Skill .. the future | నైపుణ్యమే.. భవిష్యత్తు
తన జీవితాన్ని కీలక మలుపు తిప్పిన ఆ నలభై రోజుల స్పోకెన్ ఇంగ్లిష్ వర్క్‌షాప్‌ని ఎన్నటికీ మరువలేదు శ్రావణి. ఇంగ్లిష్ ఎవరైనా చెప్పిస్తారు అందులో వింతేంలేదు. కానీ తమ చేతే ప్రతిరోజు మాట్లాడించి ఆ వేళ నేర్చుకున్న అంశంపై ఆ రోజే పూర్తిగా అవగాహన కలిగించి, ఆయా అంశాల్లో సంపూర్ణంగా సాధికారతతో తమతో మాట్లాడించిగానీ, ఆరోజు క్లాసు అయిందని అనుకొనే వారు కాదు నందు సార్. కొబ్బరికాయలోకి నీరు చేరుకున్నంత సహజంగా, పూలకు సహజంగా అబ్బే సువాసనలా తమకి ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టు లభించింది ఆయన శిక్షణ వల్ల. ఒక్క ఇంగ్లిష్ నైపుణ్యం మాత్రమే కాదు.
-వ్యక్తిత్వ వికాసం
-గ్రూమింగ్
-సమయస్ఫూర్తితో సంభాషణ చాతుర్యం
-గ్రూప్ డిస్కషన్స్ నైపుణ్యాలు
-ఇంటర్వ్యూని ఎదుర్కొనే నైపుణ్యాలు
-సెమినార్ ప్రజెంటేషన్స్
-పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలు
-సంఘ జీవితం ప్రాముఖ్యత ద్వారా టీంబిల్డింగ్ స్కిల్స్
ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో నైపుణ్యాలు ఈ వర్క్‌షాప్‌లో నేర్చుకోగలిగింది శ్రావణి. ఇంకా చిత్రంగా ఈ నైపుణ్యాలన్నీ కూడా పెన్ను పేపర్ అవసరం లేకుండానే కేవలం యాక్టివిటీస్ ద్వారా నేర్పించారు. ఆ అనుభూతులను ఎన్నిసార్లు తలుచుకున్నా తనివి తీరదు శ్రావణికి. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే మెటీరియల్ అనే పేరుతో ఇచ్చే ప్రింటెడ్ పుస్తకాలకు ఎటువంటి ప్రాధాన్యం లేదు అక్కడ. మెటిరీయల్ ఇస్తారా? అని తను మొదటిసారి అడిగినప్పుడు తనకు అక్కడ లభించిన సమాధానం గుర్తుకురాగానే శ్రావణి పెదాలపై చిరనవ్వు మెరిసింది. విద్యార్థులంతా అడిగినట్టుగానే సహజంగా అడిగేసింది తను. మెటీరియల్ ఇస్తారా సార్ అని. ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అన్నట్టు నందు సర్ ఒక ప్రశ్న సంధించాడు. నీకు టూ వీలర్ నడపటం వచ్చా అమ్మాయ్? యాక్టీవా నడపటం వచ్చు సర్ నాకు నేర్పించమని అడిగాననుకో అప్పుడు నీవు ఇది క్లచ్, ఇది ఎక్స్లెటర్, ఇది బ్రేక్ అని ఎంత చూపినా నాకు విషయం అర్థమవుతుంది కానీ నడపటం రాదు. ఏదైనా స్కిల్ అంటే నైపుణ్యాన్ని పొందటంలో మూడు దశలు ఉంటాయి.
1. తెలుసుకోవడం
2. అర్థం చేసుకోవడం
3. ఆచరణతో సాధించటం
కేవలం తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం మన లక్ష్యం కాదు. అప్పుడది కేవలం జ్ఞానం మాత్రమే అవుతుంది. నైపుణ్యం సాధించాలి అంటే మూడో దశ అత్యంత కీలకమైంది. తెలుసుకొని అర్థం చేసుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి సాధన చేసి నైపుణ్యం సాధించాలి. అప్పుడే అది స్కిల్ అనబడుతుంది. ఇక్కడ మీకు స్కిల్ ఇవ్వబడుతోంది. ఏ స్కిల్? ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడటం అనే స్కిల్‌ను ఇక్కడ నేర్పించగలుగుతున్నాం. ఏ స్కిల్ అయినా సరే కేవలం గ్రంథపఠనం ద్వారా సాధించలేం. ఉపయోగించటం ద్వారా సాధించలేం. అలా తీసుకుంటే మెటీరియల్ అనే బుక్స్‌కి ఎటువంటి ప్రాధాన్యం లేదు ఇక్కడ. ఒక స్పోకెన్ ఇంగ్లిష్ ఇన్స్టిట్యూట్ ఇవ్వాల్సింది మెటీరియల్ కాదు. మీ చేత మాట్లాడించడం. అది నూటికి నూరు శాతం ఇక్కడ సుసాధ్యం చేస్తాం.
-ఈత నేర్చుకోవడం
-నృత్యం నేర్చుకోవడం
-డ్రైవింగ్ నేర్చుకోవడం
-క్రికెట్ ఆడటం నేర్చుకోవడం
ఇలా ఏ కళయినా పుస్తకం చదివి నేర్చుకోలేం. కాబట్టి ఒక స్పోకెన్ ఇంగ్లిష్ ఇన్స్టిట్యూట్లో ఎంత అందమైన మెటీరియల్ ఇస్తున్నారు. ఎన్ని రంగురంగుల బొమ్మలున్నాయి. ఎన్ని సీడీలు ఇస్తున్నారు వంటి అప్రస్తుత అంశాలను పట్టించుకోకుండా వారు మీచేత మాట్లాడించగలరా లేదా అనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వండి. వీలయితే ఒకవారం రోజుల క్లాసులు విని అన్ని విధాలుగా నచ్చితెనే చేరండి. ఎందుకంటే మన స్కిల్స్ మనకు భవిష్యత్తుని ఇస్తాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?