ఇంగ్లిష్ పదాల వాడకం ఇలా ..
ఇంగ్లిష్ వాడుక భాషలోని పదాలను నేర్చుకుందాం. వీటిని మనం Usages అని చెప్పుకోవచ్చు.
1. Used to
సాధారణంగా మనం Use అనే పదాన్ని వాడుతుంటాం. ఉపయోగం అనే అర్థంలో. Use (v1), Used (v2), Used (v3). ఇక్కడ Use అనే పదాన్ని ఉపయోగించటం అనే అర్థంలో వాడుతున్నాం.
Used past form, past participle formలో కూడా ఉపయోగించటం అనే అర్థంలో వాడుతున్నాం.
Eg: What is the use of this device?
I use a smart phone to call
she used black color pen to write
ఈ విధంగా Used/used ని ఉపయోగం, ఉపయోగించు అనే అర్థాల్లో వాడుతాం. ఇప్పుడు తెలుసుకోబోయే Used to అనే expressionలో ఉపయోగపడు అనే అర్థం అస్సలు ఉండదు. Used to అనే expression కి అర్థం.
ఆ విధంగా చేస్తూ ఉండే వాడిని అనే స్థూలంగా చెప్పుకోవచ్చు.
I used to sing in those days
ఈ వాక్యానికి అర్థం ఆ రోజుల్లో పాడుతూ ఉండేవాడిని అని చెప్పవచ్చు. ఆ పని మరీ ఎక్కువ రోజులు కొనసాగించలేదు అని కూడా చెప్పవచ్చు. ఆ పని ఇప్పుడు కొనసాగుతూ ఉందో లేదో కూడా వివరణ ఇవ్వబడలేదు. అప్పట్లో అదో అలవాటుగా ఉండేది. అప్పట్లో అలా ఉంటూ ఉండేది. ఇలా చెప్పాల్సిన సందర్భాల్లో ఈ Used to అనే Expression ఉపయోగించవచ్చు.
I Used to attend classes regularly అంటే తరగతులకు రెగ్యులర్‌గా అటెండవుతూ ఉండేవాడిని అని అర్థం. మరీ ఇప్పుడు?
ఈ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు కూడా అటెండవుతూ ఉండవచ్చు. లేదా అవకనూపోవచ్చు. ఈ వివరణ ఆ స్పీకర్ చెబితేనే శ్రోతకి తెలిసే అవకాశం ఉంది. అంటే ఈ Used to అనే Expression ద్వారా ఇప్పుడు వర్తమానంలో చేస్తున్న పని తాలుకు వివరణ తెలియదు.
కింది రెండు వాక్యాలను గమనించండి.
I sing regularly
I used to sing regularly
మొదటి వాక్యం అర్థం నేను పాటలు పాడతాను. (ఇప్పటి అలవాటు), రెండో వాక్యం అర్థం.. నేను పాటలు పాడుతుండేవాడిని (అప్పట్లో అలవాటు) కాబట్టి Used to అనే expression ని సందర్భానుసారం వాడాలి.
Used to అనే స్థానంలో Would కూడా వాడవచ్చు.
Eg: I would sing in those days we would visit a village every sunday got used to
అలవాటు పడిపోవటం అనే అర్థంలో వాడతాం.
I got used to city traffic
I am used to city traffic
అంటే సిటీ ట్రాఫిక్‌కి అలవాటు పడిపోయాను అని చెప్పవచ్చు.
Getting used to
అలవాటు పడుతూ ఉన్నాం, అలవాటు చేసుకుంటున్నాం.
అనే అర్థంలో చెప్పుకోవచ్చు.
I am getting used to hostel food
we are getting used to new boss
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు