‘భూగోళంలో’ మార్కులు సాధించడమెలా?
ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
శాంతిభద్రతలు అనేవి రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన విషయం. కాబట్టి పరిపాలనా అవసరాల నిమిత్తం కచ్చితంగా పోలీసు నియామకాల అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.
గత ఎస్ఐ ఉద్యోగ ప్రకటనల ఆధారంగా పరిశీలిస్తే నాలుగో పేపర్లో జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి అడిగే 5 అంశాల్లో ఒకటి ఇండియన్ జాగ్రఫీ ఈ విషయానికి సంబంధించిన పరిధిని తెలుసుకోవడానికంటే ముందు గత ప్రశ్నపత్రాల్లోని (2008, 2012) కొన్ని ప్రశ్నల తీరును చూద్దాం. ముఖ్యంగా ప్రశ్నలు అభ్యర్థుల జ్ఞానాన్ని, అవగాహనను, నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా అడిగారు. ఉదాహరణ..
జ్ఞానం
1) ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏది ? (2008)
2) ఆరావళి పర్వతాల్లో ఎత్తయిన శిఖరం ఏది ? (2008)
3) సింగూరు ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది ? (2008)
4) మయూరాక్షి జలవిద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో ఉంది ? (2012)
5) ఘనా పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ? (2012)
అవగాహన
1) కింది వానిలో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న నగరం ఏది? (2008)
2) జనసాంద్రత ఆధారంగా కింది రాష్ర్టాలను ఆరోహణ క్రమంలో అమర్చండి ? (2012)
3) కింది జతల్ని పరిశీలించండి ?
ఆనకట్ట – నది
1. కిశావు -అలక్‌నంద
2. కోటేశ్వర్- భగీరథి
3. నంగల్- సట్లేజ్
పైన ఇవ్వబడిన జతల్లో సరిగ్గా జతపర్చినది? (2012)
1) 1 మాత్రమే 2) 1,3 మాత్రమే
2) 2,3 4)1,2,3
నైపుణ్యం
1) ఉత్తర దిక్కునకు ప్రవహించే నది ఏది ?
2) కింది వానిలో ఏ రెండు నదులు దాదాపు ఒకే ప్రాంతం వద్ద జన్మిస్తాయి ?
3) సముద్ర మార్గాల ద్వారా కింది నగరాల్లో పోర్ట్‌బ్లెయిర్‌కు సమీపంగా కలదు.
ఈ విధంగా అభ్యర్థుల జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలను పరీక్షిస్తున్నారు. ఇక 2008 పేపర్‌కు, 2012 పేపర్‌కు మధ్య తేడాలున్నాయి. 2008లో ప్రశ్న దిగువన 5 ఐచ్ఛికాలను (options) ఇచ్చేవారు. 2012లో నాలుగు ఐచ్ఛికాలకు తగ్గించారు. 2008లో ఎక్కువగా జ్ఞానాన్ని పరిశీలించారు, పోటీ నిష్పత్తి పెంచడం ద్వారా 2012లో అవగాహనకు సంబంధించిన ప్రశ్నల సంఖ్యను పెంచారు. అందువల్ల ప్రశ్నల్లో జతపర్చడాలు ఇవ్వడం, ఐచ్ఛికాలను ఇచ్చి వాటిలో తప్పుల్ని గుర్తించడం, ఐచ్ఛికాల్లో ఐచ్ఛికాలు ఇవ్వడం (సివిల్స్ ప్రశ్నపత్రం మాదిరి) వంటి ప్రశ్నలకు ప్రాధాన్యతను పెంచారు.
ఇండియన్ జాగ్రఫీ ఎలా చదవాలి..
ఈ విషయాన్ని చదివే విద్యార్థులు/అభ్యర్థులు రెండు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి. అవి…
1) ఏమి చదవాలి ?
2) ఎలా చదవాలి ?
ఏమి చదవాలి అనే ప్రశ్నకు సమాధానంగా భారతదేశ పర్యావరణం, పరిశ్రమలు, జనాభా, రవాణా, పంటలు… ఇలా అన్ని భౌగోళిక అంశాల్ని చదవాలి. దీని కోసం ఈ భాగం చివరిలో పట్టిక ఇచ్చాం…
ఎలా చదవాలి అన్నదే అభ్యర్థుల ప్రిపరేషన్లో ముఖ్యమైన ప్రశ్న? దీనికి అభ్యర్థులు కొన్ని సూచనలు పాటించాలి. అవి…
1. శుద్ధ జాగ్రఫీని చదవాలి
G=Geography
P=Polity
E=Economy
CA=Current affairs
ST=Science &
technology
2) జాగ్రఫీని మిగతా సబ్జెక్టులతో సమన్వయ పరుస్తూ చదవాలి. అంటే పొలిటికల్ జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ…. వాటికి సమన్వయకర్తగా జాగ్రఫీని చదవాలి. వాటికి సంబంధించిన ప్రశ్నలు చూస్తే…
1) భారతదేశంలో 22వ రాష్ట్రంగా ఏర్పడినది ? (2008) (పొలిటికల్ జాగ్రఫీ)
2) పరిశ్రమలు అవి నెలకొల్పిన ప్రాంతాలను జతపరచడం (2002) (ఎకనామికల్ జాగ్రఫీ)
3) భారతదేశంలో అతిపెద్ద కుటీర పరిశ్రమ ? (2002)
4) బందవ్‌గఢ్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది ? (2008) (ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ)
జాగ్రఫీని ముఖ్యంగా వర్తమాన అంశాలు (Current-affairs) సమన్వయ పరుస్తూ చదవాలి.
1) ఏ నది పై ఆనకట్టలు ఎక్కువగా కడుతు న్నారు? (2008)
2) భారతదేశ అటవీ సర్వే నివేదిక ప్రకారం (2009) దేశంలో అటవీ ప్రాంతం శాతం ? (2008) (పరీక్ష 2011లో నిర్వహించారు)
3) ఇప్పటి వరకు రైల్వే లైన్లు లేని రాష్ర్టాలు. (2012)
– నైపుణ్యాధారిత ప్రశ్నలకు అభ్యర్థులు ముఖ్యంగా అట్లాస్‌ను ఆధారంగా చేసుకొని జాగ్రఫీని చదవాలి.
వాటికి సంబంధించిన ప్రశ్నలు….
1) ఉత్తర దిక్కున ప్రవహించే నది ?
2) భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న నగరం ఏది ?
3) కర్కటరేఖ ఎన్ని రాష్ర్టాల గుండా పోతుంది.
– సివిల్స్, గ్రూప్-I, IIలకు ప్రిపేరయ్యే విధ్యార్థులు జాగ్రఫీని విస్తృతంగా చదవాలి. ముఖ్యంగా ప్రాథమిక భావనపై పట్టు సాధించాలి. కానీ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న వారి జాగ్రఫీ సిలబస్ సంక్షిప్తమైనది. కావున ఈ సిలబస్‌లోనే ఉన్న పాఠ్యాంశాలను లోతుగా చదివి అవగాహన చేసుకోవాలి.
– చదివిన అంశాల్ని నోట్‌బుక్‌పై రాయాలి. వీలైనన్ని టెస్ట్‌పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. లోపాల్ని గమనించాలి. రిపీటెడ్‌గా రివిజన్ చేస్తూ కచ్చితత్వాన్ని పెంచుకోవాలి.
గత ప్రశ్నపత్రాల్లో ఏయే అంశాల్లో ఎన్ని ప్రశ్నలు అడిగారో చూద్దాం..
ఈ పట్టిక దాదాపుగా 2008, 2012ల్లో అన్ని ప్రశ్నలను పరిశీలించి తర్వాత తయారు చేయడమైంది. అనగా భారతదేశ భూగోళానికి సంబంధించిన ప్రశ్నల వ్యాప్తి 30 నుంచి 45 వరకు గలదు. అభ్యర్థులు ముఖ్యంగా నదీ వ్యవస్థ, పర్యావరణం, నైసర్గిక స్వరూపం వంటి అంశాలను క్షుణ్ణంగా చదవాలి. వీటితో పాటు కొత్త నోటిఫికేషన్లో తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి 10 నుంచి 20 శాతం(4 నుంచి 5 ప్రశ్నలు) అడిగే అవకాశం ఉంది. విపత్తు దాని నిర్వహణను కూడా అభ్యర్థులు చదవాలి.
కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు అభ్యర్థి ఉద్యోగి అవ్వాలి అంటే ఒక ఆయుధాన్ని కచ్చితంగా కలిగి ఉండాలి. అదిశ్రమ, తెలివితేటలకు ఫలితం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ కష్టపడితే ఫలితం తప్పనిసరిగా వస్తుంది.
చదవాల్సిన పుస్తకాలు
1) 6 నుంచి 10 వ తరగతి వరకు గల రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక శాస్త్రం
2) తెలుగు అకాడమీ వారి భారతదేశ భూగోళం
3) సద్గుణరావు, సుగుణరావు, ఉప్పలయ్య, ఓబులేష్, వీ గురజాల….వీరిలో ఎవరిదైనా ఒక స్టడీ మెటీరియల్
ఇంగ్లీషు మీడియం అభ్యర్థులు Periyar, spectrum Tata mcgraw Hills, Geography of India Books లేదా Savinder singh, Khullae వంటి ప్రముఖుల పుస్తకాలు చదవాలి.
గతంలో వచ్చిన ప్రశ్నలు
1. కబినీ ఆనకట్ట ఎక్కడ ఉంది ? (2)
1) కేరళ 2) కర్ణాటక 3) అసోం 4) ఒడిషా
2. ఉత్తరం దిక్కున ప్రవహించే నది ఏది ? (3)
1) కావేరి 2) నర్మద 3) చంబల్ 4) బ్రహ్మపుత్ర
3. మూడు వైపుల అంతర్జాతీయ సరిహద్దులు గల రాష్ర్టాలు ఏవి ? (2)
1) జమ్ము కశ్మీర్, పంజాబ్, హర్యానా
2) జమ్ము కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం
3) పంజాబ్, రాజస్థాన్, హర్యానా
4) హర్యానా, పశ్చిమబెంగాల్, గుజరాత్
4. కృష్ణానది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది ? (4)
1) అంతర్వేది 2) యానాం
3) మచిలీపట్నం 4) హంసలదీవి
5. భారతదేశం, శ్రీలంకల మధ్య ఉన్న ద్వీపం ఏది ? (3)
1) ఎలిఫెంటా 2) నికోబార్
3) రామేశ్వరం 4) సల్సెట్టె
6. గోదావరి తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది? (4)
1) బస్తర్ 2) పోలవరం 3) నిర్మల్ 4) బాసర
7. భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్) ఎక్కడ కలదు ? (3)
1)విశాఖపట్నం 2) ఒంగోలు
3)రామచంద్రాపురం(హైదరాబాద్)
4) రామచంద్రాపురం(తూర్పు గోదావరి)
8. జోగ్ జలపాతం ఏ నదిపై ఉన్నది (4)
1) సబర్మతి నది 2) కృష్ణ 3) కావేరి 4) శరావతి
9. కింది నదులు పొడవును బట్టి ఆరోహణ క్రమంలో ఏది సరైన క్రమం ?(2)
1) గోదావరి, మహానది, నర్మదా, తపతి
2) గోదావరి, నర్మదా, మహానది, తపతి
3) నర్మదా, గోదావరి, తపతి, మహానది
4) నర్మదా, తపతి, గోదావరి, మహానది
10. ట్రోపో ఆవరణంపై ఉన్న వాతావరణ పొర ?(4)
1) శిలావరణం 2) ఊర్ధ ఆవరణం
3) ఐనో వరణం 4) స్ట్రాటో ఆవరణం
11. కింది గ్రహాల్లో సూర్యుని నుంచి వాటి దూరం సరియైన అనుక్రమం ఎగువ శ్రేణిలో ? (3)
1) బుధుడు,. శుక్రుడు, అంగారకుడు, శని, బృహస్పతి
2) శుక్రుడు, బుధుడు, అంగారకుడు, శని, బృహస్పతి
3) బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని
4) శుక్రుడు, బుధుడు, బృహస్పతి, అంగారకుడు, శని
12. అండమాన్ నికోబార్ దీవులపై ప్రాదేశిక అధికార పరిధి
కింది వానిలో ఏ అత్యున్నత న్యాయస్థానానికి కలదు ? (3)
1) ఆంధ్రప్రదేశ్ 2) తమిళనాడు
3) కోల్‌కతా 4) ఒడిషా
13. కింది గుహల్లో ఏది మహారాష్ట్రలో లేదు ? (3)
1) అజంతా గుహలు 2) ఎలిఫెంటా గుహలు
3) బెలుం గుహలు 4) ఎల్లోరా గుహలు
14. కోహిమా ఏ రాష్ర్టానికి రాజధాని ? (3)
1) మిజోరమ్ 2) మణిపూర్
3) నాగాలాండ్ 4) మేఘాలయా
15. లోకాయుక్తను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ? (1)
1) ఒడిశా 2) రాజస్థాన్
3) మధ్యప్రదేశ్ 4) ఆంధ్రప్రదేశ్
16. భూమి అతిలోపలి పొరను ఏవిధంగా పిలుస్తారు ? (4)
1) శిలావరణం 2) మెసో వరణం
3) ఎస్తెనో వరణం 4) భారావరణం
17. కావేరీ జల వివాదంలో ఉన్న ముఖ్య రాష్ర్టాలు ? (1)
1) మహారాష్ట్ర-కర్ణాటక 2) తమిళనాడు-కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్-కర్ణాటక 4) కేరళ-కర్ణాటక
18. అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ఎక్కడ ఉంది ? (1)
1) శ్రీహరికోట 2) తుంబ
3) కాకినాడ 4) విశాఖపట్నం
19. గోండులు ఎక్కువగా ఉన్న జిల్లా ? (2)
1)నల్లగొండ 2) ఆదిలాబాద్
3) నిజామాబాద్ 4) వరంగల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు