరించని వనరు ఏది? (4)
1) వెదురు 2) గాలి
3) ఇసుక 4) బొగ్గు
4. ఖనిజాలు వాటి వినియోగాలు జతపరచండి (3)
ఖనిజం వినియోగం
ఎ) ఇనుప ధాతువు 1) ఎలక్ట్రానిక్ పరిశ్రమ
బి) మైకా (అబ్రకం) 2) బ్యాటరీల తయారీ
సి) సున్నపు రాయి 3) పిగ్ ఐరన్ పరిశ్రమ
డి) మాంగనీస్ 4) కాగితపు పరిశ్రమ
5) పాలిష్ పరిశ్రమ
1) ఎ-1, బి-3, సి-4, డి-5
2) ఎ-3, బి-4, సి-5, డి-1
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-5, బి-1, సి-2, డి-3
5. టాన్బ్రౌన్ గ్రానైట్ ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన జిల్లా? (1)
1) కరీంనగర్ 2) వరంగల్
3) ఖమ్మం 4) రంగారెడ్డి
6. ఖనిజ వనరులు లభ్యమయ్యే జిల్లాలు జతపరచండి (1)
ఖనిజం లభించే జిల్లా
ఎ) ఫ్లోట్ ఐరన్ 1) రంగారెడ్డి
బి) టాన్ బ్రౌన్ గ్రానైట్ 2) నల్లగొండ
సి) యురేనియం 3) కరీంనగర్
డి) షాబాద్ బండలు 4) ఖమ్మం
5)మహబూబ్నగర్
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-5
4) ఎ-4, బి-5, సి-3, డి-1
7. మన రాష్ట్రంలో ఏ అడవులలో మధ్యరకం ఇనుప ధాతు నిక్షేపాలు విస్తరించి ఉన్నాయి. (3)
1) పాకాల అభయారణ్యం
2) నల్లమల అడవులు
3) బయ్యారం రిజర్వు అడవులు
4) ఏటూరునాగారం అభయారణ్యం
ఖనిజాలు-వాటి ప్రాధాన్యత
ఖనిజం పేరు ఉపయోగం
ఇనుము స్పాంజి ఐరన్, పిగ్ ఐరన్, ఉక్కు తయారీ
మైకా (అభ్రకం) విద్యుత్, ఎలక్ట్రానిక్ పరిశ్రమ విద్యుత్ నిరోధకం
సున్నపు రాయి సిమెంట్, కార్బైడ్, ఇనుము, ఉక్కు, రసాయనాలు, కాగితం, గాజు
గ్రానైట్ నేల నునపు, పాలిష్ గృహ అలంకరణ, స్మారక నిర్మాణాలు
మాంగనీస్ ఇనుము, ఉక్కు, బ్యాటరీల తయారీ, గాజు
బైరటీస్ బేరియం మూలకం, వైద్యరంగం, ముడి చమురు, సహజ వాయు పరిశ్రమ
ఫెల్డ్స్పార్ గాజు, సిరామిక్ తయారీ
1. అడవుల వర్గీకరణ చేయడానికి కింది ఏ అంశాన్ని పరిగనలోకి తీసుకొంటారు? (4)
ఎ) నేల స్వభావం బి) చెట్ల సాంద్రత
సి) ఉష్ణోగ్రత డి) వర్షపాతం
1) ఎ, బి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి సి, డి
2. కోనిఫెరస్ జాతికి చెందిన దేవదారు చెట్లు ఏ ప్రాంతంలో పెరుగుతాయి? (1)
1) బాగా చలిగా ఉండి, మంచు కురిసే ప్రాంతాల్లో
2) ఒక మోస్తారు ఉష్ణోగ్రతలు, అత్యల్ప వర్షపాతం సంభవించే ప్రాంతాల్లో
3) అనావృష్టి సంభవించే ప్రాంతాల్లో
4) అత్యధికస్థాయి ఉష్ణోగ్రతలు, కొండవాలు ప్రాంతాల్లో
3. సతత హరిత అడవులు పెరగడానికి దోహదపడుతున్న వాతావరణ పరిస్థితులు (1)
1) అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ఉన్న భూమధ్య రేఖ ప్రాంతాల్లో
2) సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో
3) అత్యల్ప వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో
4) ధృవ ప్రాంతాల్లో
4. మన దేశంలో సతత హరిత అడవులు పెరిగే ప్రాంతాలు (2)
1) ఈశాన్య రాష్ర్టాలు
2) కేరళ, అండమాన్
3) అత్యధిక వర్షపాతం సంభవించే మిజోరాం
4) గోవా, పశ్చిమబెంగాల్
5. హిమాలయాల్లో పెరిగే వేరే రకపు సతత హరిత అడవుల లక్షణాల్లో లేని అంశం ఏది? (2)
1) వీటి ఆకులు సన్నగా సూదిలాగా ఉంటాయి
2) రకరకాల రంగుల పూలు పూస్తాయి
3) శంఖువుల వంటి పునరుత్పత్తి భాగాలు ఉంటాయి
4) మంచు కురిసే ప్రాంతాల్లో పెరుగుతాయి
6. ఆకురాల్చే అడవులు పెరగడానికి అనుకూలించే వాతావరణం (3)
1) వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతం
2) సమశీతోష్ణ స్థితి ప్రాంతం
3) కొన్ని నెలల పాటు వర్షాలు పడి, అధిక భాగం పొడిగా, వేడిగా ఉండే ప్రాంతం
4) తక్కువ వర్షపాతం, తక్కువ ఉష్ణోగ్రతల ప్రాంతం
7. తెలంగాణలో ఏ రకమైన అడవులు పెరుగుదలకు వాతావరణం దోహదపడుతుంది (2)
1) సతత హరిత అడవులు
2) ఆకురాల్చే అడవులు
3) మడ అడవులు
4) చిట్టడవులు
8. ముళ్ళ అడవులు పెరగడానికి వాతావరణం అనుకూలించని జిల్లా ఏది? (1)
1) హైదరాబాద్ 2) నల్గొండ
3) మహబూబ్నగర్ 4) మెదక్
9. సముద్ర తీరపు చిత్తడి అడవులకు సంబంధించి కింది అంశాల్లో సరికానిది ఏది? (3)
1) సముద్ర అలల ప్రభావిత నేలల్లో పెరుగుతాయి
2) ఉప్పునీటికి సముద్ర అలల ప్రవాహానికి అనుగుణంగా పెరుగుతాయి
3) ఒండ్రు నేలల్లో మాత్రమే పెరుగుతాయి
4) వీటిని మడ అదవులు అని కూడా అంటారు
10. తెలంగాణ రాష్ట్రంలో ఎంత శాతం అడవి అనగల చెట్లు ఉన్నాయి (3)
1) 24 శాతం 2) 12 శాతం
3) 16.74 శాతం 4) 22.14 శాతం
11. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఎన్ని చదరపు కిలోమీటర్ల మేర అడవి తగ్గిపోతోంది? (1)
1) 30 2) 32 3) 41 4) 33
12. రాష్ట్రంలో ఎంత శాతం గిరిజనులు అడవుల్లో నివసిస్తున్నారు? (4)
1) 58 శాతం 2) 42 శాతం
3) 38 శాతం 4) 60 శాతం
13. మన దేశంలో ఎవరి పరిపాలన నుంచి గిరిజనులు అడవులపై హక్కులను క్రమేణా కోల్పోయారు?(3)
1) మొఘలులు 2) రాజపుత్రులు
3) బ్రిటిష్ 4) ఢిల్లీ సుల్తాన్లు
14. 1988 జాతీయ అటవీ విధానం గుర్తించిన అంశాల్లో లేనిది? (1)
1) అటవీ ఉత్పత్తులను వినియోగించుకోవడాన్ని నిషేధించారు
2) క్షీణతకు గురైన అడవుల పునరుద్ధరణ చేయడం
3) అడవుల్లోను, చుట్టు పక్కల నివసించే గిరిజనులకు ఉపాధి కల్పించడం
4) అడవి అభివృద్ధిలో ఉమ్మడి అటవీ యాజమాన్యం ప్రవేశ పెట్టడం
15. ఏ చట్టం గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని మొదటగా గుర్తించింది (2)
1) 1988 పార్లమెంటు చట్టం
2) అటవీ హక్కుల చట్టం 2006
3) అడవుల అభివృద్ధి చట్టం 1956
4) ప్రజా అటవీ యాజమాన్య చట్టం 2009
16. బ్రిటిష్ పాలనా కాలంలో అడవులు వేగంగా అంతరించడానికి ప్రధాన కారణాలు (2)
ఎ) రైలు మార్గాల నిర్మాణం
బి) బొగ్గు తయారీ
సి) ఓడల తయారీ
డి) కాగితపు పరిశ్రమ
1) ఎ, బి, సి 2) ఎ, సి
3) బి, డి 4) బి, సి
17. కింది అడవులు అవి పెరిగే ప్రాంతాలతో జతపరచండి (3)
ఎ) సతత హరత అడవులు 1) సముద్రతీర ప్రాంతం
బి) ఆకురాల్చే అడవులు 2) అధిక ఉష్ణోగ్రతలు-పొడి వాతావరణం
సి) ముళ్ళ అడవులు 3) తెలంగాణ ప్రాంతం
డి) మడ అడవులు 4) హిమాలయ పర్వత ప్రాంతం
5) అధిక వర్షపాతం, పొడి వాతావరణం
1) ఎ-1, బి-3, సి-4, డి-5 2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1 4) ఎ-5, బి-1, సి-2, డి-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు