ఆదేశిక సూత్రాల అంతిమ లక్ష్యం? ( ఇండియన్ పాలిటీ- గ్రూప్స్ ప్రత్యేకం )
1. ఆదేశిక సూత్రాల అమలు కోసం పార్లమెంట్ ప్రాథమిక హక్కుల్ని తగ్గించడం, సవరించడం చేయరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో స్పష్టం చేసింది?
1) గోలక్‌నాథ్ కేసు 2) ఉన్నికృష్ణన్ కేసు
3) చంపకమ్ దొరై కేసు
4) కేశవానంద భారతి కేసు
2. సుప్రీంకోర్టు ఇచ్చిన ఏ కేసుకు సంబంధించి పార్లమెంటు 24వ రాజ్యాంగ సవరణ చట్టం (1971), 25వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని (1971) చేసింది?
1) కేశవానంద భారతి కేసు 2) గోలక్‌నాథ్ కేసు
3) చంపకమ్ దొరై కేసు 4) మినర్వా మిల్స్ కేసు
3. 25వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పడిన నూతన ప్రకరణ ఏది?
1) ఆర్టికల్ 30-ఎ 2) ఆర్టికల్ 31-డి
3) ఆర్టికల్ 31-సి 4) ఆర్టికల్ 31
4. 25వ రాజ్యాంగ సవరణ చట్టంలో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఏవి ఉన్నాయి?
1) ఆర్టికల్ 14 2) ఆర్టికల్ 19
3) ఆర్టికల్ 31 4) పైవన్నీ
5. కిందివాటిలో సరైన దాన్ని ఎంపిక చేయండి?
ఎ. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రాథమిక హక్కుల పరిధిని తగ్గించి ఆదేశిక సూత్రాల పరిధిని విస్తృతం చేసింది
బి. మినర్వామిల్స్ కేసులో ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులు ఉన్నతమైనవిగా సుప్రీంకోర్టు పేర్కొంది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏవీకాదు
6. కింది వాటిలో సరైనదానిని గుర్తించండి.
ఎ. రాజ్యాంగ మౌళిక స్వరూపానికి భంగం కలుగకుండా పార్లమెంట్ ఆదేశిక సూత్రాల అమలుకోసం ప్రాథమిక హక్కుల్ని సవరించవచ్చు
బి. ఆర్టికల్ 39-బి, 39-సి కి లోబడి ఆర్టికల్ 14, 19 ఉండటాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
7. జతపర్చండి.
కేసులు ఏడాది
ఎ. గోలక్‌నాథ్ కేసు 1. 1967
బి. కేశవానంద భారతి కేసు 2. 1976
సి. మినర్వామిల్స్ కేసు 3. 1980
డి. 42వ రాజ్యాంగ సరవణ 4. 1973
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-4, సి-3, డి-2
3) ఎ-1, బి-3, సి-4, డి-2
4) ఎ-1, బి-2, సి-4, డి-3
8. కింది ప్రకరణల్లో గాంధేయ సూత్రాలకు సంబంధించినవి?
1) ఆర్టికల్ 40, 43, 43-బి, 46, 47, 48
2) ఆర్టికల్ 40, 43, 46, 47, 49
3) ఆర్టికల్ 40, 43, 43-ఎ, 45, 47, 48-ఎ
4) ఆర్టికల్ 40, 43, 47, 48, 49
9. కార్యనిర్వహణ శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయడానికి రాజ్యం కృషి చేయాలని చెప్పే ప్రకరణ ఏది?
1) ఆర్టికల్ 49 2) ఆర్టికల్ 50
3) ఆర్టికల్ 51 4) ఆర్టికల్ 52
10. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ. న్యాయవ్యవస్థను కార్యనిర్వహణ శాఖ నుంచి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 వేరు చేసింది
బి. ప్రస్తుతం కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విధులు మాత్రమే నిర్వహిస్తారు. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ విధులు నిర్వహించే హక్కు వారికి లేదు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏవీకాదు
11. రాజ్యంగంలో అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించడం అనే భావన ఏ ఆర్టికల్‌లో పేర్కొనబడింది?
1) ఆర్టికల్ 50 2) ఆర్టికల్ 44
3) ఆర్టికల్ 49 4) ఆర్టికల్ 51
12. రాజ్యాంగంలో రాజ్యం నిర్వచనం గురించి ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
1) ఆర్టికల్ 12 2) ఆర్టికల్ 13
3) ఆర్టికల్ 36 4) 1, 2
13. దేశ ప్రజలకు ఒకే రకమైన సివిల్ కోడ్‌ను అమలు చేయాలని ఏ కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది?
1) షాబానో కేసు 2) సరళాముద్గల్ కేసు
3) గోపాలన్ కేసు 4) ఉన్నికృష్ణన్ కేసు
14. దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం?
1) జమ్ముకశ్మీర్ 2) కేరళ 3) గోవా 4) నాగాలాండ్
15. రాజ్యాంగంలో నిర్దేశిక నియమాల గురించి పేర్కొన్న ప్రకరణలు?
1) ఆర్టికల్ 335 2) ఆర్టికల్ 350
3) ఆర్టికల్ 351 4) పైవన్నీ
16. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాన్ని ఉద్దేశించగా, ప్రాథమిక విధులు వ్యక్తిని ఉద్దేశించినవి అని పేర్కొన్నది ఎవరు?
1) బీఆర్ అంబేద్కర్ 2) ఇందిరాగాంధీ
3) చాగ్లా 4) ఫైలి
17. ఆర్టికల్ 48ని అనుసరించి గోవధ నిషేధాన్ని అమలుచేస్తున్న రాష్ర్టాలేవి?
1) మధ్యప్రదేశ్ 2) ఉత్తరప్రదేశ్
3) గుజరాత్ 4) పైవన్నీ
18. ఆదేశిక సూత్రాలకు సంబంధించి రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి?
1) 15 2) 14 3) 16 4) 17
19. ఆదేశిక సూత్రాల్లో ఇప్పటివరకు అమలుకు నోచుకోని అంశం?
1) ఉమ్మడి న్యాయ స్మృతి
2) మత్తు పానియాల నిషేధం
3) ఉచిత న్యాయ సహాయం అందించడం
4) గోవధ నిషేధం
20. ఇప్పటి వరకు ఆదేశిక సూత్రాల జాబితాలో నూతనంగా ఎన్ని అధికరణలు చేర్చారు?
1) 4 2) 5 3) 7 4) 6
21. సహకార సంఘాలను స్వచ్ఛందంగా ఏర్పాటు చేయడానికి, అవి స్వయం ప్రతిపత్తి కలిగినవిగా పనిచేయడానికి రాజ్యం కృషి చేయాల (ఆర్టికల్ 43-బి)ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాల జాబితాలో చేర్చారు?
1) 97వ రాజ్యాంగ సవరణ
2) 98వ రాజ్యాంగ సరవణ
3) 96వ రాజ్యాంగ సవరణ
4) 95వ రాజ్యాంగ సవరణ
22. జతపర్చండి.
రాజ్యాంగ నిపుణుడు పేర్కొన్న అంశం
ఎ. కేసీ వేర్ 1. నిర్దేశిక నియమాలు లక్ష్యాలు,
ఆశయాల తీర్మానాల
మ్యానిఫెస్టోగా పేర్కొన్నారు
బి. ఎల్ఎం సింఘ్వీ 2. నిర్దేశిక నియమాలు భారత
రాజ్యాంగం మూలతత్వం
సి. బీఆర్ అంబేద్కర్ 3. నిర్దేశిక నియమాలు సాంఘిక
న్యాయానికి దోహదపడుతాయి
డి. బీఎన్ రావ్ 4. నిర్దేశిక నియమాలు అధికార
బోధన లాంటివి
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-1, బి-2, సి-4, డి-3
23. ఆధునిక రాజ్యాంగాలకు నిర్దేశిక నియమాలు ఒక నూతన పోకడ లాంటివి అని ఎవరు పేర్కొన్నారు?
1) ఎంసీ సెతల్వాడ్ 2) బీఎన్ రావు
3) ఆస్టిన్ 4) బీఆర్ అంబేద్కర్
24. ఆదేశిక సూత్రాల అంతిమ లక్ష్యం?
1) వ్యక్తి స్వేచ్ఛను కాపాడటం
2) దేశంలో ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్య స్థాపన 3) దేశంలో ఆర్థిక, సామాజిక, సామ్యవాద స్థాపన 4) దేశం సర్వతోముఖాభివృద్ధికి సంబంధించింది
25. ఏ ప్రభుత్వం అయితే నిర్దేశ నియమాల అమలును విస్మరిస్తుందో ఆ ప్రభుత్వం రాబోయే సాధారణ ఎన్నికల్లో ప్రజలకు తప్పక సమాధానం ఇవ్వవలసి వస్తుంది అని నిర్దేశిక నియమాల ప్రాముఖ్యతను పేర్కొన్నది ఎవరు?
1) గాంధీ 2) రాజేంద్ర ప్రసాద్
3) ఆస్టిన్ 4) అంబేద్కర్
26. భారత రాజ్యాంగ పరిషత్ ఆదేశిక సూత్రాలను న్యాయ సమ్మతమైనవిగా ఎందుకు ప్రకటించలేదు?
ఎ. ఆదేశిక సూత్రాల అమలుకు కావలసిన ఆర్థిక వనరులు లేకపోవడం
బి. దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం, వెనుకబాటుతనం
సి. నిర్దేశిక నియమాల అమలుకు కావాల్సినంత పాలనానుభవం లేకపోవడం
డి. నిర్దేశిక నియమాల అమలుకు సరైన ప్రణాళిక విధానం లేకపోవడం
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) బి, డి
27. ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు మధ్య సంఘర్షణ ఏర్పడితే ప్రాథమిక హక్కులే చెల్లుబాటవుతాయని ఏ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది?
1) చంపకమ్ దొరైరాజన్ కేసు (1951)
2) కేశవానంద భారతి కేసు (1973)
3) బిజు మాథ్యుల్ కేసు 4) ఉన్నికృష్ణన్ కేసు
28. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య సాధనకు ఏ రాజ్యాంగ సవరణ చేశారు?
1) 76 2) 72 3) 73 4) 74
29. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలకు మధ్య వ్యత్యాసాలకు సంబంధించి కింది వాటిలో వాస్తవాంశాన్ని గుర్తించండి.
ఎ. ప్రాథమిక హక్కులు సకారత్మకమైనవి. కొన్ని అంశాలను చేయమని రాజ్యాన్ని ఆదేశిస్తాయి
బి. ఆదేశిక సూత్రాలు సకారాత్మకమైనవి. కొన్ని అంశాలను చేయడాన్ని రాజ్యం నిషేధిస్తుంది.
సి. ప్రాథమిక హక్కులు దేశంలో ప్రజాస్వామ్యానికి దోహదం చేస్తాయి
డి. ఆదేశిక సూత్రాలు రాజకీయ ప్రజాస్వామ్యానికి దోహదం చేస్తాయి
1) బి, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) సి, డి
30. సరైన దాన్ని గుర్తించండి.
ఎ. నిర్దేశిక నియమాలు అమలు చేయడానికి ప్రభుత్వాలు ప్రత్యేకంగా శాసనాలు చేయాలి
బి. ప్రాథమిక హక్కులు అమలు చేయడానికి ఎలాంటి శాసనాలు చేయనవసరం లేదు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏవీకాదు
31. సరైన దాన్ని గుర్తించండి.
ఎ. నిర్దేశిక నియమాలు చట్టబద్ధత కలిగి ఉంటాయి
బి. ప్రాథమిక హక్కులు నైతిక, రాజకీయ బద్ధత కలిగి ఉన్నాయి
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏవీకాదు
32. సరైన వాటిని గుర్తించండి.
ఎ. నిర్దేశిక నియమాలు పౌరుల సంక్షేమానికి తోడ్పడుతాయి. అందువల్ల ఇవి వ్యక్తిగతమైనవి
బి. ప్రాథమిక హక్కులు సమాజ సంక్షేమం కోసం తోడ్పడుతాయి. కావున ఇవి సామాజిక పరమైనవి.
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏవీకాదు
33. సమానమైన పనికి సమాన వేతనం అనేది దేనికి సంబంధించింది?
1) ప్రాథమిక హక్కులు 2) ప్రాథమిక విధులు
3) ఆదేశిక సూత్రాలు 4) చట్టబద్ధమైన హక్కు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు