ప్రణాళికలు – వాటి లక్ష్యాలు – పనితీరు
ప్రణాళికలు, నిర్వచనం, దాని రకాలు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాల హేతుబద్ధత మొదలైన విషయాలను తెలుసుకున్నాం. ప్రణాళికలు ఎలా ఆవిర్భవించాయి? ఆ ప్రణాళికల వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? ఆ ప్రణాళికల్లో ఉన్న లోపాలేంటి మొదలైన విషయాలను చర్చించాం. స్వాతంత్య్రానికి పూర్వం ఏర్పడిన వివిధ ప్రణాళికల లక్ష్యాలు కూడా తెలుసుకున్నాం. అందులో భాగంగానే పూర్వ రెండు భాగాలకు అనుగుణంగా మొత్తం పన్నెండు ప్రణాళికల లక్ష్యాలు, వాటి పనితీరును తెలుసుకుందాం. ఒక్కొక్క ప్రణాళిక లక్ష్యాలు, వృద్ధిరేటు ఏంటి? ఆ సమయంలో ప్రణాళిక ఉపాధ్యక్షులు ఎవరు? ఆ కాలంలో ఉండే వివిధ ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఏంటి? ప్రణాళిక సఫలమైందా? విఫలమైందా? మొదలైన విషయాలను తెలుసుకుందాం.
మొదటి ప్రణాళిక: ప్రణాళిక కాలం 1951-56. అధ్యక్షుడు జవహర్‌లాల్‌నెహ్రూ, ఉపాధ్యాక్షుడు గుల్జారీలాల్ నంద. నమూనా హరాడ్ డోమర్. వ్యవసాయాభివృద్ధి, నీటి పారుదల రంగాలకు ప్రాధాన్యం. వృద్ధి రేటు లక్ష్యం 2.1 శాతం కాగా సాధించింది 3.6 శాతం.
రెండో ప్రణాళిక: కాలం 1956-61. అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ, ఉపాధ్యక్షుడు వీటీ కృష్ణమాచారి. నమూనా మహల నోబిస్. భారీపరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యం. వృద్ధిరేటు లక్ష్యం 4.5 శాతం కాగా సాధించింది 4.1 శాతం.
మూడో ప్రణాళిక: కాలం 1961-66. అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ, ఉపాధ్యక్షులు సీఎం త్రివేది (1963), అశోక్ మెహతా. నమూనా అశోక్ మెహతా. స్వావలంబన, స్వయం సమృద్ధి ఈ ప్రణాళిక ప్రాధాన్యం. వృద్ధిరేటు లక్ష్యం 5.6 శాతం కాగా సాధించింది 2.8 శాతం.
నాలుగో ప్రణాళిక: కాలం 1969-74. అధ్యక్షురాలు ఇందిరాగాంధీ, ఉపాధ్యక్షుడు డీఆర్ గాడ్గిల్. నమూనా అశోకరుద్ర, అలెస్ మన్నే. ప్రాధాన్యం స్థిరత్వంతో కూడిన వృద్ధి, ఆర్థిక స్వావలంబన. వృద్ధి రేటు లక్ష్యం 5.7 శాతం, సాధించింది 3.3 శాతం.
ఐదో ప్రణాళిక: కాలం 1974-78/79. ఇందిరాగాంధీ అధ్యక్షురాలు కాగా, పీఎన్ హక్సర్ ఉపాధ్యక్షుడు. నమూనా డీపీ ధర్. పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం. వృద్ధిరేటు లక్ష్యం 4.4 శాతం కాగా సాధించింది 4.8 శాతం.
ఆరో ప్రణాళిక: 1980-85 ప్రణాళిక కాలం. అధ్యక్షురాలు ఇందిరాగాంధీ, ఉపాధ్యక్షుడు ఎన్డీ తివారీ (1980-81), ఎస్బీ చవాన్. నమూనా లక్డావాలా. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, సాంకేతిక స్వావలంబన రంగాలకు ప్రాధాన్యం. వృద్ధి రేటు లక్ష్యం 5.2 శాతం కాగా సాధించింది 5.7 శాతం.
ఏడో ప్రణాళిక: 1985-90. అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ, ఉపాధ్యక్షుడు మన్మోహన్సింగ్. నమూనా వకీల్-బ్రహ్మానందం. ఈ ప్రణాళిక ప్రాధాన్యం ఆహారం, పని, ఉత్పాదకత. వృద్ధిరేటు లక్ష్యం 5.0 శాతం కాగా, సాధించింది 6.0 శాతం.
-1990-92 మధ్యకాలంలో వార్షిక ప్రణాళికలను ప్రవేశపెట్టారు. 1991లో మనోహ్మన్‌సింగ్, పీవీ నర్సింహారావు ఆధ్వర్యంలో నూతన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు.
-వీటినే ఎల్పీజీ సంస్కరణలు అంటారు.
L-LIBERALISATION (సరళీకరణ),
P-PRIVATISATION (ప్రైవేటీకరణ)
G-GLOBALISATION (ప్రపంచీకరణ)
ఎనిమిదో ప్రణాళిక: 1992-97 ప్రణాళిక కాలం. అధ్యక్షుడు పీవీ నర్సింహారావు, ఉపాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జి. నమూనా ఎల్పీజీ. మానవ వనరుల అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి ఉపాధి కల్పన రంగాలకు ప్రాధాన్యం. వృద్ధిరేటు లక్ష్యం 5.6 శాతం సాధించింది 6.8 శాతం.
తొమ్మిదో ప్రణాళిక: 1997-2002 ప్రణాళిక కాలం. అధ్యక్షుడు దేవెగౌడ, ఉపాధ్యక్షుడు మధు దండావతే. నమూనా మధు దండావతే. ఈ ప్రణాళిక ప్రాధాన్యం సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి, సమానత్వం. వృద్ధిరేటు లక్ష్యం 6.5 శాతం, సాధించింది 5.4 శాతం.
పదో ప్రణాళిక: 2002-07 ప్రణాళిక కాలం. అధ్యక్షుడు వాజ్‌పేయి, ఉపాధ్యక్షుడు కృష్ణ చంద్రకాత్ పంత్. నమూనా బ్రంట్ లాండ్ నమూనా. ప్రాధాన్యం వ్యవసాయం, పేదరికం, గ్రామీణాభివృద్ధి. వృద్ధిరేటు లక్ష్యం 8.0 శాతం కాగా, సాధించింది 7.8 శాతం.
పదకొండో ప్రణాళిక: 2007-12 ప్రణాళిక కాలం. అధ్యక్షుడు మన్మోహన్సింగ్, ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లువాలియా. నమూనా మాంటెక్‌సింగ్ అహ్లువాలియా. సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి ఈ ప్రణాళిక ప్రాధాన్యం. వృద్ధిరేటు 8.1 శాతం, సాధించింది 7.9 శాతం.
పన్నెండో ప్రణాళిక: 2012-17 ప్రణాళిక కాలం. అధ్యక్షుడు మన్మోహన్సింగ్, ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లువాలియా. నమూనా మాంటెక్‌సింగ్ అహ్లువాలియా. ఈ ప్రణాళిక ప్రాధాన్యం సత్వర, నిలకడ గల సమీకృతాభివృద్ధి. వృద్ధిరేటు లక్ష్యం 9.5 శాతం.
-2014లో ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి నీతి ఆయోగ్‌ను 2015 జనవరి 1న ప్రారంభించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు