విజ్ఞానశాస్త్ర బోధన – లక్ష్యాలు
శాస్త్ర బోధనలో ఏదైనా లక్ష్యాలు ఎంపిక చేసుకోవడానికి లక్ష్యాలను నిర్ణయించుకోవాలి.
లక్ష్యాల అర్థం, ప్రాముఖ్యం: ఒక వస్తువు గురించి అవగాహన చేయలేని ఏ వస్తువైనా, విషయమైనా అవగాహన చేసుకోలేం. విద్య అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ, దీన్ని అర్థం చేసుకోవాలంటే విద్యా ప్రక్రియను మాపనం చేయాలి.
-విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి, సమగ్రాభివృద్ధికి, సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి దోహదం చేసే ప్రక్రియ.
-విద్య పరమావధి తెలియజేయడమంటే ఉద్దేశాలు, లక్ష్యాలను గురించి తెలుసుకోవడం. ఆ పరమావధి సాధించడమంటే విద్యార్థులకు అనేక అభ్యసనానుభవాల్ని కల్పించాలి.
-మూల్యాంకనలో లక్ష్యాలు- అభ్యసనానుభవాలు, సంబంధం కలిగి ఉన్నాయి.
ఎ. అంత్యాలు
బి. సాధనాలు
సి. సాక్ష్యాలు
-విద్యాపరంగా ఉద్దేశాలు గమ్యాలు అనే పదాలు ఒక అర్థంలోను లక్ష్యాలు అనే పదాన్ని వేరొక అర్థంలో వాడుతారు.
గమ్యాలు: గమ్యాలు విశాలమైన, దీర్ఘకాలిక అంతిమ ప్రయోజనాలను తెలియజేస్తాయి.
ఉద్దేశాలు: ఉద్దేశాలు గమ్యాల నుంచి ఏర్పడ్డాయి. ఇవి గమ్యాల కంటే నిర్దిష్టమైనవే కాకుండా విద్యా దిశలను కూడా సూచిస్తాయి.
లక్ష్యాలు: అనతికాలంలో చేరే గమ్యాలను లక్ష్యాలనవచ్చు.
-విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశాలు, ఉద్దేశాల ఎంపిక నుంచి ఏర్పడింది. ప్రత్యేక కోర్సుల లక్ష్యాలు ఎంపిక చేసిన లక్ష్యాలను నిర్దిష్ట పాఠ్యాంశ, బోధనా పద్ధతులను అన్వయిస్తే నిర్దిష్ట పాఠ్యాంశ లక్ష్యాలు.
బోధనా లక్ష్యాలు: విద్యార్థి ఆది ప్రవర్తనకు, అంత్య ప్రవర్తనకు మధ్య ఆశించిన ప్రవర్తనా మార్పు ఉంటుంది. విద్య ద్వారా సాధించే లక్ష్యాలు కాబట్టి వీటిని విద్యా లక్ష్యాలు అంటారు.
బెంజిమన్ బ్లూమ్ విద్యా లక్ష్యాల వర్గీకరణ: విద్యార్థి ప్రవర్తనలో మార్పు అనేది అతడు పొందిన జ్ఞానంలో మార్పు. ఇవి అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటాయి.
1. గేగ్నీ అనే విద్యావేత్త సూచించిన వర్గీకరణ: ఈయన 8 రకాల అభ్యసనాన్ని విడమర్చి చెప్పాడు. అభ్యసనం – ఉద్దీపన- ప్రతిస్పందన – అభ్యసనానుభవం- ఇవి సరళం నుంచి సంక్లిష్టానికి అమర్చారు.
2. బెంజిమన్ బ్లూమ్: 1948లో అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న అనేక కళాశాలలకు చెందిన వారు పరీక్షలపై వీరి ఒప్పందం ప్రకారం విద్యాలక్ష్యాలు మూడు రకాలు
1. జ్ఞానాత్మక రంగం
2. భావావేశ రంగం
3. మానసిక చలనాత్మక రంగం
-జ్ఞానాత్మకరంగం గురించి బెంజిమన్ బ్లూమ్
-భావావేశ రంగం గురించి డేవిడ్ ఆర్ క్రాత్హల్ కృషి చేశారు.
-మానసిక చలనాత్మక రంగం గురించి ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే కృషి చేశారు.
-మూడు రంగాల పరస్పర సంబంధం: విద్యార్థి ప్రవర్తన మూడు రంగాలపై ఆధారపడి ఉంటుంది. మహాత్మాగాంధీ గాంధీ ప్రకారం విద్య పరమావధి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రంగాలను అభివృద్ధి చేయటమే.
-జ్ఞానాత్మక రంగం -మెదడుకు
-మానసిక రంగం – హృదయానికి
-మానసిక చలనాత్మక రంగం – మనసుకు, శరీరానికి సంబంధించినవి. ఏ అంశం గురించి అయిన పిల్లలను మూడు రకాలుగా అభివృద్ధి పర్చాల్సిన అవసరం ఉంది.
-బ్లూమ్ సూచించిన లక్ష్యాల వర్గీకరణ
-(శిశువు ప్రవర్తన)
జ్ఞానరంగం
1. జ్ఞానం: జ్ఞానాన్ని గుర్తించటం. జ్ఞప్తికి తెచ్చుకోవటం దీనిలోని ముఖ్యాంశాలు
2. అవగాహన: విద్యార్థి అభ్యసించిన విషయాన్ని యథాతథంగా అప్పచెబితే అది జ్ఞానస్థాయి అవుతుంది. అదే విషయాన్ని విద్యార్థి సొంత మాటల ద్వారా విపులీకరిస్తే ఇది అవగాహన అవుతుంది.
ఇందులో పోలికలు భేదాలు తెలుపడం, ప్రతిక్షేపన, వివరణ ఉంటాయి. అవి 3 రకాలు
ఎ. తర్జుమా చేయటం
బి. వ్యాఖ్యానించటం
సి. ఎక్ట్రాపాలేషన్
3. వినియోగం: జ్ఞానం లేకుండా- అవగాహన రాదు. అవగాహన లేకుండా – వినియోగం జరుగదు. అవగాహన స్థాయిలో తగిన సూచనలిస్తే గాని చేయలేని పరిష్కారాలు వినియోగం స్థాయిలో విద్యార్థి చేయగలడు.
4. విశ్లేషణం: ఒక స్థూలమైన విషయాన్ని అనేక సూక్ష్మ అంశాలుగా విడగొట్టి వాటి మధ్య గల తార్కి సంబంధమే వ్యవస్థీకరణ విశ్లేషణ.
5. సంశ్లేషణ: వివిధ దత్తాంశాల ఆధారంగా నూతన విషయాల ఆవిష్కరణ, వ్యాసాలు రాయడం, సిద్ధాంతాన్ని వ్యవస్థీకరించడం, దత్తాంశాలలో నూతన ప్రక్రియలు కనుగొటం మొదలైనవి.
6. మూల్యాంకనం: ఉన్నత క్రమలక్ష్యం-వివిధ వాక్యాలు-సత్యాలు-విలువలు- విధానాలు- పద్ధతులకు సంబంధించిన నిర్ణయాలను చేయగలిగే శక్తిని ఈ లక్ష్యం నెరవేరుస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు