Rajya Sabha members are not members | రాజ్యసభ సభ్యులు మెంబర్లుగాలేని కమిటీలు?
ఇండియన్ పాలిటీ
1. కింది కమిటీలు వాటి సిఫారసులను జతపర్చండి.
ఎ. రాజమన్నార్ కమిటీ 1. రాష్ట్రపతి పాలనను చివరి అస్త్రంగా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి
బి. భగవాన్ సహాయ్ కమిటీ 2. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ కాదు. రాజ్యాంగం ఏర్పాటు చేసిన రాష్ర్టాధినేత
సి. సర్కారియా కమిషన్ 3. రాష్ట్రపతి పాలనను తెలుపుతున్న ప్రకరణ 356ను తొలగించాలి
డి. పూంచీ కమిషన్ 4. గవర్నర్ల వ్యవస్థను రాజకీయ ఫుట్‌బాల్‌గా ఉపయోగించుకోవడం తక్షణం ఆపాలి
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-4
2. అంతర్రాష్ట్ర మండలికి సంబంధించి సరైనవి?
ఎ. సర్కారియా కమిషన్ సిఫారసు మేరకు ఏర్పాటు చేశారు
బి. 1990లో దీన్ని ఏర్పాటు చేశారు
సి. 1985లో దీన్ని ఏర్పాటు చేశారు
డి. స్వరణ్‌సింగ్ కమిషన్ సిఫారసు మేరకు ఏర్పాటు చేశారు
ఇ. ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు
ఎఫ్. కేంద్ర హోంమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు
1) ఎ, బి, ఇ 2) బి, డి, ఇ
3) ఎ, సి, ఇ 4) ఎ, సి, ఎఫ్
3. కింది వాటిలో సరైనది?
ప్రతిపాదన (A): ప్రకరణ 21 వ్యక్తి స్వేచ్ఛకు, జీవితానికి రక్షణను కల్పిస్తుంది
కారణం (R): వ్యక్తి గౌరవప్రదంగా జీవించే హక్కులో ఆరోగ్య రక్షణ కూడా ఒక భాగం
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు 3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
4. కింది వాటిలో సరైనది?
ప్రతిపాదన (A): మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదురయ్యే సమస్యలను రాజ్యాంగం పరిష్కరించే విధంగా ఉండాలి.
కారణం (R): పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగ చట్టాలను సవరించాలి.
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు 3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
5. లోక్‌సభలో మొదటిసారిగా ప్రతిపక్షనాయకుని హోదా పొందినవారు?
1) ఏకే గోపాలన్ 2) వైబీ చవాన్
3) శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 4) ఇందిరాగాంధీ
6. రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షుడు కింది వాటిలో దేనికి ఎన్నికయ్యేందుకు అర్హత కలిగిన వాడై ఉండాలి?
1) లోక్‌సభ 2) రాజ్యసభ
3) లోక్‌సభ కాని, రాజ్యసభకాని
4) లోక్‌సభ, రాజ్యసభ రెండూ
7. రాజ్యసభ సభ్యులు మెంబర్లుగా లేని కమిటీలేవి?
ఎ. ప్రభుత్వఖాతాల సంఘం బి. అంచనాల సంఘం సి. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్
1) ఎ, బి 2) బి 3) సి 4) ఎ, సి
8. దేశంలో ఒక బలమైన రాజకీయ పార్టీగా బీజేపీ ఆవిర్భావ ప్రభావం ఎటువంటి పర్యవసానానికి దారి తీసింది?
1) మత ప్రాతిపదికగా ఓట్లు దృతం కావడం
2) రెండు పార్టీల వ్యవస్థ ఏర్పడటం
3) సంకీర్ణ రాజకీయాల ప్రారంభం
4) ఒకే పార్టీ ఆధిపత్యం అంతమవడం
9. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి లోక్‌సభ స్పీకర్ ఎవరు?
1) అనంతశయనం అయ్యంగార్
2) జీవీ మౌలాంకర్ 3) సచ్చిదానంద సిన్హా
4) నీలం సంజీవరెడ్డి
10. స్థానిక స్వపరిపాలనకు సంబంధించి సరైనవి ఏవి?
ఎ. స్థానిక సంస్థల్లో 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించిన మొదటి రాష్ట్రం- రాజస్థాన్
బి. స్థానిక సంస్థల్లో 50 శాతం స్థానాలు మహిళలకు కేటాయించిన మొదటి రాష్ట్రం- బీహార్
సి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడం తప్పనిసరి చేస్తూ చట్టం చేసిన రాష్ట్రం- గుజరాత్
డి. ఎస్సీలు లేకపోవడంతో స్థానిక సంస్థల్లో ఎస్సీ రిజర్వేషన్లను రద్దుచేసిన రాష్ట్రం- అరుణాచల్‌ప్రదేశ్
ఇ. కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖను 2004లో ఏర్పాటు చేశారు
ఎఫ్. కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖను 1993లో ఏర్పాటు చేశారు
1) ఎ, సి, ఎఫ్ 2) బి, సి, డి, ఎఫ్
3) బి, సి, డి, ఇ 4) బి, సి, ఎఫ్
11. కిందివాటిలో ట్రిబ్యునల్స్ గురించి సరైనది.
ఎ. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని చేర్చారు
బి. 14 A అనే నూతన భాగంలో వీటిని చేర్చారు
సి. స్వరణ్‌సింగ్ కమిటీ సూచనలను అనుసరించి వీటిని రాజ్యాంగంలో చేర్చారు
డి. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది
1) ఎ, బి, డి 2) బి, డి 3) ఎ, బి 4) పైవన్నీ
12. కింది వాటిని జతపర్చండి.
ఎ. ప్రాథమిక విధుల దినోత్సవం 1. 26 నవంబర్
బి. రాజ్యాంగ దినోత్సవం 2. 9 జనవరి
సి. ప్రవాసీ భారతీయ దివస్ 3. 3 జనవరి
డి. ప్రపంచ మానవహక్కుల దినోత్సవం 4. 10 డిసెంబర్
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-4, సి-1, డి-2
13. సుప్రీంకోర్టు న్యాయ సమీక్షా అధికారానికి సంబంధించి కింది వాటిలో సరైనవి?
ఎ. శంకరీ ప్రసాద్ కేసులో, సజ్జన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు కేవలం సాధారణ శాసనాలను మాత్రమే న్యాయసమీక్షకు గురిచేయవచ్చని తీర్పునిచ్చింది
బి. గోలక్‌నాథ్ కేసులో, కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణలను కూడా న్యాయసమీక్షకు గురిచేయవచ్చని పేర్కొంది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) రెండూ తప్పు
14. రాష్ట్ర శాసన వ్యవస్థకు సంబంధించి కిందివాటిలో సరైనవి.
ఎ. సాధారణ బిల్లుల్ని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు
బి. గవర్నర్ అనుమతితో ఆర్థిక బిల్లులు మొదట విధానసభలోనే ప్రవేశపెట్టాలి
సి. విధానపరిషత్లకు రాజ్యాంగ సవరణ ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేదు
డి. రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నుకుంటారు, ఎమ్మెల్సీలకు అవకాశం లేదు
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి, డి 4) పైవన్నీ
15. కింది వాటిలో సరైనది?
ప్రతిపాదన (A): 42వ రాజ్యాంగ సవరణను మినీ కాన్స్టిట్యూషన్ అంటారు
కారణం (R): రాజ్యాంగంలోని చాలా అంశాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించారు
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు 3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
16. కింది వాటిలో సరైనది?
ప్రతిపాదన (A): ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు
కారణం (R): ప్రవేశికను ఒకసారి సవరించారు
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు 3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
17. సాధారణ ప్రజలు దేశపతాకాన్ని ఎగురవేయకూడదనే నిబంధనను తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసిన వ్యక్తి?
1) నవీన్ మిట్టల్ 2) నవీన్ జిందాల్
3) నవీన్ సింగ్ 4) నవీన్ మిశ్రా
18. దేశ భూభాగంలోని కొంత భాగాన్ని విదేశీ రాజ్యానికి ఇచ్చే ఒడంబడిక ఏ ప్రాతిపదికపై జరుగుతుంది?
1) రాష్ట్రపతి ప్రకటన 2) ఆర్డినెన్స్
3) రాజ్యాంగ సవరణ 4) సాధారణ చట్టం ద్వారా
19. రాజ్యాంగంలో భారత తాత్వికతను పొందుపరిచింది?
1) పీఠిక 2) ప్రాథమిక హక్కులు
3) అత్యవసర అంశాలు 4) ఆదేశిక సూత్రాలు
20. గవర్నర్‌గా ఒక వ్యక్తి ఎన్నిసార్లు నియామకం కావచ్చు?
1) ఒకటి 2) రెండు 3) ఎన్నిసార్లయిన 4) మూడు
21. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు?
1) మార్చి 24 2) అక్టోబర్ 24
3) ఆగస్టు 24 4) ఏప్రిల్ 24
22. కింది వాటిని జతపర్చండి.
ఎ. జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రస్తుత చైర్మన్ 1. హెచ్ఎల్ దత్తు
బి. జాతీయ ఎస్టీ కమిషన్ ప్రస్తుత చైర్మన్ 2. పీఎల్ పూనియా
సి. జాతీయ ఎస్సీ కమిషన్ ప్రస్తుత చైర్మన్ 3. రామేశ్వర్ ఒరాన్
డి. జాతీయ మైనారిటీ కమిషన్ ప్రస్తుత చైర్మన్ 4. నసీమ్ అహ్మద్
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2 4) ఎ-3, బి-1, సి-2, డి-4
23. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు సంబంధించి సరైనది.
ఎ. కే సంతానం కమిటీ సూచన మేరకు దీన్ని ఏర్పాటు చేశారు
బి. సర్కారియా కమిషన్ సూచన మేరకు దీనిని ఏర్పాటు చేశారు
సి. ఏకసభ్య సంస్థ
డి. బహుళసభ్య సంస్థ
ఇ. మొదటి సీవీసీ నిట్టూరు శ్రీనివాసరావు
1) ఎ, సి, ఇ 2) బి, డి, ఇ
3) ఎ, డి, ఇ 4) బి, సి, ఇ
24. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌కు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే పదవిని అమెరికా నుంచి గ్రహించాం
బి. రాష్ట్రపతిచే నియమించబడతాడు
సి. కనీస వయస్సు రాజ్యాంగంలో పేర్కొనలేదు
డి. పదవీ కాలం ఆరేండ్లు లేదా గరిష్ట వయస్సు 65 ఏండ్లు
ఇ. ఇతన్ని తొలగించాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిని పాటించాలి
1) సి, బి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, డి, ఇ 4) బి, సి, డి, ఇ
25. కేంద్ర రాష్ర్టాల మధ్య వివాదాలకు కారణమవుతున్న అంశాలేవి?
ఎ. ప్రకరణ 365-రాష్ట్రపతి పాలన విధించడం
బి. గవర్నర్ నియామకంలో రాష్ర్టాల ప్రమేయం లేకపోవడం
సి. కేంద్ర సాయుధ దళాలను రాష్ర్టాల్లో మోహరించడం
డి. రాష్ట్ర పాలనలో కేంద్రం తరచుగా జోక్యం చేసుకోవడం
ఇ. అఖిల భారత సర్వీసులు
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) పైవన్నీ
26. కింది కేంద్ర పాలిత ప్రాంతాలు అవి ఏర్పడిన సంవత్సరాలను జతపర్చండి
ఎ. ఢిల్లీ 1. 1956
బి. చండీగఢ్ 2. 1966
సి. పుదుచ్చేరి 3. 1962
డి. దాద్రా నగర్‌హవేలీ 4. 1961
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
27. కిందివాటిలో సరైనది.
ప్రతిపాదన (A): ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ప్రధాన ఉద్దేశం ప్రజా ప్రయోజనాలు, సమష్టి ప్రయోజనాలు
కారణం (R): ఈ భావన మొదటగా బ్రిటన్‌లో ఆవిర్భవించింది.
1) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ 2) A, Rలు రెండూ నిజం కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?