Muslim Invasion of India | భారత్‌పై ముస్లిం దండయాత్రలు…
మహమ్మద్‌బిన్ ఖాసీం (క్రీ.శ. 712)
-క్రీ. శ. 712లో భారత్‌పై దండెత్తిన తొలి ముస్లిం. ఇతను అరబ్బు దేశానికి చెందిన వ్యక్తి. సింధు రాజు దాహర్పై దండెత్తాడు.
-ముస్లింలుకాని ప్రజలపై భారత్ జిజియా అనే మత పన్ను విధించాడు.
గజనీ మహమ్మద్ (క్రీ.శ. 1000-1027)..
-భారత్‌లో ఉన్న సిరి సంపదలు కొల్లగొట్టడానికి 17సార్లు దండయాత్ర చేశాడు. అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడు.
-గజనీతోపాటు ఫిరదౌసి, అల్బెరూని అనే అరబ్బు కవులు భారత్‌కు వచ్చారు.
-ఫిరదౌసి షానామా గ్రంథం, అల్బెరూని కితాబ్ -ఉల్- హింద్ పుస్తకాన్ని రాశారు.
మహమ్మద్ ఘోరి (క్రీ.శ. 1176-1206)
-మహమ్మద్ ఘోరి ప్రధానంగా భారత్‌లోని మొత్తం భూభాగాన్ని పొందటానికి దాడి చేశాడు.
-మహమ్మద్ ఘోరి దాడులను ఆనాటి రాజపుత్రులు సమర్థవంతంగా ఎదుర్కొనలేక పోయారు. ఈ సందర్భంలోనే 1191లో మొదటి తరైన్ యుద్ధం, 1192లో రెండో తరైన్ యుద్ధం జరిగింది.
-క్రీ.శ. 1206లో ఘోరీ మరణించగా భారత్‌లో కుతుబుద్దీన్ ఐబక్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. దీని ద్వారా భారత్‌లో ఢిల్లీ సుల్తానుల పాలన మొదలైంది.
ఢిల్లీ సుల్తానులు (క్రీ.శ. 1206-క్రీ.శ. 1526)
-ఢిల్లీని రాజధానిగా చేసుకొని దాదాపు మూడు శతాబ్దాల్లో బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోఢి అనే ఐదు వంశాలు పాలించాయి.
బానిస వంశం (క్రీ.శ. 1206-1290)
-మహమ్మద్ ఘోరి సేనాని, టర్కీష్ జాతీయుడైన కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని స్థాపించాడు. లాహోర్‌ను రాజధానిగా చేసుకొని పరిపాలన కొనసాగించాడు.
-కుతుబుద్దీన్ ఐబక్ గుర్రంపై పోలో లేదా బౌగన్ ఆట ఆడుతూ మరణించాడు.
-కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత అతని అల్లుడు ఇల్‌టుట్ మిష్ ఢిల్లీని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలించాడు.
-లాక్‌బక్ష్, సిపాసలార్ అనే బిరుదులతో వర్థిల్లాడు.
-దేశంలోనే తొలిసారిగా టంక అనే వెండి నాణేలు, జీతల్ అనే రాగి నాణేలు ప్రవేశ పెట్టాడు.
-సైనికులకు జీతాలు ఇవ్వకుండా, భూమి శిస్తు పన్ను- ఇక్తా పద్ధతిని ప్రవేశ పెట్టాడు.
-ఇల్టుట్మిష్ తర్వాత అతని కుమార్తె రజియా సుల్తానా (క్రీ.శ. 1236-1240) రాజ్య పాలన కొనసాగించింది. భారతదేశాన్ని పరిపాలించిన తొలి మహిళా చక్రవర్తి (పాలకురాలు).
-బానిస వంశస్థుల్లో బాల్బన్ గొప్పవాడు. చివరివాడు కైకుబాద్.
ఖిల్జీ వంశం (క్రీ.శ. 1290-1320)
-ఖిల్జీ వంశ స్థాపకుడు- జలాలుద్దీన్ ఖిల్జీ
అల్లావుద్దీన్ ఖిల్జీ
-ఢిల్లీ సుల్తాన్లలో అందరికంటే గొప్పవాడు
-దక్షిణ భారత్‌పై దండెత్తిన తొలి ఢిల్లీ సుల్తాన్
-ఇక్తా వ్యవస్థను రద్దు చేశాడు
-మార్కెట్ సంస్కరణలను ప్రవేశ పెట్టాడు.
తుగ్లక్ వంశం (క్రీ.శ. 1320-1414)
-తుగ్లక్ వంశ స్థాపకుడు ఘియాసుద్ధీన్ తుగ్లక్
మహమ్మద్ బిన్ తుగ్లక్
-తుగ్లక్ వంశస్థుల్లో గొప్పవాడు. అసలు పేరు జునాఖాన్.
-టంకా (వెండి నాణెం) స్థానంలో రాగి, కాంస్య నాణేలను ప్రవేశపెట్టాడు.
-రాజధానిని ఢిల్లీ నుంచి దేవనాగరికి మార్చాడు.
-దక్షిణ భారత రాజ్యాలపై పూర్తి పట్టు సాధించాడు.
-క్షామ నివారణ కోసం తొలిసారిగా క్షామ నివారణ చట్టం చేశాడు.
ఫిరోజ్ షా తుగ్లక్
-భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప సుల్తాన్
-షరియత్‌ను అనుసరించి పరిపాలించిన తొలి ఢిల్లీ సుల్తాన్
-దేశంలో తొలిసారిగా నీటీపారుదల సౌకర్యాలు ఏర్పర్చాడు.
-ఇక్తా వ్యవస్థను తిరిగి ప్రవేశ పెట్టి వంశ పారంపర్యం చేసాడు
సయ్యద్ వంశం (క్రీ.శ. 1414-1451)
-ఈ వంశ స్థాపకుడు సయ్యద్ ఖాజర్ ఖాన్
లోడి వంశం (క్రీ.శ. 1451- 1526)
-వీరు ఆప్ఘన్ జాతీయులు
-లోడి వంశ స్థాపకుడు- బహలాల్ లోడి
-లోడి వంశస్థుల్లో గొప్పవాడు- సికిందర్ లోడి. ఇతడు ఆగ్రా నగర నిర్మాత
-లోడి వంశస్థుల్లో చివరివాడు ఇబ్రహీం లోడి, ఇతని ఆహ్వానం మేరకు భారత్‌పై బాబర్ దండెత్తాడు. ఆ తర్వాత మొఘలుల పరిపాలన ప్రారంభమైంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?