First person to receive the Bharat Ratna posthumously | మరణానంతరం భారతరత్న పొందిన మొదటి వ్యక్తి ఎవరు?
1. కింది వాటిలో ఏ ఖర్చులు భారత సంఘటిత నిధి నుంచి తీసుకోబడుతాయి?
ఎ. రాజ్యసభ అధ్యక్షుని జీతభత్యాలు
బి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జీతభత్యాలు
సి. అటార్నీ జనరల్ జీతభత్యాలు డి. లోక్‌సభ స్పీకర్ జీతభత్యాలు
1) ఎ, సి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
2. కింది లోక్‌సభ స్పీకర్లు పనిచేసిన కాలం ప్రకారం సరైన వరుస క్రమం ఏది?
ఎ. సోమనాథ్ ఛటర్జీ బి. బలరామ్ జక్కర్
సి. మనోహర్ జోషి డి. పీఏ సంగ్మా
1) ఎ, సి, బి, డి 2) డి, ఎ, బి, సి
3) బి, డి, సి, ఎ 4) సి, డి, ఎ, బి
3. ప్రతిపాదన
(A): భారత రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛను పౌరులకు ప్రసాదించింది
కారణం (R) : ప్రభుత్వాలు చట్టబద్ధంగా వ్యక్తుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలపై హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు
1) A, Rలు నిజం, Aకు, R సరైన వివరణ
2) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
4. ప్రతిపాదన
(A): పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు అత్యవసరంగా శాసనం చేయాల్సి వచ్చినప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీచేస్తారు
కారణం (R) : రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ కాలంలో అత్యధిక ఆర్డినెన్స్‌లు జారీ అయ్యాయి
1) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ 2) A, Rలు రెండూ నిజం కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
5. జాతీయ అభివృద్ధి మండలిని జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలిగా మార్చాలని సూచించిన కమిషన్ ఏది?
1) రాజమన్నార్ కమిటీ
2) సర్కారియా కమిషన్
3) అశోక్ మెహతా కమిటీ
4) రాజ్యాంగ పునఃసమీక్షా కమిషన్
6. ఎన్నికల ప్రచార సమయం ఎన్ని రోజులు?
1) 14 2) 21 3) 16 4) 23
7. ఇందిరాగాంధీ ఎన్నికను సవాల్‌చేస్తూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసింది ఎవరు?
1) జయప్రకాష్ నారాయణ 2) రాజ్ నారాయణ్
3) మొరార్జీ దేశాయ్ 4) పై అందరూ
8. హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు తొలగిస్తారు?
1) గవర్నర్
2) పార్లమెంట్ తీర్మానం మేరకు రాష్ట్రపతి
3) రాష్ట్ర శాసనసభ తీర్మానం మేరకు గవర్నర్
4) రాష్ట్ర శాసనసభ తీర్మానం మేరకు రాష్ట్రపతి
9. ఏక కాలంలో ఇద్దరు ఉపప్రధానులను నియమించిన ప్రధాని ఎవరు?
1) జవహర్లాల్ నెహ్రూ 2) ఇందిరాగాంధీ
3) మొరార్జీ దేశాయ్ 4) వీపీ సింగ్
10. కింది కేసుల వరుస క్రమం ఏది?
1) కేశవానంద భారతి 2) గోలక్‌నాథ్
3) మినర్వామిల్స్ 4) సజ్జన్‌సింగ్
1) 3,2,4,1 2) 1,4,3,2
3) 4,2,1,3 4) 2,4,3,1
11. కిందివాటిని జతపర్చండి.
1) ప్రభుత్వ ఖాతాల సంఘం అ) 1964
2) ప్రభుత్వ రంగ సంస్థల సంఘం ఆ) 1950
3) అంచనాల సంఘం ఇ) 1921
4) స్థాయి సంఘాలు ఈ) 1993
1) 1-అ, 2-ఈ, 3-ఇ, 4-ఆ
2) 1-ఇ, 2-అ, 3-ఆ, 4-ఈ
3) 1-ఈ, 2-ఇ, 3-అ, 4-ఆ
4) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
12. కింది వాటిని జతపర్చండి.
1) ప్రకరణ 49 అ) చారిత్రక జాతీయ ప్రాముఖ్యత గల స్మారక చిహ్నాలు, పురాతన కట్టడాల పరిరక్షణ
2) ప్రకరణ 40 ఆ) గ్రామ స్వపరిపాలనకు పంచాయతీల ఏర్పాటు
3) ప్రకరణ 50 ఇ) కార్యనిర్వాహక శాఖ నుంచి నాయ్యశాఖను వేరు చేయడం
4) ప్రకరణ 44 ఈ) పౌరులందరికి ఉమ్మడి పౌరస్మృతి
1) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
2) 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
3) 1-ఈ, 2-ఇ, 3-అ, 4-ఆ
4) 1-ఇ, 2-అ, 3-ఆ, 4-ఈ
13. కింది వాటిని జతపర్చండి.
1) 73వ రాజ్యాంగ సవరణ చట్టం
అ) ప్రజాస్వామ్య వికేంద్రీకరణ
2) 74వ రాజ్యాంగ సవరణ చట్టం
ఆ) రాష్ట్ర ఆర్థిక సంఘం
3) బల్వంత్రాయ్ మెహతా కమిటీ
ఇ) మున్సిపల్ కౌన్సిళ్లు
4) ఎల్. ఎం సింఘ్వి కమిటీ
ఈ) పంచాయతీరాజ్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి
1) 1-ఆ, 2-ఈ,3-ఇ,4-అ
2) 1-అ, 2-ఆ,3-ఇ,4-ఈ
3) 1-ఆ, 2-ఇ,3-అ,4-ఈ
4) 1-ఇ, 2-అ,3-ఆ,4-ఈ
14. కింది రాజ్యాంగ సవరణలను జతపర్చండి.
1) 7వ సవరణ – 1956 అ) సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి హోదా కల్పించారు
2) 58వ సవరణ – 1987 ఆ) రాష్ట్రపతి ఎన్నికల్లో ఢిల్లీ, పుదుచ్చేరి ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం
3) 70వ సవరణ – 1992 ఇ) రాజ్యాంగాన్ని హిందీలోకి అధికారిక తర్జుమా
4) 97వ సవరణ- 2011 ఈ) ఒకే వ్యక్తిని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాలకు గవర్నర్‌గా నియమించవచ్చు
1) 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
2) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
3) 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
4) 1-ఇ, 2-అ, 3-ఆ, 4-ఈ
15. రాజ్యాంగంలోని భాగాలను వాటి అంశాలను జతపర్చండి.
1) 6వ భాగం అ) కేంద్రపాలిత ప్రాంతాలు
2) 9(బి) భాగం ఆ) రాష్ట్రప్రభుత్వం
3) 8వ భాగం ఇ) అధికార భాష
4) 17వ భాగం ఈ) సహకార సంఘాలు
1) 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
2) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
3) 1-ఆ, 2-ఈ, 3-అ, 4-ఇ
4) 1-ఇ, 2-అ, 3-ఆ, 4-ఈ
16. కింది ఏ కారణాలతో సీఎం, మంత్రి మండలిని పదవి నుం చి గవర్నర్ తొలగించవచ్చు?
1) విశ్వాస తీర్మానం వీగిపోయినప్పుడు
2) అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు
3) ఆర్థిక బిల్లులను విధానసభ తిరస్కరించినప్పుడు 4) బడ్జెట్‌ను విధానసభ తిరస్కరించినప్పుడు
5) ప్రభుత్వ బిల్లును, రాష్ట్రశాసన నిర్మాణ శాఖ తిరస్కరించినప్పుడు
1) 1, 2, 3 2) 2, 3, 4
3) 4, 3, 5 4) 1, 2, 3, 4, 5
17. రాష్ట్ర ముఖ్యమంత్రి కింది ఏ సంస్థల్లో సభ్యులుగా ఉంటారు?
1) జాతీయాభివృద్ధిమండలి
2) అంతర్రాష్ట్రకౌన్సిల్
3) జాతీయ సమైక్యతమండలి
4) జోనల్ కౌన్సిళ్లు
1) 1,2 2) 2,3 3) 1,2,3 4) 1,2,3,4
18. ప్రతిపాదన
(A) : గవర్నర్, రాష్ట్రపతి అభీష్టం ఉన్నంతవరకు పదవిలో కొనసాగుతాడు.
కారణం (R) : గవర్నర్‌ని తొలగించడానికి రాజ్యాంగంలో ప్రత్యేకమైన కారణాలను పేర్కొన్నారు.
1) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ 2) A, Rలు రెండూ నిజం కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) Aతప్పు, R నిజం
19. ప్రతిపాదన
(A) : శాసన వ్యవస్థ క్షిణిస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.
కారణం (R) : స్వాతంత్య్రానంతర తొలి దశాబ్దాల్లో జాతీయ స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న నాయకులు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించేవారు.
1) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ 2) A, Rలు రెండూ నిజం కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) Aతప్పు, R నిజం
20. మరణాంతరం భారతరత్న పొందిన మొదటివ్యక్తి ఎవరు?
1) ఇందిరాగాంధీ 2) రాజేంద్రప్రసాద్
3) లాల్‌బహదూర్‌శాస్త్రీ 4) జవహర్లాల్ నెహ్రు
21. ప్రతిపాదన
(A) : సంప్రదాయిక సమాజాన్ని బద్దలు కొట్టేందుకు రాజ్యాంగ రచయితలు వయోజన ఓటు హక్కును కల్పించారు.
కారణం (R) : వయోజన ఓటుహక్కు ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలు నియంతృత్వ ప్రభుత్వాలు.
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) Aతప్పు, R నిజం
22. ప్రతిపాదన (A) : ప్రజాస్వామ్య ప్రక్రియలో రాజకీయ పార్టీలు ఒక భాగం.
కారణం (R) : భారతదేశంలో ఏక పార్టీ వ్యవస్థ ఉంది.
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు
4) A తప్పు, R నిజం
23. అత్యధిక కాలం స్పీకర్‌గా ఉన్నవారు ?
1) బలరాం జక్కర్ 2) రబిరే
3) శివరాజ్‌పాటిల్ 4) హుకుంసింగ్
24. ప్రతిపాదన (A) : భారతదేశం అత్యవసర పరిస్థితి కాలంలో ఏకకేంద్ర రాజ్యంగా మారుతుంది.
కారణం (R) : జాతీయ అత్యవసర పరిస్థితికి గరిష్ట కాలపరిమితి లేదు.
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) Aతప్పు, R నిజం
25. ప్రతిపాదన (A) : భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులను కల్పించింది.
కారణం (R) : ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యతను రాజ్యాంగం సుప్రీంకోర్టు, హైకోర్టులకు కల్పించింది.
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) Aతప్పు, R నిజం
26. కింది కమిటీలను వాటి విషయాలను జతపర్చండి.
1) ఏడీ గోర్వాల కమిటీ అ) ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణ యంత్రాంగం
2) కే సంతానం కమిటీ ఆ) సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానం పునర్ సమీక్ష
3) నిగవేకర్ కమిటీ ఇ) అవినీతి నిర్మూలన
4) గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ
ఈ) ప్రభుత్వ పాలన
1) 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
2) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
3) 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
4) 1-ఇ, 2-అ, 3-ఆ, 4-ఈ
27. ప్రతిపాదన (A) : రాజ్యాంగం మీదగాని, రాజ్యాంగం సృష్టించిన వ్యవస్థల మీదగాని ప్రత్యక్షదాడులు లేకపోవడం వలన రాజ్యాంగం విజయవంతం అయింది.
కారణం (R) : సార్వభౌములైన భారత ప్రజల ద్వారా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్‌చే రాజ్యాంగం రూపొందించబడింది.
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) Aతప్పు, R నిజం
28. ప్రతిపాదన (A) : ఉపరాష్ట్రపతి రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.
కారణం (R) : ఉపరాష్ట్రపతిని రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు.
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) Aతప్పు, R నిజం
సమాధానాలు
1-4, 2-3, 3-2, 4-2, 5-2, 6-1, 7-2, 8-2, 9-3, 10-3, 11-2, 12-1, 13-3, 14-3, 15-3, 16-4, 17-4, 18-3, 19-2, 20-3, 21-3, 22-3, 23-1, 24-2, 25-2, 26-3, 27-2, 28-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?