2తో నిశ్శేషంగా భాగింపబడే సంఖ్యలు ఏవి?
సంఖ్యావ్యవస్థ (Number System)
-0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9లను అంకెలు అంటారు.
-అంకెల కలయికతో ఏర్పడేవి సంఖ్యలు
-ఉదా: 10, 99, 143, 1000, ……
ముఖవిలువ-స్థాన విలువ
-789 అనే సంఖ్యలో
8 ముఖ విలువ 8
7 ముఖ విలువ 7
9 ముఖ విలువ 9 కానీ..
-789 అనే సంఖ్యలో
8 స్థాన విలువ 8 x 10= 80
7 స్థాన విలువ 7 x 100= 700
9 స్థాన విలువ 9 x 1= 9
గమనిక: 9 అనే అంకె ఒకట్ల స్థానంలో, 8 పదుల స్థానంలో, 7 వందల స్థానంలో ఉంది.
6425 అనే సంఖ్యలో 4 స్థాన విలువ,
ముఖ విలువల మధ్య భేదం ఎంత?
-4 స్థాన విలువ= 4 x 100= 400
-4 ముఖ విలువ= 4
-భేదం= 400 – 4= 396
20, 79, 156 అనే సంఖ్యలో 9 స్థాన, ముఖ
విలువల మొత్తం ఎంత?
-ఇచ్చిన సంఖ్యలో
9 స్థాన విలువ= 9 x 1000= 9000
9 ముఖ విలువ= 9
మొత్తం= 9000 + 9= 9009
సంఖ్యలు-రకాలు
సహజ సంఖ్యలు (N)= {1, 2, 3, 4,….}
-మనం లెక్కించగలిగే సంఖ్యలన్నీ సహజ సంఖ్యలే.
-సహజ సంఖ్యల్లో అతిచిన్న సంఖ్య= 1
-సహజ సంఖ్యల్లో అతిపెద్ద సంఖ్య= చెప్పలేం
పూర్ణాంకాలు (W)= {0, 1, 2, 3, ….}
-పూర్ణాంకాల్లో అతిచిన్న సంఖ్య= 0
-పూర్ణాంకాల్లో అతిపెద్ద సంఖ్య= చెప్పలేం
పూర్ణసంఖ్యల సమితి (Z)
-Z= {… -3, -2, -1,0, 1, 2, 3,….}
-ఇందులో అతిచిన్న, అతిపెద్ద రెండు సంఖ్యలను చెప్పలేం.
సరి పూర్ణసంఖ్యలు (E): 2తో నిశ్శేషంగా భాగించబడే పూర్ణసంఖ్యలను సరి పూర్ణసంఖ్యలు అంటారు. దీన్ని Eతో సూచిస్తారు.
E= { ….}
బేసి పూర్ణసంఖ్యలు (O): 2తో నిశ్శేషంగా భాగించబడని సంఖ్యలను బేసి పూర్ణ సంఖ్యలు అంటారు. దీన్ని Oతో సూచిస్తారు.
E= { ……}
గమనిక: O అనేది సరి పూర్ణసంఖ్య కాదు, బేసి పూర్ణసంఖ్య కాదు.
-అకరణీయ సంఖ్యలు (Q)= {p/q, q p, qలు పూర్ణసంఖ్యలు.
-p/q రూపంలో (భిన్నరూపంలో) (q రాయగలిగే సంఖ్యలన్నింటినీ అకరణీయ సంఖ్యలు అంటారు. దీన్ని Qతో సూచిస్తారు.
ఉదా: 6, 10, 5/3, 99/100, 0.5, 0.3333, …. =1/3
గమనిక: అన్ని సహజ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు
-అన్ని పూర్ణసంఖ్యలు అకరణీయ సంఖ్యలు
కరణీయ సంఖ్యలు (Q1)= p/q రూపంలో రాయలేని సంఖ్యలన్నీ కరణీయ సంఖ్యలు అవుతాయి. లేదా అకరణీయ సంఖ్యలు కాని సంఖ్యలన్నీ కరణీయ సంఖ్యలే.
ఉదా: 3+ 2
గమనిక: eలు కూడా కరణీయ సంఖ్యలు
వాస్తవ సంఖ్యలు (R)
-అకరణీయ, కరణీయ సంఖ్యల మొత్తాన్ని వాస్తవ సంఖ్యలు అంటారు. దీన్ని Rతో సూచిస్తారు. R= Q Q1
సంకీర్ణ సంఖ్యలు (C)
-a, bలు వాస్తవ సంఖ్యలు అయి ఉండే విధంగా a+ib రూపంలో రాయగలిగే సంఖ్యలను సంకీర్ణ సంఖ్యలు (c) అంటారు. ఇక్కడ i అనేది Imaginary Number
c= {a+ ib/i=
సరి సంఖ్యలు
-2తో నిశ్శేషంగా భాగింపబడే సంఖ్యలన్నీ సరిసంఖ్యలు. ఉదా: 0, 2, 4, 6, 8, 10, ……
-సరి సంఖ్యల సాధారణ రూపం= 2K, K ఒక పూర్ణాంకం
బేసి సంఖ్యలు
-2తో నిశ్శేషంగా భాగింపబడని సంఖ్యలన్నీ బేసి సంఖ్యలు. ఉదా: 1, 3, 5, 7, ….
-బేసి సంఖ్యల సాధారణ రూపం= 2K + 1, K ఒక పూర్ణాంకం
కారణాంకాలు (భాజకాలు)
-ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే సంఖ్యలన్నింటినీ ఆ సంఖ్యకు కారణాంకాలు లేదా భాజకాలు అంటారు. a అనేది bని నిశ్శేషంగా భాగిస్తే a, bకి కారణాంకం అవుతుంది.
ఉదా: 24కు కారణాంకాలు ఏవి?
1x 24= 24
2x 12= 24
3x 8= 24
4x 6= 24
-24కు కారణాంకాలు={1,2,3,4,6,8,12,24}
గమనిక: 1 అనేది ప్రతిసంఖ్యకు కారణాంకం, ప్రతి సంఖ్య దానికదే కారణాంకం.
ప్రధాన సంఖ్య
-ఒక సంఖ్యకు ఒకటి (1), అదే సంఖ్య తప్ప ఇతర కారణాంకాలు ఏవి లేకపోతే ఆ సంఖ్యను ప్రధాన సంఖ్య అంటారు.
ఉదా: 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97.
-2 అనేది ఒకే ఒక సరిప్రధాన సంఖ్య
-1 నుంచి 50 వరకు మొత్తం 15 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి.
-50 నుంచి 100 వరకు మొత్తం 10 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి.
-కాబట్టి 1 నుంచి 100 వరకు మొత్తం 25 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి.
కవల ప్రధాన సంఖ్యలు
-రెండు ప్రధాన సంఖ్యల మధ్య బేధం 2 అయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు.
ఉదా: (3, 5), (5, 7), (11, 13), (17, 19), (29, 31), (41, 43)
సహప్రధాన సంఖ్యలు (Co-Primes)
-రెండు సంఖ్యల గ.సా.భా 1కి సమానమైతే వాటిని సహ ప్రధాన సంఖ్యలు అంటారు.
ఉదా: (2, 3), (5, 6), (10, 11), (11, 13), ….
-ప్రతి రెండు వరుస సంఖ్యలు సహప్రధాన సంఖ్యలు అవుతాయి.
-సహప్రధాన సంఖ్యల్లో రెండు సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు.
-అతిచిన్న ప్రధాన సంఖ్య= 2
-అతిచిన్న లేదా ఒకేఒక సరిప్రధాన సంఖ్య= 2
-రెండంకెల అతిపెద్ద ప్రధాన సంఖ్య= 97
-రెండంకెల అతిచిన్న ప్రధాన సంఖ్య= 11
437 ఒక ప్రధాన సంఖ్య అవునా? కాదా?
-ముందుగా 437కి దగ్గరగా ఒక కచ్చిత వర్గసంఖ్య తీసుకోవాలి. అది 441. ఇది 21 వర్గం.
441 > 437
(21)2 > 437
-ఇప్పుడు ఈ 21 కన్నా తక్కువగా ఉన్న ప్రధాన సంఖ్యలు తీసుకోవాలి. అవి 2, 3, 5, 7, 11, 13, 17, 19
-437… 19తో నిశ్శేషంగా భాగింపబడింది. కావున అది ప్రధాన సంఖ్యకాదు. ఒకవేళ 437 అనేది 21 కన్నా తక్కువైనా ఏ ప్రధాన సంఖ్యతో కూడా భాగింపబడకపోతే 437 ప్రధాన సంఖ్య అంటారు.
811 ప్రధాన సంఖ్యేనా?
-811కి దగ్గరిగా ఉన్న కచ్చితవర్గం 900
900.811
(30)2.811
-30 కన్నా చిన్నవైన ప్రధాన సంఖ్యలు=
2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29
-ఇందులో ఏ సంఖ్య కూడా 811ని నిశ్శేషంగా భాగించవు. కావున 811 ఒక ప్రధాన సంఖ్య.
గమనిక: 811 అనేది ఆ అన్ని సంఖ్యలతో భాగింపబడుతుందా లేదా అని బాజనీయతా సూత్రాల ఆధారంగా సులభంగా లెక్కించవచ్చు.
సంఖ్యాశాస్త్రం భావనలు
అన్ని సరిసంఖ్యలను 2తో నిశ్శేషంగా భాగించవచ్చు.
ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3తో నిశ్శేషంగా భాగించబడితే.. ఆ సంఖ్యను కూడా 3 తో నిశ్శేషంగా భాగించవచ్చు.
ఒక సంఖ్యలోని ఒకట్లు, పదుల స్థానంలోని అంకెలతో ఏర్పడిన సంఖ్య 4 తో నిశ్శేషంగా భాగించబడితే.. ఆ సంఖ్యను కూడా 4 తో నిశ్శేషంగా భాగించవచ్చు. ఒకట్ల, పదుల స్థానాల్లో రెండూ సున్నాలే ఉన్న సంఖ్యను కూడా 4 తో నిశ్శేషంగా భాగించవచ్చు.
ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 0 లేదా 5 ఉన్నట్లయితే.. ఆ సంఖ్యను 5 తో నిశ్శేషంగా భాగించవచ్చు.
ఒక సంఖ్య 2, 3 రెండింటితోనూ నిశ్శేషంగా భాగించబడితే.. ఆ సంఖ్యను 6 తో కూడా నిశ్శేషంగా భాగించవచ్చు.
ఒక సంఖ్యలో ఒకట్ల స్థానంలోని అంకెను 5 తో గుణించగా వచ్చిన లబ్ధాన్ని, మిగితా అంకెల మొత్తంతో కూడిగా వచ్చే సంఖ్య 7 తో నిశ్శేషంగా భాగించబడితే.. ఆ సంఖ్యను కూడా 7 తో నిశ్శేషంగా భాగించవచ్చు.
ఒక సంఖ్యలోని చివరి మూడు అంకెలతో ఏర్పడిన సంఖ్య 8 తో నిశ్శేషంగా భాగించబడితే.. ఆ సంఖ్యను కూడా 8 తో నిశ్శేషంగా భాగించవచ్చు.
ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9 తో నిశ్శేషంగా భాగించబడితే.. ఆ సంఖ్యను కూడా 9 తో నిశ్శేషంగా భాగించవచ్చు.
ఒక సంఖ్య చివర సున్నా ఉన్నట్లయితే.. ఆ సంఖ్యను 10 తో నిశ్శేషంగా భాగించవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు