జాతీయాదాయం – విశేషాలు
జాతీయ ఆదాయం నిర్వచనాలను తెలుసుకోవడానికంటే ముందు నిర్వచనంలో వచ్చే వివిధ చిన్న చిన్న పదాల వివరణలను చూద్దాం.
1. మధ్యంతర వస్తువులు
-ఇతర వస్తువుల ఉత్పత్తికి తోడ్పడేవి, మళ్లీ అమ్మడం కోసం ఉపయోగించేవి లేదా మార్కెట్ ప్రక్రియలో పాల్గొనేవి.
ఉదా: బట్టల తయారీకి ఉపయోగించే పత్తి మధ్యంతర వస్తువు అవుతుంది.
2. అంతిమ వస్తువులు
-అంతిమంగా వినియోగదారులు ఉపయోగించుకునే వస్తువులు లేదా ఎకానమీలో ఎలాంటి పునరుత్పత్తిలో పాల్గొనని వస్తువులు.
ఉదా: క్యాపిటల్ వస్తువులు (పెద్దపెద్ద యంత్రాలు)
-అంతిమ వస్తువులను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..
1. డ్యూరబుల్: మళ్లీమళ్లీ ఉపయోగించేవి, దీర్ఘకాలం ఉండేవి.
ఉదా: టీవీ, కారు మొదలైనవి
2. సెమీ డ్యూరబుల్: కొంతకాలం వరకు మాత్రమే ఉపయోగపడేవి.
ఉదా: బట్టలు, షూ మొదలైనవి
3. నాన్ డ్యూరబుల్: ఒకేసారి ఉపయోగపడేవి.
ఉదా: పాలు, బ్రెడ్ మొదలైన ఆహార పదార్థాలు
4. సేవలు: తాకడానికి వీలులేనివి. డాక్టర్ల సేవలు, లాయర్లు, టీచర్ల సేవలు.
-వస్తువుల ఆర్థిక వినియోగాన్ని బట్టి ఆ వస్తువు అంతిమ వస్తువో, మధ్యంతర వస్తువో పరిగణిస్తారు.
ఉదా: టీ పౌడర్‌ను ఇంట్లో టీ చేసుకోవడానికి ఉపయోగిస్తే అది అంతిమ వస్తువు అవుతుంది. ఒకవేళ అదే టీ పౌడర్‌ను ఒక టీ దుకాణంలో టీ చేయడానికి వాడి, ఆ టీని ఇతరులకు అమ్మితే అప్పుడు ఆ టీ పౌడరు మధ్యంతర వస్తువు అవుతుంది.
-కానీ.. NNP మార్కెట్ ధరల వద్ద = NNP ఉత్పత్తి కారకాల వద్ద + పరోక్ష పన్నులు – సబ్సిడీలు
-జీడీపీ ఉత్పత్తి కారకాల దృష్ట్యా = జీడీపీ మార్కెట్ ధరల వద్ద – పరోక్ష పన్నులు +సబ్సిడీలు
తరుగుదల = వస్తువు మొత్తం విలువ/వస్తువు జీవితకాలం (సంవత్సరాల్లో)
జాతీయ ఆదాయం అంటే ఏమిటి?
-ఒక సంవత్సర కాలంలో, ఒక నిర్దేశిత ప్రాంతంలో, ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల ద్రవ్యరూప మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు.
-జాతీయం ఆదాయం అంటే ఒక దేశం మొత్తం ఆదాయం.
జాతీయ ఆదాయంలో ముఖ్య పదాలు
-ఒక సంవత్సర కాలం, నిర్దేశిత ప్రాంతం, ఆర్థిక వ్యవస్థ, అంతిమ వస్తుసేవలు, ద్రవ్యరూప మొత్తం.
-దీన్నే జాతీయ ఆదాయం = P x Q గా నిర్వచిస్తారు.
-ఇక్కడ p = తయారైన వస్తువులు, సేవల సంఖ్య
Q = వస్తువు విలువ ద్రవ్యరూపంలో
జాతీయ ఆదాయంలో ఉన్న ముఖ్య భావనలు
-జాతీయ ఆదాయం అంటే ఈ కింద పేర్కొన్న అంశాలన్నింటిని లెక్కగట్టాలి.
1. స్థూల దేశీయోత్పత్తి
(గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్-GDP)
2. స్థూల జాతీయ ఉత్పత్తి
(గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్-GNP)
3. నికర జాతీయ ఉత్పత్తి
(నెట్ నేషనల్ ప్రోడక్ట్-NNP)
-పై మూడు భావనలు దాదాపు ఒకే విలువను ఇస్తాయి. కానీ కొన్నికొన్ని విశిష్ట అంశాలతో అవి విభేదిస్తాయి.
1. స్థూల దేశీయోత్పత్తి-GDP
-ఒక దేశంలో తయారైన అంతిమ వస్తుసేవల విలువ మొత్తాన్నే GDP అంటారు.
-GDPలో ముఖ్యంగా ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు.
-అంటే భారతదేశం అనే భౌగోళిక ప్రాంతంలో జరిగిన మొత్తం వస్తుసేవల ఉత్పత్తి విలువ.
-భారతదేశంలో ఎవరైనా ఉత్పత్తి చేయవచ్చు. అంటే స్వదేశీయులు, విదేశీయులు కూడా.
ఉదా: ఒకప్పుడు భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ఫ్లెచర్ ఇక్కడ సేవలు అందించాడు. అతడు విదేశీయుడు అయినా భారత భూభాగంలో పనిచేశాడు కాబట్టి దాన్ని జీడీపీలో లెక్కిస్తారు.
-అదేవిధంగా మనదేశం నుంచి ఎవరైనా విదేశాలకు వెళ్లి అక్కడ వస్తువులను, సేవలను ఉత్పత్తి చేస్తే దాన్ని మన జీడీపీలో లెక్కించరు.
-అంటే విదేశాల నుంచి వచ్చే ఆదాయం ఉండదు.
2. స్థూల జాతీయోత్పత్తి (GNP)
-ఇక్కడ కీలక భావన జాతీయత. అంటే దేశ పౌరుల చేత ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల మొత్తాన్నే స్థూల జాతీయోత్పత్తి అంటారు.
-GDPలో మాదిరిగా ఇక్కడ ఒక ప్రాంతాన్ని కాకుండా, ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తుల చేత ఉత్పత్తి అయిన వస్తుసేవలను లెక్కిస్తారు.
-GNPలో విదేశాల్లో భారతీయులు సంపాదించిన ఆదాయాన్ని కలుపుకుంటారు. మనదేశంలో విదేశీయులు సంపాదించిన ఆదాయాన్ని తీసివేస్తారు.
-అంటే GNP = GDP+(x-m)
ఇక్కడ x = ఎగుమతులు
m = దిగుమతులు
-GNP = GDP + (NFIA) NFIA = Net Factor Income from Abroad.
-భారత దేశం విషయంలో దిగుమతులు ఎక్కువగా, ఎగుమతులు తక్కువగా ఉంటాయి. కాబట్టి GNP ఎప్పుడు GDP కంటే తక్కువగా ఉంటుంది.
3. నికర జాతీయ ఉత్పత్తి (NNP)
-స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసివేస్తే NNP వస్తుంది. అదెలా అంటే.. వస్తువులను ఉత్పత్తి చేసినపుడు మూలధన సామాగ్రి (యంత్రాలు, ముడి సరుకు, భావనలు మొదలైనవి) తరుగుదల పొంది, మూలధన ఆస్తుల విలువ తగ్గుతుంది.
-NNPని జాతీయాదాన్ని లెక్కించడానికి ప్రామాణికంగా తీసుకుంటారు. పై మూడు అంశాలను అంటే జీడీపీ, జీఎన్‌పీ, ఎన్ఎన్పీలను కేవలం మార్కెట్ ధరల వద్ద మాత్రమే లెక్కగట్టాం.
-మార్కెట్ ధరల వద్ద అంటే అందులో పన్నులు, సబ్సిడీలు కూడా కలుస్తాయి. కాబట్టి జాతీయాదాన్ని మార్కెట్ ధరల వద్ద కాకుండా ఉత్పత్తి కారకాల వద్ద కూడా లెక్కగడతారు.
-అంటే జీడీపీ, జీఎన్‌పీ, ఎన్‌ఎన్‌పీ మార్కెట్ ధరల దగ్గర ఉత్పత్తి కారకాల వద్ద విభిన్నంగా ఉంటాయి.
-ఇప్పుడు ఉత్పత్తి కారకాలు దృష్ట్యా జీడీపీ, జీఎన్‌పీ, ఎన్ఎన్పీని లెక్కిద్దాం
-అలాగే జీఎన్‌పీ, ఎన్‌ఎన్‌పీ ఉత్పత్తి కారకాల దృష్ట్యా = జీఎన్‌పీ, ఎన్‌ఎన్‌పీ మార్కెట్ ధరల దృష్ట్యా – పరోక్ష పన్నులు+సబ్సిడీలు
National income
పన్నులు : ఒక వస్తువు ధరలో దాని ఉత్పత్తి ఖర్చు పరోక్ష పన్ను చేరతాయి. కాబట్టి ఫ్యాక్టర్ కాస్ట్‌ను తెలుసుకోవడం కోసం పన్నులను తీసివేయాలి. వస్తువు అసలు ధరను తెలుసుకోవడానికి ఇలా వ్యవకలనం చేస్తాం.
సబ్సిడీలు : పరోక్ష పన్నుల వల్లనే కాకుండా సబ్సిడీల వల్ల కూడా వస్తువు అసలు ధర మారుతుంది. మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉత్పత్తిదారులకుగానీ, వినియోగదారులకుగానీ లేదా కొన్ని వస్తువుల ఉత్పత్తులను ప్రోత్సహించడానికిగానీ ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది. అంటే మార్కెట్ ధరల కన్నా తక్కువ ధరకు వస్తువును కొనేట్టు ప్రోత్సహిస్తుంది. ఈ విధానాన్నే సబ్సిడీ విధానం అంటారు.
ఉదా: వ్యవసాయదారులకు తక్కువ ధరకే విత్తనాలు అందించడం, చౌకధరల దుకాణంలో తక్కువ ధరకే నిత్యావసర సరుకులను అందించడం.
-పరిశ్రమల కన్నా తక్కువ ధరకే విద్యుత్‌ను సరఫరా చేయడం మొదలైనవి.
-పై అంశాన్ని సాధారణంగా జాతీయాదాయాన్ని లెక్కగట్టడానికి వాడతారు. పై అంశం 2014-2015 నుంచి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. 2014-15 కంటే ముందు NNP@ఉత్పత్తి కారకాల వద్ద జాతీయాదాయంగా పరగణించేవారు.
వ్యష్టి ఆదాయం (Personal Income)
అంటే వ్యక్తులు వాస్తవంగా పొందిన ఆదాయం. మొత్తం జాతీయాదాయంలో కొంతభాగం వివిధ కారణాల రీత్యా వ్యక్తుల చేతికి రాదు. దానికి ఈ కింది విధంగా చూపవచ్చు.
-PI=జాతీయాదాయం-పంచిపెట్టని లాభాలు-కార్పొరేట్ టాక్సులు-సాంఘిక భద్రతా-చెల్లింపులు+బదిలీ చెల్లింపులు
-అంటే కార్పొరేట్ ఆదాయ పన్నులు ప్రభుత్వానికే చేరతాయి.
-సాంఘిక భద్రతా చెల్లింపులు-ప్రొవైడెట్ ఫండ్, ఆరోగ్య బీమా మొదలైనవి.
-బదిలీ చెల్లింపులు-వృద్ధాప్య, వితంతు పింఛన్లు
వ్యయార్హ ఆదాయం (Pesrsonal Disposable Income)
-వ్యక్తిగత ఆదాయం నుంచి ఆదాయపు పన్ను, సంపద పన్ను లాంటివి తీసేయగా వచ్చిన ఆదాయం.
-DPI= Personal Income-Direct taxes-non tax payments
-వ్యయార్హ ఆదాయంలో కొంత భాగం ఖర్చు చేయగా మిగిలిన భాగం పొదుపు చేస్తారు.
-DPI=Consumption+Savings
జాతీయ ఆదాయం ఎందుకు ముఖ్యమైనది?
-ఒక దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను, ఒక దేశ ప్రజల జీవన ప్రమాణస్థాయిని కొలవాలంటే జాతీయ ఆదాయమే నిర్ణాయక అంశం.
-అదేవిధంగా ఒక దేశంలో ఎలాంటి వస్తుసేవలు ఉత్పత్తి అవుతున్నాయి? ఎంత మొత్తంలో పెరుగుదల ఉంది? ఇంకా ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయాలంటే ఏం చేయాలి? మొదలైన విషయాలన్నింటిని జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టడం ద్వారా తెలుసుకోవచ్చు.
prabakar-అదేవిధంగా ఒక దేశంలో ఉన్న పేదరికం, నిరుద్యోగం, ఆదాయ అసమానతలు మొదలైన సామాజిక సమస్యలను జాతీయ ఆదాయం పెంచడం ద్వారా తగ్గించే అవకాశం ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు