Hard work – got job | పట్టుబట్టు జాబ్ కొట్టు
నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. సీఎం అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత ఒక్కో అడుగు పడుతూ ఇప్పటికే సుమారు 18 వేల జాబ్స్‌కు నోటిఫికేషన్స్ వచ్చాయి. దీంతోపాటు టీచర్ పోస్టుల ఎంపికలో మొదటి అంకం టెట్ పరీక్ష తేదీకి మరో నెల మాత్రమే గడువుంది. ఈ సమయంలో అభ్యర్థుల ఆలోచనలు ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనే దానిపై నిపుణుల సూచనలు, సలహాలు సంక్షిప్తంగా….
దృష్టంతా లక్ష్యంపైనే !
# ఏదైనా సాధించాలంటే మనసులో, తనువులో మొత్తం దాని గురించే ఆలోచన ఉండాలి. తదైక దృష్టితో లక్ష్యాన్ని చేరుకోవడానికి సరైన ప్రణాళిక వేసుకుని అహర్నిశలు శ్రమించాలి. విజయం ఎప్పుడూ శ్రమించేవారినే వరిస్తుంది. కఠోర శ్రమనే విజయానికి దగ్గరి మార్గం అని మరిచిపోవద్దు. ప్రిపరేషన్లో ఎప్పుడైనా ఆటంకాలు, పీఠభూమి దశ అంటే నిర్లిప్తత ఆవహిస్తే వెంటనే మనకు మనమే స్వయం ప్రేరణ చేసుకోవాలి. అంటే సెల్ఫ్ మోటివేషన్. అది సరిపోకపోతే సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలి. విజేతల కథనాలను చదివి, యూట్యూబ్‌లో విజేతల ఇంటర్వ్యూ వీడియోలను చూసి ప్రేరణ పొందాలి.
# కచ్చితమైన సమయపాలన అంటే టైంటేబుల్ పెట్టుకుని దాన్ని సరిగ్గా అమలు చేయాలి. నిర్ణయించుకున్న సమయానికి ప్రణాళికలో అనుకున్న ప్రకారం సిలబస్ లేదా అంశాలను చదవడం పూర్తి చేయాలి. ఒకసారి ఒక అంశం చదివిన తర్వాత దానికి సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తే మనం ఆ అంశంపై సాధించిన పట్టు ఎంతనేది తెలిసిపోతుంది. పూర్తి స్థాయిలో పట్టు రాకుంటే తిరిగి దాన్ని చదివి పట్టు సాధించాలి. ఇలా ప్రతి అంశాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి. సొంతంగా నోట్స్ ప్రిపరేషన చేసుకోవాలి. వీలైనన్ని ఎక్కువగా ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయాలి. ప్రాక్టీస్ పైనే మన విజయం ఆధారపడి ఉంటుంది.
ఇవి గుర్తుంచుకోండి
# లక్ష్యం నిర్ణయించుకుని ప్రిపరేషన్ ప్రారంభించిన తర్వాత అనేక ఆటంకాలు వస్తుంటాయి. కానీ వాటిని పట్టించుకోవద్దు. వాటిని రెట్టింపు పట్టుదలతో అధిగమించాలి. సినిమాలు, టీవీలు, కాలక్షేపాలు, సోషల్‌మీడియాలు, వాట్సాప్, ఎఫ్బీ, ఫంక్షన్లు ఇలా అన్నింటినీ పక్కన పెట్టాల్సి. ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులు ఆయా సందర్భాల్లో కొంత ఒత్తిడి తేవచ్చు. ఒక్కరోజే కదా ఫంక్షన్‌కు పోదాం, సినిమాకు పోదాం అని అనవచ్చు. కానీ కరిగిపోయిన కాలం తిరిగి రాదనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి.
# అనుకున్న లక్ష్యం చేరుకుంటే ఇప్పుడు ఇబ్బంది పెట్టిన వారు, మీకు దూరంగా ఉన్నవారు సైతం మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఏది సాధించకుండా ఉంటే ఎవరూ గుర్తించరు. సహాయం చేయరు. చిన్నచూపు చూస్తారు. మనకంటూ సమాజంలో ఒక గుర్తింపు రావాలంటే హోదా చాలా ముఖ్యం అనే విషయాన్ని పదేపదే గుర్తుకు తెచ్చుకోండి.
# పలు మాధ్యమాల్లో వచ్చే కొన్ని పుకార్లను నమ్మవద్దు. ఇప్పటికే గ్రూప్-1, పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. మిగిలిన నోటిఫికేషన్స్ కూడా క్రమక్రమంగా విడుదలవుతాయి. నిర్ణయించుకున్న లక్ష్యం కోసం ప్రిపరేషన్ నిరంతరం కొనసాగించండి. లక్ష్యాన్ని చేరుకోండి.
# కఠోర శ్రమే వజ్రాయుధం. పరీక్షలో విజయం సొంతం కావాలంటే దగ్గరి దారులేవి ఉండవు. కేవలం హార్డ్‌వర్క్ మాత్రమే దగ్గరి దారి. దాన్ని నమ్ముకుని శ్రమిస్తే విజయం వరిస్తుంది.
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం