భారతదేశ సంక్షిప్త స్వరూపం
భూమిపై అతి ప్రాచీన మానవ నాగరికతలు విలసిల్లిన ప్రాంతా ల్లో భారత భూభాగం ఒకటి. ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చి, జీవన విధానాన్ని నేర్పింది భారతదేశం. క్రీస్తు పూర్వమే సకల సిరి సంపదలతో తులతూగిన భారత్, మధ్యయుగంలో విదేశీ దండయాత్రికుల ఆక్రమణ కింద నలిగిపోయి వెనుకబాటుకు గురైంది. చివరకు శాంతియుత పోరాటం ద్వారా బ్రిటిషర్లను తరిమికొట్టి స్వాతంత్య్రం సాధించిన ఈ పురాతన భూమి పూర్వవైభవాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నది. భారతదేశ భౌగోళిక, చారిత్రక, ఆర్థిక అంశాలు లేకుండా ప్రస్తుతం ఏ పోటీ పరీక్ష కూడా జరగటం లేదు. ఈ నేపథ్యంలో నిపుణ పాఠకుల కోసం భారతదేశ సంక్షిప్త సమాచారం అందిస్తున్నాం..
– ఉనికి, పరిమాణం : భారతదేశం భౌగోళికంగా ఉత్తరార్ధ గోళంలో 8.4-37.6 ఉత్తర అక్షాంశాలు, పూర్వార్ధ గోళం లో 68.7-97.25 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
– వైశాల్యం : భారతదేశ విస్తీర్ణం 32,87,263 చ.కి.మీ
– దేశంలో భూభాగం 90.08 శాతం కలదు.
– నీటిచే ఆక్రమించిన భాగం 9.92 శాతం.
– ప్రపంచ విస్తీర్ణంలో 7వ పెద్ద దేశం (రష్యా, కెనడా, చైనా,
అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, భారతదేశం)
– ఆసియాలో చైనా తర్వాత రెండోపెద్ద దేశం, దక్షిణాసియాలో పెద్ద దేశంగా ఉన్నది.
– ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం 2.4 శాతం.
– వైశాల్యంలో పెద్ద రాష్ట్రం : రాజస్థాన్ (8, 249 చ.కి.మీ)
– వైశాల్యంలో చిన్న కేంద్ర పాలిత ప్రాంతం : లక్షదీవులు (32చ.కి.మీ)
– శీతోష్ణస్థితి : భారతదేశం మధ్య గుండా 231/2 ఉత్తర అక్షాంశరేఖ (కర్కాటక రేఖ) పోతుంది.
– కర్కాటకరేఖకు ఎగువ భాగం ఉప ఆయనరేఖ శీతోష్ణస్థితి కలదు. కర్కాటక రేఖ దిగువ భాగం ఆయనరేఖ శీతోష్ణస్థితి కలదు .
– అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే నెల – మే
– అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే నెల – జనవరి
వర్షపాతం
– సగటు వర్షపాతం – 1083 సెంటీమీటర్లు (2014)
– అత్యధిక వర్షపాతం – 1141సెంటీ మీటర్లు (మాసిన్రామ్, మేఘాలయ)
– అత్యల్ప వర్షపాతం – 10 సెంటీమీటర్లు ( జైసల్మీర్, రాజస్థాన్)
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
– 1947, ఆగస్టు 15న – 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు.
– ప్రస్తుతం – 29 రాష్ర్టాలు,7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి
– చివరగా ఏర్పడిన రాష్ట్రం – తెలంగాణ ( జూన్ 2, 2014న 29వ రాష్ట్రంగా ఏర్పడింది)
– దేశంలో మొత్తం జిల్లాలు – 683
– అత్యధిక జిల్లాలు ఉన్న రాష్ట్రం – ఉత్తరప్రదేశ్ (75)
– అత్యల్ప జిల్లాలు ఉన్న రాష్ట్రం – గోవా (2)
– అత్యధిక జిల్లాలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం – నేషనల్ క్యాపిటల్ టెరిటరి ఆఫ్ ఢిల్లీ (11)
– అత్యల్ప జిల్లాలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం – దాద్రా నగర్ & హవేలీ, చండీగఢ్, లక్షద్వీప్ (1)
– అతిపెద్ద జిల్లా – కచ్ (గుజరాత్)
– అతిచిన్న జిల్లా – మహే (పుదుచ్చేరి)
భూ సరిహద్దు దేశాలు
– భారతదేశ అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు -15,200 కి.మీ
– భారతదేశంలోని 17 రాష్ర్టాలతో 7 దేశాలు సరిహద్దుగా ఉన్నాయి. (బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్)
– భారత్‌తో పొడవైన భూ సరిహద్దు ఉన్న దేశం – బంగ్లాదేశ్ (4,096 కి.మీ)
– భారత్‌తో అతి తక్కువ భూ సరిహద్దు ఉన్న దేశం – ఆఫ్ఘనిస్తాన్ (80 కి.మీ)
– భారతదేశ ప్రాదేశిక సరిహద్దు పొడువు-12 నాటికల్ మైళ్లు
– భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలం పొడవు -300 మైళ్లు
– ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి అత్యధికంగా 8 రాష్ర్టాలతో సరిహద్దు ఉంది.(ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్)
– భారత్ మధ్య నుంచి 231/2 ఉత్తర అక్షాంశరేఖ (కర్కాటకరేఖ 8 రాష్ట్రాల మీదుగా పోతుంది. అవి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమబంగా, త్రిపుర, మిజోరాం)
– కర్కాటకరేఖ అత్యధిక దూరం పోయే రాష్ట్రం – మధ్యప్రదేశ్, అత్యల్ప దూరం – రాజస్థాన్
– భారతదేశం తూర్పు, పడమరలు 2,933 కి.మీ వెడల్పున, ఉత్తర దక్షిణాలుగా 3,214 కి.మీ విస్తరించి ఉంది.
– ఉత్తర- దక్షిణ, తూర్పు-పడమరల మధ్య 281 కి.మీ వ్యత్యాసం కలదు.
భారత్ ప్రామాణిక కాలం
– భారతదేశ ప్రామాణిక కాలం (ఐఎస్టీ), గ్రీనిచ్ కాలానికంటే ముందు + 5:30 గంటలు ముందు ఉంటుంది.
– రేఖాంశాల పరంగా తూర్పు- పడమరలుగా 30 డిగ్రీలు మాత్రమే విస్తరించి ఉంది. అందువలన పశ్చిమాన గుజరాత్‌లోని ద్వారకా కంటే తూర్పు అంచున ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌లో 2 గంటల ముందు సూర్యోదయం అవుతుంది.
– సూర్యుడు ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశాన్ని దాటడానికి 4 నిమిషాల సమయం పడుతుంది.
– భారతదేశ ప్రామాణిక కాలం 82 1/2 తూర్పు రేఖాంశం. ఇది 5 రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం మీదుగా వెళ్తుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలోని యానాం జిల్లా నుంచి పోతుంది.
– భారతదేశ ప్రామాణిక కాలం 82 1/2 తూర్పు రేఖాంశం.
– ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ పట్టణం మీదుగా, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి వెళ్తుంది.
విదేశాలతో పొడవైన సరిహద్దు గల రాష్ర్టాలు
– పాకిస్తాన్‌తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం – రాజస్థాన్
– ఆఫ్ఘనిస్తాన్‌తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం – జమ్ము
కశ్మీర్
– చైనాతో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం- జమ్ము కశ్మీర్
– నేపాల్‌తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం – బీహార్
– భూటాన్‌తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం – అసోం
– మయన్మార్‌తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం – అరుణాచల్‌ప్రదేశ్
– బంగ్లాదేశ్‌తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం – పశ్చిమబంగా
సరిహద్దురేఖలు
– మెక్‌మోహన్‌రేఖ – భారత్- చైనా
– రాడ్‌క్లిఫ్ రేఖ – భారత్- పాకిస్తాన్
– డ్యూరాండ్ రేఖ – భారత్- ఆఫ్ఘనిస్తాన్
– పాక్జలసంధి – భారత్ -శ్రీలంక
– వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) – భారత్, చైనాల మధ్య
ఉత్తరభాగం (జమ్ముకశ్మీర్‌లో) కలదు.
– భారత్,శ్రీలంక మధ్య – మన్నార్ సింధూశాఖ, పాంబన్ దీవులు, ఆడమ్స్బ్రిడ్జి ఉంది.
భారత సరిహద్దు ప్రాంతాలు
– ఉత్తరం – కిలిక్ ధావన్పాస్ (ఇందిరాకాల్), జమ్ము కశ్మీర్
– దక్షిణం – ఇందిరాపాయింట్ (గ్రేట్ నికోబార్)/ పిగ్మేలియన్ పాయింట్
– తూర్పు – పూర్వాంచల్ పర్వతాలు (అరుణాచల్‌ప్రదేశ్)
– పడమర – రాణా ఆఫ్ కచ్ (సర్‌క్రిక్), గుజరాత్
భూ పరివేష్టిత రాష్ర్టాలు
– 5 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత పాంత్రాలకు అంతర్జాతీయ సరిహద్దుగాని, తీరరేఖ గాని లేవు. కావున ఈ రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ర్టాలు అంటారు. ఇవి : మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హర్యానా, తెలంగాణ రాష్ర్టాలతో పాటు చండీగఢ్, ఢిల్లీ, దాద్రానగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.
పర్వతాలు
– నవీన పర్వతాలు (ప్రపంచంలో) – హిమాలయాలు
– పురాతన పర్వతాలు (ప్రపంచంలో) -ఆరావళి పర్వతాలు,
– దేశాన్ని ఉత్తర, దక్షిణాలుగా విడదీసే పర్వతాలు – వింధ్య, సాత్పూర పర్వతాలు
– దేశంలో ఎత్తైన శిఖరం – కాంచనజంగ (8,598 మీ), ఇది సిక్కిం, తూర్పు నేపాల్ మధ్య కలదు.
– ప్రపంచంలో ఎత్తైన శిఖరం – ఎవరెస్ట్ (8,848మీ), నేపాల్‌లో ఉంది.
– ప్రపంచంలో ఎత్తైన రెండో శిఖరం – K2. దీన్ని గాడ్విన్ ఆస్టిన్ అంటారు. ఇది కారకోరం పర్వత శ్రేణుల్లో ఉంది. ప్రస్తుతం ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఉంది. పాకిస్తాన్లో దీనిని చోఘోరీగా పిలుస్తారు. కానీ మనదేశంలో K2 శిఖరాన్ని మన అంతర్ భూభాగంగా పరిగణిస్తాం.
– దేశంలో ఎత్తైన శిఖరం – K2 (8,611మీ)
– పల్లపు ప్రాంతం – కుట్టనడ
– అత్యధిక ఉష్ణోగ్రత – రాజస్థాన్ (బార్మర్‌లో 500 సెల్సియస్, సెప్టెంబర్ 13, 1922లో నమోదైంది).
– అత్యల్ప ఉష్ణోగ్రత – జమ్ము కశ్మీర్‌లోని ద్రాస్ సెక్టార్లో – 490 సెల్సియస్ నమోదైంది.
సరస్సులు
– సాంబార్ – అతిపెద్దది
– ఊలార్- అతిపెద్ద మంచినీటి సరస్సు
– చిలుకా – అతిపెద్ద ఉప్పునీటి సరస్సు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు