భారత క్షిపణి వ్యవస్థ విశేషాలివి..!

క్షిపణులను నిర్దేశిత లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు.
క్షిపణి పనిచేయడంలో ఇమిడి ఉన్న సూత్రం: న్యూటన్ మూడో గమన సూత్రం
న్యూటన్ మూడో గమన నియమం: ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది.
క్షిపణుల్లో ఉపయోగించే విస్ఫోటన పదార్థాలను వార్‌హెడ్ అంటారు. హైడ్రోజన్ బాంబులు, అణుబాంబులు, జీవ రసాయనిక బాంబులను వార్ హెడ్లుగా ఉపయోగిస్తారు.
భారత క్షిపణి పితామహుడు : ఏపీజే అబ్దుల్ కలాం
మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా: ఏపీజే అబ్దుల్ కలాం
మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా: టెస్సీ థామస్
దేశంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన క్షిపణి ప్రయోగ కేంద్రం: Interim Test Range ( బాలసోర్, ఒడిశా)
శాశ్వత క్షిపణి పరీక్ష కేంద్రం : Intigrated Test Range (వీలార్ దీవి, ఒడిశా)
క్షిపణుల- రకాలు
లక్ష్యాన్ని ఛేదించే విధానాన్ని బట్టి క్షిపణులు రెండు రకాలు
1. బాలిస్టిక్ క్షిపణి 2. క్రూయిజ్ క్షిపణి బాలిస్టిక్ క్షిపణి
మొదట స్వయం చోదక శక్తిని ఉపయోగించుకుని అంతరిక్షంలోకి చేరి తర్వాత భూ వాతావరణంలోకి చేరి అధిక వేగంతో లక్ష్యాలను ఛేదించే క్షిపణులు.
బాలిస్టిక్ క్షిపణులను అవి ప్రయాణించగల పరిధిని బట్టి మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
హ్రస్వ శ్రేణి క్షిపణులు: ఇవి కొన్ని వందల కి.మీ.ల దూరం మాత్రమే ప్రయాణించగలవు.
మధ్యంతర శ్రేణి క్షిపణులు: ఇవి కొన్ని వేల కి.మీ.ల దూరం ప్రయాణిస్తాయి.
ఖండాంతర క్షిపణులు: ఇవి ఖండాలను దాటి ప్రయాణిస్తాయి.
క్రూయిజ్ క్షిపణి
భూమికి సమాంతరంగా ప్రయాణిస్తూ, రాడార్లు గుర్తించకుండా లక్ష్యాన్ని ఛేదించే క్షిపణులు.
క్షిపణులను ప్రయోగించే విధానాన్ని బట్టి నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు.
1. ఉపరితలం నుంచి ఉపరితలం పైకి
2. ఉపరితలం నుంచి గగనతలంలోకి
3. గగనతలం నుంచి గగనతలంలోకి
4. నీటిలో నుంచి నీటిపైకి
1983లో క్షిపణుల రూపకల్పన కోసం Integrated Guided Missile Development Programme (IGMDP)ను ప్రారంభించారు. దీనికి ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వం వహించారు. 2008లో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు.
IGMDPలో భాగంగా ఆరు క్షిపణులను రూపొందించారు.
1. అగ్ని 4. అస్త్ర
2. పృథ్వి 5. ఆకాశ్
3. త్రిశూల్ 6. నాగ్
అగ్ని (ఉపరితలం నుంచి ఉపరితలం)
- అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి 700 నుంచి 1250 కి.మీ.ల లక్ష్యాన్ని ఛేదించగలదు.
- అగ్ని-2 బాలిస్టిక్ క్షిపణి 2000 నుంచి 3000 కి.మీ.ల లక్ష్యాన్ని ఛేదించగలదు.
- అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణి 3500 నుంచి 5000 కి.మీ.ల లక్ష్యాన్ని ఛేదించగలదు.
- అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి 3000 నుంచి 4000 కి.మీ.ల లక్ష్యాన్ని ఛేదించగలదు.
- అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి 5000 నుంచి 8000 కి.మీ.ల లక్ష్యాన్ని ఛేదించగలదు.
- అగ్ని-6 బాలిస్టిక్ క్షిపణి 8000 నుంచి 10000 కి.మీ.ల లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇంకా అభివృద్ధి దశలో ఉంది.
- డీఆర్డీవో, బీడీఎల్లు అగ్ని క్షిపణులను తయారు చేస్తున్నాయి.
- జీపీఎస్ వ్యవస్థ గల తొలి క్షిపణి అగ్ని-2
- 2016 డిసెంబర్ 25న అగ్ని-5 క్షిపణిని ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవి నుంచి పరీక్షించారు.
నాగ్ (ఉపరితలం నుంచి ఉపరితలం)
- యుద్ధ ట్యాంకుల విధ్వంసక క్షిపణి. దీని పరిధి 3-7 కి.మీ.లు
- దీనిని మొదటిసారిగా థార్ ఎడారిలో పరీక్షించారు.
- లేజర్ కిరణాలను ప్రసరింపజేసే శత్రు దూరాలను గుర్తించగలదు.
- హెలికాప్టర్ నుంచి ప్రయోగించే నాగ్ క్షిపణిని HELINA (Helicopter Launched NAG) అంటారు.
- వాతావరణం సరిగ్గా లేనప్పుడు కూడా ప్రయోగించవచ్చు.
త్రిశూల్ (ఉపరితలం నుంచి గగనతలం)
- స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి. దీని పరిధి 9కి.మీ.లు
- గగనతలంలో తక్కువ ఎత్తులో ఉండే లక్ష్యాలను ఛేదిస్తుంది.
- ఇది 15 కేజీల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు.
- త్రివిధ దళాల అవసరాల కోసం నిర్దేశించింది.
- దీనిని ఎలక్ట్రానిక్ డిటోనేటర్ సహాయంతో పేలుస్తారు.
- అస్త్ర (గగనతలం నుంచి గగనతలం)
- పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొదటి క్షిపణి. దీని పరిధి 100కి.మీ.లు
- ఇది దేశ మొదటి BVRAAM (Beyond Visual Range Air to Air Missile)
- దీని ఉపరితలంపై బక్మినిష్టర్ పుల్లరిన్ అనే పదార్థంతో పూత పూస్తారు. దీంతో రాడార్ల నుంచి
- వెలువడే రేడియో తరంగాలు వీటిని గుర్తించలేవు.
- ఈ క్షిపణులను సుఖోయ్, తేజస్ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగిస్తారు.
ఆకాశ్ (ఉపరితలం నుంచి గగనతలం)
- దీని పరిధి : 25 నుంచి 30 కి.మీ.లు
- దీనికి అమర్చిన రాడార్: రాజేంద్ర
- రాజేంద్ర అనే రాడార్‌ను ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రూపొందించింది.
- దీనిలో ఉపయోగించే సాంకేతికత: రాంజెట్ టెక్నాలజీ పృథ్వి (ఉపరితలం నుంచి ఉపరితలం)
- పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన మొదటి భారత క్షిపణి పృథ్వి.
- 2016 మే 18న ఒడిశాలోని చాందీపూర్ నుంచి పృథ్వి-2ను పరీక్షించారు. దీని పరిధి 250 నుంచి 350 కి.మీ.లు.
- పృథ్వి-3 పరిధి 350 నుంచి 600 కి.మీ.లు.
- అగ్ని, పృథ్వి క్షిపణులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లడానికి రూపొందించిన వాహనం: TATRA
- పృథ్వి క్షిపణులను డీఆర్డీవో, బీడీఎల్ సంస్థలు అభివృద్ధి చేశాయి.
- స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ ట్యాంకుల విధ్వసంక క్షిపణి : అమోఘ-1
- భారతదేశ తొలి ఖండాంతర క్షిపణి సూర్య
- జలంతర్గామి నుంచి ప్రయోగించగల మొదటి భారతీయ క్షిపణి: శౌర్యనిర్భయ్
- స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మొదటి సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి.
- ఈ క్షిపణిని భూఉపరితలం, గగనతలం, నీటిపై నుంచి ప్రయోగించవచ్చు. దీనిని సైనిక, వాయు, నావికా దళాల్లో ఉపయోగిస్తారు.
- ఈ క్షిపణిని డీఆర్డీవోకు చెందిన ఏరోనాటిక్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థ రూపొందించింది.
- ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ వసంతశాస్త్రి.
- 2014 అక్టోబరు 17న ఒడిశాలోని వీలర్ దీవి నుంచి పరీక్షించారు.
బ్రహ్మోస్
- ఇది ఒక క్రూయిజ్ క్షిపణి. దీని పరిధి 290 కి.మీ.లు.
- ఈ క్షిపణిని భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
- ప్రపంచంలోనే ఏకైక స్వల్పశ్రేణి రాంజెట్ క్రూయిజ్ క్షిపణి.
- ఈ క్షిపణులను తయారు చేసిన సంస్థ : బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ (బీఏఎల్).
- బ్రహ్మోస్ క్షిపణి పితామహుడు : శివథాను పిైళ్లె
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది? (Groups Special)
మానవ శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత?
పదార్థం పంచ స్థితి రూపం
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు