విటమిన్లు – ఉపయోగాలు

విటమిన్ -A
-దీని రసాయన నామం- రెటినాల్
-సాధారణ నామం-యాంటీగ్జెరాఫ్తాల్మియా
-ఈ విటమిన్ లభించే పదార్థాలు- పసుపుపచ్చ పండ్లు, కూరగాయలు, అన్ని రకాల ఆకు కూరలు, క్యారట్, పాలు, షార్క్‌కాడ్ చేప కాలేయ నూనె
– A-విటమిన్ అధికంగా కలిగిన పదార్థం- క్యారట్
-విటమిన్-A అధికంగా ఉండే ఆకుకూర-బచ్చలి, అధికంగా ఉండే ఫలం- బొప్పాయి, అధికంగా ఉండే పాలు- ఆవు పాలు
గమనిక: మొక్కలలో A-విటమిన్ (Pro Vitamine-A) రూపంలో ఉండి పేగు, కాలేయంలలో A- విటమిన్‌గా మారుతుంది
-పామాయిల్ పసుపు రంగులో ఉండటానికి కారణం- విటమిన్-A
ఉపయోగాలు
-కంటి చూపునకు తోడ్పడుతుంది
-గర్భధారణకు ఉపయోగపడుతుంది
-ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది
-చర్మం కాంతివంతంగా ఉండటానికి అవసరం
విటమిన్ -A లోపం వలన కలిగేవ్యాధులు
రే చీకటి (నిక్టోలోపియా): మసక చీకటిలో కండ్లు కనిపించక పోవడం
పొడికండ్లు (ైగ్జెరాఫ్తాల్మియా): కన్నీటిని ఉత్పత్తి చేసే లాక్రిమల్ గ్రంథులు/అశ్రుగ్రంథులు పనిచేయకపోవడం వల్ల కన్నీరు ఉత్తత్తికాక కండ్లు పొడిగా మారతాయి
-కన్నీటిలో లైసోజైమ్ అనే ఎంజైమ్, సోడియం క్లోరైడ్ (NaCl) ఉండటం వల్ల సూక్ష్మజీవులు చనిపోతాయి. దుమ్ము, ధూళి బయటకు పంపిస్తుంది
-కండ్లు పొడిగా మారినప్పుడు కనుగుడ్లను కప్పి ఉంచే సున్నితమైన కార్నియా/శుక్లపటలం పగిలి శాశ్వత అంధత్వం (కెరటోమలేషియా) కలుగుతుంది
-కంటి అధ్యయనం- ఆప్తాల్మాలజీ
– చర్మ అధ్యయనం- డెర్మటాలజీ
గమనిక: కనుగుడ్లు దానం చేసే వ్యక్తులు మరణించిన 6-8 గంటల్లో కార్నియాను సేకరిస్తారు
డెర్మటోసిస్: చర్మం పైపొర పొలుసులుగా ఊడిపోతుంది.
విటమిన్-D
-దీని రసాయన నామం- కాల్సిపెరాల్
– దీని సాధారణ నామం- సూర్యకాంతి (Sunshine) విటమిన్ అని, యాంటీరికెటిక్ విటమిన్ అని, ఫ్రీ/ఉచిత విటమిన్ అని, హార్మోన్‌లాంటి విటమిన్ అని అంటారు.
విటమిన్-D లభించే పదార్థాలు
-సూర్యకాంతి, కాడ్చేపల కాలేయ నూనె, పాలు, కాలేయం, గుడ్డులోని పచ్చసొన. ఇది మొక్కలలో లభించదు. కానీ కొన్ని లైకేన్స్లో లభిస్తుంది.
-సూర్యకాంతి (అతినీలలోహిత కిరణాలు) చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే కొలెస్టిరాల్ అనే కొవ్వు D విటమిన్‌గా మారుతుంది.
విటమిన్-D వల్ల ఉపయోగాలు
-ఇది ఆహారం ద్వారా లభించిన కాల్షియం, ఫాస్ఫరస్లను ఎముకలు, దంతాలలోకి పంపించి గట్టిగా ఉంచడంలో (పారాథార్మోన్ వలె) తోడ్పడుతుంది.
విటమిన్-D లోపం వలన కలిగే వ్యాధులు
-చిన్నపిల్లల్లో రికెట్స్
-పెద్దవారిలో ఆస్టియోమలేషియా
-PIGEON CHEST (కపోత వక్షం)
విటమిన్-E
-దీనిని టోకోఫెరాల్ అని, బ్యూటీ విటమిన్ అని, యాంటీస్టెరిలిటీ విటమిన్ (వంధ్యత్వ నిరోధక విటమిన్) అని అంటారు.
విటమిన్-E లభించే పదార్థాలు
-తాజాఫలాలు, మొలకెత్తిన పప్పులు, సన్‌ఫ్లవర్, పత్తిగింజల నూనె.
-కుసుమ పువ్వు (Saffola) పిక్కలు/ Nuts (జీడిమామిడి, బాదం లాంటి Dry Fruits)
-గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీకి ఇవ్వాలి.
విటమిన్-E వల్ల ఉపయోగాలు
-ప్రత్యుత్పత్తి సక్రమంగా పనిచేయడానికి అవసరం
-కండరాలు ఆరోగ్యంగా పనిచేయడానికి అవసరం
విటమిన్-E వలన కలిగే వ్యాధులు
-వంధ్యత్వం-ప్రత్యుత్పత్తి అవయవాలు పనిచేయకపోవడం (ఎలుకల్లో)
-ఆర్‌బీసీల జీవిత కాలం తగ్గడం. వీటి జీవిత కాలం-120 రోజులు
విటమిన్-K
-దీనిని ఫిల్లోక్వినోన్, నాఫ్తోక్వినోన్, రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్, యాంటీహెమరేజిక్ విటమిన్ యాంటీబ్లీడింగ్ విటమిన్ అని అంటారు.
విటమిన్-K లభించే పదార్థాలు
-ఆకుకూరలు, కాలేయం, గుడ్డు, ఆవుపాలు, పెద్దపేగులోని ఎశ్చరీషియా కొలై (Escherichia coli) అనే బ్యాక్టిరియా
-అప్పుడే పుట్టిన శిశువులో లోపం ఎక్కువ. కావున సర్జరీ సమయంలో పేషెంట్‌కు K విటమిన్ ఇవ్వాలి.
విటమిన్-K వల్ల ఉపయోగాలు
-గాయమైన రెండు నుంచి ఐదు నిమిషాల్లో రక్తాన్ని గడ్డకట్టించడం
-బాంబు పేలుళ్లు, కత్తిపోట్ల వల్ల గడ్డకట్టడానికి 8 నిమిషాలు పడుతుంది
విటమిన్-K లోపం వలన కలిగే వ్యాధులు
హెమరేజియా: అధిక రక్తస్రావం, రక్తం గడ్డకట్టక పోవడం, క్లోమం దెబ్బతినడం
RELATED ARTICLES
-
Telangana Govt Schemes & policies | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు- పథకాలు
-
General Essay – Groups Special | సూయజ్ కంటే చవక… ఈ నడవ
-
Groups Special – Geography | సూర్యుడు ఉదయించే దేశాలు.. శృంగాకారపు అడవులు
-
Indian History – Groups Special | బంగారు పుట్టలు పెట్టే చీమలు.. అబద్ధాలెరుగని ప్రజలు
-
IIT/NEET Foundation – chemistry | The strength of a bond depends upon?
-
English Grammar | We should all love and respect
Latest Updates
Economy | ప్రపంచంలోని డైనమిక్ సిటీస్ కేటగిరీలో హైదరాబాద్ ర్యాంక్ ఎంత?
Indian Cultures And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
IIT Jam Notification | జాతీయ సంస్థలో మాస్టర్స్.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా…
Groups Special – Science | సహజ శక్తి అనంతం … కాలుష్య రహితం.. పర్యావరణ హితం
DSC SGT MATHS | చతురస్రాకార పొలం వైశాల్యం 1024 చ.మీ అయితే దాని భుజం ?
Physics – IIT/NEET Foundation | The acceleration of a body has the direction of
Economy – Groups Special | అండమాన్‌లో అల్పం… దాద్రానగర్‌లో అధికం
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?