An inscription by Annaladevi, the wife of Rudradeva | రుద్రదేవుని భార్య అన్నాలదేవి వేసిన శాసనం?
కాకతీయులు
1. కాకతీయుల గురించి మొదటగా ప్రస్తావన చేసిన తూర్పు చాళుక్యరాజు దానార్ణవుని శాసనం?
1) కలుచుంబూరు 2) మలియంపూడి
3) సాతలూరు 4) మాగల్లు
2. కాకతీయ సామ్రాజ్యం ఏ సంవత్సరంలో అంతరించింది?
1) 1123 2) 1223
3) 1323 4) 1423
3. ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార సంస్కృత గ్రంథాన్ని ఎవరు రచించారు?
1) రుద్రదేవుడు 2) విద్యానాథుడు
3) కవి చక్రవర్తి 4) ఏకామ్రనాథుడు
4. గణపతి దేవుని ఆస్థాన గజ సాహినిగా ఎవరు నియమితులయ్యారు?
1) విద్యానాథుడు 2) జాయపసేనాని
3) జైన అప్పయార్యుడు
4) కవిచక్రవర్తి
5. మోటుపల్లిలో వర్తకుల కోసం అభయ శాసనం వేయించింది?
1) మొదటి బేతరాజు 2) రుద్రదేవుడు
3) మొదటి ప్రోలరాజు
4) గణపతి దేవుడు
6. ఓరుగల్లు సమీపంలోని కేసరి సముద్రం అనే చెరువును నిర్మించింది?
1) మొదటి బేతరాజు 2) మహాదేవుడు
3) మొదటి ప్రోలరాజు 4) రుద్రదేవుడు
7. ప్రాడ్వివాక్కులు అంటే ఎవరు?
1) ప్రత్యేక న్యాయాధికారులు
2) సుంకం వసూలు చేసేవారు
3) గ్రామాల రక్షకులు
4) రాజుల అంగరక్షకులు
8. తన విజయాలకు చిహ్నంగా శ్రీశైలంలో విజయస్తంభాన్ని నాటిన కాకతీయ పాలకుడు?
1) రెండో ప్రోలరాజు 2) రుద్రదేవుడు
3) గణపతి దేవుడు 4) గరుడ బేతరాజు
9. కాకతీయుల ప్రసిద్ధ రేవు పట్టణం మోటుపల్లికి మరో పేరు?
1) ఓరుగల్లు 2) రుద్రేశ్వరం 3)దేశీయక్కొండ పట్టణం 4) హన్మకొండ
10) ఓరుగల్లు నగర వర్ణన ఏ గ్రంథంలో వివరించి ఉంది?
1) గీతరత్నావళి 2) క్రీడాభిరామం
3) వృషాధిప శతకం 4) సర్వేశ్వర శతకం
11. తెలుగులో గణితసార సంగ్రహం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
1) మల్లికార్జున పండితారాధ్యుడు
2) పావులూరి మల్లన
3) విద్యానాథుడు
4) వినుకొండ వల్లభామాత్యుడు
12. గణాచారి పన్ను ఎవరిపై వేసేవారు?
1) వేశ్యలు 2) రైతులపై వేసే పన్ను
3) వ్యాపారం చేసేవారిపై
4) బానిసలపై వేసే పన్ను
13. శైవ మతాన్ని తన సాహిత్యం ద్వారా ప్రచారం చేసింది ఎవరు?
1) రామేశ్వర పండితుడు
2) మల్లికార్జున పండితుడు
3) విశ్వేశ్వర పండితుడు
4) బసవేశ్వరుడు
14. విశ్వేశ్వర శివాచార్యుడికి మందడం గ్రామాన్ని దానం చేసిన కాకతీయ పాలకుడు?
1) రుద్రదేవుడు 2) రుద్రమదేవి
3) రెండో ప్రతాపరుద్రుడు
4) గణపతి దేవుడు
15. రెండో ప్రతాపరుద్రుని ఏ నర్తకి ఓరుగల్లులో చిత్రకారులకు చిత్రశాలను నిర్మించింది?
1) కుందాంబిక 2) మాచలదేవి
3) సూరాంబిక 4) మైలాంబ
16. రుద్రదేవుని భార్య అన్నాలదేవి వేసిన శాసనం?
1) ద్రాక్షారామ శాసనం
2) ధర్మసాగర శాసనం
3) చేబ్రోలు శాసనం
4) అనుమకొండ శాసనం
17. కేతన రచించిన మొట్టమొదటి ధర్మశాస్త్ర గ్రంథం?
1) దశకుమార చరిత్ర
2) విజ్ఞానేశ్వరీయం
3) ఆంధ్రభాషా సంఘం
4) కుమార సంభవం
18. శనిగరం శాసనాన్ని క్రీ.శ. 1051లో వేసిన కాకతీయ పాలకుడు?
1) మొదటి బేతరాజు 2) దుర్గరాజు
3) రెండో బేతరాజు
4) మొదటి ప్రోలరాజు
19. జైత్రపాలుడి నుంచి గణపతి దేవుడిని విడిపించి తెలుగు రాయస్థాపనాచార్య బిరుదు పొందినది?
1) నింగన 2) రేచర్ల రుద్రుడు
3) జాయపసేనాని
4) ప్రసాదిత్య నాయకుడు
20. శైవగోళకీ మత శాఖకు ముఖ్య ఆచార్యుడు?
1) బసవేశ్వరుడు
2) మల్లికార్జున పండితుడు
3) విశ్వేశ్వర శంభు 4) శ్రీపతి పండితుడు
21. కాకతీయుల కాలంలో పేరుగాంచిన నృత్యం?
1) రాసకం 2) చిందు
3) కందుకం 4) పేరిణి
22. ఏ గ్రామంలో సంగీత విద్వాంసులు, గాయకులు ఉన్నట్లు మల్కాపురం శాసనం తెలుపుతుంది?
1) మందడం 2) కాంద్రకోట
3) ఓరుగల్లు 4) అనుమకొండ
23. కాకతీయుల కాలం నాటి గద్వాణం అంటే ఏమిటి?
1) పన్ను 2) వెండి నాణెం
3) బంగారు నాణెం 4) రాగి నాణెం
24. కాకతీయుల రాజ చిహ్నం?
1) సింహం 2) వరాహం
3) వృషభం 4) గరుడ
25. జక్కుల పురంద్రీ అనే జానపద కళారూపాన్ని పేర్కొన్న గ్రంథం?
1) శివతత్వ సారం
2) ఆంధ్రభాషా భూషణం
3) క్రీడాభిరామం
4) నీతిశాస్త్ర ముక్తావళి
Answers
1-4, 2-3, 3-2, 4-2, 5-4,
6-3, 7-1, 8-1, 9-3, 10-2, 11-2, 12-1, 13-2, 14-2, 15-2, 16-1, 17-2, 18-1, 19-2, 20-3, 21-4, 22-1, 23-3, 24-2, 25-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?