presidency is a symbol of national unity | రాష్ట్రపతి పదవి దేశ సమైక్యతకు ప్రతీక అన్నవారు?
1. కిందివాటిలో రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన అంశాల్లో సరైనవాటిని గుర్తించండి.
ఎ) జాతీయ గీతం, జాతీయ గేయాలను జనవరి 24, 1950న ఆమోదించింది.
బి) జనవరి 24, 1950లో డా. రాజేంద్రప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
సి) జనవరి 24, 1950 రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ నిర్మాణం కోసం సమావేశమైన చివరి తేదీ.
డి) రాజ్యాంగ పరిషత్ 1952 సంవత్సరం వరకు పార్లమెంట్‌కు సంబంధించిన విధులను నిర్వర్తించింది.
1) ఎ, సి 2) ఎ, బి, సి 3) బి, సి 4) ఎ, బి, సి, డి
2. ముద్దాయి అయిన వ్యక్తి తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్బంధం చేయరాదని ఏ అధికరణ తెలుపుతుంది?
1) 20వ 2) 20(1) 3) 20(2) 4) 20 (3)
3. ఏ అధికరణం ప్రకారం ప్రతి పౌరుడికి తన సొంత భాష, లిపి లేదా సంస్కృతులను కలిగి ఉండటానికి, సంరక్షించుకొనే హక్కు ఉంది. ప్రభుత్వం లేదా ప్రభుత్వేతర నిధుల సహాయంతో నిర్వహించబడుతున్న ఏ విద్యా సంస్థలోకి ఏ పౌరుడికి మతం, జాతి, కులం, భాషలు లేదా వాటిలో ఏ ఒక్కదాన్ని కారణంగానై నా చూపి తన ప్రవేశాన్ని నిరాకరించరాదు?
1) 29వ 2) 30వ 3) 31వ 4) 32వ
4. ప్రాథమిక హక్కులు, నిర్దేశిక నియమాలు పరస్పర పోషకాలు అని, ప్రాథమిక హక్కులు వ్యక్తిగత వికాసానికి తోడ్పడితే నిర్దేశిక నియమాలు సమాజహితానికి ఉపయోగపడ తాయని సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది ?
1) ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (1993)
2) ఎంసీ మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు (1997)
3) కేశవానందభారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (1973)
4) సిద్దాస్ వర్సెస్ యూనియన్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ (1996)
5. కళాత్మక, చారిత్రక నైపుణ్యం కలిగిన స్థలాలను, కట్టడాల ను పరిరక్షించాలని సూచించే రాజ్యాంగ అధికరణం?
1) 47వ 2) 48వ 3) 49వ 4) 50వ
6. కిందివాటిలో ప్రాథమిక విధి కానిది ?
1) ప్రభుత్వ ఆస్తులను కాపాడటం
2) జాతీయ గీతాన్ని గౌరవించడం
3) శాస్త్రీయ దృక్పథాన్ని నమ్మకపోవడం
4) భారతదేశ సమైక్యతను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం.
7. హెబియస్ కార్పస్ అంటే ?
1) నిర్బంధించిన వ్యక్తిని కోర్టులో హాజరుపర్చాలనే ఆదేశం
2) ఒక అధికారి తన బాధ్యతలను నిర్వహించనప్పుడు దాన్ని నిర్వహించాలనే ఆదేశం
3) కింది న్యాయస్థానాల్లో విచారణ నిలుపమనే ఆదేశం
4) అర్హత లేకుండా చట్టరీత్యా పదవిలో కొనసాగుతూ అధికారాన్ని చెలాయించడాన్ని నివారించడం.
8. ప్రాథమిక విధుల లక్షణాలకు సంబంధించిన సరైన వాక్యాలను తెల్పండి.
ఎ) ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ ఉంది.
బి) వీటి అమలుకోసం పార్లమెంట్ ప్రత్యేక చట్టాలు చేయాలి.
సి) విధులు కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి.
డి) విధులు నైతిక, చట్టబద్ధమైన విధులుగా ఉన్నాయి.
1) ఎ, బి 2) బి, సి, డి 3) ఎ, సి, డి 4) పైవన్నీ సరైనవే
9. ఏ ప్రకరణ ప్రకారం కేంద్ర ఆస్తులపై రాష్ట్రప్రభుత్వం పన్నులు విధించరాదు?
1) 283 2) 285 3) 286 4) 287
10. పంజాబ్ అకాలీదళ్ పార్టీ ఆనంద్‌పూర్ సాహెబ్ తీర్మానం చేసింది. రక్షణ, అంతర్జాతీయ సంబంధాలు, కమ్యూ నికేషన్లు, కరెన్సీ మొదలగు విషయాలకే కేంద్ర పరిధి పరిమితం కావాలని, దేశంలో నిజమైన సమాఖ్య స్ఫూర్తి తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు కోరింది?
1) 1971 2) 1972 3) 1973 4) 1974
11. గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్-1969 ఏ రాష్ర్టాల నదీ జలాల పరిష్కారం కోసం ఏర్పాటు చేశారు ?
1) మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ
2) రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్
3) మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్
4) ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
12. అంతరాష్ట్ర మండలి నిర్మాణం ఏ ప్రధాని హయాంలో ఏర్పాటు చేశారు ?
1) మొరార్జీదేశాయ్ 2) ఎల్బీ శాస్త్రి
3) వీపీ సింగ్ 4) ఇందిరాగాంధీ
13. పార్లమెంటరీ ప్రభుత్వ ముఖ్య లక్షణం కానిది?
1) పార్లమెంటరీ వ్యవస్థలో నామమాత్రపు, వాస్తవ అధిపతి ఉంటారు.
2) ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రిమండలి వాస్తవ రాజకీయ అధికారం కలిగి ఉంటారు.
3) మంత్రి మండలి సమష్టి బాధ్యత కలిగి ఉంటుంది.
4) వాస్తవ కార్యనిర్వహణ అధిపతి దేశ అధ్యక్షుడు.
14. రాష్ట్రపతి ఏ ప్రకరణ ప్రకారం లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు?
1) 108వ 2) 331వ 3) 80 (3)వ 4) 103వ
15. రాష్ట్రపతి పదవి దేశ సమైక్యతకు ప్రతీక అని ఎవరు అన్నారు?
1) డా. రాజేంద్రప్రసాద్ 2) సర్వేపల్లి రాధాకృష్ణన్
3) జవహర్లాల్ నెహ్రూ 4) డా. బీఆర్ అంబేద్కర్
16. మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ గ్రంథ రచయిత ?
1) డా. బాబు రాజేంద్రప్రసాద్ 2) సర్వేపల్లి రాధాకృష్ణన్
3) కేఆర్ నారాయణన్ 4) ఆర్ వెంకట్రామన్
17. రెండుసార్లు ఉప రాష్ట్రపతిగా ఎన్నికైనవారు ?
ఎ) సర్వేపల్లి రాధాకృష్ణన్ బి) జాకీర్ హుస్సేన్
సి) వీవీ గిరి డి) కృష్ణకాంత్
ఈ) శంకర్దయాల్శర్మ ఎఫ్) హమీద్ అన్సారీ
1) ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ 2) ఇ, ఎఫ్
3)సీ, డీ, ఎఫ్ 4) ఎ, ఎఫ్
18.పంచాయతీకి సంబంధించిన శాసనాల ఔచిత్యం, ఎన్నికల వ్యవహారాలు మొదలైనవి ప్రశ్నిస్తూ ఎలాంటి దావాల ను కూడా న్యాయస్థానాల్లో దాఖలు చేయరాదని పేర్కొనే ప్రకరణ ?
1) 243-ఎల్ 2) 243-ఎం
3) 243-ఎన్ 4) 243-ఓ
19. మున్సిపాలిటీస్ అనే శీర్షికతో రాజ్యాంగంలో ఏ భాగంలో చట్టం ఏర్పాటు జరిగింది ?
1) IX 2) IXA 3) X 4) XI
20. రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్లో మున్సిపాలిటీల అధికారాలు, హక్కులు, బాధ్యతలు ఎన్ని అంశాలుగా పొందుపర్చారు ?
1) 18 2) 19 3) 28 4) 29
21. కింది నగర పాలక సంస్థల్లో సరైన వాటిని పేర్కొనండి ?
ఎ) వరంగల్ బి) రామగుండం సి) కరీంనగర్
డి) ఖమ్మం ఇ) నిజామాబాద్ ఎఫ్) హైదరాబాద్
1) ఎ, ఇ, ఎఫ్ 2) ఎ, సి, డి, ఇ
3) ఎ, సి, డి, ఇ, ఎఫ్ 4) పైవన్నీ
22. ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్?
1) గిరిజా వ్యాస్ 2) మమతశర్మ
3) లలితాకుమార మంగళం 4) పూర్ణిమా అద్వాని
జవాబులు
1-4, 2-3, 3-1, 4-3, 5-3, 6-3, 7-1, 8-2, 9-2, 10-3, 11-1, 12-3, 13-4, 14-2, 15-2, 16-4, 17-4, 18-4, 19-2 , 20-1, 21-4, 22-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?