Accountancy .. Opportunity | అకౌంటెన్సీ.. అవకాశాలెన్నో..!
ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంస్థ కావచ్చు.. ఎవరైనా సరే బిజినెస్ రన్ చేస్తున్నారంటే కచ్చితంగా ఉండాల్సిన వ్యక్తి అకౌంటెంట్! వ్యాపార లావాదేవీలు ఒక క్రమపద్ధతిలో జరగాలన్నా.. కంపెనీ లాభాల బాటలో పయనించా లన్నా.. అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీలు ఉండాల్సిందే! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ సెక్టార్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దాంతోపాటే ఆ రంగంలో పనిచేసేవారికి డిమాండ్ కూడా బాగానే ఉంది. ఇతర ఏ కోర్సులు చేసినా నిరుద్యోగులుగా మిగిలిపోతారేమోకానీ.. అకౌంటింగ్ కోర్సులు మాత్రం బెస్ట్ కెరీర్‌కు బాటలు వేస్తాయి. ఇలాంటి అకౌంటింగ్, కామర్స్ టాప్ కోర్సుల్లో ముఖ్యమైనవి సీఏ, ఐసీడబ్లూఏ, ఐసీఎస్ఐ. ప్రస్తుతం ఈ కోర్సులకు విశేష ప్రాధాన్యం ఉంది. అందుకే ఈ వారం అకౌంటింగ్ కోర్సుల సమాచారం మీకోసం..
సీఏ
అకౌంట్స్ అనగానే ఇండియాలో మొదట గుర్తుకొచ్చేది చార్టర్డ్ అకౌంట్స్. అన్ని అంశాలపై నాలెడ్జ్ ఉంటుంది. అయితే సీఏ అంటే కష్టం, ఈ కోర్సు చేయాలంటే ఎన్నో ఏండ్లు కష్టపడాలి. రోజుకు 18 గంటలు చదవాలి. ఈ కోర్సు గురించి తరచూ వినిపించే మాటలు. కానీ సీఏ కోర్సు ఎవర్క్షిగీన్. దీన్ని పూర్తి చేసినవారికి విస్తక్షుత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. అయితే మనదేశంలో సీఏల కొరత చాలా ఉంది. ప్రస్తుతం లక్షల మంది సీఏలు అవసరం. కానీ మారిన పరిస్థితులకనుగుణంగా CA Institute వారు సీఏ కోర్సు విధానంలో మార్పులు తీసుకొచ్చారు. దీంతో సీఏ కోర్సు సులువుగా మారిందని చెప్పవచ్చు.
ఐసీడబ్లూఏ
సీఏ మాదిరిగానే వీరికి డిమాండ్ ఉన్న కోర్సు ఐసీడబ్లూఏ. ఒక సంస్థ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు.. ఉత్పత్తి చేసే ఏదైనా ప్రొడక్ట్‌ను మార్కెట్లో ఎలా తీసుకోవాలి? దానికి మార్కెటింగ్ ఎలా కల్పించాలి? ఖర్చులను ఎలా నియంవూతించాలి అంటే? ఐసీడబ్లూఏ పాత్ర ఉంది. అయితే మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలకు మాత్రమే వీరి అవసరం ఉంటుంది.
ఐసీఎస్ఐ
కంపెనీ యాన్యువల్ మీటింగ్ ఎలా ఏర్పాటుచేయాలి? బోర్డు డైరెక్టర్ల మీటింగ్ కండక్ట్ ఎలా చేయాలి? వాటిలో తీసుకోవాల్సిన నిర్ణయాలేంటి? వంటి వ్యవహారాలన్నీ చక్కబె కంపెనీ సెక్రటరీస్ అంటాం. వీరికి ‘కార్పొరేట్ లా’పై ఎక్కువగా అవగాహన ఉండాలి. బిజినెస్, దాని వ్యవహారాలతో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. కంపెనీకి సంబంధించిన లీగల్ అంశాలు కూడా వీరే చూసుకోవాలి. ఈ అంశాల్లో పట్టుసాధిస్తే ఐసీఎస్ఐ వారికి కూడా అనేక అవకాశాలన్నాయి.
అకాడమీ కోర్సులకూ డిమాండ్
లక్షల్లో అకౌంటెంట్లు అవసరం ఉన్న నేపథ్యంలో సీఏ, ఐసీడబ్లూఏ, సీఎస్‌లకు డిమాండ్ ఉన్నప్పటికీ వారి కొరత ఎక్కువగానే ఉంది. అయితే ఆ అవకాశాలన్నీ అకాడమిక్ కోర్సులు చేసినవారికి దక్కుతాయి. బీకాం, బీబీఎ, ఎంకాం, ఎంబీఏ ఇవన్నీ అకాడమిక్ కోర్సులు. కానీ వీరంతా ఎగ్జామ్ ఎలా రాయాలి? ఎలా స్కోర్ చేయాలి? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పరీక్షలు రాస్తుండటంతో వర్కింగ్ నాలెడ్జ్ లేకుండాపోతుంది. వ్యాట్, సేల్స్‌ట్యాక్స్, క్యాష్బుక్.. ఎలా మెయింటనెన్స్ చేయాలో తెలియదు. ఎప్పుడయితే ప్రాక్టికల్‌గా నాలెడ్జ్ వీరికి వస్తుందో సీఏ క్వాలిఫైడ్ అభ్యర్థుల అవకాశాలు వీరికి ఉంటాయి. అయితే అకాడమీ కోర్సులు చేసినవారు వర్కింగ్ నాలెడ్జ్‌ను పెంపొందించుకొంటే అనేక అవకాశాలున్నాయి.
ఉద్యోగాలు-హోదాలు
ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఇన్సూన్స్, మేనేజింగ్ డైరెక్టర్, ఫైనాన్స్ కంట్రోలర్, ట్యాక్స్ కన్సప్టూంట్, కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్లుగా, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, మార్కెటింగ్ మేనేజర్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్స్, ప్లాంట్ అకౌంటెంట్స్, సిస్టమ్ ఇంప్లిమెంటార్స్, టెక్నో ఫంక్షనిస్టులుగా అవకాశాలు పొందవచ్చు. అంతేకాకుండా అడ్మినిస్ట్రేటర్‌గా, వ్యాల్యూయర్‌గా ఉద్యోగాలు లభిస్తాయి.
ఉద్యోగాలు లక్షల్లో – అభ్యర్థులు వేలల్లో
భారత్‌లోనే కాకుండా ప్రపంచంలో ఎన్ని సంస్థలు, కంపెనీలు ఉన్నాయో వాటన్నింటిలోనూ అవకాశాలుంటాయి. ముఖ్యంగా సేవారంగం, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఇన్సూన్స్, సాఫ్ట్వేర్, వివిధ పరిక్షిశమల వంటి అనేక సంస్థలకు సీఏ, ఐసీడబ్లూఏ, సీఎస్ల అవసరం ఎంతో ఉంది. అయితే ఉద్యోగావకాశాలకనుగుణంగా క్వాలిఫై అకౌంటెట్స్ లేరు. సీఏ కోర్సు లు చేసిన వారికి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి. కాబట్టి సీఏ కోర్సు పూర్తిచేసిన వారికి వివిధ పరిక్షిశమలు, కంపెనీలు స్వాగతం పలుకుతున్నాయి.
డిమాండ్ ఎందుకంటే..!
కంపెనీల చట్టం ప్రకారం ప్రతి కంపెనీ తమ ఆర్థిక నివేదికలను సీఏతో సర్టిఫై చేయించాలి. అలాగే కోటి రూపాయల టర్నోవర్ కలిగిన ప్రతి సంస్థను తమ లెక్కలను తప్పనిసరిగా సీఏ అర్హత కలిగినవారితోనే ఆడిట్ చేయించాలి. ఇవే కాకుండా గవర్నమెంట్ ప్రాజెక్టులు, కోఆపరేటివ్ సొసైటీలు, బ్యాంకులు అన్ని తమ ఖాతాలను సీఏల చేత ఆడిట్ చేయించాలి. ఈ నేపథ్యంలో నిపుణులైన సీఏల అవసరం భారీస్థాయిలో ఉంది. ఇవేకాకుండా సీఏలు సొంతంగా ప్రాక్టీసు పెట్టుకునే అవకాశం ఉండటంతో బాగా డిమాండ్ ఉన్న కోర్సులివి.
సీఏ కోర్సులు చేయాలంటే
-ఇంటర్ (ఏ గ్రూపైనా)/డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
-సీపీటీ (కామన్ ప్రొఫిషియన్నీ టెస్ట్) ఎగ్జామ్ రాసేందుకు రిజిస్టర్ చేసుకోవాలి.
-ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర ట్రైనింగ్ (ఆర్టికల్‌షిప్) తీసుకోవాలి.
-ఐపీసీసీ (ఇంటిక్షిగే ప్రొఫెషనల్ కాంపెటెన్స్ కోర్సు)కు ఎన్రోల్ చేసుకోవాలి. అయితే దీంట్లో రెండు గ్రూపులుంటాయి. ఈ రెండింటిలోనూ పాస్ కావాలి.
-ఇవన్నీ పూర్తయ్యాక సీఏ ఫైనల్ పరీక్ష రాయాలి.
-అయితే సీఏ ఎగ్జామ్ రాసే లోపు అర్టికల్షిప్ తప్పనిసరిగా పూర్తి చేయాలి.
-డిగ్రీ అభ్యర్థులయితే సీపీటీ అటెంప్ట్ చేయకుండా డైరెక్ట్‌గా ఐపీసీసీ రాయాలి.
-ఐసీడబ్లూఏ అయితే ఐసీడబ్లూఏ ఫౌండేషన్, సీఎస్ అయితే కంపెనీ సెక్రటరీ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.
-వీరు రెండేండ్లు అర్టికల్షిప్ చేయాలి.
-జీతభత్యాలు : ప్రారంభంలోనే కనీసం నెలకు రూ. లక్షకుపైగా ఉంటుంది.
-నోటిఫికేషన్ : ఏడాదికి రెండుసార్లు వెలువడుతాయి. జూన్/డిసెంబర్లో ఉంటుంది.
కావాల్సిన నైపుణ్యాలు
-కామర్స్‌పై పూర్తి అవగాహన
-తార్కిక ఆలోచన నైపుణ్యం
-ప్రాక్టికల్‌గా అన్వయించే సామర్థం
-వాక్చాతుర్యం, కమ్యూనికేషన్ స్కిల్స్
మరిన్ని వివరాల కోసం
Raavi smart links private limited,
Vikasnagar, Dilsukhnagar,
Ph : 040-66628856
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?