Telangana Sinhagarjana | తెలంగాణ సింహగర్జన సభకు అధ్యక్షత వహించింది?
1. పేద దళితులకు మూడెకరాల భూపంపిణీ పథకాన్ని కేసీఆర్ ఎప్పుడు ప్రారంభించారు?
1) 2015, జనవరి 26 2) 2014, అక్టోబర్ 2
3) 2015, ఆగస్టు 15 4) 2014 జూన్ 2
2. ఉస్మానియా జేఏసీ కన్వీనర్‌గా ఉంటూ ఓయూలో విద్యార్థి గర్జన నిర్వహించినవారు?
1) పిడమర్తి రవి 2) రసమయి బాలకిషన్
3) వేణుగోపాల్ 4) అల్లం నారాయణ
3. కింది వాటిని క్రమానుగుణంగా అమర్చండి.
ఎ. కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష ప్రకటన
బి. నెక్లెస్ రోడ్డుపై తెలంగాణ మార్చ్
సి. కోదండరాం జేఏసీ కన్వీనర్‌గా నియామకం
డి. జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి టీడీపీ బహిష్కరణ
1) ఎ, డి, బి, సి 2) ఎ, సి, బి, డి
3) బి, ఎ, డి, సి 4) ఎ, సి, డి, బి
4. 12వ రైతుసంఘ మహాసభ ఎప్పుడు జరిగింది?
1) 1986 2) 1988 3) 1990 4) 1991
5. కింది వాటిలో సోమసుందర్ రచన ఏది?
1) తెలంగాణ 2) వజ్రాయుధం
3) ప్రజల మనిషి 4) ఆయువుపట్టు
6. వరంగల్ రచయితల సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు?
1) 2005, జనవరి 8 2) 2006, జనవరి 26
3) 2008, జనవరి 20 4) 2007, జనవరి 10
7. కింది వాటిని జతపర్చండి.
ఎ. జైబోలో తెలంగాణ 1. శంకర్
బి. షాడో లైన్స్ 2. ప్రేమ్‌కుమార్ అమన్
సి. స్టిల్ సీకింగ్ జస్టిస్ 3. కేసీఆర్
డి. న్యాయం కోసం తెలంగాణ నిరీక్షణ
4. ఉస్మానియా యూనివర్సిటీ
1) ఎ-1, బి-3, సి-4, డి-2
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-1, బి-4, సి-2, డి-3
4) ఎ-2, బి-1, సి-4, డి-3
8. లాయక్ అలీ మంత్రివర్గం ఏ రోజున రాజీనామా చేసింది?
1) 1948, సెప్టెంబర్ 15 2) 1948, సెప్టెంబర్ 17 3) 1948, సెప్టెంబర్ 19 4) 1948, సెప్టెంబర్ 21
9. జేఎన్ చౌదరి చేసిన సంస్కరణల్లో మొదటిది ఎప్పుడు విడుదలయింది?
1) 1949, ఫిబ్రవరి 6 2) 1943, ఫిబ్రవరి 7
3) 1949, ఫిబ్రవరి 8 4) 1949, ఫిబ్రవరి 9
10. జాగీర్దారీ విధానం రద్దు చట్టం ద్వారా జాగీర్దారీ వ్యవస్థను ఎప్పుడు రద్దుచేశారు?
1) 1949 ఆగస్టు 2) 1949 సెప్టెంబర్
3) 1949 జూలై 4) 1949 అక్టోబర్
11. హైదరాబాద్ కౌలుదారీ వ్యవసాయ భూముల చట్టానికి సవరణలు ఎప్పుడు ప్రవేశపెట్టింది?
1) 1952 2) 1954 3) 1956 4) 1958
12. కింది వాటిని జతపర్చండి.
ఎ. వీ ప్రకాష్ 1. తెలంగాణ జనసభ
బి. భూపతి కృష్ణమూర్తి 2. తెలంగాణ ముక్తిమోర్చా
సి. మురళీధర్ దేశ్‌పాండే 3. తెలంగాణ మహాసభ
డి. ఆకుల భూమయ్య 4. తెలంగాణ ప్రజాసమితి
1) ఎ-4, బి-2, సి-1, డి-3
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-2, డి-1
13. కింది వాటిలో 1972 అక్టోబర్ 18 ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఉద్యమం?
1) తెలంగాణ ఉద్యమం 2) జై ఆంధ్ర ఉద్యమం
3) ప్రత్యేక రాయలసీమ ఉద్యమం 4) పైవన్నీ
14. 1980లో ఏ ప్రాంతంలో గిరిజనులు వారి హక్కుల కోసం పోరాడుతున్న సందర్భంలో పోలీస్ కాల్పుల్లో అనేకమంది మరణించారు?
1) ఇంద్రవెల్లి 2) సిరిసిల్ల
3) ఉట్నూరు 4) జగిత్యాల
15. కింది వాటిలో సరికానిదేది?
1) పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం భవిష్యత్తులో జరగబోయే నియామకాలన్నీ జనాభా ప్రాతిపదికనే జరుగుతాయి
2) రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో జరుగుతున్న పొరబాట్లను సరిదిద్ది తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నివారించడానికి జీవో 610ను విడుదల చేసింది
3) పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం రాష్ట్ర క్యాబినెట్లో ఇరుప్రాంతాలకు (ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాలవారికి) మంత్రి పదవులు 50:50 నిష్పత్తిలో ఉండాలి
4) 1953లో భారత ప్రభుత్వం జస్టిస్ ఫజల్ అలీ నాయకత్వంలో రాష్ర్టాల పునర్విభజన కమిషన్‌ను నియమించింది
16. కింది జేఏసీ కార్యక్రమాలను జతపర్చండి
ఎ. జనగర్జన 1. 2011 సెప్టెంబర్ 13
బి. సకలజనుల సమ్మె ప్రారంభం
2. 2011 అక్టోబర్ 24
సి. సకలజనుల సమ్మె ముగింపు
3) 2011 సెప్టెంబర్ 12
డి. సడక్ బంద్ 4. 2011 మార్చి 21
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-2, బి-4, సి-3, డి-2
4) ఎ-3, బి-2, సి-1, డి-4
17. కింది ఏ పార్టీ ప్రజల్లో కృత్రిమ సమస్యలు సృష్టించడంతో ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంది?
1) తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ
2) ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ 3) కాంగ్రెస్ పార్టీ
4) విద్యార్థి సంఘాలు
18. తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1945 2) 1946 3) 1947 4) 1948
19. కింది వాటిలో సరికాని జత ఏది?
1) లంబాడి హక్కుల పోరాట సమితి – బెల్లయ్య నాయక్
2) గౌడజన హక్కుల పోరాట సమితి
– ఎలికట్టె విజయ్‌కుమార్‌గౌడ్
3) వడ్డెర హక్కుల పోరాట సమితి – దుబ్బగట్ల నర్సింగరావు
4) చాకలి హక్కుల పోరాట సమితి – పూసపల్లి సైదులు
20. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ఎప్పుడు జరిగింది?
1) 2013, జూలై 10 2) 2013, జూలై 11
3) 2013, జూలై 12 4) 2013, జూలై 13
21. నిజాం పాలనకాలంలో శాసనసభ్యులను ఎవరు నియమించేవారు?
1) బ్రిటిష్ ప్రభుత్వం 2) నిజాం నవాబు
3) ప్రజలు 4) భారత యూనియన్
22. కుతుబ్‌షాహీలు భూమిశిస్తు వసూలుచేసే పద్ధతి?
1) వేలం 2) రైత్వారీ
3) మహల్వారీ 4) మున్సబ్‌దారీ
23. ఒకటో సాలార్జంగ్ కింది వారిలో ఏ పాలకుడి వద్ద దివాన్‌గా పనిచేశాడు?
1) నాసిరుద్దౌలా 2) అఫ్జలుద్దౌలా
3) మీర్ మహబూబ్ అలీఖాన్ 4) పైవారందరూ
24. పీవీ నర్సింహారావు సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని ఎన్ని రోజులు పాలించారు?
1) ఒక ఏడాది, 3 నెలల, 17 రోజులు
2) రెండేండ్లు
3) ఒక ఏడాది, 9 నెలల, 21 రోజులు
4) మూడేండ్లు
25. తెలంగాణలో రైతాంగ సమస్యలపై ప్రజాతంత్ర హక్కుల కోసం పోరాటాలను ప్రారంభించింది?
1) కాంగ్రెస్ పార్టీ 2) తెలుగు దేశం పార్టీ
3) భారత కమ్యూనిస్టు పార్టీ 4) పత్రికలు
26. హైదరాబాద్ సిటీ కాలేజీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1927 2) 1929 3) 1931 4) 1933
27. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాంతీయ సంఘాల ఏర్పాటు అధికారం రాష్ట్రపతికి ఇవ్వడమైంది?
1) 5వ 2) 6వ 3) 9వ 4) 7వ
28. తెలంగాణ సింహగర్జన సభకు అధ్యక్షత వహించినవారు?
1) రాజమల్లయ్య 2) విజయరామారావు
3) గొట్టె భూపతి 4) జీ లక్ష్మణ్
29. కింది వారిలో తెలంగాణ ప్రజల రాజ్యాంగబద్దమైన హక్కును ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం దృష్టికి తీసుకెళ్లినవారు ఎవరు?
1) తెలంగాణ గాయకులు 2) తెలంగాణ రచయితలు 3) తెలంగాణ ఉద్యోగులు 4) తెలంగాణ ఎన్ఆర్ఐలు
30. తెలంగాణ వాణిని వినిపించడానికి 1996, నవంబర్ 20న సిద్దిపేటలో సభను నిర్వహించిన సంఘం ఏది?
1) మంజీర రచయితల సంఘం
2) గోలకొండ కవుల సంఘం
3) తెలంగాణ ఉద్యోగుల సంఘం 4) ఏదీకాదు
31. 1969 తెలంగాణ ఉద్యమంలో మరణించినవారి జ్ఞాపకార్థం గన్‌పార్క్ వద్ద ఉన్న స్మారకస్థూపాన్ని రూపొందించినవారు?
1) ఎక్కా యాదగిరి 2) మల్లికార్జున్
3) మదన్మోహన్ 4) నారాయణరావు
32. 1973, జనవరి 18న ఆంధ్రప్రదేశ్‌లో విధించిన రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించింది ఎప్పుడు?
1) 1973, సెప్టెంబర్ 1 2) 1973, అక్టోబర్ 20 3) 1978, నవంబర్ 15 4) 1973, డిసెంబర్ 30
33. కింది వాటిని జతపర్చండి.
ఎ. పొరకల దొర 1) శనిగరం వెంకటేశ్వర్లు
బి. వైట్‌మ్యాన్ 2) దాసరి లక్ష్మీకాంతం
సి. సాహు 3) ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు
డి. గణపతి 4) ఎక్కలదేవి సాంబశివరావు
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-2, సి-1, డి-3
34. గోల్కొండ పత్రిక ఆగిపోయింది ఎప్పుడు?
1) 1965
2) 1966
3) 1967
4) 1968
35. హైదరాబాద్ శాసనసభకు సరికాని జత ఏది?
1) ఆర్థిక శాఖ మంత్రి – దిగంబరరావు
2) డిప్యూటీ స్పీకర్ – పంపన్నగౌడ
3) ప్రతిపక్ష పార్టీ – పీడీఎఫ్
4) ప్రతిపక్ష నాయకుడు – వీడీ దేశ్‌పాండే
36. కింది వాటిని జతపర్చండి.
ఎ) తెలంగాణ కోర్కెల దినం 1. 1968, జూలై 10
బి. తెలంగాణ సంరక్షణ దినం 2. 1948, సెప్టెంబర్ 17
సి. తెలంగాణ విమోచన దినం 3. 1969 జూన్ 1
డి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఏర్పాటు
4. 1969 మే 1
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-4, బి-1, సి-2, డి-3
37. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై అసెంబ్లీలో పెద్దస్థాయి చర్చ ఎప్పుడు జరిగింది?
1) 1988 2) 1990 3) 1992 3) 1994
38. కలం యోధుల సంస్థగా చరిత్రలో విస్మరించలేని పాత్రను పోషించిన సంస్థ?
1) తెలంగాణ విద్యావంతుల వేదిక
2) తెలంగాణ రచయితల సంఘం
3) తెలంగాణ జర్నలిస్టుల ఫోరం
4) సాహితీ మిత్ర మండలి
39. 1969 తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కింది వాటిలో సరైనదేది?
1) తెలంగాణ ప్రజలు భాషాప్రయుక్త రాష్ర్టాల భావనను ప్రశ్నించారు: ఏబీ వాజ్‌పేయి
2) తెలంగాణ ప్రజలు ప్రాంతీయ స్వయం నిర్ణాయక ప్రతిపత్తి కంటే తక్కువ ప్రతిపాదనను అంగీకరించారు: సీసీ దేశాయ్
3) పార్లమెంట్లో తెలంగాణపై ప్రధాని ఏ ప్రకటన చేసినా ముందు తెలంగాణ ప్రజాపరిషత్ నాయకులను సంప్రదించాలి: కే మనోహర్
4) ప్రధానమంత్రి తెలంగాణ ఉద్యమానికి రాజకీయ పరిష్కారాన్ని కనుక్కోవాలి: కేఎల్ గుప్తా
40. 1956కు పూర్వం కింది వాటిలోని ఏ ప్రాంతం విద్యుత్ సప్లయ్ కేంద్రంగా ఉండేది?
1) రాయలసీమ 2) తెలంగాణ
3) కోస్తాంధ్ర 4) పైవన్నీ
-జవహర్ రోజ్‌గార్ యోజన (జేఆర్‌వై- 1989)- గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడం. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 80:20 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయి. గతంలో ఉన్న ఎన్ఆర్ఈపీ, ఆర్ఈఎల్ఈజీపీలను కలిపి ఈ పథకాన్ని రూపొందించారు.
-ఎంప్లాయ్మెంట్ అస్యూరెన్స్ స్కీమ్ (ఈఏఎస్- 1993)- ఎడారి, కొండ, క్షామపీడిత ప్రాంతాల్లో 100 రోజుల పాటు పనికల్పించడం దీని ఉద్దేశం. తర్వాత ఈ పథకాన్ని ఎస్జీఆర్వైలో విలీనం చేశారు.
-జవహర్ గ్రామ్ సంవృద్ధి యోజన (జేజీఎస్‌వై- 1999)- గ్రామాల్లో అవస్థాపనా సౌకర్యాలను అభివృద్ధిచేయడం ఈ పథకం ఉద్దేశం. 1989లో ప్రవేశపెట్టిన జేఆర్వైని ఇందులో విలీనం చేశారు.
సమాధానాలు
1-3, 2-1, 3-4, 4-1, 5-2, 6-4, 7-2, 8-2, 9-1, 10-1, 11-2, 12-3, 13-1, 14-2, 15-3, 16-2, 17-2, 18-2, 19-4, 20-2, 21-2, 22-1, 23-4, 24-1, 25-3, 26-2, 27-1, 28-3, 29-4, 30-1, 31-1, 32-1, 33-1, 34-3, 35-1, 36-4, 37-1, 38-3, 39-4, 40-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?