River system in ‘Europe’ | ‘ఐరోపా’లోని నదీ వ్యవస్థ
పో నది : ఇటలీలో జన్మించి ఏడ్రియాటిక్ సముద్రంలో కలుస్తుంది. వెనిస్ నగరం ఈ నది ఒడ్డున ఉంది.
టైబర్ నది : జన్మస్థలం ఇటలీ. ఈ నది ఒడ్డున రోమ్ నగరం ఉంది. మధ్యదరా సముద్రంలో కలుస్తుంది. కస్పేట్ డెల్టాను ఏర్పరుస్తుంది.
సెయిన్ నది : ఫ్రాన్స్‌లో జన్మించి ఇంగ్లిష్ చానల్లో కలుస్తుంది. ఈ నది ఒడ్డున పారిస్ నగరం ఉంది.
ఎబ్రో నది : స్పెయిన్‌లో జన్మించి మధ్యదరా సముద్రంలో కలుస్తుంది.
వీజర్ నది : జర్మనీ గుండా ప్రవహిస్తూ ఉత్తర సముద్రంలో కలుస్తుంది.
ఎల్బే నది : జర్మనీ గుండా ప్రవహిస్తూ ఉత్తర సముద్రంలో కలుస్తుంది. ఈ నది ఒడ్డున హాంబర్గ్ నగరం ఉంది.
ఓడర్ నది : జర్మనీ, పోలండ్ సరిహద్దుల గుండా ప్రవహిస్తూ బాల్టిక్ సముద్రంలో కలుస్తుంది.
విస్తులా నది : పోలండ్‌లో జన్మించి బాల్టిక్‌లో కలుస్తుంది. వార్సా నగరం ఈ నది ఒడ్డున ఉంది.
ఓల్గానది : 3692 కి.మీ. రష్యాలో వాల్దాన్ పీఠభూమిలో జన్మించి కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. ఐరోపాలో పొడవైనది.
డాన్, నీపర్, నీస్టర్ నదులు : ఈ మూడు నదులు రష్యాలో జన్మించి నల్ల సముద్రంలో కలుస్తున్నాయి.
డాన్యూబ్ నది : 2,960 కి.మీ. ఇది జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్ పర్వతాల్లో జన్మించి 8 దేశాల గుండా ప్రవహిస్తుంది. అవి : జర్మనీ, ఆస్ట్రియా, స్లోవేకియా, యుగోస్లావియా, హంగరీ, రుమేనియా, బల్గేరియా, సెర్బియా ఇది నల్ల సముద్రంలో కలుస్తుంది.
రైన్ నది : స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో జన్మించి, జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్, ఫ్రాన్స్‌లోని వాస్జెస్ పర్వతాల మధ్యగల పగులు లోయ గుండా ప్రవహిస్తూ నెదర్లాండ్‌లోని రోటర్ డామ్ వద్ద ఉత్తర సముద్రంలో కలుస్తుంది.
ముఖ్యమైన పర్వతాలు
కోలెన్ పర్వతాలు : నార్వే, స్వీడన్ సరిహద్దులు
పెన్నైన్ పర్వతాలు : గ్రేట్ బ్రిటన్
కాంటారైన్ పర్వతాలు : స్పెయిన్
పైరవీస్ పర్వతాలు : ఫ్రాన్స్, స్పెయిన్‌లను వేరు చేస్తున్నాయి.
సియర్రా మెరేనా, సియర్రా నెవడా పర్వతాలు : స్పెయిన్
అపనైన్ పర్వతాలు : ఇటలీ
వాస్జెస్ పర్వతాలు : ఫ్రాన్స్, ఇటలీ
ఆల్ఫ్స్ పర్వతాలు : ఫ్రాన్స్, స్విట్జర్లాండ్. ఫ్రాన్స్‌లోని ఈ పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఉంది. అది బ్లాంక్ శిఖరం (4,807)
డినారిక్ పర్వతాలు : యుగోస్లావియా
కార్పేథియాన్ పర్వతాలు : పోలండ్, ఉక్రెయిన్, రుమేనియా
బాల్కన్ పర్వతాలు : బల్గేరియా
యూరల్ పర్వతాలు : రష్యా (ఐరోపా నుంచి ఆసియాను వేరు చేస్తున్నాయి)
కాకస్ పర్వతాలు : ఆసియాను యూరప్‌ను వేరు చేస్తున్నాయి. ఇందులో ఆసియాలో ఎత్తైన శిఖరమైన ఎల్బర్జ్ శిఖరం ఉంది.
బ్లాక్ ఫారెస్ట్ : జర్మనీ
యూఎస్ఏలోని నదీ వ్యవస్థ
మిసీసీపీ : 5, 971 కి.మీ. ఉపనదులు : మిస్సోరి, ఆర్కాన్సా-పక్షిపాద డెల్టాను ఏర్పరుస్తుంది. దీని జన్మస్థలం రాకీ మౌంటానా, కలిసే ప్రాంతం మెక్సికో సింధుశాఖ
సెంట్ లారెనప్స్ : 3, 780 కి.మీ (ఉత్తర అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే జలమార్గం) ప్రపంచంలో అతి పెద్దదైన నయాగారా జలపాతం ఇది. ఒంటారియో సరస్సుల మధ్య ప్రవహించే సెంట్ లారెన్స్ నదిపై ఉంది. జన్మస్థలం ఒంటారియో సరస్సు, కలిసే ప్రాంతం సెంట్ లారెన్స్ సింధుశాఖ
కొలరాడో : దీని జన్మస్థలం గ్రాండ్ కంట్రీ. కలిసే ప్రాంతం కాలిఫోర్నియా సింధుశాఖ
కొలంబియా నది (యూఎస్ఏలో పొడవైనది): జన్మస్థలం స్నేక్ నదీలోయ ప్రాంతం. కలిసే ప్రాంతం పసిఫిక్
-రియొగ్రాండ్ నది (యూఎస్ఏ. మెక్సికో సరిహద్దు గుండా ప్రవహించే నది). దీని జన్మస్థలం కాస్కేడ్, సియర్రా నెవడా పర్వతాలు. సియర్రా నెవడా, పసిఫిక్ మెక్సికో సింధుశాఖ.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు