Every action is economic | ప్రతిచర్యా ఆర్థికమే
మొత్తం గ్రూప్-1లో ఎకానమీ ప్రిలిమినరీ 40-50 మార్కులు, మెయిన్స్‌లో 900 వరకు మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎకానమీపై పూర్తి పట్టుకోసం దాని మౌలిక భావనల నుంచి అధ్యయనం చేయాలి.
-ఎకానమీ మౌలిక భావనలు (Economy Basics) అర్థం కాకుండా ఎకానమీపై పట్టు సాధించడం అసంభవం కాబట్టి గ్రూప్-1 ఎకనామీ నుంచి ప్రారంభిద్దాం.
పరిచయం
-ఎకానమీ కంటే ముందు ఎకనామిక్స్ అంటే తెలుసుకుందాం.
ఎకానమీ-ఎకనామిక్స్
-ఎకనామిక్స్ (అర్థశాస్త్రం) అనే పదం గ్రీకు పదాలైన Oikos, Nomos నుంచి ఉద్భవించింది. అంటే Economics=Oikos+Nomos
-Oikos అంటే household (గృహరంగం)
-Nomos అంటే Law (నియమాలు)
-అంటే గృహరంగాన్ని ఎలా నడపాలో తెలిపేది దీన్నే వివిధ వర్గాలకు వివిధ రకాలుగా అర్థశాస్ర్తాన్ని అన్వయించుకోవచ్చు.
ఎకనామిక్స్ నిర్వచనం
-మనిషి కోరికలు అనంతం కానీ వనరులు మాత్రం పరిమితం. ఉన్న కొరత వనరులను మనిషికి ఉన్న అపరిమిత కోరికలను తృప్తిపర్చడానికి ఏ రకంగా ఉపయోగిస్తామని తెలుసుకోవడమే ఎకనామిక్స్.
-ఎకనామిక్స్ అనేది వివిధ ఆర్థిక వ్యవస్థలను అధ్యయనం చేస్తూ వాటికనుగుణమైన నమూనా వ్యవస్థలను (Economy models) తయారు చేసేది. మానవుని ప్రవర్తనా శైలిని అధ్యయనం చేస్తుంది.
ఎకానమీ అంటే ఏమిటి?
-ఎకానమీ అంటే ఆర్థిక వస్తు సేవల ఉత్పత్తి వ్యవస్థ.
-వస్తువులు, సేవలు, మనీ సర్క్యులేషన్, కొనే సామర్థ్యం (Purchesing Capacity), ఉద్యోగిత, వ్యాపారం, ఎగుమతి, దిగుమతి మొదలైన వాటి మధ్య అనుసంధాన వేదికే ఎకానమీ అని చెప్పవచ్చు.
-ఆర్థిక వ్యవస్థ అంటే వస్తు సేవల ఉత్పత్తి వ్యవస్థ అంటారు. అంటే భారత ఆర్థిక వ్యవస్థ అంటే భారతదేశ వస్తు సేవల ఉత్పత్తి అని అర్థం. అదేవిధంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అంటే తెలంగాణలో తయారైన వస్తు సేవల ఉత్పత్తి.
-అంటే అర్థశాస్త్రం అంటే సింపుల్‌గా వస్తువులు, సేవల ఉత్పత్తి గురించి చెబుతుంది.
-అర్థశాస్ర్తాన్ని రెండు ముఖ్య భాగాలుగా విభజించారు. అవి సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం
-సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ధరల సిద్ధాంతం అంటే వృద్ధి, అభివృద్ధి మొదలైన సిద్ధాంతాల గురించి ఇది చర్చిస్తుంది. అంటే అర్థశాస్త్రంలో ఉన్న సూత్రాలు, సిద్ధాంతాల గురించి ఇది చర్చిస్తుంది.
స్థూల అర్థశాస్త్రం అంటే?
-అర్థశాస్త్ర సిద్ధాంతాలను పరిగణలోకి తీసుకొని, వాటిని Applicaionలోకి తీసుకువచ్చే శాస్త్రం.
-ఉదా: సూక్ష్మ అర్థశాస్త్రంలో మాల్థస్ సిద్ధాంతం ఉంటుంది. దీని Applicaion అనేది జనాభా వివరాలను వివరిస్తుంది.
-అంటే సూక్ష్మ అర్థశాస్త్రంలో వ్యక్తి, ఉత్పత్తి కారకాల గురించి వివరిస్తే స్థూల అర్థశాస్త్రంలో మొత్తం ఆదాయం, మొత్తం ఉత్పత్తి, పేదరికం, నిరుద్యోగం మొదలైన వాటి గురించి స్థూలంగా చర్చిస్తుంది. సూక్ష్మ అర్థశాస్త్రం వ్యక్తి చుట్టూనే తిరుగుతుంటే స్థూల అర్థశాస్త్రం మాత్రం ఒకదేశ, రాష్ట్ర లేదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి చెబుతుంది.
– Micro Economics = Particular Unit -> individual, household, firm, industry
Macro Economics = Large -> aggregates-> Total income, Total production, Total Population, నిరుద్యోగం, పేదరికం మొదలైనవి.
-కింది బాక్స్‌లో ఒక కంపెనీ (firm) ఆర్థిక వివరాలను సూక్ష్మ అర్థశాస్త్రం వివరిస్తే, భారత ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని వాటి సాధారణ స్థాయిని వివరించేదే స్థూల అర్థశాస్త్రం.
సెంట్రల్ ప్ల్రాబ్లమ్స్ ఆఫ్ ఎకానమీ
-ఏ ఆర్థికవ్యవస్థకైనా 4 ముఖ్యమైన సమస్యలుంటాయి. అవి..
1) ఏం ఉత్పత్తి చేయాలి?
2) ఎలా ఉత్పత్తి చేయాలి?
3) ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి?
4) ఆర్థికాభివృద్ధికి తీసుకునే చర్యలేంటి?
-ఆర్థిక వ్యవస్థ అంటే వస్తుసేవల ఉత్పత్తి కదా.. మరి ఈ వస్తువులు, సేవలు ఎందుకు ఉత్పత్తి చేయాలి?
-అంటే మానవునికి ఉండే ఎన్నో అవసరాలు, కోరికలను సంతృప్తిపర్చాలంటే వస్తువులను ఉత్పత్తి చేయాలి.
-ఇక్కడ వస్తువులు అంటే మనకు కనిపించేవి.
ఉదా: బియ్యం, పెన్ను, మొబైల్ మొదలైనవి.
-సేవలు అంటే బోధన, డాక్టర్ ఇచ్చే సలహాలు, టూరిజమ్ మొదలైనవి.
-మరి ఈ వస్తువులను ఎవరు ఉత్పత్తి చేస్తారు?
-వస్తువులు, సేవలను ఉత్పత్తి చేయడానికి వ్యాపార సంస్థలు ఉంటాయి. అంటే వ్యాపార సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువులను వివిధ దశలు, వ్యక్తుల ద్వారా మన ఇంటికి చేరుతాయి. ఇక్కడ మన ఇల్లు లాంటి ఇండ్లు ఎన్నో ఉంటాయి. ఇలా అన్ని ఇండ్లను కలిపి గృహరంగం అంటారు.
1) మరి వస్తువులు, సేవలను ఎలా ఉత్పత్తి చేస్తారు?
-ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి వ్యాపార సంస్థలు వివిధ ప్రాథమిక మూల కారకాలను పొందాలి.
-ఇక్కడ మూల కారకాలంటే భూమి, కార్మికులు, మూలధనం, వ్యవస్థాపన, శ్రమ. వీటినే ఉత్పత్తి కారకాలు అని కూడా అంటారు.
-పైన తెలిపిన నాలుగు కారకాలు ఒక వస్తువును కానీ, సేవను కానీ ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి.మరి ఉత్పత్తి కారకాలు పొందిన వ్యాపార సంస్థ వాటికి ప్రతిఫలం చెల్లించాలి కదా.. వాటిని ఉత్పత్తి ఆదాయాలు అంటారు. అంటే భూమిపై గృహరంగాలు పొందే ప్రతిఫలాన్ని బాటకం అంటారు. కార్మికుల శ్రమపై పొందే ప్రతిఫలాన్ని వేతనం అంటారు. మూలధనంపై పొందే ప్రతిఫలాన్ని వడ్డీ అంటారు. వ్యవస్థాపన శ్రమపై పొందే ప్రతిఫలాన్ని లాభం అంటారు.
-ఇక్కడ వస్తువులను ఉత్పత్తి చేసేది వ్యాపార సంస్థలు. ఇవి ఉత్పత్తి చేసిన వస్తుసేవలను గృహరంగాలకు అమ్మడం ద్వారా ఆదాయం పొందుతారు.
-వ్యాపార సంస్థలు వస్తుసేవలను ఉత్పత్తి చేయాలంటే.. వారు గృహరంగాల నుంచి భూమిని, కార్మికులను, మూలధనాన్ని ఇన్‌పుట్స్‌గా తీసుకోవాలి. దీనికి ప్రతిఫలంగా వారు బాటకం, వేతనం, వడ్డీ అనే ఆదాయాలను గృహరంగాలకు చెల్లించాలి.
-ఇలా ఈ చక్రీయ ప్రక్రియ అంతా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. దీన్నే ఆర్థిక కార్యకలాపాల వలయాకార ప్రవాహం అంటారు.
సొల్యూషన్ టు ఫోర్ సెంట్రల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎకానమీ
-పైన పేర్కొన్న 4 ఆర్థిక వ్యవస్థ సమస్యలకు ఈ ప్రపంచంలో 3 ప్రధానమైన పరిష్కారాలున్నాయి. అవి..
1. సామ్యవాద (సోషలిస్టిక్) ఆర్థిక వ్యవస్థ
2. సామ్రాజ్యవాద (క్యాపిటలిస్టిక్) ఆర్థిక వ్యవస్థ
3. మిశ్రమ (మిక్స్డ్) ఆర్థిక వ్యవస్థ
-కోరుకున్న వస్తువులు పొందాలంటే, వాటి ఉత్పత్తి జరగాలంటే ఎంత మోతాదులో ఎలా జరగాలో, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలో నిర్ణయించడమనేది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల మౌలిక భావనలకు అనుగుణంగా జరుగుతుంది.
-ఆయా దేశాల వనరుల లభ్యత, ప్రజల అవసరాలు, ఆర్థిక, సామాజిక, చారిత్రక అవసరాలకు అనుగుణంగా ఒక్కో దేశం ఒక్కో ఆర్థిక వ్యవస్థను అవలంబిస్తుంది.
ఉదా: రష్యా – సోషలిస్టిక్
అమెరికా – క్యాపిటలిస్టిక్
భారత్ – మిక్స్డ్ ఎకనామిక్ సిస్టం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?