జెమ్స్ లాంటి జీవితం..!
నగలంటే మోజులేని వారు ఉండరు. అందులోనూ రత్నాలు పొదిగిన ఆభరణాలంటే ఇక చెప్పాల్సిన అవసరంలేదు. ఈ రత్నాలు పొదిగిన నగలకు చాలా గిరాకీ ఉంది. అంతేకాదు రత్నాల నగల తయారీ, రత్నాలు అసలువా, నకిలీవా అని తేల్చేందుకు నిపుణులు అవసరం. వారినే జెమాలజిస్ట్ అంటారు. వారు చేసిన కోర్సునే జెమాలజీ అంటాం. ఈ కోర్సు గురించి తెలుసుకుందాం..
రత్నం అంటే
-భూమి లోపల పలు కారణాల వల్ల వివిధ రంగుల్లో రాళ్లు ఏర్పడ్డాయి. వీటినే రత్నం అంటారు. సహజ సిద్ధంగా ఏర్పడిన రత్నానికి విలువ ఉంటుంది.
జెమాలజీ
-రత్నాలతో కూడిన నగలను తయారుచేయడం ఒక ప్రత్యేక కళగా ప్రాచీనకాలంలో రాజులు ప్రోత్సహించారు. ఆ కళే దినదినాభివృద్ధిచెందుతూ జెమాలజీ అయ్యింది. రత్నాలు లేదా విలువైన లోహాలను అధ్యయనం చేయడాన్ని జెమాలజీ అంటారు. ఇది జియోసైన్స్‌లో ఒక విభాగం. కొనుగోళ్లు, గ్రేడింగ్, క్యాలిక్యులేషన్, ప్రాసెస్ వంటివి రత్నాల అధ్యయనంలో కీలక అంశాలు. ఇలాంటి విధులను నిర్వహించేవారిని జెమాలజిస్ట్‌లు అంటారు.
ఏం నేర్చుకుంటారు
-రత్నాల ప్రాథమిక నిబంధనలు, వాటి నామకరణం, నాణ్యత, కొలతలు, వాటి భౌతిక లక్షణాలు, వాటి ఆప్టికల్ ప్రాపర్టీస్, మ్యాగ్నిఫికేషన్ తదితరాలు జెమాలజీ కోర్సులో నేర్చుకుంటారు. వాటిలో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే విషయాలను పరిశీలిస్తారు.
అవకాశాలు
-నగల తయారీ, మైనింగ్ పరిశ్రమ, డిజైనింగ్ యూనిట్స్, నగల దుకాణాల్లో వీరికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అంతేకాకుండా జెమ్ ఎక్స్పోర్టింగ్ ఆర్గనైజేషన్స్, కటింగ్, గ్రేడింగ్, టెస్టింగ్ ల్యాబొరేటరీలు, పాలిషింగ్ యూనిట్లు, క్వాలిటీ సర్టిఫై చేసే ఏజెన్సీలు, వేలం వేసే సంస్థల్లో కూడా మంచి వేతనాలతో ఉపాధి దొరుకుతుంది.
కోర్సులు డైమండ్స్ అండ్ డైమండ్ గ్రేడింగ్
-ఇది రెండున్నర నెలల కోర్సు. ఇందులో భాగంగా వజ్రాల గురించి సమగ్ర పరిజ్ఞానం లభిస్తుంది.
కలర్డ్ జెమ్‌స్టోన్ ఐడెంటిఫికేషన్
-ఇది మూడున్నర నెలల కోర్సు. నిజమైన రంగు రత్నాల గుర్తింపులో పరిజ్ఞానాన్ని నేర్పుతారు.
డిప్లొమా ఇన్ జెమాలజీ
-ఇది 6 నెలల కాలవ్యవధిగల కోర్సు. ఈ కోర్సులో వజ్రాలు, రంగురాళ్ల గుర్తింపు, వజ్రాల గురించి విస్తారమైన పరిజ్ఞానాన్ని అందిస్తారు.
-బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ), మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఎంఎఫ్ఏ) ఇన్ జ్యూయలరీ డిజైన్ కోర్సులు కూడా ఉన్నాయి. ఢిల్లీలోని నిఫ్ట్ మూడేండ్ల ఇంటెన్సివ్ డిప్లొమా ప్రోగ్రామ్‌ను అందిస్తుంది.
అర్హతలు
-గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి 10+2 లేదా తత్సమానమైన పరీక్ష పాసైనవారు పై కోర్సులతోపాటు జెమాలజీ డిగ్రీలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస వయస్సు 18 ఏండ్లు. గరిష్ఠ వయోపరిమితి లేదు.
విదేశీ ఇన్స్టిట్యూట్లు
-ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమాలజికల్ సైన్సెస్, బ్యాంకాక్. వెబ్సైట్: www.aigsthailand.com
-జెమాలజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా. వెబ్సైట్: www.gia.edu
దేశీ ఇన్స్టిట్యూట్లు
-జెమాలజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ముంబై. వెబ్సైట్: http://giionline.com
-ఇంటర్నేషనల్ జెమాలజికల్ ఇన్స్టిట్యూట్, న్యూఢిల్లీ. వెబ్సైట్: www.igiworldwide.com
-సెయింట్ గ్జేవియర్స్, ముంబై. వెబ్సైట్: http://xaviers.edu/
-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, న్యూఢిల్లీ.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు