తెలంగాణలో బౌద్ధం వ్యాప్తి ఎలా జరిగింది?
తెలంగాణలోని కొండాపూర్, ధూళికట్ట, తిరుమలగిరి, గాజులబండ, ఫణిగిరి, నేలకొండపల్లి, లింగాలమెట్ట, పెద్దబంకూరు, కోటిలింగాల్లో బౌద్ధ శిథిలాలు బయటపడ్డాయి.
-ఫణిగిరిలోని శిథిలాల్లో బుద్ధుడి పాదాలు, ధర్మచక్రం బయటపడటంతో తెలంగాణలో కూడా ప్రాచీన కాలం నుంచి బౌద్ధమతం వర్థిల్లిందని తెలుస్తుంది.
-బౌద్ధమతం గౌతమ బుద్ధుడి కాలంలోనే తెలంగాణలో ప్రవేశించిందనేది నిర్వివాదాంశం.
-బౌద్ధ వాజ్మయంలోను ఆ తర్వాత కాలంలో ఏర్పడ్డ షోడశ మహాజనపదాల్లో ఒక్కటైన అస్మక రాజ్యంలో తొలినాటి బౌద్ధ వికాస ప్రాంతాలు ఉన్నాయి.
-బుద్ధుడి సమకాలికుడైన భావరి అనే బ్రాహ్మణుడు కరీంనగర్ జిల్లా ములక ప్రాంత నివాసి.
-ఇతడు గౌతమ బుద్ధుని గురించి తెలుసుకొని తన 16 మంది శిష్యులను బుద్ధుని వద్దకు పంపించాడు.
-ఈ 16 మంది శిష్యులు శ్రావస్తిలో నివసిస్తున్న బుద్ధుడిని కలిసి, బుద్ధుని సిద్ధాంతాలకు ప్రభావితులై బౌద్ధ మతాన్ని స్వీకరించారు.
-కొంతకాలం తర్వాత పింగియా లేదా కౌండిన్య అస్మక రాజ్యానికి తిరిగివచ్చి బుద్ధుని సిద్ధాంతాలను భావరికి వివరించాడు. దీంతో బౌద్ధం పట్ల ప్రభావితుడైన భావరి బౌద్ధ మతాన్ని స్వీకరించి అస్మక రాజ్యంలో బౌద్ధమతం వ్యాప్తి చేశాడు.
-బౌద్ధ సాహిత్యంలో ఎంతో ప్రఖ్యాతమైన విమానవత్తు అనే వ్యాఖ్యాన గ్రంథంలో పొతల్లి రాజధానిగా చేసుకొని అస్మక ప్రాంతాన్ని పాలించే రాజు తన కుమారుడితో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించాడని, గౌతమ బుద్ధుని ముఖ్య శిష్యుడైన మహాకాత్యాయనుడు తథాగతుడి మహాపరి నిర్యాణం తర్వాత వారికి దీక్ష ఇచ్చాడని ఉంది.
-అస్మక దేశం గోదావరి నది ఒడ్డున గల కవితవనంలో ఉన్నట్లుగా జాతక కథల్లో పేర్కొన్నారు.
ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు
-ధూళికట్ట: కరీంనగర్ పట్టణానికి 30 కి.మీ.ల దూరంలో ఉన్న ఎలిగేడు మండలంలోని హుస్సేమియా వాగు ఒడ్డున గల గ్రామం ధూళికట్ట.
-తెలంగాణలోని అతి ప్రాచీన బౌద్ధ క్షేత్రాల్లో ధూళికట్ట ఒకటి.
-ఇక్కడ బార్హుత్ శిల్పాల ప్రభావంతో చెక్కిన శిల్పాలు ఉన్నాయి. బౌద్ధ స్తూప అవశేషాలతోపాటు రోమ్ శాతవాహనుల కాలంనాటి నాణేలు లభించాయి. ఈ ప్రాంతంలో ఆనాడు వర్తక వ్యాపారాలు కొనసాగినట్టు తెలుస్తుంది.
-1972-75 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ నిపుణులు, చరిత్రకారులు వీవీ కృష్ణశాస్త్రి ఆధ్వర్యంలో ఇక్కడ పురావస్తు తవ్వకాలు జరుపగా శాతవాహనుల కాలంనాటి గొప్ప బౌద్ధ స్తూపం బయటపడింది.
-ఇక్కడ నాగుపాము చుట్టపై బుద్ధుడు ఆసీనుడు కాగా, ఐదు పడగలు విప్పి రక్షణ ఇస్తున్నట్టు శిల్పం బయటపడింది.
-ఇక్కడి తవ్వకాల్లో పెద్ద మొత్తంలో మట్టిపాత్రలు, పెంకులు బయటపడ్డాయి. కాంస్యంతో చేసిన మాతాశిశువుల విగ్రహం లభించింది.
నాగార్జునకొండ
-ఆనాటి శ్రీపర్వతం- విజయపురి ప్రాంతాన్ని ప్రస్తుతం నాగార్జునకొండగా పిలుస్తున్నారు.
-తెలంగాణలోని ప్రసిద్ధిచెందిన బౌద్ధ క్షేత్రాల్లో నాగార్జునకొండ ఒకటి.
-ఇది గుంటూరు, నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో ఉంది.
-ఇక్కడ బుద్ధుని ధాతుగర్భ స్తూపం ఉంది. బౌద్ధ నిర్మాణాలతోపాటు అనేక వైదిక నిర్మాణాలున్నాయి. ఇక్షాకుల కాలంలో రాజధానిగా ఉండి అనేక హిందూ ఆలయాల నిర్మాణాలకు కేంద్రమైంది. దీంతో నాగార్జునకొండను లౌకిక నిర్మాణాలు గల ప్రాంతం అని పేర్కొంటారు.
-ఎహూవల శాంతములుడు నాగార్జునకొండపై హిందూ ఆలయాలు నిర్మించాడు.
-నాగార్జునకొండలో తొలిసారి పరిశోధన జరిపిన వారు-లాంగ్ హార్ట్స్
-నాగార్జునకొండ లోయలో బౌద్ధ మహాచైత్యం, ఆరామాలు, విశ్వవిద్యాలయం, క్రీడారంగ స్థలాలు, యజ్ఞశాల నిర్మాణాలు బయటపడ్డాయి.
-ఇక్కడ బయటపడిన బౌద్ధస్తూపాలు స్వస్తిక్ గుర్తులను కలిగి ఉన్నాయి.
-శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుని కోసం నాగార్జునకొండ వద్ద 1500 గదులతో పారావత విహారం లేదా మహాచైత్యం నిర్మించాడు.
-నాగార్జునుడు ఈ చైత్యానికి శిలా ప్రాకారాలను నిర్మించాడని హుయాన్త్సాంగ్ తన సీయూకి గ్రంథంలో పేర్కొన్నాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు