If the adjectives are to be easily identified | అధికరణలను తేలికగా గుర్తించాలంటే..
73, 74వ రాజ్యాంగ సవరణలు స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినవి. ఇందులో పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించి రాజ్యాంగ అధికరణలను 243లో చేర్చారు. ఆంగ్ల పెద్ద అక్షరంతో రాజ్యాంగంలో ఏదైనా అధికరణం ఉందంటే, కచ్చితంగా అది సవరణ ద్వారా చేర్చిందన్నది తెలిసిందే. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి కూడా 243లో A నుంచి ZG వరకు చేర్చారు. ఇవి 243A, 243B, 243C….. ఇలా ఉంటాయి. మెమరీ టెక్నిక్స్‌లో భాగంగా ఇప్పటికే మన మస్తిష్కంలో నమోదై ఉన్న అంశాలకు కొత్త వాటిని అనుసంధానం చేయాలని సూచించాం. ఇదే టెక్నిక్స్ స్థానిక ప్రభుత్వాల అధికరణలను నేర్చుకోడానికి ఉపయోగిస్తాం.
-పంచాయతీలకు సంబంధించిన అధికరణలు 243-243O అధికరణ వరకు కొనసాగుతాయి. మున్సిపాలిటీలకు సంబంధించిన అధికరణాలు 243P నుంచి 243ZG వరకు ఉంటాయి. Z, తర్వాత వచ్చే ఆర్టికల్స్‌కు ZA, ZB, ZC… ఇలా ZG వరకు చేర్చారు. పంచాయతీల నిర్వచనం 243 అధికరణంలో, గ్రామ సభ అధికారాల గురించి 243Aలో ఉంటాయి. పంచాయతీల వ్యవస్థాపన 243B అధికరణంలో, మున్సిపాలిటీల ఏర్పాటు 243Q నుంచి ఉంటుంది. ఇక్కడ నుంచి రెండు సమాంతర అంశాలతో వెళతాయి, అంటే 243B=243Q, 243C=243R (పంచాయతీల నిర్మాణం=మున్సిపాలిటీల నిర్మాణం) ఉంటాయి. S అనేది ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. ఇది వేరుగా నేర్చుకోవాలి. 243D నుంచి పంచాయతీలకు ఉన్న అంశాలే, 243T నుంచి మున్సిపాలిటీలకు ఉంటాయి. అందుకే పంచాయతీల గురించి నేర్చుకుంటే, మున్సిపాలిటీల గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, సమాంతరంగా వచ్చే అక్షరం ఏదో చూసుకుంటే సరిపోతుంది.
-B నుంచి O వరకు 14 అంశాలు ఉన్నాయి. వీటిని రెండో తరగతి నుంచి 15వ తరగతి వరకు అనుసంధానం చేస్తే తేలికగా గుర్తుంటాయి. ఆయా తరగతుల్లో క్లాస్ టీచర్లు లేదా ఆయా తరగతుల్లో మిత్రులు లేదా ఆయా తరగతుల్లో మనం ఎప్పటికీ మరిచిపోలేని సంఘటనలకు వీటిని అనుసంధానం చేయడంతో తేలికగా గుర్తుంచుకోవచ్చు.
-రెండో తరగతిలో మీ స్కూలులో, ఎవరెవరు ఎలా కూర్చోవాలో, తరగతిని ఎలా వ్యవస్థాపన చేయాలో నేర్పారో గుర్తు తెచ్చుకోండి. అంటే రెండో తరగతిని వ్యవస్థాపనతో అనుసంధానం చేశాం
-మూడో తరగతిలో మీ ఇంటి లేదా మీరు చదువుకున్న స్కూల్ నిర్మాణం ప్రారంభమైందని ఊహించుకోండి.
-నాలుగో తరగతిలో ఒక్కసారిగా మీ తరగతిలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని ఊహించండి.
-ఐదో తరగతిలో మీకు కాల పరిమితి గురించి టీచర్ వివరించాడు లేదా టైం చూడటం నేర్చుకున్నది ఐదో తరగతిలో అని ఊహించండి.
-ఇలా 15 వతరగతి వరకు అంటే 10 తరగతులు, ఇంటర్మీడియట్ రెండేండ్లు, డిగ్రీ మూడేండ్లు, స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలను ఆయా తరగతులకు అనుసంధానం చేయండి.
-రెండో తరగతిలో వ్యవస్థాపన చేశారుగా.. అది పంచాయతీల వ్యవస్థాపకు సంబంధించింది. ఇక్కడ 243B అధికరణం ఉంటుంది. ఇది 243Q అధికరణంతో సమానం. ఇందులో మున్సిపాలటీల వ్యవస్థాపన ఉంటుంది.
-మూడో తరగతిలో నిర్మాణం ప్రారంభమైందని చెప్పాం.. ఇది 243Cతో సమానం. ఇక్కడ పంచాయతీల నిర్మాణం ఉంటుంది. దీన్ని 243R తో సమానం చేయాలి.
-నాలుగో తరగతిలో రిజర్వేషన్ ఉందని చెప్పాం. ఇది 243Dతో సమానం. ఇది పంచాయతీల్లో రిజర్వేషన్ గురించి తెలుపుతుంది. 243T తో సమానం.
-ఐదో తరగతిలో వాచి లేదా గడియారానికి లింక్ చేశాం. ఇది కాలాన్ని తెలుపుతుంది. ఆర్టికల్స్‌లో 243E అనేది పంచాయతీల కాలపరిమితిని తెలుపుతుంది. ఇది 243Uకు సమానం, ఇది మున్సిపాలిటీల కాలపరిమితిని తెలుపుతుంది. ఇలా అన్ని అనుసంధానం చేస్తే, తెలికగా స్థానిక ప్రభుత్వాల ఆర్టికల్స్ నేర్చుకోవచ్చు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు