బోధనోద్దేశాలు – విలువలు

బోధనా కార్యక్రమంలో ముఖ్యంగా ఎదురయ్యే ప్రశ్నలు
1. ఏమి బోధించాలి? -విద్యా ప్రణాళిక
2. ఎందుకు బోధించాలి? -లక్ష్యాలను సాధించడానికి
3. ఎలా బోధించాలి? -బోధనా పద్ధతులు
విద్యా విధానం ముఖ్య ఉద్దేశం
1) విద్యార్థుల్లో వివిధ శక్తి సామర్థ్యాలను పెంపొందించడం
2) విద్యార్థి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాభివృద్ధికి తోడ్పడటం
విద్య విలువలు
- విద్యార్థుల్లో అభివృద్ధి పర్చగల శక్తి సామర్థ్యాలనే విద్యా విలువలు అంటారు.
- విద్యా విలువలు చాలా విశాలమైనవి.
- విద్యావేత్తలు, రాజకీయ, సామాజిక, ఆర్థిక విధానాలను బట్టి విలువలను నిర్ణయిస్తారు.
- ఏ గుణం అయితే ఒక వ్యక్తికి లేదా వస్తువుకి ప్రాధాన్యం, గౌరవం, ఉపయోగం కలిగిస్తుందో అలాంటి గుణాన్ని విలువ అంటారు.
- తాత్విక ధోరణిలో చూస్తే విలువ అనేది ఆలోచన.
- విలువ అనేది మానవ ప్రవర్తనలో వచ్చే మార్పు.
- ఏది ప్రధానం, ఏది అప్రధానం అన్న వాటి గురించిన భావాలే విలువలుగా చెప్పొచ్చు.
- విలువలనేవి యోగ్యతను నిర్ధారించడానికి వినియోగించే సూత్రాలు, ప్రమాణాలు.
- ఒక వ్యక్తికి లేదా వస్తువుకి ప్రాధాన్యాన్ని, గౌరవాన్ని, ఉపయోగాన్ని కలిగించే గుణాన్ని విలువ అంటారు.
నిర్వచనాలు
- బాండ్: ఒక వస్తువు, సన్నివేశం, భావం, కృత్యం, యోగ్యత, మంచితనాన్ని గురించిన దృఢమైన నమ్మకాన్ని విలువ అంటారు.
- కానే: ఈ సమాజంలోని ఎక్కువ మంది ఆచరించే ఆదర్శాలు, నమ్మకాలు, నియమాలనే విలువలు అంటారు.
- కన్నింగ్ హామ్: విద్యా లక్ష్యాలే విద్యా విలువలు
- జేఎస్ బ్రుబేచర్: వ్యక్తి లక్ష్యాలే అతని విద్యా విలువలు
- జాన్ డ్యూయీ: దేన్నయితే ప్రేమగా చూస్తామో, ఏదైతే పొందాలనుకుంటామో, దేన్నయితే అభిమానిస్తామో, పొగుడుతామో, ఊహిస్తామో, అభినందిస్తామో దానిని విలువ అంటారు.
- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్: ఓటమి ఎరుగని వ్యక్తికన్నా విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి మిన్న
- కొఠారి కమిషన్: నేడు అనేక రాజకీయ, సామాజిక, శాస్త్రీయ, ఆర్థిక సమస్యల పరిష్కారానికి విలువల విద్య ఎంతో అవసరం ఉందని తెలిపింది.
సాంఘిక శాస్త్ర బోధనా ఆశయాలు
- సామాజిక విషయాల గురించి ప్రాథమిక భావనలు అందించడం.
- విద్యార్థుల్లో సామాజిక సమర్థతను పెంపొందించడం.
- విద్యార్థుల్లో పౌరసత్వ విలువలను పెంపొందించడం.
- ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడం.
- భారతీయ సంస్కృతిని ప్రశంసించడం.
- పర్యావరణంతో పరిచయం కలిగించడం.
- సాంఘిక, ఆర్థిక అంశాల పట్ల అవగాహన కలిగించడం.
- జాతీయ సమైక్యతను పెంపొందించడం.
- అంతర్జాతీయ అవగాహనను పెంపొందించడం.
- మానవ సంబంధాలపై అవగాహన కలిగించడం.
విలువల లక్షణాలు
1. అమూర్తమైనవి
2. అంతర్లీనమైనవి
3. సాపేక్షమైనవి
4. ఆపాదింపబడేవి
5. నమ్యత కలిగినవి
అమూర్త గమ్యాలనే విలువలు అంటారు.
ఉద్దేశాలు – విలువల మధ్య తేడాలు
ఉద్దేశం / ఆశయం
1. సాంఘిక శాస్ర్తాన్ని ప్రవేశపెట్టడంలో ఉన్న ఆవశ్యకతను తెలియజేస్తాయి.
2. ఆశయాలను ఆ దేశ తత్వశాస్త్రం ప్రకారం నిర్దేశిస్తారు.
3. ఆశయాలు సాధించవలసిన గమ్యాన్ని సూచిస్తాయి.
విలువ
1. సాంఘిక శాస్త్ర బోధన తర్వాత వచ్చే ఫలితాలే విలువలు.
2. విలువలు వాస్తవాలను ప్రతిబింబిస్తాయి.
3. విలువలు ఆశించిన ఫలితాలను సూచిస్తాయి
RELATED ARTICLES
-
SSC CHSL Preparation 2023 | ఉమ్మడిగా చదివితే.. ఉద్యోగం మీదే!
-
Scholarship 2023 | Scholarships for students
-
Scholarship 2023 | Scholarships for students
-
TS ITI ADMISSIONS | తెలంగాణ ఐటీఐ అడ్మిషన్ 2023
-
Nipuna Career Opportunities | Scholarships
-
TS EAMCET 2023 | నెలాఖరులో ఎంసెట్ రిజల్ట్.. ఇవాళ ప్రైమరీ కీ రిలీజ్
Latest Updates
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
Indian Polity | జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది?
Telangana Government Schemes | ప్రజల పాలిట వరాలు.. అభివృద్ధికి ప్రతీకలు
TS EAMCET | టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Current Affairs | దేశంలో అతిపెద్ద అక్వేరియం ఏ నగరంలో రానుంది?
MSTC Recruitment | ఎంఎస్టీసీ లిమిటెడ్‌లో 52 మేనేజర్ పోస్టులు
Telangana Current Affairs | షీ భరోసా సైబర్ ల్యాబ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
GEOGRAPHY | పర్వతాల ఊయలగా వేటిని పేర్కొంటారు?
ISRO Recruitment | ఇస్రోలో 303 సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులు
Indian Navy MR Recruitment 2023 | ఇండియన్ నేవీలో 100 అగ్నివీర్ పోస్టులు