అంతరిక్షంలో మన శాస్త్ర తేజస్సు.. పీఎస్ఎల్వీ

- పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV). భారతదేశం మూడవ తరం ప్రయోగ వాహనం.
- లిక్విడ్ స్టేజీలతో కూడిన మొట్టమొదటి భారతీయ ప్రయోగ వాహనం ఇది.
- 1994 అక్టోబర్‌లో మొదటి ప్రయోగం విజయవంతమైనది.
- అత్యధిక ప్రయోగాలు విజయవంతం కావడంతో పీఎస్ఎల్వీ భారతదేశ విశ్వసనీయ, బహుముఖ ప్రయోగ వాహనంగా ఉద్భవించింది.
- 1994-2017 మధ్య పీఎస్ఎల్వీ ద్వారా 209 విదేశాలకు చెందిన ఉపగ్రహాలను, 48 దేశీయ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు.
- అంతేకాకుండా పీఎస్ఎల్వీతో రెండు అంతరిక్ష నౌకలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.
- ఇవి వరుసగా 2008లో చంద్రయాన్-1, 2013లో మార్స్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్.
భిన్న రూపాలు
ప్రస్తుతం పీఎస్ఎల్వీలో మూడు రకాలు ఉన్నాయి. అవి..
1. పీఎస్ఎల్వీ – సీ ఇది సాధారణ రూపం. దీనిలో స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఉంటాయి.
2. పీఎస్ఎల్వీ-సీఏ. ఇది Core alone రూపం. దీనిలో స్ట్రాప్ ఆన్ మోటార్స్‌ను తొలగిస్తారు.
3. పీఎస్ఎల్వీ- ఎక్స్ఎల్. దీనిలో సాధారణ స్ట్రాప్ ఆన్ మోటార్స్ కంటే ఎక్కువ శక్తిమంతమైన మోటార్లను వినియోగిస్తారు.
(600 కి.మీ)లో 1750 కేజీల పేలోడ్‌ను, జీటీఓలో 1425 పేలోడ్‌ను ప్రయోగించే సామర్థ్యం ఇది కలిగి ఉంది.
Vehicle Specifications
Height: 44 m
Diameter: 2.8 m
Number of Stages: 4
Lift Off Mass: 320 tonnes (XL)
Variants: 3 (PSLV-G, PSLV – CA, PSLV – XL)
First Flight: September 20, 1993
పీఎస్ఎల్వీ విశేషాలు
- చంద్రయాన్-1ని దీని ద్వారానే ప్రయోగించారు. ఇది భారతదేశపు మొదటి చంద్ర యాత్ర.
- మంగళయాన్ ఇది భారతదేశపు మొదటి గ్రహాంతర (అంగారక) యాత్ర దీన్ని కూడా పీఎస్ఎల్వీ ద్వారానే ప్రయోగించారు.
- భారతదేశపు మొదటి పూర్తిస్థాయి ఖగోళ పరిశోధక ఉపగ్రహం ఆస్ట్రోశాట్‌ను దీని ద్వారానే ప్రయోగించారు.
- పీఎస్ఎల్వీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.isro.gov.in/launchers/pslvలో తెలుసుకోవచ్చు.
ఇప్పటివరకు ప్రయోగించిన శాటిలైట్లు
- పీఎస్ఎల్వీ డీ1ను 1993, సెప్టెంబర్ 20న మొట్టమొదటిసారి ప్రయోగించారు. ఇది విజయవంతం కాలేదు.
- పీఎస్ఎల్వీ డీ2- దీన్ని అక్టోబర్ 15, 1994లో ప్రయోగించారు. పీఎస్ఎల్వీ శ్రేణిలో విజయవంతమైన మొదటి వాహనం.
- 2022 ఫిబ్రవరి 14న PSLV-C52/EOS-04 Missionతో మొత్తం 54 ప్రయోగాలు ఇస్రో చేసింది. దీనిలో కేవలం రెండు మాత్రమే విఫలమయ్యాయి.
- పీఎస్ఎల్వీని ఇస్రోకు నమ్మకమైన గుర్రంగా పిలుస్తారు.
- నాలుగు లిక్విడ్ స్టేజెస్ కలిగి ఉన్న భారతదేశపు మొదటి ప్రయోగ వాహనం. ఈ ప్రయోగ వాహనంలో మొత్తం 4 దశలు ఉన్నాయి.
- మొదటి, మూడు దశల్లో ఘన ఇంధనమైన హెచ్టీపీబీ, రెండో దశలో ద్రవస్థితి (లిక్విడ్)లో ఉన్న యూడీఎంహెచ్, నాల్గో దశలో ద్రవ మోనో మిథైల్ హైడ్రోజన్‌ను వినియోగించుకొంటుంది.
- రెండో దశలో వాడే ఇంజిన్‌ను వికాస్ ఇంజిన్ అంటారు. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినది.
Latest Updates
బీబీనగర్ ఎయిమ్స్‌లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
Let’s play a game of cricket with numbers…
The Independence struggle
ఆర్టికల్ 39(f)ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
పుట్టుకతోనే గుడ్డి, చెవిటి జీవులు ఏవి? ( బయాలజీ )
తనను తాను దున్నుకునే నేలలు?
జిలాబంది విధానాన్ని ప్రవేశ పెట్టినది ఎవరు
సంస్థానాలయుగం – తెలంగాణ సాహిత్యం
బహ్మనీలు..గోల్కండ కుతుబ్ షాహీలు
ముల్కీ ఉద్యమం మూలాలు