కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జ్యోతిబాపూలే రాసిన గ్రంథమేది?
సాంఘిక మత, కుల సంస్కరణోద్యమాలు
- 18,19 శతాబ్దాల్లో సమాజంలో మతంలో, కులంలో గల మత విశ్వాసాలను, మూఢనమ్మకాలను వ్యతిరేకించే వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వచ్చే మార్పులను ఏమంటారు? – ‘రినేసాన్స్’
- ప్రాశ్చ పండితులు: భారతదేశ ప్రాచీన సాహిత్యాన్ని చదివి అనువదించి పుస్తకాలుగా ప్రచురించిన యూరోపియన్ పండితులను ప్రాశ్చ పండితులు అంటారు.
- ఉదా: విలియం జోన్స్, మాక్స్ ముల్లర్
- సంస్కృత, తమిళ, తెలుగు, పర్షియన్, అరబిక్ పురాతన పుస్తకాలను యూరప్ భాషలలోకి అనువదించి దేశ సంపన్న, వైవిద్య భరిత సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తించారు.
- యూరోపియన్లు భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ప్రవేశ పెట్టారు. దీనివల్ల అనేక గ్రంథాల ముద్రణ జరిగింది.
ఉద్యమాలు:
- బ్రహ్మసమాజం: రాజా రామ్మోహన్రాయ్ , 1828
- ఆర్యసమాజ్: దయానంద సరస్వతి, 1975
- ప్రార్థనా సమాజం: ఆత్మారాం పాండురంగారావు, 1867
- దివ్యజ్ఞాన సమాజం: బ్లావట్సీ, ఓల్ఖాట్, 1875
- రామకృష్ణ ఉద్యమం: వివేకానంద, 1897
- అలీగఢ్ ఉద్యమం: సయ్యద్ అహ్మద్ ఖాన్. 1875
బ్రహ్మసమాజం:
- రాజ రామ్మోహన్ రాయ్ (1772-1833) 1828లో బెంగాల్లో స్థాపించారు
- సంస్కృతం, పారశీక, ఆంగ్లం, అరబిక్, లాటిన్, గ్రీకు వంటి 12 భాషల్లో బోధన జరిగేది.
బోధనలు - దేవుడు ఒక్కడే
- విగ్రహారాధన, బలులు ఇవ్వడం వ్యతిరేకించింది.
- ఇతరుల మతాలను విమర్శించడం సరికాదు
- హేతుబద్ధంగా ప్రజలకు ప్రయోజనకంగా ఉన్నప్పుడే మత భావనలను అంగీకరించాలి.
- పూజారుల అధికారాన్ని తిరస్కరించి మతంలో మూల గ్రంథాలను చదవడం.
- రాజా రామ్మోహన్ రాయ్ మరణానంతరం బ్రహ్మ సమాజం దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలో నడిచింది.
- కేశవ చంద్రసేన్ రామకృష్ణ పరమహంస భక్తుడు, ఇతని ప్రభావం కందుకూరి వీరేశలింగంపై ఉంది.
ఆర్య సమాజ్
- దయానంద సరస్వతి (1824-1883)
- 1875లో బొంబాయిలో ఆర్యసమాజం స్థాపించారు.
- సనాతన సాంప్రదాయాలతో కూడిన హిందూ మతాన్ని తిరస్కరించి, సన్యాసిగా మారారు.
- వేదాలకు తరలిపొండి అని పేర్కొన్నారు.
- ఆయన రాసిన గ్రంథాలు సత్యార్థ ప్రకాశ్, రుగ్వేద భాష్య భూమిక.
బోధనలు - ఎ) విగ్రహారాధనను, బ్రాహ్మణ పూజారులను, కులవ్యవస్థను వ్యతిరేకించారు.
- బి) సాధారణ పూజా విధానాలతో, వేద మంత్రాలతో ఒక్క దేవుడినే పూజించాలి.
- సి) శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు.
- 1883లో అతని మరణం తర్వాత పంజాబ్‌లో డి.ఎ.వి. పాఠశాలలు స్థాపించారు. ఆ స్కూల్స్‌లో మతం, సంస్కృతి, గురించి చెప్పేవారు.
- అతని అనుచరులు హరిద్వార్‌లో గురుకుల కాంగ్రి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.
ప్రార్థనా సమాజం
- కేశవ చంద్రసేన్ ఉపన్యాసాల ఫలితంగా మహారాష్ట్రలో బొంబాయి కేంద్రంగా ప్రార్ధనా సమాజ్‌ని 1867లో ఏర్పాటు చేశారు.
- ఎం.జి. రనడే, ఆర్.జి. భండార్కర్‌లు శరణాలయాలు, రాత్రి పాఠశాలలు స్థాపించారు.
రామకృష్ణ ఉద్యమం
- స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యులు.
- రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం స్థాపించారు.
- ఉద్ధేశ్యాలు: సంస్కరణలతో కూడిన హిందూమత పునరుద్ధరణ.
- జాతి నిర్మాణానికి సామాజిక సేవలో పాల్గొనడం
వివేకానంద బోధనలు - హిందూమతం ఇతర మతాల కంటే గొప్పది.
- ఉపనిషత్తుల బోధనకు ప్రాధాన్యం ఇచ్చారు.
- హిందూమత మౌఢ్యం, మూఢాచారాలను వదిలి పెట్టి యూరోపియన్ సంస్కృతిలో స్వేచ్ఛ, మహిళల పట్ల గౌరవం, సాంకేతికత వంటి వాటిని అవలంబించాలి.
- శరణాలయాలు, ఆస్పత్రులు, పాఠశాలలను ఈ మిషన్ ద్వారా స్థాపించాలని కోరుకున్నారు.
అలీగఢ్ ఉద్యమం:
- సయ్యద్ అహ్మద్‌ఖాన్ (1817-98)
- 1857 తిరుగుబాటు ముస్లింలు, ఆంగ్లేయుల మధ్య తీవ్ర విభేదాలను సృష్టించింది.
- మౌళ్వీలు ఆంగ్లవిద్యను తిరస్కరించడానికి కారణం ఆధునిక విజ్ఞాన శాస్త్రం. తత్వశాస్ర్తాల్లోని అంశాలు ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధంగా వుండటం.
అహ్మద్‌ఖాన్ భావనలు:
- ముస్లింలు, ఆంగ్లేయులకు మధ్య శత్రుత్వం అంతమవ్వాలి. ప్రగతి సాధించడానికి ముస్లింలు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలి.
- ముస్లింలు ఆధునీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- ముస్లిం మహిళలు చదువుకోవాలి, పరదా పద్ధతి రద్దు చేయాలి.
- ఈ భావనలను తన తెహ్రీక్-ఇ-ఆక్లాక్ పత్రికలో ప్రచారం చేశారు.
- 1864లో విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని ఏర్పాటు చేశారు.
- 1875లో అలీగఢ్‌లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించారు.
- ఇస్లాం వాతావరణంలో ఆంగ్లం, విజ్ఞాన శాస్ర్తాలు బోధించేవారు.
- అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని 1920 నాటికి స్థాపించారు.
సాంఘిక సంస్కరణలు – మహిళలు
- 200 సంవత్సరాల క్రితం మహిళల పరిస్థితి సామాజికంగా చాలా హీనంగా ఉండేది.
- ఉదా: బాల్య వివాహాలు, సతీ సహగమనం, బహు భార్యత్వం, దేవదాసి, బసివి, జోగిని వ్యవస్థలు అమల్లో ఉండేవి.
- 1846-10 సంవత్సరాల్లోపు వివాహం నేరం
- 1891-12 సంవత్సరాల్లోపు వివాహం నేరం
- 1929 – 14 సంవత్సరాల్లోపు వివాహం నేరం (శారదా చట్టం)
- 1978- అమ్మాయిలకు 18 సంవత్సరా ల్లోపు అబ్బాయిలకు 21సంవత్సరాల్లోపు వివాహం నేరం.
- సతీ సహగమనాన్ని రద్దు చేసింది.-1829 లో అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ (రాజారామ్మోహన్ రాయ్ సహకారంతో)
ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్
- వితంతు పునర్వివాహాల కోసం పోరాటం
- బహు భార్యత్వాన్ని వ్యతిరేకించాడు
- బాలికల విద్య కోసం పాఠశాలలు నెలకొల్పాడు
- 1855లో వితంతు పునర్వివాహాల చట్టం వచ్చింది.
- మొదటి వితంతు పునర్వివాహం 1856లో కలకత్తాలో జరిగింది. ఈ వివాహాన్ని చూసిన ఒక ప్రేక్షకుడు ఇలా వివరించాడు. “ఆ రోజు ఎన్నటికీ మరచిపోలేను. విద్యాసాగర్ తన మిత్రుడైన పెళ్ళి కొడుకుతో వచ్చినపుడు ఇసుక వేస్తే రాలనంతగా సందర్శకులు వచ్చారు. పెళ్లి తర్వాత మహిళలతోపాటు అందరి నోటా ఇదే చర్చ”
కందుకూరి వీరేశలింగం(1848-1919)
- సనాతన తెలుగు కుటుంబంలో రాజమండ్రిలో జన్మించాడు.
- ఆంధ్రప్రదేశ్‌లో బ్రహ్మసమాజ స్థాపకుడు.
- వితంతు పునర్వివాహాల కోసం బాల్య వివాహాల నిషేధం కోసం ప్రయత్నించాడు.
- రాజమండ్రి దగ్గర ధవళేశ్వరంలో బాలికా పాఠశాలను స్థాపించాడు.
గద్య తిక్కనగా పేరుపొందాడు. - కేశవ చంద్రసేన్ ప్రభావం ఇతనిపై ఎక్కువగా ఉంది.
- దక్షిణ భారతదేశంలో సాఘిక, మత సంస్కరణోద్యమాన్ని ఇతడే ప్రారంభించాడు.
సావిత్రిబాయి పూలే: (1831-1897)
- మొదటి మహిళా ఉపాధ్యాయురాలు.
- మహారాష్ట్రలో మహిళల హక్కుల కోసం పోరాడింది.
- భర్త మరణానంతరం ‘సత్యశోధక్ సమాజ్’ బాధ్యతలను చేపట్టింది.
- ప్లేగు వ్యాధి కాలంలో ప్రతి రోజూ రెండు వేల మందికి అన్నం పెట్టింది.
- తారాబాయి షిండే ఈమెతో కలిసి పని చేసింది.
- బాలికల పాఠశాలను పుణెలో స్థాపించి హెచ్.ఎం.గా పనిచేసింది.
- దళితులను, వ్యవసాయదారులను, కూలీలను విద్యావంతులను చేయడానికి రాత్రి పాఠశాలలు స్థాపించింది.
- ‘మీకు మీ ప్రాణం మీద ఎంత ప్రేమో మహిళలకు కూడా అలా ఉండదా? ఆమె భర్త చనిపోయినందుకు ఆమె దురదృష్టవంతురాలు.
- ఆమె నుదుటి మీద కష్టాలు రాసి ఉన్నాయి. ఆమెను శుభకార్యాలకు కూడా వెళ్ళనివ్వరు’- తారాబాయి షిండే (1882) (స్త్రీ పురుష్ తుల్నా).
పండిత రమాబాయి సరస్వతి (1858-1922)
- మహారాష్ట్రలో జన్మించిన ఈమె సంస్కృత గ్రంథాలను చదివారు.
- తండ్రి మరణానంతరం తన సోదరుడితో దేశమంతా పర్యటించింది (కలకత్తా కూడా).
ఇంగ్లండ్, అమెరికా దేశాల మహిళా సంఘాల గురించి తెలుసుకోవడానికి ఆ దేశాలకు వెళ్లింది. - శారదా సదన్ అనే పాఠశాలను, ఆశ్రమాన్ని స్థాపించింది.
- వృత్తి విద్య నైపుణ్యాలను ఇందులో నేర్పించేవారు.
- ఆశ్రమంలో వితంతువులు, అనాథలు, అంధులకు వసతి, చదువు, వృత్తివిద్య, వైద్యసేవలను రమాబాయి అందించేవారు.
- పురుషులపై ఆధారపడి ఉంటారు కాబట్టే మహిళలు అన్ని దాష్టీకాలను మౌనంగా భరించాల్సి వస్తుంది,
- సొంత సంపాదన ఉంటేనే తమహక్కులు సాధిస్తారు. పశువులతో ప్రవర్తిస్తున్నట్లు పురుషులు స్త్రీలతో ప్రవర్తిస్తారు. మా పరిస్థితి మెరుగుపరచు కోవడా నికి ప్రయత్నిస్తే మేం పురుషులకు వ్యతిరేకులమనీ అంటున్నారు’- రమాబాయి
ముస్లిం మహిళలు- సంస్కరణలు:
- 20వ శతాబ్దం ఆరంభం నుంచి భోపాల్‌కు చెందిన బేగంలు ముస్లిం మహిళల్లో విద్యావ్యాప్తికి కృషి చేశారు.
- బేగం రోఖియా సఖావత్ హుస్సేన్
- ముస్లిం మహిళల్లో విద్యావ్యాప్తి కోసం ప్రయత్నించింది.
- పాట్నా కలకత్తాలో ముస్లిం బాలికల కోసం పాఠశాలలు ప్రారంభించారు.
- అన్ని మతాల నాయకులు మహిళలకు తక్కువ స్థానాన్ని ఇచ్చారని వాదిస్తూ సనాతన భావాలను విమర్శించింది.
సంఘ సంస్కరణలు – కుల వ్యవస్థ
- మహాత్మా జ్యోతిబాఫూలే : (1827-1890)
- మహారాష్ట్రలో జన్మించిన ఇతను క్రైస్తవ మత బోధకులు ప్రారభించిన పాఠశాలల్లో చదువుకున్నాడు.
- తన బ్రాహ్మణ మిత్రుడి పెళ్లి ఊరేగింపులో జరిగిన అవమానం ఇతని జీవితాన్ని మలుపు తిప్పింది.
- కులవ్యవస్థను వ్యతిరేకిస్తూ, అందరికంటే ఉన్నతులం అనే బ్రాహ్మణులను వ్యతిరేకించేవాడు/ ఖండించేవాడు.
- కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు.
- సత్యం సమానత్వం ఆధారంగా నూతన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించాడు.
- మహర్, మంగా కులాలకు చెందిన బాలికల కోసం ఒక పాఠశాలను 1928లో పుణెలో స్థాపించారు.
- కులవ్యవస్థకు వ్యతిరేకంగా గులాంగిరి అనే గ్రంథాన్ని రాశాడు.
- నిమ్న కులాల టీచర్లే పాఠాలు చెప్పే పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల కోసం ఉద్యమించాడు.
- వ్యాసరచన, చర్చ, వక్తృత్వం వంటి అంశాలతో పోటీలు పెట్టి నిమ్న కులాల వాళ్లల్లో ఆత్మ విశ్వాసం, ఆత్మగౌరవం పెంపొందేలా చేశాడు.
- బ్రాహ్మణులు లేకుండా, వివాహాలను, కర్మకాండలను నిర్వహించాలని నిమ్న కులాలకు పిలుపు నిచ్చాడు.
నారాయణ గురు: (1856-1928) కేరళ
- మనుషులందరికీ ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అనే భావనను ప్రచారం చేశాడు
- ఇతని తండ్రి ఆయుర్వేద డాక్టర్. తండ్రి నడిపిన బడిలోనే చదివాడు.
- ‘ఈఝువా’ కులస్థులకు సారాయి కాయడం, జంతుబలులు వంటివాటిని మానేయమని పిలుపునిచ్చాడు.
- కుల వివక్షతను పాటించని దేవాలయాలను స్థాపించి, బ్రాహ్మణ పూజారులు లేకుండా సామాన్య పూజా విధానాలు అనుసరించేవాళ్లు.
- గుడులు కట్టడం కంటే బడులు కట్టడం మేలని, కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించాడు.
భాగ్యరెడ్డి వర్మ (1888-1939):
- దళితులు తమ పరిస్థితిని గుర్తించి హక్కుల కోసం పోరాడేలా చేయడానికి ఇతడు కృషి చేశాడు.
- దళితులే ఈ ప్రాంతపు మూలవాసులు, ఆర్యులు దళితులను బలంతో అణచివేశారు.
- దళితులను ‘ఆది ఆంధ్రులు’ అనేవారు.
- దళితుల్లో చైతన్యం కలిగించడానికి 1906లో జగన్మిత్ర మండలిని స్థాపించాడు.
- దళితుల విద్యకు ప్రత్యేక నిధులు కేటాయించేలా నిజాంను ఒప్పించాడు.
- దళిత బాలికలను ‘దేవదాసీలు’, ‘జోగినీలు’గా చేయడాన్ని వ్యతిరేకించాడు.
- దళితులు బౌద్ధమతాన్ని స్వీకరించడానికి ప్రోత్సహించాడు.
Previous article
అంతరిక్షంలో మన శాస్త్ర తేజస్సు.. పీఎస్ఎల్వీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు