Telugu Literary Processes – Yakshaganam | తెలుగు సాహిత్య ప్రక్రియలు – యక్షగానం
యక్షగానమంటే యక్షుల పాటలని అర్థం. జక్కుల స్త్రీలు ‘యక్ష’ వేషం వేసి నృత్య ప్రదర్శన చేసేవారని క్రీడాభిరామం ద్వారా తెలుస్తుంది. యక్షగానం కేవలం గాన ప్రధానమైనదే కాక ప్రదర్శనలో నృత్తనృత్యా త్మకమైనదిగా, రూపకయుక్తమైన రచనగా పరిణమించి ఒక సాహిత్య ప్రక్రియగా వెలిసింది. యక్షగానం మొదట గేయరూపంలో ఉండి తరువాత సంవాదరూపాన్ని దాల్చి క్రమంగా వీధినాటకంగా పరిణమించింది.
యక్షగానం 15వ శతాబ్ది నాటికి ఒక సాహిత్య ప్రక్రియగా స్థిరపడింది. తెలుగు సాహిత్యంలో మొట్టమొదట యక్షుల ప్రస్తావన వారి ఆటపాటల ప్రసక్తి పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరివూతలోని పర్వత ప్రకరణంలో కనిపిస్తుంది. ఆ తరువాత శ్రీనాథుడు రచించిన భీమఖండంలో కీర్తింతుద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి అంటూ యక్షగాన ప్రసక్తి కనిపిస్తుంది.
-ప్రోలుగంటి చెన్నశౌరి రచించిన సౌభరి చరితం తెలుగులో మొదటి యక్షగానం. కానీ ఇది అలభ్యం.
– లభిస్తున్న యక్షగానాల్లో మొదటిది సుగ్రీవ విజయం. దీన్ని 16 వశతాబ్దికి చెందిన కందుకూరి రుద్రకవి రాశారు.
– చక్రపురి రాఘవాచార్యులు రచించిన యక్షగానం- విప్రనారాయణ చరిత్ర.
– బాల పాపాంబ రచించిన యక్షగానం- అక్కమహాదేవి చరిత్ర.
– తెలుగులో తొలి యక్షగాన కవయిత్రి- బాల పాపాంబ.
– కంకంటి పాపరాజు రచించిన యక్షగానం- విష్ణుమాయా నాటకం.
– ‘జానకీ పరిణయం’ అనే యక్షగానాన్ని రచించిన కవి- రంగశాయి.
– తంజావూరు నాయకరాజుల కాలంలో విలసిల్లిన సాహిత్య ప్రక్రియ- యక్షగానం.
– రఘునాథ నాయకుడు రచించిన యక్షగానం- రుక్మిణీ కృష్ణ వివాహం.
– రఘునాథ నాయకుని కుమారుడు విజయ రాఘవ నాయకుడు 23 యక్షగానాలను రచించినట్లు ప్రహ్లాద చరిత్ర పీఠికలోని పద్యం ద్వారా తెలుస్తుంది. వాటిలో ముఖ్యమైనవి.. కాళియమర్దనం, కృష్ణ విలాసం, విప్రనారాయణ, రఘునాథాభ్యుదయం, పూతన హరణం, ప్రహ్లాద చరిత్ర మొదలైనవి.
– పసుపులేటి రంగాజమ్మ రచించిన యక్షగానం- మన్నారుదాస విలాస నాటకం.
– మన్నారు దేవుడు రచించిన యక్షగానం- హేమాబ్జ నాయికా పరిణయం.
– కామరసు వెంకటపతి సోమయాజి రచించిన యక్షగానం- విజయ రాఘవ చంద్రికా విహారం.
– కోనేటి దీక్షిత కవి రచించిన యక్షగానం- విజయ రాఘవ కల్యాణం.
– పురుషోత్తమ దీక్షితుడు రచించిన యక్షగానం- తంజాపురాన్నదాన మహానాటకం.
– నాయక రాజుల వలే యక్షగానాలను రచించిన పాలకులు- మహారాష్ట్రులు.
– శహాజీ రచించిన యక్షగానాల సంఖ్య- 20. వీటిలో ముఖ్యమైనవి.. కిరాత విలాసం, కృష్ణలీలా విలాసం, గంగా పార్వతీ సంవాదం, జలక్షికీడలు, ద్రౌపదీ కల్యాణం, రతీ కల్యాణం, రామపట్టాభిషేకం, రుక్మిణీసత్యభామ సంవాదం, వల్లీ కల్యాణం, విఘ్నేశ్వర కల్యాణం, త్యాగరాజ వినోద చరిత్ర, విష్ణుపల్లకి సేవావూపబంధం, శంకర పల్లకి సేవావూపబంధం మొదలైనవి.
– శహాజీ తాను రచించిన యక్షగానాలను నాటకాలుగా, ప్రబంధాలుగా పేర్కొన్నారు.
– ‘గంగాగౌరీ విలాసం’ అనే యక్షగానాన్ని రచించిన కవి- పెద కెంపరాయడు.
– కంఠీరవ నరసరాజు రచించిన యక్షగానాల సంఖ్య- 7. వీటిలో ముఖ్యమైనవి వసంతోత్సవ విలాసం, విభక్తి కాంతా విలాసం, అష్టదిక్పాలక విలాసం.
– 18వ శతాబ్ది ఉత్తరార్ధం నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులు విరివిగా యక్షగానాలను రాశారు.
– శేషాచల కవి రచించిన యక్షగానం- ధర్మపురి రామాయణం
– రాపాక శ్రీరామ కవి రచించిన యక్షగానం- ఆధ్యాత్మ రామాయణం
– బసవ మహిమామృత విలాసం అనే యక్షగానాన్ని రచించిన కవి- కానూరి వీరభద్ర కవి.
– చెల్వురు సన్యాసి కవి రచించిన యక్షగానం- బసవ కల్యాణం.
– తెలంగాణ యక్షగాన కవుల్లో మిక్కిలి ప్రసిద్ధుడు చెర్విరాల భాగయ్య కవి. ఈయనకు గల బిరుదు తెలంగాణ యక్షగాన పితామహుడు. ఈయన రచించిన యక్షగానాల సంఖ్య- 34.
– చెర్విరాల భాగయ్య జన్మస్థలం మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలోని గుమ్మడిదల గ్రామం. 1904లో జననం, 1966, జనవరి 6న మరణం. హైదరాబాద్‌లోని మశురబాద్ (ముషీరాబాద్)లో స్థిరపడ్డారు. ఈయన రచించిన సుగ్రీవ విజయం యక్షగానం ఆ రోజుల్లో లక్షల ప్రతులు అమ్ముడుపోయిందంటే దాని విశిష్టత ఏంటో తెలుస్తుంది. ఈయన రచించిన యక్షగానాల్లో సుప్రసిద్ధమైనవి. సుగ్రీవ విజయం, మాయాసుభద్రా విలాసం, నాగార్జున చరిత్రం, మాంధాత చరిత్రం, అల్లీరాణి చరిత్రం, సారంగధర చరిత్రం, ఆరెమరాఠీల చరిత్ర, మాధవ చరిత్రం, భద్రసేన విలాసం, కనకతార చరిత్రం, కాంతామతి చరిత్రం, జయంత జయపాలం, బభ్రువాహన చరిత్ర, కృష్ణగారడీ, బాలనాగమ్మ కథ మొదలైనవి.
– చెర్విరాల భాగయ్య శిష్యుడైన మహమ్మద్ అబ్దుల్లా రచించిన యక్షగానం- హనుమవూదామ సంగ్రామం. ఈయన స్వస్థలం నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలోని సోమవరం గ్రామం. ఈయన రచించిన మరో సుప్రసిద్ధ యక్షగానం కుశలవ చరిత్రం.
– జానపద కథ ఇతివృత్తంగా గల మల్లన్న చరిత్ర అనే యక్షగానాన్ని రచించిన కవి- అంబేద రాజ వీరప్ప.
– పట్లోరి వీరప్ప రచించిన యక్షగానాలు- మన్మథ సంహారం, క్రోధాపురి రైతు విజయం.
– వఝల నరసింహ కవి రచించిన యక్షగానం- దుష్యంత చరిత్రం.
– కృష్ణ విజయం యక్షగాన కర్త- అకలంక శ్రీకృష్ణమాచార్యులు.
-నారాయణ కవి రచించిన యక్షగానం- సుందరకాండము.
-బూరెల విఠల్ రచించిన యక్షగానం- శ్రీరామ విజయం.
-గుజ్జెల నర్సయ్య గుప్త రచించిన యక్షగానం- సులోచన పరిణయం.
-మైరావణ చరిత్ర యక్షగానం రచయిత- కొల్తూరు పురుషోత్తం.
-వానమామల నరసింహ దాసు రచించిన యక్షగానం- హేలావతి పరాభవం.
-పండరి విఠల రాయకవి రచించిన యక్షగానం- గజగౌరీ వ్రతం.
-ఆముదాల రామస్వామి రచించిన యక్షగానం- శశిరేఖా పరిణయం.
-గోశిక భూమయ్య రచించిన యక్షగానం- కుంతీదేవి దీవెన అనే స్త్రీ సాహసం.
-పనుస హనుమద్దాసు రచించిన యక్షగానం- డాంగ్నేమోపాఖ్యానం
-గయోపాఖ్యానం యక్షగాన కర్త- శ్రీయుత సంగయాభ్యులు
-జెల్లా వెంకటదాసు రచించిన యక్షగానం- భీమార్జున గర్వాపహరణం.
-మయూరధ్వజ యక్షగానం రచయిత- శ్రీమాన్ తిరునగరి కృష్ణయ్య పంతులు. ఈయన మరో రచన- జగదేక వీరుని కథ.
-చంద్రహాస చరిత్రం యక్షగాన రచయిత- ఆడెపు నారాయణ దాసు.
-గడ్డం రామదాసు రచించిన యక్షగానం- ప్రభావతి విలాసం.
-గాధి హనుమత్కవి రచించిన యక్షగానం- చంద్రకళ విలాసం.
-శ్రీనరసింహ దాసు రచించిన యక్షగానం- కుమారస్వామి వివాహం.
-బొందుగ యాదవదాసు రచించిన యక్షగానం- రామదాసు చరిత్రం.
-మాయావూపకృతి పురుషలీల యక్షగానం రచయిత- నాగప్పగారి భౌమదాసు.
-సత్యాచారి రచించిన యక్షగానం- శ్రీ పతివూవతా శిరోమణి.
-సుగుణావతి చరిత్రం యక్షగానం రచయిత- బూరుగుపల్లి వెంకటనృసింహ కవి.
-పోలా సుదర్శనం రచించిన యక్షగానం- మౌనధారి చరిత్రం.
-కర్ణ దుశ్శాసన వధ యక్షగానాన్ని రచించిన కవి- తొరమామిడి మల్లయ్య. ఈయన నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం గట్టుప్పుల గ్రామవాసి. ఈయనకు ‘బాలకవి’ అనే బిరుదు కలదు. చెర్విరాల భాగయ్య కవి రచించిన సుగ్రీవ విజయం తర్వాత అంతగా ప్రసిద్ధి పొందిన యక్షగానం- కర్ణదుశ్శాసన వధ.
-పద్మవ్యూహం యక్షగాన రచయిత- పల్లా రాములు. ఈయన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లికి చెందిన కవి.
-జానపద కథాగేయంగా ప్రసిద్ధిగాంచిన బల్గునూరి కొండలరాయచరివూతను యక్షగానంగా రచించిన కవి- ఆడెపు గురువదాసు. ఈయన నల్లగొండ జిల్లా మర్రిగూడెం గ్రామవాసి.
-సుంకర సత్యనారాయణ రచించిన ‘కష్టజీవి’ బుర్రకథ ఇతివృత్తాన్ని అనుసరించి ప్రజాకవి సుద్దాల హనుమంతు అసంపూర్తిగా రాసిన యక్షగానం- వీర తెలంగాణ. దీన్ని ఈయన కుమారుడు సుద్దాల అశోక్‌తేజ పూర్తిచేశారు. నిజాం పాలనలో రైతాంగ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చిత్రించిన సాంఘిక యక్షగానమిది.
-హనుమద్వివాహం యక్షగానం రచించిన కవి- బసవప్ప. ఈయన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందినవారు.
-భీమ విజయం యక్షగానం రచించిన కవి- సంగయ్య. ఈయన నల్లగొండ మండలం చర్లపల్లి గ్రామనివాసి.
-విష్ణుమోహినీ విలాసం యక్షగానం రచించిన కవి- వెంకట కవి. ఈయన కరీంనగర్ జిల్లా బూరుగుపల్లి గ్రామానికి చెందినవారు.
-నాటకం: సుమారు ఐదు నుంచి పది అంకములు కలిగిన సుప్రసిద్ధమైన ఇతివృత్తం. ధీరోదాత్తుడైన నాయకుడు వీర, శృంగార రసాల్లో ఏదో ఒక రసాన్ని కలిగి సంగీత, సాహిత్య, నృత్య సమన్వితమై గంట నుంచి మూడు గంటల సమయంలో ప్రదర్శించే దృశ్యకావ్యానికి నాటకం అనే పేరు.
-దశవిధ రూపకాల్లో ఒకటి నాటకం. ధనంజయుడు చెప్పిన దశవిధ రూపకాలు.. 1) నాటకం 2) ప్రకరణం 3) ప్రహసనం 4) డిమం 5) వ్యామోగం 6) అంకం 7) బాణం 8) వీధి 9) ఈహామృగం 10) సమవాకారం.
-నాటకంలో ప్రధానంగా పది అంగాలుంటాయి. అవి.. 1) పూర్వరంగం 2) నాంది 3) ప్రస్తావన 4) అంకం 5) అర్ధోప క్షేపకాలు 6) అర్ధవూపకృతులు 7) కార్యావస్థలు 8) పంచసంధులు 9) పతాక స్థానకాలు 10) భారతవాక్యం.
1) పూర్వరంగం: నాటక ప్రదర్శనకు నటీనటులు సమాయత్తం కావటం, ఎటువంటి అవరోధాలు లేకుండా నాటక ప్రదర్శన విజయవంతమయ్యేటట్లు ముందు చేసే కార్యాచరణకు పూర్వరంగం అని పేరు.
2) నాంది: ఆనందింపచేసేది నాంది. ఆశీర్వచనంగా, నమస్కార పూర్వకంగా ఉండేది. సూత్రధారుడు నాంది శ్లోకాన్ని లేదా పద్యాన్ని పఠిస్తాడు. రంగస్థలంగా మారిన నందీశ్వరునికి చేసే పూజనే నాంది అని మరికొందరి అభివూపాయం.
3) ప్రస్తావన లేదా ఆముఖం : సూత్రధారుడు నటితోగాని, విదూషకునితో గాని నాటక రచయిత గురించి, నాటక ప్రత్యేకత గురించి ప్రస్తావించటాన్ని ప్రస్తావన లేదా ఆముఖం అని అంటారు.
మాదిరి ప్రశ్నలు
1. లభిస్తున్న యక్షగానాల్లో మొదటిది?
1) సౌభరి చరితం 2) సుగ్రీవ విజయం
3) అక్కమహాదేవి చరిత్ర
4) విష్ణుమాయానాటకం
2. యక్షుల ప్రస్తావన, వారి ఆటపాటల ప్రసక్తి గల తొలి కావ్యం?
1) పండితారాధ్య చరిత్ర 2) భీమఖండం
3) బసవపురాణం 4) సింహానద్వావూతింశతి
3. తంజావూరు నాయకరాజుల కాలంలో విలసిల్లిన సాహిత్య ప్రక్రియ?
1) నాటకం 2) ప్రబంధం
3) కథాకావ్యం 4) యక్షగానం
4. తెలంగాణ యక్షగాన పితామహుడిగా ప్రసిద్ధిచెందిన కవి?
1) చెర్విరాల భాగయ్య కవి 2) శేషాచల కవి
3) పనుస హనుమద్దాసు
4) మహమ్మద్ అబ్దుల్లా
సమాధానాలు : 1-2, 2-1, 3-4, 4-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?