College is also important in branch selection | బ్రాంచి ఎంపికలో కాలేజీ కూడా ముఖ్యమే!
త్వరలోనే ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. మచి ర్యాంక్ వచ్చి న విద్యార్థులకు టాప్ కాలేజీల్లో కోరుకున్న సీటు వస్తుంది. ఇక మధ్యస్థంగా ర్యాంకు వచ్చిన వారికి ఏ బ్రాంచీ ఎంపిక చేసుకోవాలి? ఏ కాలేజీని ఎంపిక చేసుకోవాలి అనే విషయాలపై చాలా మందికి అనుమానాలుంటాయి. అందుకే వారికోసం సూచనలు, సలహాలు …ఇంజినీరింగ్‌లో విద్యార్థులు వారు అనుకున్న కాలేజీలో, అనుకొన్న బ్రాంచీలో సీటు రాకపోవచ్చు. ఎందుకంటే, అనుకున్న సీటు రావడం, రాకపోవడం ప్రధానంగా ఎంసెట్‌తో వచ్చిన ర్యాంక్‌ను బట్టి ఉంటుంది. ఆ తర్వాత తమ రిజర్వేషన్ కేటగిరీని బట్టి ఉంటుంది.
కాలేజీల ఎంపిక..
బ్రాంచీని ఎన్నిక చేసుకొనే ముందు, కాలేజీల జాబితాను తయారు చేసుకొంటే మంచిది. కాలేజీలో విద్యా నాణ్యత ఈ కింది అంశాలను బట్టి ఉంటుంది.
-బోధనా సిబ్బంది, ఇన్‌వూఫాస్ట్రక్చర్ ఫెసిలిటీస్
-ఇండస్ట్రీతో అనుబంధం, పరిశోధనా అవకాశాలు, ప్లేస్‌మెంట్స్
ఈ అంశాల గురించి తెలుసుకోవడం కష్టమేమి కాదు. దీనికోసం..
-వెబ్‌సైట్‌ను చూడటం ద్వారా
-పూర్వ విద్యార్థులను విచారించడం ద్వారా
-బోధనా సిబ్బందిని విచారించడం ద్వారా
-ఆయా కాలేజీలను స్వయంగా సందర్శించి తెలుసుకోవచ్చు.
పై అంశాలను పరిగణలోకి తీసుకొని ఎంహెచ్ఆర్డీ (భారత ప్రభుత్వం) ఈ ఏడాది కాలేజీలు, విశ్వవిద్యాలయాల ర్యాంకులను విడుదల చేసింది. ఇదేకాకుండా కొన్ని మేగజైన్ల వారు కూడా ప్రతి ఏడాది ర్యాంకింగ్స్‌ను విడుదల చేస్తారు. వీటన్నింటి ద్వారా కాలేజీ ఎంపిక చేసుకోవడం మంచిది.
బ్రాంచీల ఎంపిక..
కాలేజీ ఎన్నికతో పోలిస్తే బ్రాంచీ ఎంపిక సులభం. బ్రాంచీల్లో ముఖ్యమైనవి కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్‌లు కోర్ బ్రాంచీలు. ఇవేకాకుండా కొన్ని ప్రత్యేకమైన బ్రాంచీలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి బయో మెడికల్, బయో టెక్నాలజీ, ఏరోనాటికల్, మెకవూటానిక్స్, ఇన్స్ట్రుమెం అన్ని ఇంజినీరింగ్ కోర్సులకు అర్హతగా విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ప్రావీణ్యత ఉండాలి. దీని కోసమే ఎంసెట్, జేఈఈల్లో ఈ సబ్జెక్టులను పరీక్షిస్తారు. వీటిలో మ్యాథ్స్ కీలకం. మ్యాథ్స్ మీద ఆసక్తి లేకపోతే ఇంజినీరింగ్ కోర్సు చేయకపోవడం మంచిది.
బ్రాంచీ ఎంపికనేది, విద్యార్థి ఆసక్తిని బట్టి ఉంటుంది. విద్యార్థి ఇష్టాయిష్టాలను బట్టి సంప్రదాయక కోర్సుల్లో వేటినైనా ఎంచుకోవచ్చు. పరిస్థితులనుబట్టి ఉద్యోగ అవకాశాలు ఈ బ్రాంచీల్లో మారుతూ ఉంటాయి. కాకపోతే ఏ బ్రాంచీ అయినప్పటికీ బాగా చదువుకొని, మంచి ప్రావీణ్యత సాధిస్తే ఉద్యోగాలు రావడం సులభం.
ముఖ్యంగా ఇండస్ట్రీలో విద్యార్థుల్లోని స్కిల్స్‌ను చూస్తారు. ఫండమెంటల్స్‌ను పరీక్షిస్తారు. కాబట్టి ప్రాథమికాంశాల్లో మంచి అవగాహన, ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్నట్లయితే జాబ్ ఈజీగా వస్తుంది.
30 ఏండ్లుగా పరిశీలిస్తే ఐటీ రంగంలో మంచి అవకాశాలు వచ్చాయి. మన దేశంలోని ఐటీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా మంచిపేరు తెచ్చుకున్నాయి. అంతేకాకుండా గూగుల్, అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి ఐటీ దిగ్గజాలు దేశంలో బ్రాంచీలను తెరిచాయి. యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. దీనివల్ల చాలామంది ఐటీ వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతకాలంగా దేశంలో అనేక ఇన్‌వూఫాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లు ప్రారంభించారు. దీంతో సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఆటోమొబైల్ పరిక్షిశమ కూడా బాగా వృద్ధిచెందింది. వీటితో మెకానికల్ విద్యార్థులకు కూడా అవకాశాలు పెరిగాయి.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కాలేజీలను, బ్రాంచీలను ఎంపికచేసుకోవాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?