ఎంత మంది అనుచరులతో గాంధీజీ దండియాత్ర చేపట్టారు?
మూడో దశ
‘వేల్స్’ యువరాజు పర్యటనను బహిష్కరిం చారు. విదేశీ వస్తువులను కాల్చివేశారు.
ఈ దశలో నాలుగు సంఘటనలు జరిగాయి.
1.చీరాల-పేరాల ఉద్యమం
2.పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం
పర్వతనేని వీరయ్య చౌదరి
అనుచరులు-శాంతి సేన
బిరుదు- ఆంధ్రా శివాజీ.
3.పల్నాడు విప్లవం
4.రంప విప్లవం
చీరాల-పేరాల ఉద్యమం
- నాయకుడు- దుగ్గిరాల గోపాల కృష్ణయ్య
- ప్రకాశం జిల్లాలోని చీరాల, పేరాల గ్రామాలను బ్రిటిష్ ప్రభుత్వం 1920లో ‘నగరపా లికగా’ చేసింది.
- చీరాల యూనియన్‌లో ఉన్నప్పుడు రూ. 4,000 పన్నుగా ఉండేది. నగరపాలిక అయ్యాక రూ.40,000కు పెరిగింది. దీంతో ప్రజలు పూర్వస్థితి కావాలని కోరారు.
- దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పన్నులు చెల్లించకుండా సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టేందుకు పిలుపునిచ్చారు. దీని కోసం ‘రామదండ’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు.
- గాంధీ చీరాలను సందర్శించి ప్రజలు వారి ఇండ్లను ఖాళీ చేస్తే అక్కడ మున్సిపాలిటీ ఉండదని సలహా ఇచ్చాడు. దీంతో ‘రామనగర్’ పేరుతో నూతన పట్టణాన్ని ఏర్పాటు చేశారు. (మొత్తం జనాభా 15,000)
పల్నాడు ఉద్యమం (గుంటూరు)
- నాయకుడు- కన్నెగంటి హనుమంతరావు
- పుల్లరి పన్ను కోసం ఈ ఉద్యమం జరిగింది. ఇదే సమయంలో కడప జిల్లాలో రాయచోటి తాలూకాలోనూ అటవీ సత్యాగ్రహం జరిగింది.
రంప విప్లవం
- నాయకుడు- అల్లూరి సీతారామరాజు
- విశాఖ జిల్లా పాండ్రంగి గ్రామంలో 1897 జూలై 4న జన్మించాడు. తల్లిది విశాఖపట్టణం, తండ్రిది మొగళ్లు (భీమవరం దగ్గర)
- అల్లూరి తన మేనమామ ‘రామచంద్రరాజు’ దగ్గర పెరిగాడు.
- 1882లో మద్రాసు అటవీ చట్టం చేయటంతో గిరిజనులను అడవుల్లో స్వేచ్ఛగా తిరగడాన్ని నిషేధించింది.
- బెంగాలి విప్లవకారుల దేశభక్తితో స్ఫూర్తిపొంది చింతపల్లి, రంపచోడవరం, దమ్మనపల్లి, కేడీ పేట, అడ్డతీగల, నర్సీపట్నం, అన్నవరం ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లపై దండెత్తారు.
- ‘దమ్మనపల్లి’ దగ్గర స్కాట్ కవార్డ్తో పాటు అనేక బ్రిటిష్ సైనికులను చంపేశారు.
- 1922 డిసెంబర్లో సాండర్స్ నాయకత్వం లో అస్సాం రైఫిల్స్‌ను పంపించారు. వీరు ‘పెగడపల్లె’ దగ్గర మకాం వేశారు. అనుచరులు మల్లుదొర, గంటం దొరలను చింతపల్లి అడవుల దగ్గర రామరాజును మంప గ్రామం దగ్గర కాల్చి చంపారు.
చౌరీ చౌరా సంఘటన (1922 ఫిబ్రవరి 5)
- గోరఖ్‌పూర్ జిల్లాలో చౌరీచౌరా పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన జరిగింది.
- 1922 ఫిబ్రవరి 5న పోలీస్‌స్టేషన్‌లో 22 మంది పోలీసులను సజీవదహనం చేశారు.
- ఉద్యమం హింసాత్మకంగా మారుతుందని గాంధీ భావించి ఫిబ్రవరి 11న ఉద్యమాన్ని ఆపారు.
1920-30 మధ్య సంఘటనలు
- RSS ఏర్పాటు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (కేశవ్ బలరాం) (1925), కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు- 1925. M.N. రాయ్.
- స్వరాజ్య పార్టీ స్థాపన- 1923 మోతీలాల్ నెహ్రూ, సీఆర్ దాస్ (లక్ష్యం- ఎన్నికల్లో పోటీచేయడం)
- సైమన్ గో బ్యాక్ ఉద్యమం
- బార్డోలీ సత్యాగ్రహం- 1928, వల్లభాయ్ పటేల్
- పూర్ణ స్వరాజ్య తీర్మానం- 1929
సైమన్ గోబ్యాక్ ఉద్యమం (1928)
- సైమన్ కమిషన్‌లో ఏడుగురు సభ్యులు ఆంగ్లేయులే కావడంతో భారతీయులు ఈ కమిషన్‌ను వ్యతిరేకించారు.
- ఈ ఉద్యమ కాలంలో టంగుటూరికి ‘ఆంధ్రకేసరి’ బిరుదు వచ్చింది.
- ఈ ఉద్యమ కాలంలోనే పంజాబ్‌లో లాలాలజపతిరాయ్‌ను లాహోర్ ఏసీపీ సాండర్స్ కొట్టాడు. దీంతో భగత్‌సింగ్, అతని అనుచరులు సాండర్స్‌ను హత్యచేశారు.
పూర్ణ స్వరాజ్య తీర్మానం (1929)
- 1929 INC సమావేశం నెహ్రూ ఆధ్వర్యంలో ‘లాహోర్’లో జరిగింది.
- 1930 జనవరి 26న ‘స్వరాజ్య తీర్మానం’ జరపాలని నిర్ణయించారు. ‘సంపూర్ణ స్వరాజ్యదినం’.
విప్లవాత్మక తీవ్రవాదం
- ఈ దశలో భాగంగానే భగత్‌సింగ్, భతుకేశ్వర్ దత్, సుఖ్‌దేవ్ సింగ్, రాజ్‌కేశ్వర్ గురు 19 29 ఏప్రిల్ 8న పార్లమెంటుపై బాంబులు వేశారు
- వీరిని 1931 మార్చి 23న లాహోర్ జైలులో ఉరితీశారు.
శాసనోల్లంఘన ఉద్యమం (1930-1934)
- ఉప్పు సత్యాగ్రహం/దండి సత్యాగ్రహం
- ఉప్పు తయారీపై బ్రిటిష్ ప్రభుత్వం పన్ను విధించడంవల్ల ఉప్పు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో
- గాంధీ నిర్ణయంతో.. గుజరాత్ తీరంలో దండి గ్రామంలో ఉప్పు తయారుచేశారు.
- 1930 మార్చి 12న సబర్మతీ ఆశ్రమంలో గాంధీ నిర్ణయం తీసుకుని 13న 78మంది అనుచరులతో దండియాత్ర చేపట్టారు.
- 24 రోజుల్లో తన అనుచరులతో గాంధీ 375 కిలోమీటర్లు ప్రయాణం చేసి 1930 ఏప్రిల్ 6న దండి చేరాడు. ఇది అరేబియా సముద్ర తీర ప్రాంతం. ఈ క్రమంలో చట్టాలను ఉల్లంఘించారని గాంధీజీని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.
ఫలితాలు
- దర్శన ఉప్పు కర్మాగారం ముందు సరోజినీ నాయుడు కవాతు చేశారు.
- దేశమంతటా నూతన ఉత్తేజం కలిగింది.
- ఢిల్లీలో 1600మంది మహిళలను జైలులో వేశారు.
- విదేశీ వస్త్ర, మద్యం దుకాణాల దగ్గర పికెటింగ్ చేశారు.
- భారతీయులు బ్రిటిష్ పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగాలను బహిష్కరించారు.
- 90వేలకు పైగా సత్యాగ్రహులు జైలు పాలు కాగా…కాల్పుల్లో 110 మంది చనిపోయారు. 300మందికి పైగా గాయపడ్డారు.
నోట్: గాంధీ-ఇర్విన్ ఒప్పందం వల్ల (1931) ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. గాంధీ R.T.C సమావేశాలకు వెళ్లారు. - 3 రౌండ్ టేబుల్ సమావేశాలు(R.T.C) జరిగాయి. అవి 1930, 1931, 1932
- 2వ R.T.C సమావేశానికి గాంధీ, సరోజినీ నాయుడు లండన్ వెళ్లారు.
- 3వ R.T.C సమావేశానికి బీఆర్ అంబేద్కర్, మహ్మద్ అలీ జిన్నా వెళ్లారు.
ముస్లింలీగ్
- 1906లో ‘ఢాకా’లో ముస్లిం భూస్వాములు, నవాబులు కలిసి ‘అఖిల భారత ముస్లిం లీగ్’ ను ఏర్పాటు చేశారు.
- స్థాపించినవారు. సలీముల్లాఖాన్, ఆగాఖాన్.
- ఈ పార్టీ బెంగాల్ విభజనను సమర్థించినది.
- ఈ పార్టీ కోరుకున్నట్లు 1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పడ్డాయి.
- ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం భూస్వాముల ప్రయోజనాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ పార్టీకి 1930 వరకు ప్రజా మద్దతు లేదు.
- 1937లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగినప్పుడు దేశంలోని 482 ముస్లిం నియోజకవర్గాల్లో 102 స్థానాలను ముస్లింలీగ్ గెలుచుకుంది.
- ఈ ఎన్నికల్లో 58 ముస్లిం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేయగా 28 స్థానాల్లో గెలిచింది.
- 1937 ఎన్నికల్లో ముస్లిం ఓట్లలో 4.4 శాతం మాత్రమే ముస్లింలీగ్‌కు వచ్చాయి.
- 1946 రాష్ట్ర, కేంద్ర సభల ఎన్నికల్లో ముస్లింలీగ్ విజయం సాధించింది.
- 1930లో ముస్లింలీగ్ అధ్యక్షోపన్యాసం చేసిన మహ్మద్ ఇక్బాల్ వాయవ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకతను తెలియజేశాడు.
- పాకిస్థాన్ లేదా పాక్‌స్థాన్ (Pakstan ) అనే పేరును సూచించాడు. ‘చౌదరి రహమత్ అలీ’ (కేంబ్రిడ్జ్డిలో పంజాబీ ముస్లిం)
- పాక్స్తాన్ (Pakstan ) -పంజాబ్, అఫ్గ్గాన్, కశ్మీర్, సింథ్, బెలూచిస్థాన్.
- 1933-35లో రాసిన కరపత్రాల్లో చౌదరి రహమత్ అలీ ఈ రాష్ర్టాలకు జాతీయ ప్రతిపత్తిని ఆశించాడు.
- 1940 మార్చి 23న ఉపఖండంలో ముస్లిం లు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తిని కోరుతూ ముస్లింలీగ్ తీర్మానం ప్రవేశపెట్టింది.
- 1940లో ముస్లింలకు స్వతంత్ర రాష్ర్టాలు కోరుతూ తీర్మానం.
- 1946లో రాష్ట్రప్రభుత్వాలకు ఎన్నికలు జరిగాయి.
- ఈ ఎన్నికల్లో 569 స్థానాల్లో 442 ముస్లింలీగ్ గెలుచుకుంది. (86శాతానికి పైగా ఓట్లు).
- 1946 ఆగస్టు 16న తమ కోరికలను సాధించుకోవడానికి ప్రజలను వీధుల్లోకి రమ్మని ముస్లింలీగ్ పిలుపునిచ్చింది. (కలకత్తాలో అల్లర్లు జరిగాయి)
- 1947 ఆగస్టు 14న పాకిస్థాన్ నూతన దేశంగా అవతరించింది.
1935 భారత ప్రభుత్వ చట్టం
- దీని ప్రకారం రాష్ర్టాలకు స్వయం ప్రతిపత్తి లభిస్తుంది.
- 1937ఎన్నికల్లో 11 రాష్ర్టాలకు 8 రాష్ర్టాల్లో కాంగ్రెస్, ఒక రాష్ట్రంలో సంకీర్ణం, 2 రాష్ర్టాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
- 1939 సెప్టెంబర్ 1న హిట్లర్ పార్టీ (నాజిజం, జర్మనీ).
- పొలెండ్పై దాడి చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది.
- 1942లో జపాన్..అమెరికాకు చెందిన ‘పెర్ల్ హార్బర్’ పై దాడి చేయడంతో USA ఈ యుద్ధంలో చేరింది.
- 1945 ఆగస్టు 6న హిరోషిమా,9న నాగసాకి నగరాలపై USA అణు బాంబులు వేసింది.
Previous article
MA=CA అయితే IQ ఎంత?
Next article
X CLASS MATHEMATICS
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు