అంతర్జాతీయ కూటములు – వాటి వివరాలు
జి-5 దేశాలు
జి-5 అనేది అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలైన బ్రెజిల్, చైనా, భారత్, మెక్సికో, దక్షిణాఫ్రికాలతో కూడిన కూటమి. 2008లో జపాన్‌లోని హోక్కైడోలో జరిగిన శిఖరాగ్ర సదస్సులో ఆ దేశాలు తమకు తాము జీ-5గా పేర్కొంటూ ఉమ్మడి రాజకీయ ప్రకటన విడుదల చేశాయి. 2009లో ఇటలీలోని లాక్విలాలో జి-8 దేశాలతోపాటు జి-5 దేశాలు సమావేశంలో పాల్గొన్నాయి.
జి-8 దేశాలు
చమురు ధరల పెరుగుదలతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభంపై చర్చిండానికి అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు వెలారీ గిస్వార్ డి ఎస్టెంగ్, జర్మనీ చాన్స్‌లర్ హెల్మట్ షిండ్ 1975 నవంబరులో యూఎస్ఏ, బ్రిటన్, ఇటలీ, జపాన్ దేశాలను ఆహ్వానించి ఫ్రాన్స్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. తర్వాత మరో సభ్యదేశమైన కెనడా హాజరుతో 1976 జూన్‌లో సాన్ జువాన్ (పోర్టారికో) ఏర్పాటు చేసిన సమావేశంలో జి-7 (గ్రూపు ఆఫ్ సెవన్) గ్రూపును అధికారికంగా ఏర్పాటు చేశారు. జి-7 ఆర్థికాభివృద్ధి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వాణిజ్య సంబంధమైన సమస్యలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించడానికి అంతర్జాతీయ వేదికైంది. తర్వాత రాజకీయ సమస్యలను చర్చించడానికి కూడా వేదికగా మారింది. 1997లో డెన్వర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జి-7లో రష్యా చేరికతో జి-7 పేరును జి-8గా మార్చారు.
-సభ్య దేశాలు: ఫ్రాన్స్ (యూరప్), జన్మనీ (యూరప్), ఇటలీ (యూరప్), బ్రిటన్ (యూరప్), రష్యా (యూరేషియా), కెనడా (ఉత్తర అమెరికా), యూఎస్ఏ (ఉత్తర అమెరికా), జపాన్ (ఆసియా)
జి-20 దేశాలు
అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ ఆర్థిక అంశాలకు సంబంధించి తీసుకొనే విధాన నిర్ణయాల్లో కొత్తగా ఎదుగుతున్న ఆర్థిక శక్తులకు కూడా భాగం కల్పించాలన్న ఉద్దేశంతో కొత్తగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలని జీ-7 కూటమి 1990వ దశకంలో సంకల్పించింది. తత్ఫలితంగా కొలోన్‌లో ఏర్పాటు చేసిన శిఖరాగ్ర సమావేశంలో జి-20 ఏర్పాటుకు జి-7 దేశాలు నిర్ణయించాయి. ఈ నిర్ణయానికి అనుగుణంగా 1999, సెప్టెంబర్ 25లో జి-20 ఆవిర్భవించింది. 19 వ్యవస్థాపక దేశాలతోపాటు యురోపియన్ యూనియన్ కూడా ఇందులో సభ్యత్వం కలిగి ఉంది. బ్రెట్టాన్ వుడ్స్ సంస్థలైన ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్‌లు కూడా జి-20 సమావేశాల్లో పాల్గొంటాయి.
-అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వ సాధన కోసం విధాన అంశాలపై పారిశ్రామిక దేశాలు, కొత్తగా ఎదుగుతున్న మార్కెట్ దేశాల మధ్య చర్చలను, అధ్యయనాన్ని, సమీక్షను ప్రోత్సహించడం జి-20 ప్రధాన లక్ష్యం
-సభ్య దేశాలు: అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, చైనా, క్యూబా, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్థాన్, నైజీరియా, ఫిలిఫ్ఫైన్స్, దక్షిణకొరియా, టాంజానియా, వెనిజులా, జింబాబ్వే, థాయ్‌లాండ్, గ్వాటెమాలా, పరాగ్వే, బొలివియా, ఇండియా
-కొత్తగా 2005 మార్చిలో చేరిన దేశం ఉరుగ్వే 1991-2001 వరకు జి-20 సమావేశాలు కెనడాలో జరిగాయి. 2017 జూలై 7, 8 తేదీల్లో జర్మనీలో జీ-20 సమావేశాలు జరుగనున్నాయి. 2018లో అర్జెంటీనాలో నిర్వహించనున్నారు.
అలీనోద్యమం (ఎన్ఏఎం)
20వ శతాబ్దం మధ్య భాగంలో చిన్న దేశాలు ముఖ్యంగా కొత్తగా స్వాతంత్య్రం పొందిన దేశాలు కలిసి అగ్రరాజ్యాల ఆధిపత్యానికి దూరంగా వాటి స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడానికి అలీనోద్యమాన్ని ప్రారంభించాయి. మొదటిసారిగా 1955లో బాండుంగ్ (ఇండోనేషియా) నగరంలో ఆఫ్రో ఆసియా మహాసభను ఏర్పాటు చేశారు. ఇందులో ఆఫ్రికా ఖండం నుంచి ఆరు దేశాలతోపాటు మొత్తం 29 దేశాలు పాల్గొన్నాయి. కానీ, ఈ సభ అనుకున్న ఫలితాన్నివ్వలేదు. 1961లో బెల్గ్రేడ్(యుగోస్లావియా)లో ఏర్పాటు చేసిన సమావేశంలో 25 దేశాలకు చెందిన అలీనోద్యమ దేశాధినేతలు పాల్గొన్నారు. వీరిలో చాలా వరకు ఆఫ్రికా, ఆసియా ఖండాలకు చెందిన వారే. ఈ సమావేశంలో యుగోస్లావియా అధ్యక్షుడైన జోసెఫ్ టిటో అగ్ర దేశాలైన సోవియట్ యూనియన్, అమెరికాల ఆయుధ సేకరణ యుద్ధానికి దారి తీయగలదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ సభలో ఈజిప్ట్‌కు చెందిన గమాల్ అబ్దుల్ నాజర్, ఇండియాకు చెందిన జవహర్లాల్ నెహ్రూ, ఇండోనేషియాకు చెందిన సుకర్నోలు పాల్గొన్నారు. 1964లో కైరో(ఈజిప్ట్)లో ఏర్పాటు చేసిన సమావేశంలో అలీన దేశాలు పాశ్చత్య దేశాల వలసవాదాన్ని, సైన్యాల మోహరింపును ఖండించాయి. 1973లో అల్జీర్స్ (అల్జీరియా)లో ఏర్పాటు చేసిన నాలుగో శిఖరాగ్ర సమావేశంలో అలీన దేశాలు అవి చేపట్టే కార్యకలాపాలకు ఒక కో-ఆర్డినేటింగ్ బ్యూరోను అధికారికంగా స్థాపించాయి.
-అలీనోద్యమం ముఖ్య ఉద్దేశం స్వాతంత్య్ర, సమానత్వం, సాంఘిక న్యాయం, అందరి క్షేమాన్ని ప్రోత్సహించడం, శాంతిని కాపాడటం, నిరాయుధీకరణ సాధించడం, ప్రపంచ ఆర్థిక సమస్యలపై అంగీకారయోగ్యమైన పరిష్కారాలు కనుగొనడం, ముఖ్యంగా ప్రపంచాభివృద్ధిని సాధించడం.
-2012 నాటికి నామ్ సభ్య దేశాల సంఖ్య 120కు చేరింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు