MA=CA అయితే IQ ఎంత?
1. ఏక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు?
1) బినే 2) స్పియర్మన్
3) థార్న్డైక్ 4) థర్స్టన్
2. గార్డెనర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ?
1) సంగీత లయ సంబంధ ప్రజ్ఞ
2) ప్రకృతి సంబంధ ప్రజ్ఞ
3) శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ
4) దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ
3. ‘Abilities of Man’ గ్రంథ రచయిత
1) బినే 2) స్పియర్మన్
3) థర్స్టన్ 4) గిల్ఫర్డ్
4. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1) స్పియర్మన్ 2) గిల్ఫర్డ్
3) థార్న్డైక్ 4) థర్స్టన్
5. బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు?
1) థార్న్డైక్ 2) థరస్టన్
3) గిల్ఫర్డ్ 4) స్పియర్మన్
6. ‘Measurement of Intelligence’ గ్రంథ రచయిత ఎవరు?
1) గిల్ఫర్డ్ 2) థర్స్టన్
3) ఇ.ఎల్. థార్న్డైక్ 4) స్టెర్న్
7. ప్రజ్ఞలో అంతస్తు లేదా స్థాయి, వ్యాప్తి లేదా విస్తరణ, వైశాల్యం, నిష్పాదన వేగం అనే గుణాల గురించి తన సిద్ధాంతాల్లో తెలియజేసింది ఎవరు?
1) ఇ.ఎల్. థార్న్డైక్ 2) గిల్ఫర్డ్
3) థర్స్టన్ 4) స్పియర్మన్
8. సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1) థర్స్టన్ 2) థార్న్డైక్
3) గిల్ఫర్డ్ 4) స్పియర్మన్
9. ‘Primary Mental Abilities’ గ్రంథ రచయిత ఎవరు?
1) బినే 2) స్టెర్న్
3) ఎబ్బింగ్ హాస్ 4) థర్స్టన్
10. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1) థర్స్టన్ 2) గిల్ఫర్డ్
3) థార్న్డైక్ 4) స్పియర్మన్
11. గిల్ఫర్డ్ ప్రతిపాదించిన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో మూల్యాంకనం, సమైక్య, విభిన్న ఆలోచన, స్మృతి, జ్ఞానం అనేవి దేని కిందకు వస్తాయి?
1) మూలకాలు 2) విషయాలు
3) ఉత్పన్నాలు 4) ప్రచాలకాలు
12. థార్న్డైక్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి తయారు చేసిన ప్రజ్ఞా పరీక్షలు ఏవి?
1) CAVD 2) RPMT
3) WISC 4) DATB
13. గిల్ఫర్డ్ ప్రకారం మనసులో ఉండే విశేషకాలు
1) 5 రకాల ప్రచాలకాలు, 5 రకాల విషయాలు, 6 రకాల ఉత్పన్నాలు
2) 5 రకాల ప్రచాలకాలు, 5 రకాల విషయాలు, 5 రకాల ఉత్పన్నాలు
3) 4 రకాల ప్రచాలకాలు, 4 రకాల విషయాలు, 4 రకాల ఉత్పన్నాలు
4) 6 రకాల ప్రచాలకాలు, 6 రకాల విషయాలు, 5 రకాల ఉత్పన్నాలు
14. ‘మానసిక వయస్సు’ భావనను ప్రతిపాదించింది ఎవరు?
1) టెర్మన్ 2) బినే
3) స్టెర్న్ 4) థార్న్డైక్
15. ప్రజ్ఞాలబ్ధి సూత్రం
1) C.A/M.A x100
2) M.A/C.A x 100
3) IQ x C.A/100
4) M.A/IQ x 100
16. 9 సంవత్సరాల విద్యార్థి 10 సంవత్సరాలకు నిర్దేశించిన అంశాలను సాధిస్తే అతని మానసిక వయస్సు ఎంత?
1) 7 సంవత్సరాలు
2) 8 సంవత్సరాలు
3) 9 సంవత్సరాలు
4) 10 సంవత్సరాలు
17. ‘ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్స్’గా ఎవరిని పిలుస్తారు?
1) ఆల్ఫ్రెడ్ బినే 2) స్టెర్న్
3) టెర్మన్ 4) థార్న్డైక్
18. 5 సంవత్సరాలున్న గణేష్ మానసిక వయస్సు 6 సంవత్సరాలు, అయితే అతడి ప్రజ్ఞాలబ్ధి?
1) 100 2) 110
3) 120 4) 130
19. థార్న్డైక్ ‘CAVD’ ప్రజ్ఞా పరీక్షలో ‘D’ అనే అక్షరం సూచించే సామర్థ్యం ఏది?
1) వాక్యపూరణాలు 2) పదజాలం
3) అంకగణితం 4) నిర్దేశాలు
20. 14 సంవత్సరాలున్న అమృత మానసిక వయస్సు 15 సంవత్సరాలయితే ఆమె ప్రజ్ఞా లబ్ధి ఎంత?
1) 100 2) 107
3) 110 4) 115
21. మానసిక, శారీరక వయస్సు సమానమైతే ప్రజ్ఞా లబ్ధి ఎంత?
1) 100 2) 110
3) 120 4) 150
22. ‘హెరిడిటరీ జీనియస్’ గ్రంథ రచయిత ఎవరు?
1) సిగ్మండ్ ఫ్రాయిడ్ 2) ఎబ్బింగ్ హాస్
3) జాన్ డ్యూయీ 4) ఫ్రాన్సిస్ గాల్టన్
23. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి?
1) 120-139 2) 110-119
3) 70-89 4) 90-109
24. MA=CA అయితే IQ ఎంత?
1) 90 2) 100 3) 110 4) 120
25. కింది వాటిలో ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత?
1) 90-109 2) 110-119
3) 120-139 4) 140 పైన
26. 8వ తరగతి విద్యార్థి ప్రజ్ఞాలబ్ధి 100 ఉంది. అతడిని ఏమని పిలవవచ్చు?
1) అధిక ప్రజ్ఞావంతుడు
2) ప్రతిభావంతుడు
3) మందబుద్ధి కలవాడు
4) సగటు ప్రజ్ఞావంతుడు
27. 16 సంవత్సరాల వంశి ప్రజ్ఞా లబ్ధి 75, అయితే అతని మానసిక వయస్సు ఎంత?
1) 10 సంవత్సరాలు
2) 12 సంవత్సారాలు
3) 14 సంవత్సరాలు
4) 16 సంవత్సరాలు
28. ప్రజ్ఞాలబ్ధి సూచిక (IQ)ను మొదటిసారిగా ఏ ప్రజ్ఞ మాపని పరీక్షలో ఉపయోగించారు?
1) బినే-సైమన్ మాపని – 1905
2) బినే-సైమన్ మాపని – 1908
3) బినే-సైమన్ మాపని – 1911
4) బినే-సైమన్ మాపని – 1916
29. రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ టెస్ట్ అనే ప్రజ్ఞా పరీక్ష?
1) నిష్పాదన, వ్యక్తిగత పరీక్ష
2) పేపర్, పెన్సిల్, వేగ పరీక్ష
3) సామూహిక, అశాబ్దిక పరీక్ష
4) వ్యక్తిగత, శాబ్దిక పరీక్ష
30. ‘డ్రా ఎ పర్సన్ టెస్ట్’ అనే పరీక్ష కింది వాటిలో దేనిని మాపనం చేస్తుంది?
1) మూర్తిమత్వం 2) సహజ సామర్థ్యం
3) ప్రజ్ఞ
4) చిత్ర లేఖన సామర్థ్యం
31. యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు
1) భాషా సంబంధ పరీక్షలు
2) సౌందర్య కళా సంబంధ పరీక్షలు
3) వృత్తి సంబంధ పరీక్షలు
4) విద్యా సంబంధ పరీక్షలు
32. ‘మొయిర్-సీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్’ ఏ సహజ సామర్థ్య పరీక్షకు సంబంధించినది?
1) విద్యాసంబంధ సహజ సామర్థ్య పరీక్ష
2) వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్ష
3) సౌందర్య కళా సంబంధ సహజ సామర్థ్య పరీక్ష
4) భాషా సంబంధ పరీక్ష
33. వ్యక్తిగత పరీక్షకు ఉదాహరణ
1) రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్
2) ఆర్మీ ఆల్ఫా పరీక్ష
3) బాటియా ప్రజ్ఞా మాపని
4) కల్చర్ పేపర్ మాపని
జవాబులు
1) 1 2) 4 3) 2 4) 1 5) 1 6) 3 7) 1 8) 1 9) 4 10) 2 11) 4 12) 1 13) 1 14) 2 15) 2 16) 4 17) 1 18) 3 19) 4 20) 2 21) 1 22) 4 23) 4 24) 2 25) 4 26) 4 27) 2 28) 4 29) 3 30) 3 31) 3 32) 3 33) 3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?