NTR rule-politics | ఎన్టీఆర్ పాలన-రాజకీయాలు
నందమూరి తారక రామారావు
-కృష్ణా జిల్లాకు చెందినవారు.
-1983 జనవరి 9న ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో తన పేరును నమోదు చేసుకున్నారు.
-ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉన్నతాధికారులు ఐఏఎస్, ఐపీఎస్‌ల అవినీతిని నిర్మూలించడానికి ప్రయత్నించారు.
-దీని కోసం ధర్మ మహామాత్య అనే పదవిని ఏర్పాటు చేశారు.
-తనకు సన్నిహితుడైన రామిరెడ్డిని ధర్మ మహామాత్యగా నియమించారు.
-రామిరెడ్డి హఠాత్తుగా ఉన్నతాధికారుల కార్యాలయాలు, ఇండ్లపై దాడులు చేసేవారు.
-దీంతో ప్రారంభంలోనే అధికారుల మద్దతు కోల్పోయారు.
-ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తప్పనిసరిగా కార్యాలయంలోనే ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు.
-ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 58 నుంచి 55 ఏండ్లకు తగ్గించారు.
-దీంతో ప్రభుత్వ ఉద్యోగులు 2 నెలల పాటు సమ్మె చేశారు.
-అయినప్పటికీ ఎన్టీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు.
-1984 జనవరిలో గ్రామ అధికారుల పదవులను రద్దు చేశారు.
-అర్చకుల వారసత్వాన్ని కూడా రద్దు చేశారు.
-తన మంత్రివర్గంలోని కేబినెట్ మంత్రి అయిన రామచంద్రరావు అవినీతికి పాల్పడుతున్నాడని అతన్ని మంత్రి పదవి నుంచి తొలగించారు.
-శాసన మండలి కారణంగా పరిపాలనా నిర్ణయాల్లో స్తబ్దత ఏర్పడుతుందని భావించిన ఎన్టీఆర్ శాసనమండలిని రద్దుచేయడానికి అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు.
-దీంతో సొంత పార్టీకి చెందిన నాయకులు ఎన్టీఆర్‌కు వ్యతిరేకమయ్యారు.
-1984 జూన్, జూలైలో బైపాస్ సర్జరీ కోసం ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేసి గవర్నర్ రాంలాల్గిరా సహాయంతో 1984 ఆగస్టు 16న ముఖ్యమంత్రి అయ్యారు.
-1984 ఆగస్టు 16 నుంచి 1984 సెప్టెంబర్ 16 మధ్యకాలంలో ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి జాతీయ స్థాయిలో పోరాటం చేశారు.
-అప్పుడే చైతన్య రథయాత్రలను చేపట్టారు. హరికృష్ణ రథసారథిగా వ్యవహరించారు.
-తిరుగుబాటు ఎమ్మెల్యేలను తిరిగి ఎన్టీఆర్ వర్గంలోకి తీసుకురావడంలో చంద్రబాబునాయుడు కీలక పాత్ర పోషించారు.
-ఎన్టీఆర్ తన మద్దతు ఎమ్మెల్యేలతో రాష్ర్టపతి జైల్‌సింగ్‌ను కలిసి తన ప్రభుత్వాన్ని పునరుద్దరించాలని విజ్ఞప్తి చేశారు.
-దీంతో జైల్‌సింగ్ ఆంద్రప్రదేశ్ గవర్నర్ రాంలాల్‌ను విమర్శించారు.
-మనస్తాపానికి గురైన రాంలాల్ రాజీనామా చేయడంతో శంకర్దయాల్శర్మ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
-శంకర్దయాల్శర్మ ఆదేశం మేరకు 1984 సెప్టెంబర్ 16న నాదెండ్ల భాస్కరరావు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
-దీంతో 1984 సెప్టెంబర్ 16న ఎన్టీఆర్ 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-తనపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు తమ పదవులలో కొనసాగకూడదని భావించిన ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాల్సిందిగా గవర్నర్‌ను కోరారు.
-దీంతో 1984 సెప్టెంబర్ 24 నుంచి 1985 మార్చి 8 వరకు ఎన్టీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు.
-ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో టీడీపీ మళ్లీ 202 సీట్లు గెల్చుకుంది.
-1985 మార్చి 9న ఎన్టీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-ఎన్టీఆర్ నిజమైన పాలన అప్పటి నుంచే ప్రారంభమైంది.
-1985లో శాసనమండలి రద్దు అయింది.
-1985 సెప్టెంబర్‌లో తండ్రి ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారు.
-1985 డిసెంబర్లో స్థానికేతరులను వారివారి ప్రాంతాలకు పంపడానికి 610 జీఓను తీసుకువచ్చారు.
-కానీ ఈ జీవో సరిగా అమలు కాలేదు.
-హుస్సేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహాన్ని నెలకొల్పారు.
-తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేశారు.
-తాలూకా వ్యవస్థను రద్దుచేసి మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు.
-1988లో మంత్రిమండలి నిర్ణయాలు మీడియాకు తెలుస్తున్నాయనే కారణంతో మంత్రిమండలిని రద్దు చేసి మళ్లీ 3 రోజులకు కొత్త మంత్రి మండలిని ఏర్పాటు చేశారు.
-ఈ సమయంలో ఎన్టీఆర్‌పై అవినీతి ఆరోపణలు అధికమయ్యాయి.
-విశాఖపట్నానికి చెందిన ద్రోణంరాజు సత్యనారాయణ ఎన్టీఆర్ ఆస్తులపై విచారణ జరుపాల్సిందిగా హైకోర్టులో పిల్ వేశారు.
-ముఖ్యమంత్రిగా విశ్వామిత్ర అనే చిత్రంలో నటించడంతో ఎన్టీఆర్ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.
-1989లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది.
-1989-94 మధ్యకాలంలో ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.
-జాతీయ స్థాయిలో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు.
-ఈ మధ్య కాలంలోనే లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు.
-1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (మిత్ర కూటమితో కలిసి) అత్యధికంగా 246 సీట్లు గెల్చుకుంది.
-కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లు గెలుచుకొని ప్రతిపక్ష పార్టీ హోదాను కోల్పోయింది.
-1994 డిసెంబర్ 12న ఎన్టీఆర్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అదే రోజున ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధంను అమలుచేశారు.
-1995 ఆగస్టు సంక్షోభం/చంద్రబాబునాయుడు తిరుగుబాటు కారణంగా ఎన్టీఆర్ తన పదవిని కోల్పోయారు.
-1996 జనవరి 18న ఎన్టీఆర్ గుండెపోటుతో మరణించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?