గమ్యం-ఉద్దేశం-లక్ష్యం-స్పష్టీకరణలు
బయాలజీ మెథడ్ ఉద్దేశాలు
1. ప్రకృతిలోని సమానత్వాన్ని, సౌందర్యాన్ని అర్థం చేసుకోవడమే విద్య/జీవశాస్త్ర అంతిమ ఉద్దేశం.
-ఉద్దేశం బోధనకు దిశా నిర్దేశం చేస్తుంది.
-ఉద్దేశాలు దీర్ఘకాలంలో సాధించేవి.
-సాధారణంగా ఉద్దేశాలు – గమ్యాలు – లక్ష్యాలను విద్యారంగంలో పర్యాయపదాలుగా వాడుతారు.
-ఉద్దేశాలకు మూలం జీవశాస్త్రంలో ఇమిడి ఉన్న విలువలే.
నిర్వచనాలు
-మన కళ్ల ముందు కనిపిస్తూ మనం చేసే ప్రతి కృత్యానికి దిశా నిర్దేశం సూచిస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడేది ఉద్దేశం – జాన్ డ్యూయి
-మన జయాపజయాన్ని మాపనం చేసే సాధనమే ఉద్దేశం
– జాన్ డ్యూయి
-11-16 ఏండ్ల మధ్య వయస్సు విద్యార్థులకు ఉద్దేశాలు, విలువలు చెప్పడం అవసరం.
ప్రాముఖ్యత
-గమ్యం నుంచి ఉద్దేశం, ఉద్దేశం నుంచి లక్ష్యం, లక్ష్యం నుంచి స్పష్టీకరణలు ఉద్భవిస్తాయి
– యునెస్కో, హ్యాండ్‌బుక్ ఫర్ సైన్స్ టీచర్స్
గమ్యం – ఉద్దేశం – లక్ష్యం – స్పష్టీకరణం
-విద్యావ్యవస్థలో విజ్ఞానశాస్త్రం – విజ్ఞానశాస్త్ర బోధన ఉద్దేశాలు – కోర్ లక్ష్యాలు – పాఠం లక్ష్యాలు అని ఉద్దేశాలు – లక్ష్యాలకు గల సంబంధాన్ని తెలిపారు
– ప్రొఫెసర్ రిచర్డ్ వైట్‌ఫీల్డ్ (కేంబ్రిడ్జి యూనివర్సిటీ)
-ఉద్దేశాలు దీర్ఘకాలిక గమ్యాలు.
-ఒక కోర్సు బోధనా సమయంలో విద్యార్థి సాధించగలిగే ప్రవర్తనా మార్పులను లక్ష్యం అంటారు.
-గమ్యాలు దీర్ఘకాలికమైనవి. ఒక అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశిచినవి. ఉద్దేశాలు నియమితమైనవి- జేకే సూద్
-ఉద్దేశాలు గమ్యాల కంటే నిర్దిష్టమైనవి. లక్ష్యాలు ఉద్దేశాల కంటే మరీ నిర్దిష్టమైనవి.
అవశ్యకత
-విద్యార్థిలో శాస్త్రీయ దృక్పథాన్ని/శాస్త్రీయ వైఖరిని పెంపొందించడం జీవశాస్త్ర అంతిమ ముఖ్య ఉద్దేశం.
-నైపుణ్యాలు, విలువలతో సమాజ ఉత్తమ పౌరునిగా చేయడం జీవశాస్త్ర ప్రధాన ఉద్దేశం.
-విజ్ఞానశాస్త్రం పట్ల అభిరుచి, ఆసక్తిని పెంచడం.
-ప్రపంచశాంతి కోసం పాటుపడటం.
-సాంకేతిక అభివృద్ధిని పెంచడం కోసం
-ప్రకృతి సమన్వయాన్ని కాపాడటం.
-సంపూర్ణ మూర్తిమత్వం పెంచడం.
-నిత్య జీవితంలో శాస్త్ర పరిజ్ఞానాన్ని అన్వయించుకోవడం.
-పరిశోధనాత్మక దృష్టి పెంచడం.
ఉద్దేశాలు – రకాలు
1. జ్ఞాన సముపార్జన ఉద్దేశం
-విజ్ఞానశాస్ర్తానికి సంబంధించిన పూర్తి, క్రమానుగతమైన సమాచారాన్ని అందిస్తుంది.
-ప్రతి అంశం వెనుక ఉన్న శాస్త్రజ్ఞులు, వారి పరిశోధనలు, పరిస్థితులు, చరిత్ర, సంఘటనల మధ్య సహ సంబంధాన్ని తెలుపుతుంది.
-ప్రక్రియల ద్వారా శాస్త్రీయ పరిజ్ఞానం అందుతుంది.
-జ్ఞానమే శక్తి. ఏ పని చేయాలన్నా కావాల్సింది జ్ఞానమే
– సోక్రటీస్
2. అనుకూల అలవాట్లను అభివృద్ధి చేసే ఉద్దేశం
-నీతి, నిజాయితీ, నిష్పక్షపాత తీర్పు, కష్టపడి పనిచేసే తత్వం వంటి ఉత్తమ లక్షణాలను అందిస్తుంది.
3. శాస్త్రీయ వైఖరులను అభివృద్ధి చేసే ఉద్దేశం
-విజ్ఞానశాస్త్రం జీవ ప్రపంచంపై ప్రేమ, ఆసక్తి, అభిరుచి పెరిగి ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, కృత్యాలు చేయడాన్ని ప్రోత్సహిస్తుంది.
4. విద్యార్థుల్లో అభిరుచి, అభినందన అభివృద్ధి చేసే ఉద్దేశం
-శాస్త్ర పత్రికలు చదవడం, సైన్స్ క్లబ్, సైన్స్ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే అభిరుచి, అభినందన పెరుగుతుంది.
5. నైపుణ్యాలు, సామర్థ్యాలు అభివృద్ధి చేసే ఉద్దేశం
-ప్రయోగాలు చేసే నైపుణ్యం, సమస్యలను గుర్తించడం, విశ్లేషించడం, వివరించడం, సాధారణీకరణాలను రాబట్టడం అభివృద్ధి చేస్తుంది.
6. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణనిచ్చే ఉద్దేశం
-సమస్యను గుర్తించి నిర్వచించడం, ప్రాకల్పనలు రూపొందించడం, సమస్య పరిష్కారంచేసే విధంగా శిక్షణనిస్తుంది.
7. ఉన్నత జీవితానికి భూమికను ఏర్పరిచే ఉద్దేశం
-విద్యార్థులు జీవశాస్ర్తానికి సంబంధించిన వివిధ వృత్తులు చేపట్టడానికి అవకాశం కల్పిస్తుంది.
-ఉదా: పట్టు సంవర్ధనం, తేనెటీగల పెంపకం, వైద్యవృత్తి
8. విరామ సమయ సద్వినియోగ ఉద్దేశం
-చార్టులు, బొమ్మలు, నమూనాలు, పరికరాలు, వస్తువుల సేకరణ లాంటి పనులు చేయడానికి ప్రోత్సాహం ఇస్తుంది.
9. సమాజానికి ఉత్తమ పౌరులను అందించే ఉద్దేశం
-శాస్త్ర విజ్ఞానాన్ని నిత్య జీవితానికి అన్వయించుకొని సమాజంపై బాధ్యతగా ఉంటూ నీతి నిజాయితీ విలువలు కలిగిన ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దుతుంది.
10. మనోవైజ్ఞానిక ఉద్దేశం
-జీవశాస్త్ర బోధన ద్వారా పౌష్టికాహారం, అంటువ్యాధుల నిర్మూలన వంటి వాటి నుంచి సమాజాన్ని రక్షించడం.
-ఆరోగ్య దారుఢ్యమైన శరీరంలోనే దృఢ చిత్తం ఉంటుంది. – అరిస్టాటిల్
విలువలు
-విలువ అంటే ఒక దృగ్విషయానికి చెందిన యోగ్యతను తెలుపుతుంది. మంచి దృఢమైన నమ్మకమే విలువ.
-విలువలు వ్యక్తి యోగ్యతను నిర్ధారించే ప్రమాణాలు.
-విలువలు అమూర్తంగా అభివృద్ధి చెంది బాహ్యంగా కనిపిస్తాయి. వీటిని అమూర్త గమ్యాలు అంటారు.
నిర్వచనం
-ఒక విషయం మంచిదని, సరైనదని తెలిపేవి విలువలు – బాండ్
-ఒక వస్తువు సన్నివేశం, భావం, కృత్యానికి సంబంధించిన యోగ్యత మంచిదని నమ్మే దృఢమైన నమ్మకమే విలువ.
-ఒక వ్యక్తి ప్రవర్తనకు సంబంధించిన ప్రమాణం విలువ.
విలువలు – రకాలు
1. బౌద్ధిక విలువ
-వ్యక్తి ఆలోచనా విధానంలో, తార్కిక విధానంలో మార్పులను కలుగజేస్తూ జీవశాస్త్ర పఠనం ద్వారా బౌద్ధిక నిజాయితీని పెంచడానికి కృషిచేసే విలువను బౌద్ధిక విలువ అంటారు.
-నిత్యజీవితంలో సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది.
-విద్యార్థిలో కొత్త రకమైన ఆలోచనలు, కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరికను కలిగిస్తుంది.
-విద్యార్థిలో నిష్పక్షపాత నిర్ణయాలు, క్రమశిక్షణ, ఓర్పు, సహనం అభివృద్ధి చెందుతాయి.
-కచ్చితమైన నిర్ణయాలు చేయడానికి తోడ్పడుతుంది.
2. ఉపయోగిక విలువ
-జీవశాస్త్ర అధ్యయనం అనేది శాస్ర్తాలకు పునాదిలాంటిది.
-మానవునికి కలిగే అనుమానాలను నివృత్తి చేసి ప్రకృతి సంపదను, వనరులను, ప్రకృతి రహస్యాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఉపయోగిక విలువ.
-ఆహార సమస్యకు-కొత్త రకపు వంగడాలను, వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక టీకాలు, వ్యాక్సిన్లు, యాంటీబయాటిక్స్ రూపొందించడం
-వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు వినియోగించడం
-వైద్యం- రక్తమార్పిడి, అవయవ మార్పిడి, శస్త్ర చికిత్సలను సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడేది.
-కొత్త ప్రజనన పద్ధతుల ద్వారా మొక్కలు, జంతువుల నాణ్యత, ఉత్పత్తిలో పెరుగుదల సాధించి జీవనస్థాయిని పెంచుతారు.
-ప్రకృతి సంపదను జీవనానికి అనుకూలంగా వినియోగించుకోవడం ఉపయోగిక విలువ.
3. వృత్తిపరమైన విలువ
-జీవశాస్త్ర అధ్యయనం ఎన్నో వృత్తులకు ఆధారంగా, వివిధ వృత్తి కోర్సులకు తెరిచిన ద్వారంగా ఉంటుంది. విద్యార్థిలో వృత్తిని ఎంచుకునే నైపుణ్యం కలుగుతుంది.
-స్వయం జీవనోపాధి గడపడానికి ఉపయోగపడే వివిధ రకాల వృత్తులను కల్పించడానికి ఒక్క జీవశాస్త్ర అభ్యసనంవల్లే సాధ్యం అవుతుంది.
-జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, లెక్చరర్, ప్రొఫెసర్, శాస్త్రవేత్తలు (వ్యవసాయ, పశుగణాభివృద్ధి, జన్యు శాస్త్రవేత్తలు), నర్సులు కావడం.
-స్వయం ఉపాధి వృత్తులు పశుసంవర్ధకం, చేపల పెంపకం, తేనెటీగలు, పట్టుపురుగులు, కోళ్లు, పక్షుల పెంపకం.. పూతోటలు, తోటలు (మామిడి, దానిమ్మ, నిమ్మ మొదలైన పండ్ల తోటలు), ఆకుకూరలు, కూరగాయల పెంపకాలు చేపట్టడానికి జీవశాస్త్ర పరిజ్ఞానం తోడ్పడుతుంది.
4. క్రమశిక్షణ విలువ
-సత్యాన్వేషణలో శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించడంవల్ల క్రమశిక్షణ ఏర్పడుతుంది.
-సమస్యను స్పష్టంగా అర్థం చేసుకోవడం, వాటికి సంబంధించిన విషయాలను నిశితంగా పరిశీలించడంలో శిక్షణనిస్తుంది. సమస్య, పనిపై అంకితభావం, నిర్దిష్ట అలవాట్లను పెంచుతుంది.
-ప్రకృతి ఒక క్రమ పద్ధతిలో ఉందని తెలుసుకొని, కృత్యాలను ఒక క్రమపద్ధతిలో చేయాలని తెలుసుకొని అంతర్గతంగా తనలో ఒక క్రమశిక్షణను, క్రమ జీవనాన్ని పెంచుకోవడానికి తోడ్పడుతుంది.
5. నైతిక విలువ
-సత్యం, శివం, సుందరం అనే ఆదర్శాన్ని సాధించడానికి మార్గం ఏర్పరుస్తుంది.
-నైతిక విలువలుగల వ్యక్తి సుగుణాల రాశి – సోక్రటీస్
-సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి తోడ్పడుతుంది.
-నిష్పక్షపాత, నిస్వార్థ సత్యాన్వేషణ, ఓర్పుగా ఉండేలా చేస్తుంది. శివం అంటే సకల జీవరాశుల శ్రేయస్సు కోరడం.
-సుందరం అంటే ప్రకృతిలోని సహజ సౌందర్యాన్ని, సమతుల్యతను భంగపర్చకుండా కాపాడటం. ఒక విషయాన్ని మళ్లీ మళ్లీ రుజువు చేస్తాడు.
6. సౌందర్యాత్మక విలువ
-విద్యార్థులు ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు వేసుకొని సమాధానాలకు అన్వేషింపజేసేదే సౌందర్యాత్మక విలువ.
-శాస్త్రం ఒక కళ అయితే శాస్త్రజ్ఞులు కళాకారులు.
-సత్యాన్వేషణలో ప్రకృతిని చూసి సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యమని అర్థం చేసుకుంటాడు.
-మెచ్చుకోలు, సంతృప్తి అనే విలువలను కల్పిస్తుంది.
-ఇది సిద్ధాంతాలకు దారితీస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు