Who worked as a translator at Duple | డూప్లే వద్ద అనువాదకుడిగా పనిచేసినవారు?
1. భారతదేశానికి రెడ్ సీ ద్వారా మార్గం కనుగొన్న తరువాత పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా కాలికట్కు చేరుకున్నాడు. దీంతో భారత్‌కు యూరోపియన్ వర్తకుల ప్రవాహం ఎక్కువైంది. అయితే వాస్కోడిగామా కాలికట్కు చేరుకున్నదెప్పుడు?
1) 1498, మే 17 2) 1489, మే 18
3) 1498, మే 18 4) 1489, మే 17
2. కాలీకాత, సుతనాటి, గోవిందాపూర్ అనే మూడు గ్రామాల వద్ద కోల్‌కతాకు 1690లో పునాది వేశారు. 1700లో అక్కడ ఫోర్ట్ విలియం అనే కోటను నిర్మించారు. అయితే కోల్‌కతాకు పునాది వేసిందెవరు?
1) విలియం 2) జాబ్ చార్నోక్
3) లార్డ్ వెల్లస్లీ 4) రాబర్ట్ ైక్లెవ్
3. ఆదాయం కోసం ఆంగ్లేయుల వర్తక కేంద్రాలను ఆక్రమించుకోవడం ద్వారా ఫ్రెంచివారు ఆంగ్లేయులతో శత్రుత్వం పెంచుకున్నారు. దీంతో వారిరువురి మధ్య జరిగిన యుద్ధాలను కర్ణాటక యుద్ధాలు అంటారు. అయితే ఈ యుద్ధాలు వారిరువురి మధ్య ఎన్ని జరిగాయి?
1) ఒకటి 2) నాలుగు 3) మూడు 4) రెండు
4. కర్ణాటక యుద్ధాలకు కారణమైన ఫ్రెంచి గవర్నర్ ఎవరు?
1) అన్వరుద్దీన్ 2) రాబర్ట్ ైక్లెవ్
3) ముర్షీద్ కులీఖాన్ 4) డూప్లే
5. డూప్లే వద్ద దుబాసి (అనువాదకుడి)గా పనిచేసినది ఎవరు?
1) ఆనందరంగ పిళ్లై 2) సుబ్రమణియన్
3) రంగస్వామి 4) కుప్పుస్వామి
6. బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా సైన్యానికి, బ్రిటిష్ సైన్యాధిపతి రాబర్ట్ ైక్లెవ్ల మధ్య జరిగిన యుద్ధమే ప్లాసీ యుద్ధం. ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) 1756, జూన్ 22 2) 1757, జూన్ 23
3) 1765 జూలై 22 4) 1765 జూలై 23
7. బెంగాల్ నవాబుగా పదవిని కోల్పోయిన మీర్ ఖాసీం మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలం, అయోధ్య నవాబు షుజాఉద్దౌలాతో కలిసి ఆంగ్లేయులతో బక్సార్ వద్ద 1764 అక్టోబర్ 22న యుద్ధం చేశాడు. దీన్నే బక్సార్ యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో మీర్ ఖాసీం కూటమి ఓడిపోయింది. అయితే ఆంగ్లేయుల సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు?
1) రాబర్ట్ ైక్లెవ్ 2) వాన్ సిత్తార్
3) సర్ హెక్టర్ మన్రో 4) ఎవరూకాదు
8. రెండో సారి బెంగాల్ గవర్నర్‌గా నియమితులైన రాబర్ట్ ైక్లెవ్ 1765లో రెండో షా ఆలం, షుజాఉద్దౌలాతో అలహాబాద్ సంధి చేసుకున్నాడు. దీని ప్రకారం శిస్తు వసూలుచేసే దివానీ అధికారం ఆంగ్లేయులకు, పాలనాధికారం బెంగల్ నవాబు మీర్ జాఫర్‌కు, అతని తరువాత అతని కుమారుడైన నిజాముద్దౌలాకు లభిస్తుంది. మీర్ జాఫర్‌కు లభించిన పాలనాధికారాన్ని ఏమంటారు?
1) కొత్వాల్ 2) దివాన్-ఎ-ఖాస్
3) గవర్నర్ జనరల్ 4) నిజామత్
9. 1772-73లో బ్రిటిష్ పార్లమెంటు రెగ్యులేటింగ్ చట్టం చేసింది. దీని ప్రకారం భారత్‌లో ఆక్రమించిన భూభాగాలపై సంపూర్ణ పాలనాధికారాన్ని పార్లమెంటు నియమించిన గవర్నర్ జనరల్, అతని కౌన్సిల్ సభ్యులకు ఉంటుంది. అయితే మొదటి గవర్నర్ జనరల్‌గా నియామకమైనది ఎవరు?
1) వారన్ హేస్టింగ్స్ 2) లార్డ్ వెల్లస్లీ
3) రాబర్ట్ ైక్లెవ్ 4) కారన్ వాలీస్
10. 1767-69లో మైసూర్ రాజైన హైదరాలీ బ్రిటిష్‌వారితో కొన్ని షరతులతో సంధిచేసుకొని యుద్ధం విరమించాడు. అయినా బ్రిటిష్‌వారు ఇచ్చిన మాటప్రకారం హైదరాలీకి సహాయం చేయలేదు. అయితే ఈ యుద్ధాన్ని ఏమంటారు?
1) రెండో కర్ణాటక యుద్ధం
2) మొదటి మైసూరు యుద్ధం
3) మూడో కర్ణాటక యుద్ధం
4) రెండో మైసూరు యుద్ధం
11. హైదరాలీ 1780లో బ్రిటిష్‌వారిపై యుద్ధం చేసి కొన్ని విజయాలు సాధించి కర్ణాటక తీరాన్ని ఆక్రమించుకొన్నాడు. కానీ 1781 జూలైలో సర్ ఐర్క్యూట్ అనే బ్రిటిష్ సైన్యాధికారి మైసూర్ సైన్యాలను పోర్టినోవా వద్ద ఓడించాడు. అయినా హైదరాలీ తన యుద్ధం కొనసాగిస్తూనే 1782, డిసెంబర్ 7న మరణించాడు. అప్పడు అతని కుమారుడైన టిప్పుసుల్తాన్ యుద్ధం కొనసాగించాడు. దీన్నే రెండో మైసూర్ యుద్ధం అంటారు. ఈ యుద్ధం ఏ సంధితో ముగిసింది?
1) అలీనగర్ సంధి 2) ఐర్క్యూట్ సంధి
3) మంగళూరు సంధి 4) ఏదీకాదు
12. మంగుళూరు సంధి ఒప్పందాలను పక్కనపెట్టిన బ్రిటిష్ సైన్యం నిజాం నవాబు, మహారాష్ర్టులతో సంధి కుదుర్చుకొని టిప్పుసుల్తాన్‌పై యుద్ధం ప్రకటించింది. 1790-92లో జరిగిన ఈ యుద్ధాన్నే మూడో మైసూర్ యుద్ధం అంటారు. అయితే యుద్ధం ప్రకటించిన రెండో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు?
1) వారన్ హేస్టింగ్స్ 2) రాబర్ట్ ైక్లెవ్
3) లార్డ్ వెల్లస్లీ 4) కారన్ వాలీస్
13. టిప్పుసుల్తాన్ 1792లో బ్రిటిష్‌వారితో సంధిచేసుకొని మూడో మైసూర్ యుద్ధాన్ని ముగించాడు. ఈ సంధి ప్రకారం టిప్పు తన మైసూర్ రాజ్యంలోని సగం భూభాగాలను కోల్పోయాడు, జరిమానాగా రూ. 3.5 కోట్లను బ్రిటిష్‌వారికి చెల్లించాడు. అయితే ఈ సంధిని ఏమంటారు?
1) శ్రీరంగపట్నం సంధి 2) మైసూర్ సంధి
3) కారన్‌వాలీస్ సంధి 4) ఏదీకాదు
14. 1799లో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్‌గా నియమితులైన లార్డ్ వెల్లస్లీ తాను ప్రవేశపెట్టిన సైన్యసహకార పద్ధతిలో చేరమని ఆహ్వానం పంపగా టిప్పుసుల్తాన్ అందుకు నిరాకరించాడు. దీంతో వెల్లస్లీ టిప్పుపై యుద్ధం ప్రకటించాడు. డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్గా ప్రసిద్ధిగాంచిన వెల్లస్లీ సోదరుడు ఆర్థర్ వెల్లస్లీ నాయకత్వంలో బ్రిటిష్ సేనలు టిప్పు సేనలను ఓడించాయి. దీన్నే నాలుగో మైసూర్ యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో టిప్పు చంపబడ్డాడు. అయితే టిప్పుసుల్తాన్ మరణించింది ఎప్పుడు?
1) 1789 మే 3 2) 1799 మే 4
3) 1789 జూన్ 3 4) 1799 జూన్ 4
15. టిప్పుసుల్తాన్ తల్లిదండ్రులు హైదరాలీ, ఫాతిమా ఫక్రున్నిసా. బిరుదులు షేర్-ఎ-మైసూర్ (మైసూర్ పులి), టైగర్ ఆఫ్ ద ఈస్ట్. అయితే టిప్పు అసలు పేరేంటి?
1) రెండో హైదరాలీ 2) సాహెబ్ ఫతేఖాన్
3) ఫతే అలీఖాన్ సాహెబ్ 4) మూడో హైదరాలీ
16. కాశీ రాజు చైత్యసింగ్ను తొలగించడం, బెంగాల్లో ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి నందకుమార్‌కి మరణశిక్ష విధించడం, అయోధ్య వితంతు బేగంల ఆస్తులను కొల్లగొట్టడం వంటి అభియోగాలపై అభిశంసనకు గురైన ఏకైక బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు?
1) కారన్ వాలీస్ 2) లార్డ్ వెల్లస్లీ
3) డల్హౌసీ 4) వారన్ హేస్టింగ్స్
17. భారతదేశ చరిత్రను వెలుగులోకి తేవడానికి 1784లో కలకత్తాలో ఏసియాటిక్ సొసైటీని స్థాపించారు. ఈ సొసైటీని స్థాపించింది ఎవరు?
1) వారన్ హేస్టింగ్స్ 2) లార్డ్ వెల్లస్లీ
3) విలియం జోన్స్ 4) డల్హౌసీ
18. విలియం జోన్స్ మనుస్మృతి, గీతగోవిందం అనే సంస్కృత గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదించాడు. వీటితోపాటు ఆయన ఆంగ్లంలోకి అనువదించిన సంస్కృత నాటకం ఏది?
1) నలదమయంతి 2) మేఘసందేశం
3) రాజతరంగిణి 4) అభిజ్ఞాన శాకుంతలం
జవాబులు
1-1, 2-2, 3-3, 4-4, 5-1, 6-2, 7-3, 8-4, 9-1, 10-2, 11-3, 12-4, 13-1, 14-2, 15-3, 16-4, 17-3, 18-4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?