అత్యధిక కాలం లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నదెవరు?
1.షెడ్యూల్డ్ కులాలు, తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989 ప్రాథమిక హక్కుల్లో కింది వేటిని సాధిస్తుందని చెప్పవచ్చు?
1) చట్టం ముందు అందరూ సమానులే 2) వివక్షత రద్దు 3) అంటరానితనం నిషేధం 4) మతస్వేచ్ఛ
ఎ) 1, 2, 3 బి) 2, 3 సి) 2, 3, 4 డి) పైవన్నీ
2.ప్రతిపాదన (A): ప్రకరణ 352 ప్రకారం రాష్ర్టాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారు.
కారణం (R): రాజ్యాంగ యంత్రాంగం రాష్ర్టాల్లో విఫలమైనప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు.
ఎ) A, Rలు రెండూ నిజం Aకు R సరైన వివరణ
బి) A, Rలు రెండూ నిజం కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
3.కింది వారిలో డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుడు కానివారు?
ఎ) బీఆర్ అంబేద్కర్ బి) కేఎం మున్షీ
సి) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ డి) ఎంకే గాంధీ
4.రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ విధంగా విధిస్తారు?
ఎ) ప్రధాన మంత్రి సలహా మేరకు
బి) మంత్రి మండలి సలహా మేరకు
సి) రాష్ట్రపతి సొంత నిర్ణయం ద్వారా
డి) క్యాబినెట్ లిఖిత పూర్వక సలహా మేరకు
5.కింది వాటిలో ప్రభుత్వాలకు, విధాన నిర్ణయాలకు మార్గదర్శకాలుగా పనిచేసేవి?
ఎ) ప్రాథమిక హక్కులు బి) ప్రాథమిక విధులు
సి) ఆదేశిక సూత్రాలు డి) ఎ, బి
6.కింది వారిలో ఎవరిని రాష్ట్రపతి నియమిస్తారు?
1) రాజ్యసభ చైర్మన్ 2) భారత ప్రధాన న్యాయమూర్తి 3) లోక్‌సభ స్పీకర్
ఎ) 1, 2 బి) 2 సి) 2, 3 డి) 1, 2, 3
7.కింది వాటిని జతపర్చండి.
1) ఐర్లాండ్ అ) రాజ్యాంగ సవరణ పద్ధతులు
2) ఆస్ట్రేలియా ఆ) ఉభయ సభల సంయుక్త సమావేశం
3) దక్షిణాఫ్రికా ఇ) రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది సభ్యుల్ని నియమించడం
4) నార్వే ఈ) ఎగువ సభ, దిగువ సభ సభ్యులను ఎన్నుకునే పద్ధతి
ఎ) 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
బి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
సి) 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
డి) 1-ఇ, 2-ఆ, 3-అ, 4-ఈ
8.కింది వాటిలో ప్రాథమిక హక్కులేవి?
1) 6 – 14 ఏండ్ల లోపు బాలలకు ఉచిత ప్రాథమిక విద్య
2) మనుషుల క్రయవిక్రయాలు, వెట్టిచాకిరీ నిషేధం
3) ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చడం, మత్తుపదార్థాల నిషేధం
4) కార్మికులకు కనీస జీవన వేతనం
ఎ) 1, 2 బి) 2, 3 సి) 3, 4 డి) 1, 4
9.కింది వారిలో ఎవరు రాష్ట్రపతి అభీష్టం ఉన్నంతవరకు పదవిలో ఉంటారు అనే దానికి మినహాయింపు?
ఎ) సివిల్ సర్వెంట్ బి) కేంద్ర మంత్రి సి) హైకోర్టు న్యాయమూర్తి డి) అటార్నీ జనరల్
10. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద లోకసభ సభ్యుడిని అనర్హుడిగా ఎవరు ప్రకటిస్తారు?
ఎ) లోక్‌సభ స్పీకర్ బి) రాష్ట్రపతి
సి) సుప్రీంకోర్టు డి) ఎన్నికల సంఘం
11. కింది వాటిని జతపర్చండి.
1) ప్రోబోనో పబ్లికో అ) ఫ్రెండ్ ఆఫ్ కోర్టు
2) అమికస్ క్యూరి ఆ) ఇతరుల తరఫున
అర్జీ దాఖలు చేసేవ్యక్తి
3) ఆడి అల్టరమ్ పార్టం ఇ) జోక్యం చేసుకొనే హక్కు
4) లోకస్ స్టాండీ ఈ) కక్షిదారుల విన్నపం వినాలి
ఎ) 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
బి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
సి) 1-ఆ, 2-అ, 3-ఈ, 4-ఇ
డి) 1-ఇ, 2-అ, 3-ఆ, 4-ఈ
12. కింది వాటిని పరిశీలించండి.
1) రాష్ట్రపతి తన రాజీనామాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పిస్తాడు
2) రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పిస్తాడు
3) ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తాడు
4) లోక్‌సభ స్పీకర్ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తాడు
ఎ) 1, 2, 4 బి) 2, 3 సి) 2, 3, 4 డి) 1, 3
13. కింది వాటిని జతపర్చండి.
1) ప్రాథమిక విధులు అ) 6వ భాగం
2) రాష్ట్ర ప్రభుత్వం ఆ) 4(ఎ)వ భాగం
3) మున్సిపాలిటీలు ఇ) 14(ఎ)వ భాగం
4) ట్రిబ్యునల్స్ ఈ) 9(ఎ)వ భాగం
ఎ) 1-ఆ, 2-అ, 3-ఈ, 4-ఇ
బి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
సి) 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
డి) 1-ఇ, 2-అ, 3-ఆ, 4-ఈ
14. ప్రతిపాదన (A): భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులను కల్పించింది
కారణం (R): ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యతను రాజ్యాంగం సుప్రీంకోర్టు, హైకోర్టులకు కల్పించింది
ఎ) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు రెండూ నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
15. కింది కమిటీలు, వాటి విషయాన్ని జతపర్చండి.
1) ఏడీ గోర్వాల కమిటీ అ) ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణ యంత్రాంగం
2) కె. సంతానం కమిటీ ఆ) సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానం పునఃసమీక్ష
3) నిగవేకర్ కమిటీ ఇ) అవినీతి నిర్మూలన
4) గోపాల స్వామి అయ్యంగార్ కమిటీ
ఈ) ప్రభుత్వ పాలన
ఎ) 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
బి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
సి) 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
డి) 1-ఇ, 2-అ, 3-ఆ, 4-ఈ
16. ప్రతిపాదన (A): రాజ్యాంగం మీదగాని, రాజ్యాంగం సృష్టించిన వ్యవస్థల మీదగాని ప్రత్యక్ష దాడులు లేకపోవడం వల్ల రాజ్యాంగం విజయవంతమైంది.
కారణం (R): సార్వభౌములైన భారత ప్రజలతో ఏర్పడిన రాజ్యాంగ పరిషత్‌తో రాజ్యాంగం రూపొందించబడింది.
ఎ) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు రెండూ నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
17. ప్రతిపాదన (A): ఉపరాష్ట్రపతి రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.
కారణం (R): ఉపరాష్ట్రపతిని రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు.
ఎ) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు రెండూ నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
18. పార్లమెంటు సాధారణ మెజార్టీ పద్ధతి ద్వారా సవరించే అంశాలు కింది వాటిలో ఏవి?
1. కొత్త రాష్ట్రాల ఏర్పాటు 2. పౌరసత్వంలో మార్పులు
3. పార్లమెంటులో కోరం 4. రాష్ట్రపతి ఎన్నిక విధానం
5. ప్రాథమిక విధులు
6. హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు
ఎ) 1, 2, 3, 6 బి) 2, 3, 4, 5
సి) 1, 2, 3, 4 డి) 1, 3, 4
19. ప్రతిపాదన (A): సమన్యాయ పాలన చట్టం ఔన్నత్యాన్ని సూచిస్తుంది.
కారణం (R): విచక్షణాధికారాలు నిరంకుశత్వానికి దారి తీస్తాయి.
ఎ) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు రెండూ నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
20. లోక్‌సభ స్పీకర్‌కు సంబంధించి సరైనవి?
1. లోక్‌సభ రద్దయినా స్పీకర్ పదవి రద్దు కాదు
2. ప్రకరణ-92, స్పీకర్ ఎన్నిక గురించి తెలుపుతుంది
3. భారత్ అధికారిక హోదాలో 7వ స్థానం కలిగి ఉంటారు
4. స్పీకర్‌గా ఎన్నికయ్యే వ్యక్తి లోక్‌సభ సభ్యుడై ఉండాలి
5. భారత అధికారిక హోదాలో 6వ స్థానం కలిగి ఉంటారు
6. ప్రకరణ-93 స్పీకర్ ఎన్నిక గురించి తెలుపుతుంది
ఎ) 1, 2, 3, 6 బి) 1, 3, 4, 6
సి) 1, 2, 3, 4 డి) 1, 3, 4
21. లోక్‌సభ రద్దయినప్పుడు బిల్లుల విషయంలో కింది వాటిని పరిశీలించండి.
1. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి చర్చిస్తున్నప్పుడు లోక్‌సభ రద్దయితే ఆ బిల్లు రద్దుకాదు
2. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి చర్చిస్తున్నప్పుడు లోక్‌సభ రద్దయితే ఆ బిల్లు కూడా రద్దవుతుంది
3. బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి దాని పరిశీలనలో ఉండగా, లోక్‌సభ రద్దయినప్పుడు బిల్లు రద్దవుతుంది
4. బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి దాని పరిశీలనలో ఉండగా, లోక్‌సభ రద్దయినప్పటికీ బిల్లు రద్దుకాదు
5. బిల్లును ఉభయసభలు ఆమోదించి, రాష్ర్టపతి పరిశీలనలో ఉండగా, లోక్‌సభ రద్దయితే బిల్లు రద్దుకాదు
ఎ) 1, 2, 3 బి) 1, 3 సి) 2, 4, 5 డి) 1, 3, 4
22. ఎర్రకోట నుంచి ప్రసంగించని ఏకైక ప్రధాని ఎవరు?
ఎ) చరణ్ సింగ్ బి) చంద్రశేఖర్
సి) మొరార్జీదేశాయ్ డి) లాల్‌బహదూర్ శాస్త్రి
23. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాల్లో చేర్చిన అంశాలేవి?
1) ప్రజలకు ఉచిత న్యాయ సేవా సహాయాన్ని అందించాలి (ప్రకరణ 39ఏ)
2) బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, అంగవైకల్యం ఉన్నవారు ఎలాంటి పీడనకు గురికాకుండా వారికి తగిన సంరక్షణ చర్యల్ని చేపట్టాలి (ప్రకరణ 39-ఎఫ్)
3) పరిశ్రమల నిర్వహణ, యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యాన్ని కల్పించాలి (ప్రకరణ 43ఎ)
4) పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి (ప్రకరణ 48ఎ)
ఎ) 1, 2, 3, 4 బి) 1, 3 సి) 2, 4, 5 డి) 1, 3, 4
24. ప్రతిపాదన(A): భారతదేశం అత్యవసర పరిస్థితి కాలంలో ఏకకేంద్ర రాజ్యంగా మారుతుంది
కారణం (R): జాతీయ అత్యవసర పరిస్థితికి గరిష్ఠ కాలపరిమితి లేదు.
ఎ) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు రెండూ నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
25. ప్రతిపాదన (A): సంప్రదాయక సమాజాన్ని బద్ధలు కొట్టేందుకు రాజ్యాంగ రచయితలు వయోజన ఓటుహక్కును కల్పించారు
కారణం (R): వయోజన ఓటు హక్కు ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలు నియంతృత్వ ప్రభుత్వాలు.
ఎ) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు రెండూ నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
26. ప్రతిపాదన (A): ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఒక భాగం
కారణం (R): భారతదేశంలో ఏక పార్టీ వ్యవస్థ ఉంది.
ఎ) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు రెండూ నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
27. అత్యధిక కాలం లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నదెవరు?
ఎ) బలరాం జక్కర్ బి) రబీరే సి) శివరాజ్ పాటిల్ డి) హుకుం సింగ్
28. ప్రతిపాదన (A): గవర్నర్, రాష్ట్రపతి అభీష్టం ఉన్నంతవరకు పదవిలో కొనసాగుతాడు.
కారణం (R): గవర్నర్‌ని తొలగించడానికి రాజ్యాంగంలో ప్రత్యేకమైన కారణాలను పేర్కొన్నారు.
ఎ) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు రెండూ నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
సమాధానాలు
1-a, 2-d, 3-d, 4-d, 5-c, 6-b, 7-d, 8-a, 9-c, 10-a, 11-c, 12-b, 13-a, 14-b, 15-c, 16-b, 17-c, 18-a, 19-b, 20-c, 21-c, 22-b, 23-a, 24-b, 25-c, 26-c, 27-a, 28-c
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు