Hyderabad Landlord Act | హైదరాబాద్ భూమిశిస్తు చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది?
తెలంగాణ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ
1. హైదరాబాద్ దక్కన్ కంపెనీ ఏర్పడిన తర్వాత 1920లో సింగరేణి కాలరీస్ కంపెనీ ఆవిర్భవించింది. దీంతో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. పబ్లిక్‌వర్క్స్ డిపార్ట్మెంట్తో నీటిపారుదల వృద్ధి, గోదావరి లోయ రైల్వేలైనువల్ల నూనెగింజల ఉత్పత్తి పెరిగింది. 1874లోనే మొదటి పత్తిమిల్లు ఏర్పడింది. 1901 నాటికే 68 అతిపెద్ద పారిశ్రామిక సంస్థలు ఏర్పడగా, 1920 నాటికి వీటి సంఖ్య 330కి పెరిగింది. అయితే నిజాం కాలంలో ముఖ్యమైన పారిశ్రామిక ఉత్పత్తులు ఏవి?
ఎ. బొగ్గు
బి. ఎగుమతులకు సంబంధించిన వస్ర్తాలు, వజ్రాలు, నౌకా నిర్మాణం
సి. స్వదేశీ డిమాండ్‌కు అవసరమైన విలాస వస్తువులు డి. యుద్ధ సామాగ్రి
1) ఎ, బి, సి 2) ఎ 3) ఎ, డి 4) బి, సి, డి
2. 1918లో కామర్స్ పరిశ్రమల శాఖ (సీఐడీ)ను ఏర్పాటు చేశారు. 1929లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ట్రస్ట్ఫండ్ సీఐడీ విధులను పంచుకునేది. అదేవిధంగా చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమల అభివృద్ధికి 1917లో ఏర్పాటు చేసిన సంస్థ?
1) ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్
2) ఇండస్ట్రియల్ ల్యాబొరేటరి
3) పారిశ్రామిక అభివృద్ధి సంస్థ
4) పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్
3. హైదరాబాద్ రాష్ట్రంలో పారిశ్రామికవాడలను అభివృద్ధి చేయడానికి ప్రముఖ ఇంజినీర్, మైసూర్ రాష్ట్ర ప్రధాని అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫారసులతో పారిశ్రామికవాడలను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) గోదావరిఖని-రామగుండం 2) గుల్బర్గా
3) ముషీరాబాద్ 4) ముషీరాబాద్-ఆజంగర్
4. చేతివృత్తుల కుటీర పరిశ్రమలైన పట్టు, ఊలు బట్టలు, బిద్రివేర్, బొమ్మల తయారీ, తోలు వస్తువుల అభివృద్ధి కోసం 1930లో ఏర్పాటు చేసిన సంస్థ?
1) ఇండస్ట్రీస్ ఇన్స్టిట్యూట్
2) కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్స్టిట్యూట్
3) ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ సెక్షన్
4) పారిశ్రామిక ఎగ్జిబిషన్
5. టాటాల షహబాత్ సిమెంట్ కంపెనీ, దక్కన్ గ్లాస్ వర్క్స్ కంపెనీలు, 1929-50 మధ్యకాలంలో 85 గనులు, ఉత్పత్తి రంగాల కంపెనీల్లో 43 సంస్థలు నిజాం ప్రభుత్వం నుంచి రూ. 76 కోట్లు సహాయం పొందాయి. ఇలాంటి పారిశ్రామిక కార్పొరేట్ పరిశ్రమలకు విత్త వనరులు సమకూర్చడానికి ఏర్పాటు చేసిన సంస్థ?
1) ఇండస్ట్రీస్ ఇన్స్టిట్యూట్ 2) ఇండస్ట్రీస్ ఫండ్
3) ఇండస్ట్రియల్ ట్రస్ట్ఫండ్ 4) కామర్స్ పరిశ్రమల శాఖ
6. నిజాంల పరిపాలనాకాలంలో అంతర్జాతీయంగా ఆర్థికమాంద్యం ఎప్పుడు సంభవించింది?
1) 1929-33 2) 1929-30
3) 1927-29 4) 1929-34
7. రైల్వేల అభివృద్ధికోసం నిజాం స్టేట్ రైల్వే కంపెనీ (ఎన్ఆర్ఎస్సీ) రోడ్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్ను 1932లో ప్రారంభించింది. ఇది భారదేశంలోనే ప్రభుత్వ ఏకస్వామ్యంలో ఏర్పడిన మొదటి రోడ్ ట్రాన్స్పోర్ట్. విమానయానం కూడా ఎన్ఆర్ఎస్సీ ఆధ్వర్యంలోనే మొదలైంది. హైదరాబాద్ రాష్ట్రంలో నిటిపారుదల శాఖ 1878లో ఏర్పడింది. అయితే నిజాం సాగర్ ద్వారా జలవిద్యుత్ ఉత్పత్తి ఎప్పుడు మొదలైంది?
1) 1929 2) 1930 3) 1931 4) 1932
8. నిజాం రాష్ట్రంలో అక్బర్ హైదరీ తీసుకువచ్చిన బడ్జెటరీ విధానంలో ప్రణాళికా రచన అంశాలు 1922లోనే ప్రతిబింబించాయి. 1929లో ఇండస్ట్రియల్ ట్రస్ట్ఫండ్ను ఏర్పాటుచేసినప్పుడు ప్రణాళికారచన అంశాలను ఆచరించారు. అయితే హైదరాబాద్ రాష్ట్రంలో ప్రణాళికా శాఖను ఎప్పుడు ఏర్పాటుచేశారు?
1) 1922 2) 1929 3) 1933 4) 1943
9. బొంబాయి భూమిశిస్తు చట్టం-1879లోని అంశాలను జోడించి రూపొందించిన హైదరాబాద్ భూమిశిస్తు చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది?
1) 1908 2) 1918 3) 1928 4) 1938
10. సింగరేణి కాలరీస్ కంపెనీ ఎప్పుడు ఏర్పడింది?
1) 1919 2) 1920 3) 1921 4) 1922
11. కింది వాటిని జతపర్చండి.
ఎ. హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం
1. 1907
బి. ఆసామి షక్మీ చట్టం 2. 1939
సి. ఎంఎస్ భరూచీ కమిటీ 3. 1944
డి. మల్ఘజరీ రెవెన్యూ చట్టం 4. 1950
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
12. రైత్వారీ విధానంలో ఎంత శాతం భూమి ఉంది?
1) 39 శాతం 2) 37 శాతం
3) 36 శాతం 4) 38 శాతం
13. మహల్వారి విధానంలో ఎవరి ఆధీనంలో భూమి హక్కులు ఉంటాయి?
1) జాగీర్దార్లకు 2) గ్రామంకు
3) జమీందార్లకు 4) రైతులకు
14. ఖల్సా విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
1) సబావు ఫకీర్-ఉల్-ముల్- 1878
2) నవాబ్ ఖాన్- 1875
3) మహారాజ కిషన్ ప్రసాద్ సింగ్
4) సాలార్జంగ్- 1875
15. సింగరేణి ప్రాంతంలో 1871లో బొగ్గు గనులను కనుగొన్నారు. ఈ నిక్షేపాలను కనుగొన్న భారతీయ భౌగోళిక సర్వేశాఖ అధికారి ఎవరు?
1) బ్లన్ ఫోర్డ్ 2) డబ్ల్యూ కింగ్
3) కిషన్ ప్రసాద్ 4) సాలార్జంగ్
16. కింది వాటిని జతపర్చండి.
ఎ. బేతలు 1. భూమిపై హక్కులు లేనివారు
బి. గల్లా మక్తా 2. భూమిపై హక్కులు కలిగినవారు
సి. ఆసామీ షక్మీదారులు 3. స్థిర కౌలు పద్ధతి
డి. షక్మీదారులు 4. పంటలో కొంత భాగం కౌలుగా చెల్లించడం
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
17. హైదరాబాద్ రాష్ట్రంలో పారిశ్రామిక సహకార సంఘాలకు శ్రీకారం చుట్టి, పరిశ్రమల ఉత్పత్తులకు మార్కెటింగ్ కోసం ఎగ్జిబిషన్లను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1930 2) 1925 3) 1920 4) 1918
జవాబులు
1-4, 2-2, 3-4, 4-2, 5-3, 6-1,7-2, 8-4, 9-1, 10-2, 11-1, 12-4, 13-2, 14-4, 15-2, 16-1, 17-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?