అంతర్జాతీయ సరిహద్దులు విశేషాలు
సరిహద్దున ఉన్న భూభాగాలకు సంబంధించి రెండు దేశాల మధ్య తరచూ వివాదాలు జరుగుతూ ఉంటాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని గ్రామాలు తమవేనంటూ చైనా వాదిస్తూ ఉండటం, అక్కడ మిలిటరీ క్యాంపులు ఏర్పాటు చేయడం, వాటికి కొత్త పేర్లు పెట్టడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో దేశాల మధ్య ఉండే అంతర్జాతీయ సరిహద్దులు, వాటిని ఎవరు ఏర్పాటు చేశారనే సమాచారం తెలుసుకుందాం..
డ్యూరాండ్ రేఖ: ఇది పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉంది. రెండు దేశాల మధ్య ఈ హద్దులను సర్ మార్టిమర్ డ్యూరాండ్ 1896లో ఏర్పాటు చేశారు.
-హిండెన్‌బర్గ్ రేఖ: ఇది జర్మనీ, పోలాండ్ మధ్య ఉంది. 1917లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ దీన్ని ఏర్పాటు చేసింది.
-లైన్ ఆఫ్ కంట్రోల్: ఇది భారత్, పాకిస్థాన్ మధ్య ఉంది. రెండు దేశాల మిలిటరీ ఆధీనంలో ఉన్న కశ్మీర్‌ను లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ) విడదీస్తుంది. మన దేశంలో ఉన్న భూభాగాన్ని జమ్ముకశ్మీర్ అని, పాకిస్థాన్‌లో ఉన్న భూభాగాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ (గిల్గిత్-బల్టిస్థాన్) అని పిలుస్తారు.
-దీన్ని మొదట కాల్పుల విరమణ ఒప్పంద రేఖ (Cease-fire Line) అని పిలిచేవారు. అయితే 1972, జూలై 3న జరిగిన సిమ్లా ఒప్పందం తర్వాత అధికారికంగా దీన్ని ఎల్ఓసీగా మార్చారు.
-మెక్‌మోహన్ రేఖ: ఇది భారత్, చైనా మధ్య ఉంది. దీన్ని నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన సర్ హెన్రీ మెక్‌మోహన్ 1914లో ఏర్పాటు చేశారు. ఇది హిమాలయ పర్వతాల వెంట సుమారు 890 కి.మీ. భూటాన్ పశ్చిమ ప్రాంతం నుంచి బ్రహ్మపుత్రా నది తూర్పు వైపు ఉంది.
-రాడ్‌క్లిఫ్ రేఖ: భారత్, పాకిస్థాన్ మధ్య ఉంది. దీన్ని 1947లో సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ రూపొందించారు.
-మాజినాట్ లైన్: ఇది ఫ్రాన్స్, జర్మనీ మధ్య ఉంది. దీన్ని 1929-38 మధ్య నిర్మించారు. ఫ్రెంచ్ యుద్ధ శాఖ మంత్రి ఆండ్రి మాజినాట్ పేరు మీదుగా దీనికి ఈ పేరు వచ్చింది.
-మన్నెర్హీమ్ రేఖ: ఇది రష్యా, ఫిన్లాండ్ మధ్య ఉంది. దీన్ని ఫీల్డ్ మార్షల్ ఎమిల్ మన్నెర్హీమ్ సోవియట్ రష్యా, ఫిన్లాండ్ మధ్య ఏర్పాటు చేశారు. దీని నిర్మాణం రెండు దశల్లో 1920-1924 వరకు, 1932-1939 మధ్య జరిగింది.
-ఓల్డర్ నీస్సే లైన్: ఇది జర్మనీ, పోలాండ్ మధ్య ఉంది.
-సీగ్‌ఫ్రైడ్ లైన్: జర్మనీ, ఫ్రాన్స్ మధ్య ఈ రేఖ ఉంది.
-17వ సమాంతర రేఖ: వియత్నాం కలిసిపోక ముందు ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం మధ్య ఈ సరిహద్దు రేఖ ఉంది.
-24వ సమాంతర రేఖ: భారత్, పాకిస్థాన్ మధ్య పాక్ ఏర్పాటు చేసిన సమాంతర రేఖ. అయితే దీన్ని భారత్ గుర్తించలేదు.
-26వ దక్షిణ సమాంతర రేఖ: ఇది ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణఅమెరికా ఖండాల గుండా వెళ్లే అక్షాంశానికి సమాంతరంగాగల వలయం.
-36వ సమాంతర రేఖ: మిస్సోరీ రాష్ర్టానికి దక్షిణం వైపున అర్కాన్సాస్ రాష్ట్రంతోగల సరిహద్దు రేఖ.
-38వ సమాంతర రేఖ: ఇది దక్షిణకొరియా, ఉత్తరకొరియా దేశాలను విభజిస్తూ వెళ్లే అక్షాంశానికి సమాంతరంగా ఉంటుంది.
-39వ ఉత్తర సమాంతర రేఖ: ఇది భూమధ్య రేఖకు ఉత్తరాన 39 డిగ్రీల అక్షాంశానికి ఊహాత్మక వలయంలా ఉంటుంది.
-40వ ఉత్తర సమాంతర రేఖ: ఇది మేరీలాండ్‌లోని బ్రిటిష్ కాలనీకి వాస్తవిక ఉత్తర సరిహద్దును ఏర్పరుస్తుంది.
-45వ ఉత్తర సమాంతర రేఖ: ఇది ఉత్తర ధృవానికి, భూమధ్య రేఖకు మధ్యగల సమాంతర రేఖ.
-49వ సమాంతర రేఖ: ఇది అమెరికా, కెనడా దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖ.
-30వ ఉత్తర సమాంతర రేఖ: ఈ రేఖ ఉత్తర ధృవానికి, భూమధ్య రేఖకు మధ్య 1/3 వంతు దూరం వరకుగల అక్షాంశానికి సమాంతరంగా ఉంటుంది.
-33వ ఉత్తర సమాంతర రేఖ: ఇది అమెరికాలోని దక్షిణాది రాష్ర్టాలు.. ఉత్తర ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, చైనాలోని కొన్ని ప్రాంతాలను ఛేదిస్తూ వెళ్లే అక్షాంశానికి సమాంతర వలయంగా ఉంటుంది.
-35వ ఉత్తర సమాంతర రేఖ: ఇది నార్త్ కరోలినా, జార్జియా రాష్ర్టాల మధ్య.. టెన్నెస్సీ, జార్జియా, అలబామా, మిసిసిపీ రాష్ర్టాల మధ్య సరిహద్దుగా ఉంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు