International organizations | అంతర్జాతీయ సంస్థలు
ప్రపంచీకరణ వేగవంతమవుతున్నకొద్దీ దేశాలమధ్య సన్నిహితత్వంతోపాటు వివాదాలూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలతో దారుణ మారణకాండను చవిచూసిన ప్రపంచం మరోసారి అలాంటి విపత్తులు తలెత్తకుండా అనేక అంతర్జాతీయ సంస్థలు ఆవిర్భవించాయి. ఐక్యరాజ్యసమితితో మొదలైన ఈ పరంపర అనేక సంస్థల స్థాపనతో ఇప్పటికీ కొనసాగుతున్నది. అనేక రంగాల్లో అభివృద్ధి, సహకారాలకోసం ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. కొన్ని సంస్థల గురించి పెద్దగా ప్రచారం కాకపోయినా అవి తమ లక్ష్యసాధన కోసం విశేషంగా కృషిచేస్తున్నాయి. అయితే, పోటీ పరీక్షలకోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో చాలామందికి వాటిపై పెద్దగా అవగాహన లేకపోవటంతో నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో నిపుణ పాఠకుల కోసం పలు అంతర్జాతీయ సంస్థల గురించి సంక్షిప్తంగా..
ఆయుధ నియంత్రణ సంస్థలు
-ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో ఆపరేషన్ ఇన్ యూరప్ (ఓఎస్‌సీఈ -1973)
-సంస్థ స్థాపన – 1973
-ప్రధాన కార్యాలయం – వియన్నా (ఆస్ట్రియా)
-సభ్య దేశాలు- 57
-ప్రస్తుత ప్రధాన కార్యదర్శి – లాంబర్టో జెన్నియర్
-శాంతి భద్రతలు, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన ఒక అంతర్జాతీయ సంస్థ. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో శాంతి భద్రతలపై విస్త్రృత చర్చ జరిగింది. అనంతరం 1973లో కాన్ఫరెన్స్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో ఆపరేషన్ ఇన్ యూరప్‌ను (సీఎస్సీఈ)ని ఏర్పాటు చేశారు. 1990 నవంబర్ 21న పారిస్ సమావేశంలో సభ్యదేశాల ఒప్పందంలో భాగంగా ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో ఆపరేషన్ ఇన్ యూరప్‌గా మార్పు చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా సంస్థ తన విధులను నిర్వహిస్తోంది.
కాన్ఫరెన్స్ ఆన్ డిజార్మమెంట్
-స్థాపన -1979
-ప్రస్తుతం సభ్యదేశాలు -65
-సంస్థ ప్రధాన కార్యాలయం – జెనీవా (స్విజ్జర్లాండ్)
-ప్రధాన కార్యదర్శి – మైఖేల్ ముల్లర్
-ఆయుధ నియంత్రణ, నిరాయుధీకరణ ఒప్పందాలపై చర్చలు జరిపేందుకు ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థ. బహు పాక్షిక ఆయుధ నియంత్రణ, అణ్వస్త్రవ్యాప్తి నిరోధక, నిరాయుధీకరణ వంటి ఒప్పందాల మేరకు నిబంధనలకు అనుగుణంగా విధులను నిర్వహిస్తుంది. ఇది ఐరాసకు అనుబంధ సంస్థగా కాకుండా ప్రధాన కార్యదర్శి ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో పనిచేస్తుంది.
ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్
కెమికల్ వెపన్స్
-స్థాపన – 29 ఏప్రిల్, 1997
-ప్రధాన కార్యాలయం – ది హేగ్ (నెదర్లాండ్స్)
-ప్రస్తుత సభ్య దేశాలు – 192
-డైరెక్టర్ జనరల్ – అహ్మద్ ఉజుంక్
-ఈ సంస్థ అంతర్జాతీయంగా రసాయన ఆయుధాల వాడకాన్ని నిషేధిస్తుంది. ఉన్నవాటిని విధ్వంసం చేయడం. రసాయనిక ఆయుధాల కన్వెన్షన్‌కు కట్టుబడి కొత్త ఆయుధాలను తయారుచేయకుండా పర్యవేక్షిస్తుంది. ఒప్పందం నిబంధనలు అమలు జరిగేలా చూడటంతో పాటు సభ్య దేశాల్లో పరీక్షలపై దృష్టిసారిస్తుంది. సంస్థకు 2013లో సంస్థకు నోబెల్ బహుమతి లభించింది.
కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్
ట్రీటీ ఆర్గనైజేషన్
-స్థాపన – 19 నవంబర్, 1996
-ప్రధాన కార్యాలయం – వియన్నా (ఆస్ట్రియా)
-ప్రస్తుత సభ్య దేశాలు – 183
-ధృవీకరించిన దేశాలు – 164
-కార్యనిర్వాహక కార్యదర్శి – లాస్సినా జెర్బో
-సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం నిబంధనలు సభ్యదేశాల్లో అమలయ్యేలా చూడడం. కొత్త అణ్వాయుధ పరీక్షలు జరపకుండా, అణుబాంబు తయారీ, ప్రయోగాలు చేపట్టకుండా పర్యవేక్షించడం. చైనా, ఈజిప్టు, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా లాంటి దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేసినప్పటికీ ఉల్లంఘించి అణుపరీక్షలు చేపట్టాయి. అయితే భారత్, పాకిస్థాన్, ఉత్తర కొరియా దేశాలు అణ్వస్త్ర ఒప్పందంపై సంతకాలు చేయలేదు.
వాస్సెనార్ అగ్రిమెంట్
-స్థాపన – 12 జూలై, 1996
-ప్రధాన కార్యాలయం – వాస్సెనార్ (నెదర్లాండ్స్)
-ప్రస్తుత సభ్యదేశాలు – 41
-ప్రధాన కార్యదర్శి –
-వాస్సెనార్ ఒప్పందం ప్రకారం పారదర్శకత, సంప్రదాయ ఆయుధాలు, ద్వంద్వ ఉపయోగిత వస్తువులు, సాంకేతికత బదిలీల్లో భాగంగా సభ్యదేశాల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రత, స్థిరత్వం దోహద క్రమంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు.
న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్
-స్థాపన – 1974
-ప్రధాన కార్యాలయం – వాషింగ్టన్ డీసీ (అమెరికా)
-సభ్యదేశాలు – 48
-ప్రధాన కార్యదర్శి (చైర్) – సాంగ్ యంగ్వాన్ (దక్షిణ కొరియా)
-అంతర్జాతీయంగా అణ్వాయుధ అభివృద్ధికి అనువైన పదార్థాల ఎగుమతి, బదిలీలను నియంత్రించడం. ఇప్పటికే ఉన్న పదార్థాలకు భద్రతా ప్రమాణాలు, రక్షణను మెరుగుపరచడం ద్వారా అణ్వాయుధ వృద్ధిని తగ్గించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. 1975-78 వరకు లండన్‌లో జరిగిన సంస్థ సమావేశాల కారణంగా లండన్క్లబ్అనే పేరు వాడుకలోకి వచ్చింది. దీన్ని లండన్ సప్లయర్స్ గ్రూపుగా కూడా సూచిస్తారు.
ఆస్ట్రేలియా గ్రూప్
-స్థాపన – జూన్, 1985
-ప్రధాన కార్యాలయం – సిడ్ని (ఆస్ట్రేలియా)
-సభ్య దేశాలు – 42
-ఈ సంస్థ సభ్య దేశాల్లో రసాయన, జీవ ఆయుధాల అభివృద్ధిని నిరోధిస్తుంది. ఎగుమతి, దిగుమతులపై కూడా నియంత్రణ కలిగి ఉంటుంది. రసాయన ఆయుధాల కన్వెన్షన్ అండ్ బయాలజికల్ అండ్ టాక్సిన్ కన్వెన్షన్ కింద సంస్థ ఒప్పంద నిబంధనల మేరకు బాధ్యతలను నిర్వహిస్తుంది.
మల్టీ సెక్టార్ ఆర్గనైజేషన్స్
1. అంతర్జాతీయ శక్తి సంస్థ
(ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ – IEA)
-ఈ సంస్థ 1974లో ఏర్పాటైంది.
-దీని ప్రధాన కార్యాలయం పారిస్ (ఫ్రాన్స్)లో ఉంది.
-ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు శక్తి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో IEA ప్రాధన్యత కూడా పెరుగుతున్నది.
ప్రధాన విధులు
-ప్రపంచ దేశాల మధ్య చమురు, సహజవాయువు, ఇతర శక్తి వనరులకు సంబంధించి సంక్షోభం రాకుండా పర్యవేక్షించడం.
-సంక్షోభ సమయాల్లో పరిష్కారం చూపడం.
2. ఎనర్జీ చార్టర్
-1991లో రూపుదిద్దుకుంది. ఇది ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్.
-ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్ (బెల్జియం)లో ఉంది.
3. ఎనర్జీ కమ్యూనిటీ
-ఎనర్జీ కమ్యూనిటీ ఒప్పందం 2006, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది.
-ఈ సంస్థ సచివాలయం వియన్నా (ఆస్ట్రియా)లో ఉంది.
4. ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-UNIDO)
-దీన్ని 1966, నవంబర్ 17న స్థాపించారు.
-దీని ప్రధాన కార్యాలయం వియన్నా (ఆస్ట్రియా)లో ఉంది.
-సభ్యదేశాల సంఖ్య 170 (2016 ఫిబ్రవరి నాటికి)
ప్రధాన కార్యకలాపాలు
-ఈ సంస్థ ఆర్థికంగా వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తుంది.
-శుద్ధమైన, సుస్థిర పారిశ్రామిక అభివృద్ధి సాధనకు కృషి చేస్తుంది.
-పారిశ్రామిక పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానంలో అంతర్జాతీయ సహకారానికి తోడ్పడుతుంది.
5. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లయిడ్ సిస్టమ్స్ అనాలసిస్ (IIASA)
-ఈ సంస్థ 1972లో ఏర్పాటైంది.
-దీని ప్రధాన కార్యాలయం లగ్జెంబర్గ్ (ఆస్ట్రియా)లో ఉంది.
-ఇది అంతర్జాతీయ పరిశోధనా సంస్థ
ప్రధాన విధులు
-ఈ సంస్థ మారుతున్న ప్రపంచంలో మానవ పరిణామానికి సంబంధించి పర్యావరణ, ఆర్థిక, సాంకేతిక, సామాజిక అంశాలపై శాస్త్రీయ అధ్యయనాలు చేస్తుంది.
-సమాజ శ్రేయస్సు మెరుగు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి విధానకర్తలకు మార్గనిర్దేశనం చేస్తుంది.
6. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరం (IEF)
-దీన్ని 1991లో స్థాపించారు.
-ఇందులో 76 సభ్యదేశాలు ఉన్నాయి.
-ఈ సంస్థ సచివాలయం రియాద్ (సౌదీ అరేబియా)లో ఉంది.
సస్టెయినబుల్ ఎనర్జీ ఆర్గనైజేషన్స్
1. ఇంటర్నేషనల్ రెన్యువబుల్ ఎనర్జీ ఏజెన్సీ (IRENA)
-ఇది 2009, జనవరి 26న ఏర్పాటైంది.
-దీని ప్రధాన కార్యాలయం మస్దార్ సిటీ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – UAE)లో ఉంది.
ప్రధాన విధులు
-ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంలో ప్రధాన చోదక శక్తిగా మారాలనేది ఈ సంస్థ లక్ష్యం.
-పునరుత్పాదక ఇంధన వినియోగంలో పారిశ్రామిక, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సలహాలు, మద్దతు ఇస్తుంది.
2. సస్టెయినబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ (SE4ALL)
3. రెన్యువబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ పార్ట్నర్షిప్
న్యూక్లియర్ పవర్ ఆర్గనైజేషన్స్
1. యూరోపియన్ అటామిక్ ఎనర్జీ కమ్యూనిటీ
-ఈ సంస్థను 1957, మార్చి 25న స్థాపించారు.
-దీని పరిపాలనా విభాగం యూరోపియన్ కమిషన్
-యూరప్‌లో అణువిద్యుత్‌కు ప్రత్యేక మార్కెట్‌ను ఏర్పర్చడం కోసం ఈ సంస్థను స్థాపించారు.
2. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ – IAEA)
-ఈ సంస్థ 1957, జూలై 29న ఏర్పాటైంది.
-దీని ప్రధాన కార్యాలయం వియన్నా (ఆస్ట్రియా)లో ఉంది.
-ఈ సంస్థలో సభ్యదేశాల సంఖ్య 168.
సంస్థ లక్ష్యాలు
-సభ్యదేశాల అణుశక్తిని.. ఆరోగ్యం, ఇంధన భద్రత, విద్యుత్తు లాంటి శాంతియుత అవసరాలకు వినియోగించేలా ప్రోత్సహించడం.
-సైనిక అవసరాలకు అణుబాంబుల వంటి వాటిని వినియోగించకుండా చూడటం. ఒకవేళ అలాంటి వాటిని వినియోగిస్తే ఆ దేశాలపై ఆంక్షలు విధించడం.
3. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సింక్రోట్రాన్-లైట్ ఫర్ ఎక్స్పెరిమెంటల్ సైన్స్ అప్లికేషన్స్ ఇన్ ది మిడిల్ ఈస్ట్
-ఈ సంస్థను 2002లో ఏర్పాటు చేశారు.
-దీని ప్రధాన కార్యాలయం అల్ బాకా (జోర్డాన్)లో ఉంది.
4. కొరియన్ పెనిన్సులా ఎనర్జీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (KEDO)
-ఈ సంస్థను 1995, మార్చి 15న అమెరికా, దక్షిణకొరియా, జపాన్ దేశాలు ఉత్తరకొరియాలో స్థాపించాయి.
-1994లో ఉత్తరకొరియా, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ సంస్థను స్థాపించారు.
5. న్యూక్లియర్ ఎనర్జీ ఏజెన్సీ (NEA)
-ఈ సంస్థ 1958, ఫిబ్రవరి 1న యూరోపియన్ న్యూక్లియర్ ఎనర్జీ ఏజెన్సీ (ENEA) పేరుతో ఏర్పాటైంది.
-1972, ఏప్రిల్ 20న న్యూక్లియర్ ఎనర్జీ ఏజెన్సీగా మార్చారు.
-దీని ప్రధాన కార్యాలయం పారిస్ (ఫ్రాన్స్)లో ఉంది.
విధులు
-ఈ సంస్థ సభ్యదేశాల మధ్య పరస్పర అణుశక్తి వినియోగానికి సహకరిస్తుంది.
-సభ్యదేశాలు పర్యావరణ అనుకూల, ఆర్థిక ప్రయోజనకర అవసరాల కోసం శాంతియుతంగా, సురక్షితంగా అణుశక్తి సహకారం అందించుకునేలా చూస్తుంది.
6. యునైటెడ్ నేషన్స్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (UNAEC)
-ఈ సంస్థ 1946, జనవరి 24న ఏర్పాటైంది.
7. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఆపరేటర్స్ (WANO)
-ఇది 1989లో ఏర్పాటైంది.
-దీని ప్రధాన కార్యాలయం లండన్ (యూకే)లో ఉంది.
-చెర్నోబిల్ అణు దుర్ఘటన అనంతరం అణు పరిశ్రమలపై ప్రజల్లో విశ్వాసం సడలింది. దీంతో న్యూక్లియర్ ఆపరేటర్లు అంతా కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల్లో భయాందోళనలు తొలగించడం కోసం ఈ సంస్థ న్యూక్లియర్ ప్లాంట్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వివిధ కార్యక్రమాల ద్వారా బహిర్గతపర్చింది.
ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్
1. ప్రపంచ పర్యావరణ ఫెసిలిటీ (గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ – GEF)
-ఈ సంస్థను 1991లో స్థాపించారు.
ప్రధాన కార్యకలాపాలు
-ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుంది.
-అంతర్జాతీయ పర్యావరణ సమస్యలపై చర్చించడానికి ఈ సంస్థకు 183 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, పౌరసమాజం, ప్రైవేటురంగం సహకరిస్తాయి.
-ప్రాథమికంగా GEF ప్రాజెక్టు అమలు భాగస్వాములు.. 1. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం, 2. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, 3. ప్రపంచ బ్యాంకు.
2. అగ్రిమెంట్ ఆన్ ది కన్జర్వేషన్ ఆఫ్ అల్బట్రోసెస్ అండ్ పెట్రెల్స్ (ACAP)
3. ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ బ్యాంబూ అండ్ రట్టన్
-ఈ సంస్థ 1997లో ఏర్పాటైంది.
4. ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ ైక్లెమేట్ చేంజ్ (IPCC)
-ఈ సంస్థను 1988లో ఐక్యరాజ్యసమితికి చెందిన WMO, UNEP కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.
-దీని ప్రధాన కార్యాలయం జెనీవా (స్విట్జర్లాండ్)లో ఉంది.
విధులు
-ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు సంబంధించిన మానవ ప్రేరిత కారణాల సమాచారాన్ని వేలమంది శాస్త్రవేత్తల నుంచి సేకరిస్తుంది.
5. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం – UNEP)
-ఈ సంస్థను 1972 జూన్‌లో మౌరిక్ స్ట్రాంగ్ స్థాపించారు.
-ప్రధాన కార్యాలయం నైరోబి (కెన్యా)లో ఉంది.
-1988లో ప్రపంచ వాతావరణ సంస్థ, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం సంయుక్తంగా శీతోష్ణస్థితి మార్పులపై అంతర్జాతీయ ప్యానెల్ (IPCC)ను ఏర్పాటు చేశాయి.
ప్రధాన కార్యకలాపాలు
-పర్యావరణపరమైన విధానాల రూపకల్పన చేస్తుంది.
-పర్యావరణ సంబంధ కార్యక్రమాలను అనుసంధానం చేస్తుంది.
ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్
-దీన్ని 1951లో ఏర్పాటు చేశారు.
-ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.
-సభ్యదేశాల సంఖ్య 165, పరిశీలక హోదాలో 8 దేశాలు ఉన్నాయి.
-అధికారిక భాషలు ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్
-ఐఎంవో సంస్థ డైరెక్టర్ జనరల్ విలియం లాసి స్వింగ్
ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మైగ్రేషన్ పాలసీ డెవలప్మెంట్ (ఐసీఎంపీడీ)
-ఈ సంస్థను 1993లో ఏర్పాటుచేశారు
-ప్రధానకార్యాలయం వియన్నాలో ఉంది
-సభ్యదేశాల సంఖ్య 15
-డైరెక్టర్ జనరల్ మైఖేల్ స్పిన్డెలిగ్గర్
అంటార్కిటికా ట్రీటీ సెక్రటేరియట్ (ఏటీఎస్)
-దీన్ని 2003లో ప్రారంభించారు
-ప్రధాన కార్యాలయం బ్యూనస్ ఐరిస్, అర్జెంటీనాలో ఉంది
ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్
-దీన్ని 1921, జూన్ 21న ప్రారంభించారు
-కార్యాలయం మొనాకోలో ఉంది
-సభ్యదేశాల సంఖ్య -85
-అధికార భాషలు ఇంగ్లిష్, ఫ్రెంచ్
-అధ్యక్షుడు రాబర్ట్ వార్డ్ (ఆస్ట్రేలియా)
ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్
-దీన్ని 1959లో ఏర్పాటుచేశారు
-ఇది స్పెషలైజ్డ్ ఏజెన్సీ కేటగిరీ సంస్థ
-ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది
-దీని అధ్యక్షుడు కిటాక్ లిం
ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ (ఐఎస్ఏ)
-దీన్ని 1964, నవంబర్ 16న ప్రారంభించారు
-ప్రధాన కార్యాలయం జమైకాలోని కింగ్‌స్టన్‌లో ఉంది
-సభ్యదేశాల సంఖ్య 167
-సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన (ఎస్‌జీఆర్‌వై-2001)- గతంలో ప్రవేశపెట్టిన జేజీఎస్‌వై, ఈఏఎస్లను విలీనం చేసి ఎస్జీఆర్వైని రూపొందించారు. ఈ పథకంలో భాగంగా ఆహార భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో నిధులు ఖర్చు చేస్తాయి. దీన్ని ఎన్ఆర్ఈజీఎస్లో విలీనం చేశారు.
-జాతీయ పనికి ఆహార పథకం (ఎన్ఎఫ్ఎఫ్డబ్ల్యూపీ- 2004)- గ్రామాల్లో సామాజిక ఆస్తులను సృష్టించడం, ఆహార భద్రత కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ పథకాన్ని దేశంలోని 150 వెనుకబడ్డ జిల్లాల్లో ప్రారంభించారు.
-జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్- 2006, ఫిబ్రవరి)- గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 100 రోజులు పని కల్పించడం ఈ పథకం ఉద్దేశం. దీన్ని గతంలో ఉన్న ఎస్‌జీఆర్‌వై, ఎన్ఎఫ్ఎఫ్డబ్ల్యూపీలను కలిపి రూపొందించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?