శాస్త్రీయపద్ధతి అని దేనినంటారు?
ప్రకల్పన పద్ధతి
-ఈ పద్ధతిని రష్యాకు చెందిన స్టీవెన్సన్ అనే వ్యవసాయ శాస్త్రవేత్త రూపొందించాడు.
-ఈ పద్ధతి జాన్ డ్యూయి రూపొందించిన వ్యవహారిక సత్తావాదం నుంచి ఉద్భవించింది.
వ్యవహారిక సత్తావాదం తెలిపే విషయాలు
1. పాఠశాలలో నేర్చుకున్న విద్య నిత్యజీవితంలో ఉపయోగపడాలి.
2. ప్రాచీనకాలం నాటి విద్యా ఉద్దేశాలు విడనాడి ప్రస్తుత దేశ పరిస్థితులకు అనుగుణంగా విద్యా ఉద్దేశాలు ఏర్పర్చుకోవాలి.
-ఈ పద్ధతిని ప్రచారంలోకి తెచ్చింది కిల్ పాట్రిక్ (అమెరికా)
ప్రాజెక్ట్ నిర్వచనం
సహజ వాతావరణంలో పూర్తిచేసే సమస్యాత్మక కృత్యం
– స్టీవెన్సన్
సహజ వాతావరణంలో ముందుకు సాగే హృదయపూర్వక కృషినే ప్రాజెక్ట్ అంటారు – కిల్ పాట్రిక్
పాఠశాలలో దిగుమతి చేసిన నిజజీవిత భాగమే ప్రాజెక్ట్
బల్లార్డ్సోపానాలు
1. పరిస్థితిని కల్పించడం
-పరిస్థితిని ఉపాధ్యాయుడు కల్పిస్తాడు.
2. ప్రాజెక్ట్ ఎన్నిక ఉద్దేశం వివరణ
-ప్రాజెక్ట్ను విద్యార్థులే ఎన్నుకుంటారు.
3. పథక రచన
-ఎవరెవరు ఏ పనులు నిర్వర్తించాలని నిర్ణయించుకుంటారు.
-ప్రాజెక్ట్ ఫలితం పథక రచనపై ఆధారపడి ఉంటుంది.
4. అమలు పర్చడం
-ఎవరికి అప్పగించిన పనులు వారు నిర్వర్తిస్తారు.
5. మూల్యాంకనం
-ప్రాజెక్ట్ సఫలత, విఫలతలపై చర్చిస్తారు.
6. నివేదిక తయారు చేయడం
-అభ్యసించిన విషయాలపై నివేదిక తయారుచేస్తారు.
ఉదా: ఈజిప్ట్ పిరమిడ్ల సందర్శన
గుణాలు
-ఈ పద్ధతి థారన్డైక్ యత్నదోశ సిద్ధాంతంలోని ఉపసిద్ధాంతాలైన సంసిద్ధతా నియమం, అభ్యసన నియమం, ఫలిత నియమాలపై ఆధారపడి ఉన్నది.
-పై మూడింటిలో ఎక్కువ ప్రభావితం చేసేది ఫలిత నియమం.
-విద్యార్థుల్లోని అంతర్గత సామర్థ్యాలను వెలికి తీయవచ్చు.
-విద్యార్థుల్లో ప్రజాస్వామిక, నాయకత్వ లక్షణాలను, సామూహిక భావన పెంపొందించవచ్చు.
-learning by doing, learning by practicing, learning by observing, learning by earning అనే నియమాలపై ఆధారపడి ఉన్నది.
-పాఠ్యాంశాల మధ్య సహ సంబంధాన్ని పెంపొందించవచ్చు.
-విద్యార్థి పంచేంద్రియాలకు వికాసం కల్పించవచ్చు.
-విద్యార్థులు, విద్యార్థుల మధ్య.. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య మంచి స్నేహ సంబంధం ఉంటుంది.
-విద్యార్థులు శ్రమను గుర్తిస్తారు.
-ఆచరణ ద్వారా అభ్యసిస్తారు.
-ఇంటిపనిని తగ్గిస్తుంది.
పరిమితులు
1. సమయం ఎక్కువ.
2. బోధన నియమబద్ధంగా జరుగదు.
3. ఖర్చుతో కూడుకున్నది.
4. ఉపాధ్యాయుడికి శ్రమ ఎక్కువ.
5. అన్ని పాఠ్యాంశాలను బోధించలేం.
6. పునఃశ్చరణకు అవకాశం లేదు.
ప్రకల్పనలు రకాలు
1. కిల్ పాట్రిక్ వర్గీకరణ
-ప్రాజెక్ట్ ఫలితం ఆధారంగా కిల్ పాట్రిక్ ప్రకల్పనలు నాలుగు రకాలు.
ఎ. ఉత్పత్తిదారుల ప్రాజెక్ట్
బి. వినియోగదారుల ప్రాజెక్ట్
సి. సమస్యా ప్రాజెక్ట్ డి. శిక్షణ ప్రాజెక్ట్
2. స్టీవెన్సన్ వర్గీకరణడి.
-నిర్వహించే వ్యక్తుల ఆధారంగా స్టీవెన్సన్ ప్రకల్పనలను రెండు రకాలుగా వర్గీకరించాడు.
ఎ. మేధో సంబంధిత ప్రకల్పనలు (వైయక్తిక)
బి. భౌతిక సంబంధమైన ప్రకల్పనలు (సామూహిక)
బోధించే అంశాలు
1. చతుర్విద ప్రక్రియలపై, అవగాహన కల్పించవచ్చు.
2. జ్యామితీయ పటాలపై అవగాహన కల్పించవచ్చు.
3. నిష్పత్తిపై అవగాహన కల్పించవచ్చు.
4. లాభనష్టాలు బోధించవచ్చు.
5. పాఠశాల పొదుపు నిధిని నిర్వహింపజేయవచ్చు.
6. విద్యార్థుల వసతిగృహాన్ని నిర్వహింపజేయవచ్చు.
7. క్రీడాదినోత్సవాన్ని నిర్వహింపజేయవచ్చు.
8. పాఠశాల గ్రంథాలయాన్ని నిర్వహింపజేయవచ్చు.
7. సమస్య పరిష్కార పద్ధతి
బోధించాల్సిన అంశాలను సమస్యల రూపంలోకి మార్చుతూ విద్యార్థులే సమస్యను పరిష్కరించుకొనేటట్లు చేస్తూ బోధించే పద్ధతిని సమస్య పరిష్కార పద్ధతి అంటారు.
1. అంతర దృష్టి, ప్రజ్ఞ, ఏకాగ్రత అవసరం.
2.ప్రకల్పన పద్ధతిని పోలి ఉంటుంది.
3. శాస్త్రీయపద్ధతి అని కూడా అంటారు.
4. ఏడు సోపానాలు ఉంటాయి.
1. సమస్యను గుర్తించడం
2. సమస్యను నిర్వచించడం.
3. కావాల్సిన సమాచారం స్వీకరించడం.
4. సమాచారాన్ని వ్యవస్థీకరించడం.
5. తాత్కాలిక పరిష్కారం కనుగొనడం.
6. కచ్చితమైన పరిష్కారం కనుగొనడం.
7. ఫలితాలను సరిచూడటం
5. సమస్యను పరిష్కరించడానికి ఏది ఉత్తమమైన పద్ధతి అని నిర్ణయించే క్రమంలో కింది కొన్నింటిని సమస్య పరిష్కార పద్ధతులుగా పేర్కొన్నారు.
1. రేఖాచిత్ర పద్ధతి 2. సాదృశ్య పద్ధతి
3. విశ్లేషణా పద్ధతి
4. ఆశ్రయ సంబంధాల పద్ధతి
రేఖాచిత్ర పద్ధతి
-ఈ పద్ధతిలో విద్యార్థి ఇచ్చిన సమస్యను రేఖాచిత్రాల సహాయంతో పరిష్కరిస్తాడు.
-ఉదా: దిక్కులు, దూరాలకు సంబంధించిన సమస్యలు.
సాదృశ్య పద్ధతి
-ఈ పద్ధతిలో విద్యార్థి ఇచ్చిన కఠినమైన సమస్యను సాధించడానికి దాన్ని పోలి ఉన్న సులభమైన సమస్యను సాధించి ఆ తర్వాత ఇచ్చిన కఠినమైన సమస్యను సాధిస్తాడు.
విశ్లేషణా పద్ధతి
-ఈ పద్ధతిలో విద్యార్థి సారాంశం నుంచి ప్రారంభించి సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడగొడుతూ దత్తాంశం ఆధారంగా సమస్యను పరిష్కరిస్తాడు.
ఆశ్రయ సంబంధాల పద్ధతి
-ఈ పద్ధతిలో విద్యార్థి ఇచ్చిన సమస్యలోని దత్తాంశాల మధ్యగల సంబంధాల ఆధారంగా ఇచ్చిన సమస్యను పరిష్కరిస్తాడు.
-ఉదా: రక్త సంబంధాలకు సంబంధించిన సమస్యలు
గమనిక: సమస్య పరిష్కార పద్ధతిని ఎక్కువగా పద సమస్యలను బోధించడానికి ఉపయోగిస్తారు.
గుణాలు
1. విద్యార్థులలో ఆలోచనాశక్తిని పెంపొందిస్తుంది.
2. స్వయం అభ్యసనకు దోహదపడుతుంది.
3. ఆత్మవిశ్వాసం, సహకారం అనే లక్షణాలను పెంపొందిస్తుంది.
4.నిత్యజీవిత సమస్యలను పరిష్కరించడానికి సన్నద్ధులను చేస్తుంది.
5.ఉపాధ్యాయుడు, విద్యార్థుల మధ్య మంచి స్నేహ సంబంధం ఉంటుంది.
పరిమితులు
1. సమయం ఎక్కువ.
2. ఉపాధ్యాయుడికి శ్రమ ఎక్కువ.
3. అన్ని పాఠ్యాంశాలను బోధించలేం.
4. ప్రాథమిక స్థాయివారికి ఉపయోగించలేం.
5. ఈ పద్ధతి ప్రకారం బోధించడానికి పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేవు.
ప్రయోగశాల పద్ధతి
-గణిత విషయాలను పరికరాలు, వస్తువులను ఉపయోగించి ప్రయోగపూర్వకంగా తెలుసుకునే పద్ధతినే ప్రయోగశాల పద్ధతి అంటారు.
1. ఈ పద్ధతిలో విద్యార్థి అభ్యసించేటప్పుడు దృష్టి, శ్రవణం, స్పర్శ అనే మూడు జ్ఞానేంద్రియాలను అభ్యసన కోసం వినియోగిస్తాడు.
2. క్రియలు, అభ్యసన పరిశీలనల ద్వారా అభ్యసనం అనే నియమాలపై ఆధారపడి ఉన్నది.
3. ఆగమన పద్ధతి ద్వారా కనుగొన్న సూత్రాలు, నియమాలను నిరూపించడానికి ప్రయోగశాల పద్ధతిని ఉపయోగిస్తారు. ప్రయోగశాల
పద్ధతిని ఆగమన పద్ధతి విస్తరణ అంటారు.
ఉదా: శంఖువు ఘనపరిమాణం V = 1/3 అని నిరూపించడం.
గుణాలు
1. ఆచరణ ద్వారా అభ్యసనం ఉంటుంది.
2. గణిత పరికరాలను ఉపయోగించడం ద్వారా గణితంపై ఆసక్తిని పెంపొందించుకుంటారు.
3. మూర్త వస్తువుల సహాయంతో అమూర్త విషయాలను అభ్యసించడం.
4. ఇది మనోవైజ్ఞానికమైనది.
5. విద్యార్థుల్లో సామూహిక భావనను పెంపొందిస్తుంది.
6. ప్రయోగాత్మకంగా నేర్చుకొన్న విషయాలను ఎక్కువ కాలం గుర్తుంచుకోవచ్చు.
7. విద్యార్థుల్లో అన్వేషణా దృక్పథ ఆవిష్కరణ శక్తులను పెంపొందిస్తుంది.
8. విజ్ఞానశాస్త్రం, గణితశాస్త్ర విషయాల మధ్య సహ సంబంధాన్ని పెంపొందిస్తుంది.
పరిమితులు
1. సమయం ఎక్కువ, ఖర్చుతో కూడుకున్నది.
2. పరిమిత సంఖ్యగల తరగతులకే ఉపయోగించగలం.
3. మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఈ పద్ధతిని ఉపయోగించడం లేదు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు